రాబోయే సంవత్సరం 2021 లో వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించబోయే ప్రవేశ పరీక్ష నీట్ -2021 పరీక్షను ఎట్టి పరిస్థితులలోనూ వాయిదా వేసే ప్రసక్తి లేదని నేడు కేంద్ర విద్యా శాఖ ఒక ప్రకటన ద్వారా తెలియచేసినది.
కరోనా వైరస్ నేపథ్యంలో నీట్ పరీక్ష ను రద్దు చేయాలనే విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో నీట్ మరియు జేఈఈ పరీక్షల నిర్వహణ పై జరిపిన రివ్యూ మీటింగ్ లో నీట్ పరీక్ష 2021 నిర్వహణ పై కేంద్ర విద్యా శాఖ తమ తాజా నిర్ణయాన్ని ప్రకటించింది.
రాబోయే నీట్ 2021 పరీక్షను ఆన్లైన్ లో నిర్వహించేలా కేంద్ర విద్యాశాఖ ప్రణాళికలు రచిస్తుంది.
ఇకపై ప్రతీ సంవత్సరం జేఈఈ పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించడానికి కూడా ఈ రివ్యూ మీటింగ్ లో కేంద్ర విద్యా శాఖ సమాలోచనలు జరిపింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి