వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి మీడియా సమావేశం
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి గురువారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈఓ శ్రీ పి.బసంత్ కుమార్, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, శ్రీవారి ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ హరీంద్రనాథ్ పాల్గొన్నారు. మీడియా సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి.
దర్శనం
- వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం స్వామివారి దర్శనం మరియు వైకుంఠ ద్వార దర్శనాన్ని డిసెంబరు 25 నుండి జనవరి 3వ తేదీ వరకు 10 రోజుల పాటు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లను చేయడమైనది.
- ఈ 10 రోజుల్లో స్వామివారి దర్శనార్థం అలిపిరి కాలినడక ద్వారా లేదా రోడ్డు మార్గం ద్వారా మరియు శ్రీవారి మెట్టు కాలినడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకునే భక్తులు ఆయా తేదీల్లో దర్శనానికి సంబంధించిన టోకెన్లు కలిగిన భక్తులను ఆయా ప్రవేశమార్గాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత అనుతించడం జరుగుతుంది. టోకెన్ లేని భక్తులను అనుమతించబడదు.
- రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ప్రముఖులకు వారికి కేటాయించిన సమయంలో, అదేవిధంగా వారికి నిర్ణయించిన ప్రవేశమార్గాల్లో ఉదయం 3 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1కు చేరుకుని స్వామివారి దర్శనభాగ్యాన్ని పొందవలసిందిగా కోరడమైనది. వీరందరూ కూడా శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం ఆవరణలోని కౌంటర్లలో వసతి మరియు దర్శనానికి సంబంధించిన టోకెన్లు పొందవలసిందిగా కోరడమైనది.
- డిసెంబరు 25న రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ప్రముఖులు స్వయంగా వచ్చిన వారికి మాత్రమే టికెట్లు కేటాయించబడును. వారితో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులకు వెరసి 6 గురికి మాత్రమే దర్శనం టికెట్లు కేటాయించబడుతుంది.
- ఇతర విఐపిలకు నలుగురికి మాత్రమే దర్శనం టికెట్లు కేటాయించబడుతుంది.
- ఈ 10 రోజుల్లో బ్రేక్ దర్శనం మరియు శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందించే దాతలకు టికెట్ ధర రూ.1000/- గా నిర్ణయించడమైనది.
- ప్రముఖులు మరియు విఐపిల సిఫార్సులపై డిసెంబరు 25 నుండి జనవరి 3వ తేదీ వరకు బ్రేక్ దర్శన టికెట్లు కేటాయించబడవు. మిగిలి 8 రోజుల్లో పరిస్థితిని బట్టి పరిమిత సంఖ్యలో అనుమతించడం జరుగుతుంది.
- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి రోజుకు 20 వేల టికెట్లను వివిధ టైంస్లాట్ల ద్వారా 10 రోజులకు ఆన్‌లైన్ ద్వారా జారీ చేయడం జరిగింది. ఈ టికెట్లను దేశం నలుమూలల నుండి భక్తులు బుక్ చేసుకోవడం జరిగింది.
- శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి డిసెంబరు 25న 1000 టికెట్లను, జనవరి 1న 1000 టికెట్లను, మిగిలిన 8 రోజుల్లో(డిసెంబరు 27 నుంచి జనవరి 3వ తేదీ వరకు) రోజుకు 2000 చొప్పున ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయడం జరిగింది. వీటిని కూడా దేశం నలుమూలల నుండి భక్తులు బుక్ చేసుకోవడం జరిగింది.
- తిరుమల తిరుపతి దేవస్థానంలోని అనేక ట్రస్టులకు విరాళాలు అందించిన దాతలకు కూడా ఈ సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించడం జరుగుతోంది. కావున దాతలు వారికి నిర్దేశించిన టైంస్లాట్లను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకుని రావాల్సిందిగా కోరడమైనది.
- వర్చువల్ కల్యాణోత్సవం బుక్ చేసుకున్న భక్తులు డిసెంబరు 25, 26 మరియు జనవరి 1 తేదీలలో మినహా మిగతా రోజుల్లో స్వామివారి దర్శనానికి రావాల్సిందిగా కోరడమైనది.
- సర్వదర్శనం టోకెన్లు పొందగోరు భక్తులకు తిరుపతిలో ఏర్పాటుచేసిన 5 కేంద్రాల్లో(ఒక్కో కేంద్రంలో 10 కౌంటర్లు) రోజుకు 10 వేలు చొప్పున సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది.
- మహతి ఆడిటోరియం, రామచంద్ర పుష్కరిణి, మున్సిపల్ ఆఫీస్, భైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్ పాఠశాల, ఎంఆర్.పల్లి కొత్త మార్కెట్‌లో టోకెన్లు జారీ చేయబడును.
- బయట ప్రాంతాల వారు ఇదివరకే ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు మరియు వర్చువల్ ఆర్జిత సేవలకు సంబంధించిన టోకెన్లు పొంది ఉండడం వల్ల మరియు కోవిడ్ వ్యాప్తిని నివారించేందుకు తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను కేవలం స్థానికులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కావున స్థానికులు తమ ఆధార్ కార్డు ద్వారా సర్వదర్శనం టోకెన్లు పొందవలసిందిగా కోరడమైనది.
- వైకుంఠ ఏకాదశి నాడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.
- కోవిడ్-19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని వైకుంఠ ద్వాదశినాడు చక్రస్నానం ఏకాంతంగా జరుపబడుతుంది.
- లడ్డూ కాంప్లెక్సులో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగినన్ని లడ్డూలను ఏర్పాటు చేయగలం.
శానిటైజేషన్
- అలిపిరి చెక్ పాయింట్, తిరుమలలోని గదుల కేటాయింపు కేంద్రాలు, వైకుంఠ క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం మరియు లడ్డూ కౌంటర్ల వద్ద కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా శానిటైజేషన్, భక్తులందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది.
వసతి కల్పన
- తిరుమలలో గదుల కేటాయింపు కేంద్రాల వద్ద కోవిడ్ -19 నిబంధనల మేరకు భక్తులు భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటారు.
- స్వయంగా వచ్చిన ప్రముఖులకు గరిష్టంగా 2 గదులు మాత్రమే కేటాయించబడును.
- డిసెంబరు 24 నుండి 26వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ప్రివిలేజ్ ఉండదు.
- శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులకు వెంకటకళా నిలయం, రామరాజ నిలయం, సీతా నిలయం, సన్నిధానం, గంబుల్ విశ్రాంతి గృహాల్లో అలాట్‌మెంట్ కౌంటర్లు ఏర్పాటుచేసి గదులు కేటాయిస్తారు.
- సామాన్య భక్తులకు సిఆర్‌వో జనరల్ కౌంటర్ ద్వారా గదులు మంజూరు చేస్తారు.
- మఠాల్లోని 50 శాతం గదులను టిటిడి ఆధీనంలోకి తీసుకుని భక్తులకు కేటాయించడం జరుగుతుంది.
కల్యాణకట్ట
- తలనీలాలు తీసేందుకు తగినంత మంది క్షురకులను అందుబాటులో ఉంచడం జరిగింది. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ క్షురకులు పిపిఇ కిట్లు, ఆప్రాన్లు వినియోగిస్తారు.
అన్నప్రసాదం
- అన్నప్రసాద భవనంలో కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఈ 10 రోజుల పాటు ఉదయం 4 నుండి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది.
- వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవనాల్లోని క్యూలైన్లలో భక్తులకు అన్నప్రసాద వితరణ.
వైద్యం
- అవసరమైన భక్తులకు వైద్యసేవలందించేందుకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, వైకుంఠం క్యూకాంప్లెక్స్-2, నారాయణగిరి ఉద్యానవనాలతోపాటు అవసరమైన ప్రాంతాల్లో డిస్పెన్సరీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
శ్రీవారి సేవ
- అన్ని విభాగాల్లో శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందిస్తారు.
పార్కింగ్
- తిరుమలలో పోలీసులతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాలు పార్కింగ్ ప్రాంతాలకు చేరేలా ఏర్పాట్లు.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
18, డిసెంబర్ 2020, శుక్రవారం
TTD Update
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి