Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

24, నవంబర్ 2023, శుక్రవారం

Junior Assistant cum Computer Assistant in Revenue Department under Group-IV Notification No.23/2021 selection process shortlisted the candidates

Recruitments – APPSC Direct Recruitment for the post of – Junior Assistant cum Computer Assistant in Revenue Department under Group-IV Notification No.23/2021 selection process shortlisted the candidates @ 1:2 Certificate verification conducted – ‘Computer Proficiency Test’ held on 12.10.2023 – selection list published calling for objections / claims if any from the affected candidate Regarding.

Collectorate

Ananthapuramu

View (195 KB) 

Selected List (1 MB) 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్దతిన పని చేసేందుకు 13-10-2023 న ఇచ్చిన నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకుని మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు 27న కౌన్సెలింగ్

అనంతపురం(వైద్యం), న్యూస్టుడే: వైద్య విధాన పరిషత్ పరిధిలో వివిధ కేడర్లలో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి ఒక సంవత్సరం పాటు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్దతిన పని చేసేందుకు 13-10-2023 న ఇచ్చిన నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకుని మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 27న ఉదయం 10 గంటలకు అనంతపురం లోని సర్వజన వైద్యశాల ఆవరణలో ఉన్న వైద్యవిధాన పరిషత్ (డీసీ హెచ్ ఎస్) కార్యాలయంలో కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు సమన్వయ కర్త డాక్టర్ పాల్ రవికుమార్ తెలిపారు. పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల
వివరాలు http:///ananthapuramu.ap.gov.in వెబ్సైట్లో ఉంచటంతో పాటు కార్యాలయంలోని నోటీసు బోర్డులో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కౌన్సెలింగ్కు తమ ఒరి
జినల్ విద్యార్హత సర్టిఫికెట్స్ తీసుకుని హాజరుకావాలని తెలిపారు.

+

వైద్యుల పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు Walk-in interviews for filling up the posts of doctors

వైద్య విధాన పరిషత్ (డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్) ఆధ్వర్యంలో పనిచేసే ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషాలిటీ వైద్యుల పోస్టులను శాశ్వత, ఒప్పంద విధానంలో భర్తీ చేసేందుకు డిసెంబరు 11, 13, 15 తేదీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైద్య విధాన పరిషత్ ప్రధాన కార్యాలయంలో జరగనున్నాయని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ బోర్డు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. 11న జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, 13న గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ, పెధాలజీ, 15న పీడియాట్రిక్స్, ఆర్గో, ఆప్తమాలజీ, రేడియాలజీ, సైకియాట్రీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయని, పూర్తి వివరాలు https://cfw.ap.nic.in వెబ్సైట్లో ఉన్నాయని తెలిపింది.

150 స్పెషలిస్ట్ వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
వచ్చే నెల 11, 13, 15 తేదీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య శాఖ పరిధిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (గతంలో ఏపీవీ వీపీ) ఆస్పత్రుల్లో 13 స్పెషాలిటీల్లో 150
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్(సీఏఎస్ఎస్) పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. వాక్-ఇన్ రిక్రూట్మెంట్ ద్వారా శాశ్వత, కాంట్రాక్ట్ పద్ధతుల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నామని బోర్డ్ మెంబర్ సెక్రటరీ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. వచ్చే నెల 11వ తేదీ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ సైన్స్, 13వ తేదీ గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ, పాథాలజీ, 15వ తేదీ పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, సైకియాట్రీ విభాగాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు గుంటూరు జిల్లా తాడేపల్లి పాతూరు రోడ్డులోని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సి ఉంటుంది. నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://cfw.ap.nic.in/, http://hmfw.ap.gov.in/ వెబ్సైట్లను సందర్శించవచ్చు.

కంప్యూటర్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం | Applications for Computer Training

పెనుకొండ రూరల్, నవంబరు 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పరిటాల శ్రీరాములు ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్హాబ్లో నిరుద్యోగులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు ఎంపీడీఓ శివశంకరప్ప గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగులకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుపై మూడు నెలలు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పెనుకొండలో ఉన్న కళాశాలలోని స్కిల్హాబ్లో ఈనెల 30లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు స్కిల్హబ్ కోఆర్డినేటర్ శివప్రసాద్ 9676706976కు సంప్రదించాలన్నారు.

డిగ్రీ ఆనర్స్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కదిరిఅర్బన్, నవంబరు 23: పట్టణంలోని ఎన్డీ -ఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో 4 ఏళ్ల డిగ్రీ ఆనర్స్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. స్మిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఆనర్స్ లో కెమిస్ట్రీ, కామర్స్, తెలుగు సబెక్టులలో ప్రవేశాలకు అర్హత కలిగిన విద్యార్థులు కళాశాలలో సప్రందించి దరఖాస్తులు అందిచాలన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోనే డిగ్రీ ఆనర్స్ కోర్సు మొట్టమొదటిగా కదిరి డిగ్రీ కళాశాలో ప్రారంభమైనట్లు చెప్పారు. అవకా శాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిగ్రీ ఆనర్స్ చదివిన విద్యార్థులు నేరుగా వివిధ విశ్వవిద్యాలయాల్లో సంబంధిత సబ్జెక్టులలో ద్వితీయ సంవత్సరం పీజీలో ప్రవేశం పొందవచ్చని చెప్పారు.

12 బార్లకు నోటిఫికేషన్

అమరావతి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 12 బార్ల వేలానికి ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్ గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. గురువారం నుంచి ఈనెల 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తా మని, 30న ఆన్లైన్ వేలం ప్రక్రియలో బార్లు కేటాయిస్తామని తెలిపారు. ఇప్పుడు కేటాయించే బార్ లైసెన్సుల కాలపరిమితి రెండేళ్లుగా పేర్కొన్నారు. 50 వేల వరకు జనాభా ఉంటే రూ.5 లక్షలు. 50 వేల నుంచి 5 లకల జనాభాకు రూ.7.5 లక్షలు, 5లక్షలు దాటిన ప్రాంతాల్లో రూ.10 లక్షలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

12 బార్ల లైసెన్స్ల కోసం నోటిఫికేషన్ జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 12 బార్లకు వేలం ద్వారా లైసెన్సులు కేటాయించేందుకు ఎక్సైజ్
శాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో నిర్వహించిన వేలంలో లైసెన్సులు
దక్కించుకుని, బిడ్డర్ల లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ చార్జీలు, బిడ్ మొత్తం చెల్లించడంలో
విఫలమైన బార్లకు ప్రస్తుతం మరోసారి వేలం నిర్వహించాలని నిర్ణయించారు. అందుకోసం
ఈ నెల 23 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 30న ఆన్లైన్ ద్వారా వేలం ప్రక్రియ నిర్వహిస్తారు. వివరాల కోసం http://apcpe.aptonline.in వెబ్సైట్లో సంప్రదించాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.


27, 28 తేదీల్లో AGBSC ఏజీబీఎస్సీ సీట్లకు వెబ్ ఆప్షన్లు

27, 28 తేదీల్లో ఏజీబీఎస్సీ సీట్లకు వెబ్ ఆప్షన్లు
అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ కళాశాలల్లో అగ్రికల్చర్ బీఎస్సీ(హాన్) కోర్సులో ప్రవేశానికి ఈనెల 27, 28 తేదీల్లో రెండో దశ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహించను న్నట్లు రిజిస్ట్రార్ రామారావు గురువారం తెలిపారు. అగ్రిసెట్-2023 ర్యాంక్ల ద్వారా డిప్లొమా విద్యార్థులు వెబ్ ఆప్షన్ల ద్వారా ఏజీబీఎస్సీలో మిగిలి ఉన్న సీట్లను పొందవచ్చని తెలిపారు. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న డిప్లొమా విద్వార్థులు రిజిస్టర్ చేసుకోకపోయినా వెబ్ ఆప్షన్లు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...