Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

2, నవంబర్ 2021, మంగళవారం

NHAI Recruitment 2021: నేషనల్ హైవేస్ అథారిటీలో ఉద్యోగాలు | ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 29-11-2021

NHAI Recruitment: ఎన్‌హెచ్‌ఏఐలో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు.. నెలకు రూ. లక్షన్నరకు పైగా జీతం పొందే అవకాశం..

NHAI Recruitment: నేషనల్ హైవేష్ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీకిగాను..

NHAI Recruitment: నేషనల్ హైవేష్ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీకిగాను నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దరఖాస్తుల ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* ఫైనాన్స్‌ అండ్ అకౌంట్స్‌ విభాగంలో మొత్తం 17 డిప్యూటీ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్‌ ఇన్‌ కామర్స్‌/ సీఏ/ సర్టిఫైడ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌/ మాస్టర్స్‌ ఇన్‌ బిజినెస్‌ అడ్మినేషన్‌ (ఫైనాన్స్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* పరీక్ష పార్ట్‌ 1, పార్ట్‌ 2 లో భాగంగా 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.

* జనరల్‌ అభ్యర్థ/లు రూ. 500, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థ/లు రూ. 300 ఫీజుగా చెల్లించాలి.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 56,100 నుంచి రూ. 1,77,500 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 29-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

For Notification click here

For website Click Here

 ---------------------------------------------------------------------------------


ఆయుష్ రిక్రూట్‌మెంట్ మంత్రిత్వ శాఖ 2021 సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్, డేటా అసిస్టెంట్, MTS & ఇతర - 7 పోస్ట్‌లు ayush.gov.in చివరి తేదీ 10-11-2021


Name of Organization Or Company Name :Ministry of Ayush


Total No of vacancies: – 7 Posts


Job Role Or Post Name:Senior Program Manager, Data Assistant, MTS & Other


Educational Qualification:10+2, Degree, PG (Relevant Discipline)


Who Can Apply:All India


Last Date:10-11-2021


Website: ayush.gov.in


Click here for Official Notification



MSME టూల్ రూమ్ రిక్రూట్‌మెంట్ 2021 అకౌంట్స్ అసిస్టెంట్, పర్చేజ్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్ & ఇతర – 13 పోస్టులు www.citdindia.org చివరి తేదీ 05 నుండి 15–11-2021 వరకు – వాక్ ఇన్ చేయండి


Name of Organization Or Company Name :MSME Tool Room


Total No of vacancies: 13 Posts


Job Role Or Post Name:Accounts Assistant, Purchase Engineer, Design Engineer & Other 


Educational Qualification:Diploma/ Degree (Relevant Discipline)


Who Can Apply:All India


Last Date:05 to 15–11-2021 – Walk in


Website: www.citdindia.org


Click here for Official Notification



ITBP రిక్రూట్‌మెంట్ 2021 స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్, స్పెషలిస్ట్ – 20 పోస్టులు www.itbpolice.nic.in చివరి తేదీ 15 & 16-11-2021 – వాక్ ఇన్



Name of Organization Or Company Name :Indo-Tibetan Border Police


Total No of vacancies:– 20 Posts


Job Role Or Post Name:Specialist Medical Officer, Specialist 


Educational Qualification:PG Degree/ Diploma


Who Can Apply:All India


Last Date:15 & 16-11-2021 – Walk in


Website: www.itbpolice.nic.in


Click here for Official Notification



ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2021 గ్రాడ్యుయేట్ & డిప్లొమా అప్రెంటీస్ – 63 పోస్టులు www.aai.aero చివరి తేదీ 30-11-2021



Name of Organization Or Company Name :Airports Authority of India


Total No of vacancies: 63 Posts


Job Role Or Post Name:Graduate & Diploma Apprentice 


Educational Qualification:Diploma, Degree (Relevant Engg. Discipline)


Who Can Apply:All India


Last Date:30-11-2021


Website: www.aai.aero


Click here for Official Notification


IBPS PO Notification 2021: 4135 పీఓ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల, ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 10.11.2021

బ్యాంకింగ్‌ రంగంలో కెరీర్‌ కోరుకునే అభ్యర్థులకు శుభవార్త! ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆఫీసర్‌ స్థాయి కొలువుకు చక్కటి అవకాశం!! ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌).. 4135 ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీఓ) పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు పోటీ పడొచ్చు. ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. బ్యాంకింగ్‌ రంగంలో అద్భుతమైన కెరీర్‌ సొంతమవుతుంది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఐబీపీఎస్‌ పీవో పోస్టులు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్‌ టిప్స్‌తో ప్రత్యేక కథనం.. 

  • 4135 పీఓ పోస్ట్‌ల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ 
  • ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు
  • మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ

ఐబీపీఎస్‌.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్, పీవో,స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాటైన అటానమస్‌ సంస్థ. ఐబీపీఎస్‌ ప్రతి ఏటా ఆయా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదల

చేస్తోంది. తాజాగా 2022–23 సంవవత్సరానికి పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,135 పీఓ/ఎంటీ(మేనేజ్‌మెంట్‌ ట్రైనీ) పోస్ట్‌లకు దరఖాస్తులు కోరుతోంది.

8 బ్యాంకులు.. 4,135 పోస్ట్‌లు

  • ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం–మొత్తం ఎనిమిది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,135 పీఓ/ఎంటీ ఖాళీలు ఉన్నాయి. 
  • బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా–588, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర–400, కెనరా బ్యాంకు–650, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా–620, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌–98, పంజాబ్‌ అండ్‌ సిం«ద్‌ బ్యాంక్‌ –427, యూకో బ్యాంక్‌–440, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా–912. 
  • వాస్తవానికి మరో మూడు ప్రభుత్వ బ్యాంకులు(బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌) కూడా ఐబీపీఎస్‌ ద్వారానే నియామకాలు చేపడుతుంటాయి. 2022–23 సంవత్సరంలో ఖాళీలకు సంబంధించి ఈ బ్యాంకుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు రాలేదు. దాంతో ఎనిమిది బ్యాంకుల్లో పోస్ట్‌ల భర్తీకే ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

 అర్హతలు

  • నవంబర్‌ 10, 2021 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
  • వయసు: అక్టోబర్‌ 1, 2021 నాటికి 21–30ఏళ్లు(అక్టోబర్‌ 2, 1991–అక్టోబర్‌ 01, 2001 మధ్య జన్మించాలి) మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీ(నాన్‌ క్రిమి లేయర్‌) అభ్యర్థులకు మూడేళ్ల గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. 


ఎంపిక ప్రక్రియ

ఐబీపీఎస్‌ పీఓ/ఎంటీ ఎంపిక ప్రక్రియను మూడు దశల్లో నిర్వహించనున్నారు. అవి..ప్రిలిమినరీ, మెయిన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ. ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు ఆబ్జెక్టివ్‌ తరహాలో,ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతాయి. 

ప్రిలిమినరీ పరీక్ష

ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ పరీక్షను మూడు విభాగాల్లో వంద మార్కులకు నిర్వహిస్తారు. అవి..ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు–30 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 35 ప్రశ్నలు–35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35
మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఒక్కో విభాగానికి 20 నిమిషాల చొప్పున మొత్తం పరీక్ష సమయం 60 నిమిషాలు. 

మెయిన్‌కు ఎంపిక

అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కులు, నిర్దేశిత కటాఫ్‌ ఆధారంగా మెయిన్‌కు ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో ప్రతి విభాగంలోనూ నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు పొందాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్‌కు 1:10 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంటే.. ప్రతి పోస్టుకు పది మంది చొప్పున పోటీపడతారు.  

మెయిన్‌ ఎగ్జామ్‌

మెయిన్‌లో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ పరీక్షలు ఉంటాయి. మెయిన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో నాలుగు విభాగాల్లో మొత్తం 155 ప్రశ్నలు–200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. 

విభాగం ప్రశ్నలు మార్కులు సమయం
రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 45 60 60 ని
జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ 40 40 35 ని
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 35 40 40 ని
డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ 35 60 45 ని
మొత్తం 155 200 3 గం

ఇంగ్లిష్‌ డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌

మెయిన్‌ పరీక్షలో భాగంగా ఇంగ్లిష్‌ డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. వ్యాసరూప తరహాలో ఉండే ఈ విభాగంలో అభ్యర్థులు ఇంగ్లిష్‌లో ఎస్సే, లెటర్‌ రైటింగ్‌ రాయాల్సి ఉంటుంది. దీనికి కేటాయించిన మార్కులు 25. పరీక్ష సమయం 30 నిమిషాలు. అభ్యర్థుల ఇంగ్లిష్‌ పరిజ్ఞానాన్ని పరీక్షించే ఉద్దేశంతో దీన్ని నిర్వహిస్తున్నారు.

నెగెటివ్‌ మార్కింగ్‌

ఆన్‌లైన్‌ విధానంలో.. ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌లుగా నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్‌ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన అమలవుతోంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. 

పర్సనల్‌ ఇంటర్వ్యూ

మెయిన్‌కు సెక్షన్‌ వారీ కటాఫ్, ఓవరాల్‌ కటాఫ్‌లను నిర్దేశించి.. ఆ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూకు కేటాయించిన మార్కులు 100. ఇందులో అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధించాల్సి
ఉంటుంది. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం మార్కులు, రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాలి. 

తుది జాబితా 80:20 వెయిటేజీ

  • అభ్యర్థుల తుది జాబితా రూపకల్పనలో మెయిన్‌ మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూకు నిర్దేశిత వెయిటేజీలు పేర్కొన్నారు.
  • మెయిన్‌ పరీక్షలో మార్కులకు 80 శాతం వెయిటేజీ, పర్సనల్‌ ఇంటర్వ్యూ మార్కులకు 20 శాతం వెయిటేజీని నిర్దేశించారు. అంటే.. అభ్యర్థులు మెయిన్, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కులను వంద మార్కుల వెయిటేజీకి క్రోడీకరించి.. తుది జాబితా ప్రకటిస్తారు. 

విజయం సాధించాలంటే

  • ఎస్‌బీఐ పీఓకు పోటీ పడే అభ్యర్థులు.. ఐబీపీఎస్‌ పీవోకు కూడా దరఖాస్తు చేసుకుంటే.. ఒకే సమయంలో రెండు పరీక్షలకు సిద్ధం కావొచ్చు. 
  • మొదట ప్రిలిమ్స్, మెయిన్‌ రెండింటిలో కీలకంగా నిలిచే రీజనింగ్‌పై పట్టు సాధించేందుకు కృషి చేయాలి. సిరీస్, అనాలజీ, కోడింగ్‌–డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్‌ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్, సిలాజిజమ్స్‌పై అవగాహన పెంచుకోవాలి.
  • క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ విభాగానికి సంబంధించి అర్థమెటిక్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. స్క్వేర్‌ రూట్స్, క్యూబ్‌ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్‌ డిస్టెన్స్, టైం అండ్‌ వర్క్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, రేషియోస్‌ సంబంధిత ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయాలి. వీటితోపాటు నంబర్‌ సిరీస్, డేటా అనాలిసిస్‌ విభాగాలను కూడా అధ్యయనం చేయాలి. ఫలితంగా ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలోనూ మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.
  • అభ్యర్థుల్లోని విశ్లేషణ సామర్థ్యం, తులనాత్మకతను పరిశీలించే డేటా అనాలిసిస్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో రాణించేందుకు కాలిక్యులేషన్‌ స్కిల్స్‌ను పెంచుకోవాలి. టేబుల్స్, డయాగ్రమ్స్, నంబర్‌ డేటా, లైన్‌ గ్రాఫ్, బార్‌ గ్రాఫ్‌ తదితర గ్రాఫ్‌ ఆధారిత డేటాలోని సమాచారాన్ని క్రోడీకరించే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి.
  • జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌కు సంబంధించి ఇటీవల కాలంలో జాతీయ ఆర్థిక రంగంలో మార్పులు, బ్యాంకుల విధి విధానాలు, అవి కొత్తగా ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి. బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో వినియోగించే పదజాలంపై పట్టు సాధించాలి. 
  • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కోసం బేసిక్‌ గ్రామర్‌తో మొదలు పెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, జంబుల్డ్‌ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్‌ వంటి వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
  • డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉండే ఇంగ్లిష్‌ ఎస్సే రైటింగ్, లెటర్‌ రైటింగ్‌ కోసం ఇంగ్లిష్‌ దినపత్రికలు చదవడం, ఎడిటోరియల్స్‌ చదవడం మేలు చేస్తుంది.

ఐబీపీఎస్‌ పీఓ/ఎంటీ –(11)–2022–23 సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 10.11.2021
  • ప్రిలిమినరీ కాల్‌ లెటర్స్‌ డౌన్‌లోడ్‌: నవంబర్‌/డిసెంబర్, 2021
  • ప్రిలిమినరీ పరీక్ష(ఆన్‌లైన్‌) తేదీలు: డిసెంబర్‌ 4, 11 తేదీల్లో
  • ప్రిలిమినరీ ఫలితాలు: డిసెంబర్‌ 2021/జనవరి 2022.
  • మెయిన్‌ కాల్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌: డిసెంబర్‌ 2021/జనవరి 2022.
  • మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: జనవరి 2022
  • మెయిన్‌ ఫలితాల వెల్లడి: జనవరి/ఫిబ్రవరి 2022
  • ఇంటర్వ్యూ కాల్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌: ఫిబ్రవరి 2022
  • పర్సనల్‌ ఇంటర్వ్యూలు: ఫిబ్రవరి/మార్చి 2022
  • ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌: 2022 ఏప్రిల్‌

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.ibps.in/

ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: https://ibpsonline.ibps.in/crppo11jul21

Gemini Internet

NEET Results: నీట్‌ ఫలితాలు, కటాఫ్ సమాచారం

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) యూజీ–2021 ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్ టీఏ) నవంబర్ 1 న విడుదల చేసింది.
నీట్‌ ఫలితాలు, కటాఫ్ సమాచారం

తెలంగాణకు చెందిన మృణాల్‌ కుట్టేరితోపాటు ఢిల్లీకి చెందిన తన్మయ్‌ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్‌ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్‌ సాధించారు. విజయవాడకు చెందిన జి.రుషిల్, రాజమహేంద్రవరంకు చెందిన చందం విష్ణువివేక్, తెలంగాణకు చెందిన ఖండవల్లి శశాంక్‌ (715 మార్కులు) జాతీయ స్థాయిలో ఐదో ర్యాంక్‌ సాధించి సత్తా చాటారు. అదేవిధంగా కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత కుమారుడు కౌషిక్‌రెడ్డి 23వ ర్యాంక్‌తో మెరిశాడు. ఇక బాలికల టాప్‌ 20లో తెలంగాణకు చెందిన కాస లహరి, ఈమణి శ్రీనిజ, దాసిక శ్రీనిహారిక, పసుపునూరి శరణ్య ర్యాంక్‌లు సాధించారు. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో టాప్‌ 10లో తెలంగాణకు చెందిన సీహెచ్‌ వైష్ణవి ఉంది. ఆమె 143వ ర్యాంకు సా«ధించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 12న నీట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ నుంచి 59,951 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఎన్ టీఏ విద్యార్థుల ఈమెయిల్, ఫోన్ నంబర్‌లకు ర్యాంక్‌ కార్డులను పంపింది. 

720కి 720 మార్కులు సాధించింది వీరే.. 

తెలంగాణకు చెందిన మృణాల్‌ కుట్టేరి సహా మొత్తం ముగ్గురు విద్యార్థులు వంద శాతం మార్కులతో టాప్‌ ర్యాంక్‌ సాధించినట్లు ఎన్ టీఏ ప్రకటించింది. 720 మార్కులకుగాను 720 సాధించి అగ్రస్థానంలో నిలిచినవారిలో మృణాల్‌ కుట్టేరి, ఢిల్లీకి చెందిన తన్మయ్‌ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్‌ ఉన్నారు. అదేవిధంగా 5వ ర్యాంకును 12 మంది, 19వ ర్యాంకును 21 మంది సాధించారు. 8 మంది ట్రాన్స్జెండర్లు కూడా నీట్‌లో అర్హత సాధించారు. ఈ ఏడాది నీట్‌కు దేశవ్యాప్తంగా 16.14 లక్షల మంది నమోదు చేసుకోగా సుమారు 95% మంది.. అంటే 15.44 లక్షల మంది పరీక్ష రాశారు. వీరిలో 8.70 లక్షల మంది అర్హత సాధించారు. బాలికలు 4,94,806 మంది, బాలురు 3,75,260 మంది అర్హత సాధించినట్లు ఎన్ టీఏ తెలిపింది. పరీక్ష పత్రం ఫైనల్‌ ‘కీ’ని కూడా ఎన్ టీ ఏ విడుదల చేసింది. కటాఫ్‌ మార్కులు కంటే ఎక్కువ సాధించినవారే ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌కు అర్హులు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఎయిమ్స్, జిప్‌మర్‌ తదితర సంస్థల్లో నీట్‌ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కలి్పస్తారు. 

ఈసారి తగ్గిన కటాఫ్‌ మార్కులు..

గతేడాది జనరల్‌ కేటగిరీలో నీట్‌ కటాఫ్‌ 147 ఉండగా ఈసారి 138కి తగ్గింది. గతేడాది కంటే కఠినంగా పేపర్‌ ఉండటం వల్లే కటాఫ్‌ తగ్గింది. 720కి 700 మార్కులు వచ్చినవాళ్లు గతేడాది 100 మంది ఉంటే.. ఈసారి 200 మంది వరకు ఉన్నారు. 640 మార్కులు, ఆపై వచి్చనవారు సుమారు 5 వేల మంది ఉన్నారు. గతేడాది మొత్తం 180 ప్రశ్నలకు 180 రాయాల్సి ఉండగా, ఈసారి 200 ప్రశ్నలుంటే 180 మాత్రమే రాసే అవకాశం కలి్పంచారు. 

రాష్ట్రంలో 5,010 ఎంబీబీఎస్‌ సీట్లు

ఆంధ్రప్రదేశ్‌లో 11 ప్రభుత్వ, 15 ప్రైవేటు, 2 మైనార్టీ కాలేజీల్లో కన్వీనర్, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా, ఇలా అన్ని విభాగాల్లో 5,010 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల వరకు మాత్రమే చూస్తే.. ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 2,180. రాష్ట్రంలో ప్రభుత్వ ఎంబీబీఎస్‌ సీట్లలో 15 శాతం జాతీయ కోటా కింద నేషనల్‌ పూల్‌లో భర్తీ చేస్తారు. మిగతా 85 శాతం సీట్లను రాష్ట్రమే భర్తీ చేస్తుంది. కాగా, 2 ప్రభుత్వ డెంటల్‌ కాలేజీల్లో 140 సీట్లు, 14 ప్రైవేటు డెంటల్‌ కాలేజీల్లో 1,300 బీడీఎస్‌ సీట్లు ఉన్నాయి.

15 శాతం సీట్లకు అఖిల భారత కౌన్సెలింగ్

  • నీట్‌లో జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సంటైల్‌గా, ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా నిర్ణయించారు. సీట్ల కేటాయింపులో ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. 
  • అఖిల భారత కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో సీట్లు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, కేంద్ర సంస్థలు అన్నీ నీట్‌ ర్యాంకుల ఆధారంగానే కేటాయిస్తారు. 
  • దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని 15 శాతం సీట్లను నేషనల్‌ పూల్‌లోకి తీసుకున్నారు. వాటినన్నింటినీ అఖిల భారత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. నీట్‌ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్‌ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. 
  • నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్‌ జాబితాను ’కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ’ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సరీ్వసెస్‌తో పాటు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రూపొందిస్తాయి. విద్యార్థులు 15 శాతం అఖిల భారత సీట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు  https://www.mcc.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎన్ టీఏ విజ్ఞప్తి చేసింది. 
  • ఇక రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేస్తాయి. ఇందుకోసం రాష్ట్రస్థాయి నీట్‌ ర్యాంకులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా కన్వీనర్, మేనేజ్‌మెంట్, ఎన్ ఆర్‌ఐ, మైనారిటీ సీట్లను భర్తీ చేస్తారు. 

Gemini Internet

AP EAPCET వెబ్ ఆప్షన్లు ఫ్రీజ్ కాని సమస్యకు పరిష్కారం | AP EAPCET Weboptions Freezing problem Solved 2021-22

AP EAPCET 2021-22 సంవత్సరానికి సంబందించి ఎవరైతే weboptions పెడుతున్నారో అలాంటి వారు ఖచ్చితంగా తెలుసుకోవలసినవి

1.     వెబ్ ఆప్షన్స్ పెట్టాడానికి ముందు కాలేజ్ కోడ్స్, కోర్సు కోడ్ లను జాగ్రత్త ఒక పేపరు లో వ్రాసుకుని వెబ్ ఆప్షన్స్ ను ఫిలప్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు కొని కొత్త కోర్సులకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు కాబట్టి తల్లిదండ్రులు, సన్నిహితులు, కంప్యూటర్ ఆపరేటర్లు శ్రద్ద తీసుకుని కోర్సు అలాగే నచ్చిన కాలేజీ కోడ్ లను వరుస క్రమంలో వ్రాసుకోవాలని మనవి.

2.    ఇంజీనీరింగ్ లో ఎవరైనా ఫోన్ నెంబరు పోగొట్టుకున్నా లేదా ఫోన్ నెంబరు తప్పుగా ఎంటర్ చేసి OTP లు రాకపోతే అలాంటి వారు మీకు సంబందించిన Help Line Centerను సందర్శించండి.

3.    ఇప్పుడు చెప్పబోయేది కాస్త జాగ్రత్తగా వినండి, విద్యార్థులు ఖచ్చితంగా కంప్యూటర్లు వాడాలి సెల్ ఫోన్ లో చేయడానికి ప్రయత్నించకండి.

మీరు ఆప్షన్స్ పెట్టినతరువాత Freeze ఆప్షన్ పనిచేయకపోతే వేరొక బ్రౌజర్ లో చేయడం ద్వారా మీ ఆప్షన్లను ఫ్రీజ్ చేయవచ్చు.

నిజానికి ఈ సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రస్తుత బ్రౌజర్లో options సేవ్ చేసిన తరువాత successfully saved అని వచ్చి do you want to block this message prompt అనే ఆప్షన్ ను క్లిక్ చేసి ఉండడం వల్ల ఇది జరుగుతుంది.

క్రింద ఉన్న స్క్రీన్ షాట్ లలో weboption ప్రక్రియను చూడవచ్చు.

Gemini Internet, Dhanalakshmi Road, Hindupur.




 
వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 5వ తేదీ వరకు ఆప్షన్లను నమోదు చేయవచ్చు. నవంబర్ 6వ తేదీన మార్పులు చేసుకోవచ్చు. నవంబర్ 10వ తేదీన తొలి విడత సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్ధులు ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు సంబంధిత కాలేజీల్లో నవంబర్ 15వ తేదీలోపు చేరాలి. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

AP EAPCET: ఇంజనీరింగ్, ఫార్మసీలో సీట్లు వివరాలు

ఏపీఈఏపీ సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఈ రోజు (నవంబర్‌ 2న) ప్రారంభం అయింది. 

Gemini Internet

వెబ్ కౌన్సెలింగ్కు కాలేజీల్లోని కోర్సులవారీగా సీట్ల సంఖ్యను ప్రభుత్వం నవంబర్ 1న ఖరారు చేసింది. ఈ మేరకు వేర్వేరు జీవోలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్చంద్ర విడుదల చేశారు. తొలిసారిగా యూనివర్సిటీల కాలేజీలు, ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలతో పాటు ప్రైవేటు యూనివర్సిటీల్లోని 35 శాతం సీట్లు కూడా కనీ్వనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. 2021–22 విద్యా సంవత్సరంలో తొలి విడత కౌన్సెలింగ్కు 1,45,421 ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అత్యధికం కంప్యూటర్ సైన్సు విభాగంలో ఉన్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ (ఈసీఈ), మెకానికల్, కెమికల్, సివిల్ వంటి కోర్ సబ్జెక్టులకు సంబంధించినవి ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి మొత్తం 435 కాలేజీలు ఈసారి కౌన్సెలింగ్లో ఉన్నాయి.

నవంబర్ 2 నుంచి వెబ్ ఆప్షన్లు

వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 5వ తేదీ వరకు ఆప్షన్లను నమోదు చేయవచ్చు. నవంబర్ 6వ తేదీన మార్పులు చేసుకోవచ్చు. నవంబర్ 10వ తేదీన తొలి విడత సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్ధులు ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు సంబంధిత కాలేజీల్లో నవంబర్ 15వ తేదీలోపు చేరాలి. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

యూనివర్సిటీ కాలేజీల్లోని ఇంజనీరింగ్‌ సీట్లు

5,901

ప్రైవేటు కాలేజీల్లోని ఇంజనీరింగ్‌ సీట్లు

1,24,577

ప్రైవేటు వర్సిటీల్లో ఇంజనీరింగ్‌ సీట్లు

2,118

యూనివర్సిటీ కాలేజీల్లో ఫార్మసీ సీట్లు

600

ప్రైవేటు కాలేజీల్లోని ఫార్మసీ సీట్లు

12,225

 

NEET-UG 2021: నీట్ వ్రాసిన విద్యార్థులు తెలుసుకోవలసిన విషయాలు

  • నీట్‌–2021కు దాదాపు 16 లక్షల మంది హాజరు
  • విద్యార్థులు దృష్టి పెట్టాల్సిన అంశాలెన్నో!

నీట్‌–యూజీ–2021. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల(సెప్టెంబర్‌) 12న జాతీయ స్థాయిలో నిర్వహించిన పరీక్ష! ఇందులో ర్యాంకు ఆధారంగా.. మెరిట్‌ లిస్ట్, ఫైనల్‌ కటాఫ్‌లను నిర్ణయించి.. ఆల్‌ ఇండియా కోటా.. అదేవిధంగా రాష్ట్రాల స్థాయిలో కన్వీనర్‌ కోటా విధానంలో సీట్లు భర్తీ చేస్తారు!! నీట్‌ యూజీ ఈసారి క్లిష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు..పరీక్షలో మంచి మార్కులు వస్తాయని, సీటు లభించే అవకాశం ఉందని భావించే విద్యార్థులు! మరోవైపు.. పరీక్ష సరిగా రాయలేక పోయామని.. ఆశించిన ర్యాంకు రాకపోవచ్చని ఆవేదన చెందే విద్యార్థులు! ఫలితాలు వెలువడటానికి మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. నీట్‌ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు నిపుణుల సలహాలు.. 

జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్‌ 2021కు దాదాపు 16 లక్షల మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నీట్‌కు ఆంధ్రప్రదేశ్‌ నుంచి 59,951 మంది, తెలంగాణ నుంచి 59,069 మంది దరఖాస్తు చేసుకున్నారు. ‘గత ఏడాదితో పోల్చితే నీట్‌ ఈసారి క్లిష్టంగా ఉంది. 450 మార్కులకు పైగా వచ్చిన వారికి సీటు లభించే అవకాశం ఉంది’ అని నిపుణులు సూచిస్తున్నారు.

450 కంటే ఎక్కువ 

నీట్‌ను మొత్తం 720 మార్కులకు నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరై.. 450 కంటే ఎక్కువ మార్కులు వస్తాయని భావిస్తున్న విద్యార్థులు.. జాతీయ, రాష్ట్ర స్థాయిలోని మెడికల్, డెంటల్‌ కళాశాలల వివరాలు తెలుసుకోవడంపై దృష్టిపెట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఆయా కళాశాలల్లో విద్యా ప్రమాణాలు, ఇతర మౌలిక సదుపాయాల గురించి తెలుసుకోవాలి. ఫలితంగా కౌన్సెలింగ్‌ సమయంలో ప్రాథమ్యాలుగా పేర్కొనాల్సిన కాలేజీలపై స్పష్టత వస్తుంది. 

కౌన్సెలింగ్‌కు సన్నద్ధం

నీట్‌లో మెరుగైన ప్రతిభ చూపామని, సీటు ఖాయమని భావించే విద్యార్థులు.. కౌన్సెలింగ్‌కు సన్నద్ధమవ్వాలి. కౌన్సెలింగ్‌ సమయంలో అవసరమయ్యే అన్ని రకాల ధ్రువ పత్రాలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ తదితర ధ్రువ పత్రాలను వీలైనంత ముందుగా ఫలితాలు వెలువడేలోపు పొందేందుకు కసరత్తు చేయాలి.

ముందుగా ఆల్‌ ఇండియా కోటా

ప్రస్తుతం నీట్‌–యూజీ ప్రవేశాలను ఆల్‌ ఇండియా కోటా, స్టేట్‌ కోటా అనే రెండు విధానాల్లో నిర్వహిస్తున్నారు. ముందుగా ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ జరుగుతుంది. ఆల్‌ ఇండియా కోటాలో.. అన్ని రాష్ట్రాల్లోని మెడికల్‌ కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు. వీటికి స్థానికత, పుట్టిన రాష్ట్రం తదితర అంశాలతో సంబంధం లేకుండా.. ఏ రాష్ట్ర విద్యార్థులైనా దరఖాస్తు చేసుకొని..ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. గతేడాది కౌన్సెలింగ్‌ గణాంకాల ప్రకారం–ఆల్‌ ఇండియా కోటాలో దాదాపు 6,700 ఎంబీబీఎస్‌ సీట్లు; నాలుగు వేల బీడీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సారి కౌన్సెలింగ్‌ సమయానికి ఈ సంఖ్యలో మార్పులు,చేర్పులు జరిగే అవకాశముంది.

రాష్ట్రాల స్థాయిలో కౌన్సెలింగ్‌

ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ ముగిశాక.. రాష్ట్రాల స్థాయిలో ప్రవేశాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల హెల్త్‌ యూనివర్సిటీలు వేర్వేరుగా కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. వీటికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల మార్కుల ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ రూపొందించి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు పేర్కొన్న కాలేజ్, సీటు ప్రాథమ్యాలు; వారు పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకొని ప్రవేశం ఖరారు చేస్తారు.

కాలేజ్‌ ఎంపిక

ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల విషయంలో ఏ కాలేజ్‌లో సీటు వచ్చినా ఓకే అనుకునే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కారణం..సీట్ల పరిమితే! కానీ నీట్‌లో మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించే కళాశాలలో చేరేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎయిమ్స్, జిప్‌మర్‌ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. కాబట్టి విద్యార్థులు నాణ్యమైన ఇన్‌స్టిట్యూట్‌లో చేరేలా ప్రాథమ్యాలను ఇవ్వాలి. 

ప్రత్యామ్నాయ మార్గాలు 

నీట్‌ పరీక్షను ఆశించిన విధంగా రాయలేదని భావిస్తున్న విద్యార్థులు.. ప్రత్యామ్నాయ కోర్సులవైపు దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీరు వైద్య అనుబంధ కోర్సులుగా పేర్కొనే ఆయుష్‌తోపాటు మరెన్నో కోర్సులను ఎంచుకోవచ్చు. 

ఆయుష్‌ కోర్సులూ నీట్‌తోనే

  • ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో సీటు దక్కని విద్యార్థులకు చక్కటి ప్రత్యామ్నాయం.. ఆయుష్‌ కోర్సులు. బీహెచ్‌ఎంఎస్, బీఏఎంఎస్, యునానీ(బీయూఎంఎస్‌), బీఎన్‌వైఎస్‌ వంటి కోర్సులను పూర్తి చేసుకుంటే.. డాక్టర్‌ కల సాకారం అవుతుంది. 
  • ఆయుష్‌ కోర్సుల సీట్లను కూడా నీట్‌ స్కోర్‌ ఆధారంగానే భర్తీ చేస్తున్నారు. ఇందుకోసం ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత.. ప్రత్యేక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. తెలంగాణలో కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్, ఏపీలో ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌లు ఈ ప్రక్రియను చేపడతాయి.

బీహెచ్‌ఎంఎస్‌
బ్యాచిలర్‌ ఆఫ్‌ హోమియోపతిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ(బీహెచ్‌ఎంఎస్‌).గత కొన్నేళ్లుగా కార్పొరేట్‌ రూపు సంతరించుకుంటున్న కోర్సు ఇది. బీహెచ్‌ఎంఎస్‌ పూర్తి చేసిన వారికి ప్రస్తుతం అవకాశాలకు కొదవ లేదు. రోగుల్లో ఈ వైద్య విధానంపై ఆసక్తి పెరగడం, పలు కార్పొరేట్‌ ఆసుపత్రులు ప్రత్యేకంగా హోమియోపతి వైద్యాన్ని అందించే ఏర్పాట్లు చేస్తుండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఏపీలో నాలుగు కళాశాలల్లో,తెలంగాణలో అయిదు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.
 
బీఏఎంఎస్‌
మెడికల్‌ రంగంలో స్థిరపడాలనుకునే బైపీసీ విద్యార్థులకు మరో ప్రత్యామ్నాయం.. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ(బీఏఎంఎస్‌). ఈ కోర్సులోనూ ఎంబీబీఎస్‌లో మాదిరిగానే అనాటమీ, ఫిజియాలజీ, పిడియాట్రిక్స్, జనరల్‌ మెడిసిన్‌ తదితర సబ్జెక్టులు బోధిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు కళాశాలల్లో, తెలంగాణలో రెండు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఉన్నత విద్యపరంగా ఎండీ స్థాయిలో ఆయుర్వేద, ఎంఎస్‌–ఆయుర్వేద కోర్సులు చదవొచ్చు. 

యునానీ (బీయూఎంఎస్‌)
ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతున్న మరో కోర్సు.. బీయూఎంఎస్‌(బ్యాచిలర్‌ ఆఫ్‌ యునానీ మెడికల్‌ సైన్స్‌). దీన్ని పూర్తిగా ప్రకృతి వైద్యంగా పేర్కొనొచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి, తెలంగాణలో ఒకటి చొప్పున రెండు కళాశాలల్లో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది. 

బీఎన్‌వైఎస్‌
బ్యాచిలర్‌ ఆఫ్‌ నేచురోపతిక్‌ మెడికల్‌ సైన్సెస్‌.. బీఎన్‌వైఎస్‌. బైపీసీ విద్యార్థులకు వైద్య రంగంలో మరో ప్రత్యామ్నాయ కోర్సు ఇది. దీన్ని పూర్తి చేసిన వారికి యోగా, సిద్ధ యోగా వంటి విధానాల ద్వారా రోగులకు చికిత్స చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి. ఈ కోర్సు తెలంగాణలో ఒక కళాశాలలో, ఏపీలో ఒక కళాశాలలో అందుబాటులో ఉంది.

బీవీఎస్‌సీ
బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న చక్కటి కోర్సు.. బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీ(బీవీఎస్‌సీ). ఈ కోర్సు ద్వారా.. జంతువులకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల తదితర అంశాలపై నైపుణ్యం లభిస్తుంది. పౌల్ట్రీ ఫారాలు, పశు వైద్య ఆసుపత్రులు, పశుసంవర్థక శాలలు,వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలు, డెయిరీ ఫామ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తెలంగాణలో పి.వి.నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. 

అగ్రికల్చర్‌ బీఎస్సీ
బైపీసీ విద్యార్థులకు అవకాశాలు అందించే మరో కోర్సు.. అగ్రికల్చర్‌ బీఎస్సీ. వ్యవసాయ సాగు విధానాల్లో ఆధునిక పద్ధతులు, నూతన పరికరాల వినియోగం వంటి నైపుణ్యాలను అందించే కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రైవేటు రంగంలో విత్తన ఉత్పాదక సంస్థలు, పౌల్ట్రీ ఫామ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. రూరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్లుగా కొలువులు దక్కించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో.. ఆచార్య ఎన్‌జీరంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ(ఏపీ), ఆచార్య జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ(తెలంగాణ) పరిధిలో పలు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.

హార్టికల్చర్‌ సైన్స్‌
బైపీసీ విద్యార్థులు బీఎస్సీ హార్టికల్చర్‌ సైన్స్‌ను ఎంచుకోవచ్చు. వీరికి స్టేట్‌ హార్టికల్చర్‌ మిషన్, నాబార్డ్‌ వంటి వాటిల్లో ఉద్యోగాలు లభిస్తాయి. డ్రిప్‌ ఇరిగేషన్‌ కంపెనీలు, మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. తెలంగాణలో శ్రీ కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ, ఏపీలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. 

బీఎఫ్‌ఎస్సీ
బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌.. సంక్షిప్తంగా బీఎఫ్‌ఎస్‌సీ. బైపీసీ విద్యార్థులు ఈ కోర్సు ద్వారా చేపల పెంపకంపై ప్రత్యేక నైపుణ్యాలు పొందొచ్చు. వీరికి ఆక్వాకల్చర్‌ సంస్థలు, ఆక్వా రీసెర్చ్‌ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలు. తెలంగాణలో పి.వి. నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ఏపీలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది.

ఇతర కోర్సులు కూడా
బైపీసీ విద్యార్థులు ఆసక్తి ఉంటే.. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ నర్సింగ్, బ్యాచిలర్‌ ఆఫ్‌ అనస్థీషియా టెక్నాలజీ వంటి కోర్సుల్లో కూడా చేరే అవకాశం ఉంది.

నీట్‌–2021– ముఖ్యాంశాలు

  • జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్‌కు దాదాపు 16 లక్షల మంది హాజరు. 
  • దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌లో 83 వేలు, 
  • బీడీఎస్‌లో 27 వేల సీట్లు. 
  • నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ప్రకారం–ఏపీలో 5,210 ఎంబీబీఎస్‌ సీట్లు, తెలంగాణలో 5,240 ఎంబీబీఎస్‌ సీట్లు. 
  • గత ఏడాది హెల్త్‌ యూనివర్సిటీల నోటిఫికేషన్‌ గణాంకాల ప్రకారం– ఏపీలో 1440 బీడీఎస్‌ సీట్లు , తెలంగాణలో 1140 బీడీఎస్‌ సీట్లు. 
  • 450పైగా స్కోర్‌ వస్తుందనుకునే విద్యార్థులు కౌన్సెలింగ్‌కు సన్నద్ధంగా ఉండాలి.
  • కౌన్సెలింగ్‌కు అవసరమైన అన్ని ధ్రువ పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
  • ఎంబీబీఎస్, బీడీఎస్‌కు ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్న ఆయుష్, ఏజీ బీఎస్సీ, బీవీఎస్‌సీ, ఫిషరీస్‌ తదితరాలు.

కౌన్సెలింగ్‌కు ముందే స్పష్టత

నీట్‌ కౌన్సెలింగ్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్, ఛాయిస్‌ ఫిల్లింగ్‌ విషయంలో స్పష్టతతో వ్యవహరించాలి. ఇందుకోసం ఇప్పటి నుంచే ముందస్తు కసరత్తు ప్రారంభించాలి. నిర్దిష్టంగా కాలేజీ, కోర్సు విషయంలో స్పష్టత వచ్చాక.. దానికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలు పేర్కొనాలి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్‌ పత్రాలు దగ్గర ఉండేలా చూసుకోవాలి. – డాక్టర్‌ బి.కరుణాకర్‌ రెడ్డి, వైస్‌ ఛాన్స్‌లర్, కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌

Gemini Internet

విద్యా ఉద్యోగ సమాచారం Education and Job Updates



Gemini Internet

న‌వంబ‌రు 4న టిటిడి స్థానిక ఆల‌యాల్లో దీపావళి ఆస్థానం

🕉 TTD News ™ తిరుపతి:
          తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం, శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యాల్లో న‌వంబ‌రు 4వ తేదీ దీపావళి సందర్భంగా శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు.

🕉 శరీ గోవిందరాజస్వామివారి ఆలయంలో….

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి
★ సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల మధ్య నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు.
◆  అనంతరం దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు.

🕉 శరీ కోదండరామస్వామివారి ఆలయంలో….

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో దీపావళి సందర్భంగా రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు దీపావ‌ళి ఆస్థానం నిర్వహించారు.

★ దీపావళి సందర్భంగా గురువారం రాత్రి 7.00 గంటలకు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది.

🕉 న‌వంబ‌రు 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం :

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నవంబరు 2న ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.

👉 శరీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో నవంబరు 2న ఉదయం 7.30 నుండి 10 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. అనంతరం భక్తులను ఉదయం 11 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.

👉 ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. దీపావళి ఆస్థానం సంద‌ర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆన‌వాయితీ.
 *Dept.Of PRO TTD*

Gemini Internet

రైతులకు శుభవార్త.. గ్యారంటీ లేకుండా రూ.3 లక్షల రుణం! Kisan Credit Card KCC

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రైతులకు శుభవార్త తెలిపింది. రైతులకు గ్యారంటీ లేకుండా రూ. 3 లక్షలు వరకు రుణం అందించనున్నట్లు పేర్కొంది. ఈ రుణం కోసం ఎస్‌బీఐ బ్యాంక్ ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. రైతులకు సహాయం చేయడం కోసం ఎస్‌బీఐ కిసాన్ క్రెడిట్ కార్డును అందిస్తుంది. రైతు తన వ్యవసాయానికి సంబంధించిన ఖర్చుల కోసం ఈ కార్డు సహాయంతో రుణం సులభంగా తీసుకోవచ్చు. ఇది చాలా సులభమైన ప్రక్రియ. దీని ద్వారా వారి అవసరాన్ని బట్టి రుణం అందిస్తుంది. ఈ కార్డు గురించి మ‌రిన్ని వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎస్‌బీఐ కిసాన్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలు

  • కిసాన్ క్రెడిట్ కార్డు అనేది రివాల్వింగ్ క్యాష్ క్రెడిట్ అకౌంట్ తరహాలోనే ఇది ఉంటుంది. 
  • ఖాతాలో ఏదైనా బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటును అందిస్తుంది.
  • ఈ కార్డు వ్యవది 5 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం వార్షిక సమీక్షకు లోబడి మీ కార్డు పరిమితి 10% పెరుగుతుంది.
  • కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న రుణాలకు రూ.3 లక్షల వరకు 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. 
  • తిరిగి చెల్లించే వ్యవధి పంట కాలం(స్వల్ప/దీర్ఘం), పంట మార్కెటింగ్ పీరియడ్ పై ఆధారపడి ఉంటుంది. 
  • 45 రోజులకు ఒకసారి కార్డు యాక్టివేట్ చేసినట్లయితే, బ్యాంకు రూపే కార్డుల మాదిరిగా మీకు రూ. 1 లక్ష బీమా లభిస్తుంది.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
రైతులు/వ్యక్తులు/ఉమ్మడి రుణగ్రహీతలు, యజమాని సాగుదారులు, కౌలు రైతులు, నోటి లెస్సీలు, షేర్ క్రాపర్లు అందరూ కూడా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కౌలు రైతులు, షేర్ క్రాపర్లు మొదలైన వాటితో సహా రైతుల స్వయం సహాయక గ్రూప్, జాయింట్ లయబిలిటీ గ్రూపులు కూడా వర్తిస్తాయి. రూ.3 లక్షల వరకు తీసుకునే రుణాలపై వడ్డీ రేటు 7 శాతం వరకు ఉంటుంది. 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు రుణగ్రహీతలు వ్యక్తిగత ప్రమాద బీమా పథకం(పీఎఐఎస్) కింద కవర్ చేయబడతారు. అర్హత కలిగిన పంటలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పిఎమ్ఎఫ్ బివై) కింద కవర్ అవుతాయి.

(చదవండి: ఆహా ఏమి అదృష్టం! ఏడాదిలో కోటీశ్వరులైపోయారు!)

కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా?

  • ఎస్‌బీఐ పోర్టల్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి 
  • రైతులు నేరుగా ఎస్‌బీఐ శాఖను సందర్శించి కేసీసీ దరఖాస్తు ఫారమ్ కోసం అడగవచ్చు. 
  • ఆ తర్వాత మీ పూర్తి వివరాలను నింపి, బ్యాంకులో సమర్పించాలి 
  • బ్యాంకు దరఖాస్తును పరిశీలించి, దరఖాస్తుదారుడి వివరాలను ధృవీకరించి, కార్డును కేటాయిస్తుంది. 

యోనో ద్వారా కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా?

  • యోనో ఎస్‌బీఐ లాగిన్ అవ్వండి
  • యోనో కృషి ఆప్షన్ పై క్లిక్ చేసి ఖాతాపై క్లిక్ చేయండి. 
  • మళ్లీ కిసాన్ క్రెడిట్ కార్డుపై క్లిక్ చేయండి 
  • ఇప్పుడు మీ వ్యక్తిగత వివరాలు, భూమి వివరాలు, పంట వివరాలు నమోదు చేసి దరఖాస్తు సమర్పించండి. 
  • మీరు గనుక అర్హులు అయితే, కిసాన్ క్రెడిట్ కార్డు మీ ఇంటికి వస్తుంది.

కావాల్సిన పత్రాలు 

  • ఇంటి చిరునామా, గుర్తింపు రుజువు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి. 
  • వ్యవసాయ భూమి పత్రాలు 
  • దరఖాస్తుదారుడి ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌ను అందించాలి. 
  • కార్డ్ జారీ చేసే బ్యాంక్ సెక్యూరిటీ పోస్ట్ డేటెడ్ చెక్‌ను సమర్పించమని కూడా అడగవచ్చు.

Gemini Internet

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...