15, డిసెంబర్ 2020, మంగళవారం

Mini Job Mela 2020 Update Telugu || కాకినాడ లో ఆలీవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా

 

కాకినాడలో ఆలీవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ నగరంలో ఉన్న ఆలీవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించడానికి మినీ జాబ్ మేళా ను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఒక ప్రకటన తాజాగా విడుదల అయినది.

ఈ మినీ జాబ్ మేళా లో పలు సంస్థలలో ఉద్యోగాలను నిరుద్యోగులకు కల్పించనున్నారు. అర్హతలు గల అభ్యర్థులు అందరూ ఈ మినీ జాబ్ మేళా కు హాజరు కావచ్చు.

ముఖ్యమైన వివరాలు :

మినీ జాబ్ మేళా నిర్వహణ తేదిడిసెంబర్ 16,2020
జాబ్ మేళా నిర్వహణ సమయంఉదయం 9 గంటలకు

జాబ్ మేళా నిర్వహణ ప్రదేశం  :

ఆలీవ్ ఫౌండేషన్,ఫౌండేషన్ కార్యాలయం, కరణం గారి జంక్షన్,కాకినాడ.

సంస్థల వారీగా ఉద్యోగాలు – వివరాలు :

ఐసీఐసీఐ బ్యాంకు :

ఈ బ్యాంకు లో క్యాషియర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

సింప్లిజిత్ అకాడమీ :

ఈ అకాడమీ లో హెచ్. ఆర్ పొజిషన్ ను భర్తీ చేయనున్నారు.

స్టార్ హాస్పిటల్ :

ఈ సంస్థలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అపోలో ఫార్మసీ :

ఈ ఫార్మసీ సంస్థలో ఫార్మాసిస్ట్ ఉద్యోగాలను మినీ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాల జాబ్ మేళా కు హాజరు కాబోయే అభ్యర్థులు వివిధ సంస్థల ఉద్యోగాలను అనుసరించి డిగ్రీ/ బీ. టెక్/జిఎన్ఎం/బీ. ఎస్సీ (నర్సింగ్ )/బీ. ఫార్మసీ /ఎం. ఫార్మసీ /ఎంబీఏ(హెచ్. ఆర్ ) కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

వయసు :

ఈ మినీ జాబ్ మేళా కు హాజరు కావాలంటే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలనుండి 35 సంవత్సరాలు కలిగి ఉండవలెను.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 11,500 రూపాయలు నుండి 20,000 రూపాయలు వరకు జీతం లభించనుంది.

మినీ జాబ్ మేళా కు హాజరు అయ్యే అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.

ఈ మినీ జాబ్ మేళా గురించి మరింత ముఖ్యమైన సమాచారం కొరకు ఈ క్రింది మొబైల్ నంబర్లను సంప్రదించవచ్చు.

ఫోన్ నెంబర్లు :

8985487872,

7981891042.

 

కామెంట్‌లు లేవు: