Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

7, మార్చి 2022, సోమవారం

NOS Scholarship 2022-23: ఈ కేంద్రప్రభుత్వ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు

MSJE National Overseas Scholarship 2022: భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన సమాజిక, సాధికారత విభాగం 2022-23 విద్యా సంవత్సరానికిగాను నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ (National Overseas Scholarship)కు ఉన్నత విద్యనభ్యసించే అర్హులైన విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ స్కాలర్‌షిప్‌కు సంబంధించిన ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 125

వయోపరిమితి: ఎప్రిల్ 1, 2022 నాటికి విద్యార్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: బ్యాచిలర్స్, మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్న విద్యార్ధులు, పీహెచ్‌డీ చేసే అభ్యర్ధులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, 2022-23 విద్యాసంవత్సరానికి దేశంలోని టాప్‌ 500 ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌/యూనివర్సిటీల్లో పొందిన ప్రవేశాల ఆధారంగా స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

 

Gemini Internet

DRDO Scholarship 2022: ఏడాదికి రూ.1,86,600ల చొప్పున స్కాలర్‌షిప్‌ అందుకునే అవకాశం

DRDO scholarship 2022 last date: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (DRDO) 2022-23 విద్యాసంవత్సరానికిగానూ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ స్కాలర్‌షిప్‌ సంబంధిత స్పెషలైజేషన్లో యూజీ, పీజీ చదివే గర్ల్‌ స్టూడెంట్స్‌ (Female Students)కు మాత్రమే అందించబడుతుంది. ఈ స్కాలర్‌షిప్‌కు సంబంధించిన ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 30

సబ్జెక్టులు: ఎయిరోస్పేస్‌ ఇంజనీరింగ్‌, ఎయిరో నాటికల్‌ ఇంజనీరింగ్‌, స్పేస్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ రాకెట్రీ, ఏవియోనిక్స్‌, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్‌.

  • యూజీ స్కాలర్‌షిప్‌లు-20

స్కాలర్‌షిప్‌: ఏడాదికి రూ. 1,20,000ల వరకు స్కాలర్‌షిప్‌ అందిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజనీరింగ్‌) కోర్సుల్లో మొదటి సంత్సరం అడ్మిషన్‌ తీసుకున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వ్యాలిడ్‌ జేఈఈ మెయిన్‌ స్కోర్ కూడా ఉండాలి.

  • పీజీ స్కాలర్‌షిప్‌లు-10

స్కాలర్‌షిప్‌ మొత్తం: ఏడాదికి రూ.1,86,600ల వరకు స్కాలర్‌షిప్‌ అందిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఈ/ఎంటెక్‌/ఎమ్మెస్సీ (ఇంజనీరింగ్‌) కోర్సుల్లో మొదటి సంత్సరం అడ్మిషన్‌ తీసుకున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వ్యాలిడ్‌ గేట్‌ స్కోర్ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: జేఈఈ మెయిన్‌/గేట్‌ స్కోర్‌ ఆధారంగా స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

 

Gemini Internet

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...