రైల్వే ఎన్టీపీసీ పరీక్షలకు సంబంధించిన ముఖ్య గమనిక :
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు 2020 వ్రాయబోయే అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక.
ఈ నెల డిసెంబర్ 28 నుంచి ఆరంభమయ్యే రైల్వే పరీక్షలు కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెయిల్ అడ్రస్ లకు CEN 01/2019 పేరుతో
చెన్నై రైల్వే బోర్డు నుంచి అభ్యర్థుల రిజిస్టర్ నంబర్ మరియు పాస్ వర్డ్స్ తో కూడిన మెయిల్స్ వస్తున్నాయి. వీటిని అభ్యర్థులు సరిచూసుకోగలరు.
తాజాగా చెన్నై రైల్వే బోర్డు నుంచి వస్తున్న మెయిల్స్ ఆధారంగా RRB NTPC 2020 పరీక్షల తేదిలు మరియు అభ్యర్థులకు కేటాయించబడిన నగరాలు వివరాల లింక్ డిసెంబర్ 18,2020 నుంచి ఓపెన్ అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుత పరిణామలతో సామాజిక మధ్యమాలలో జోరుగా వస్తున్న రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు వాయిదా పడతాయి అనే వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లు కనపడుతున్నాయి.
భారతీయ రైల్వే బోర్డు ప్రకటించిన ముందు షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్ 28,2020 నుంచి రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు జరుగనున్నాయి అనే విషయం స్పష్టమవుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి