14, డిసెంబర్ 2020, సోమవారం

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జనవరి 7న నోటిఫికేషన్లు విడుదల

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జనవరి 7న నోటిఫికేషన్లు విడుదల :

ఏపీ లో ఉన్న నిరుద్యోగ విభిన్న ప్రతిభవంతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్తను అందించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభిన్న ప్రతిభవంతుల కోసం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అన్నిటిని భర్తీ చేయడానికి జనవరి 7, 2021 నాడు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల అయినది.

డిసెంబర్ 25,2020 నాటికీ వివిధ ప్రభుత్వ శాఖలలో  ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫై చేసి జనవరి 7,2021 న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొత్తాన్ని జనవరి నెల నెలాఖరకు పూర్తి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.

కామెంట్‌లు లేవు: