Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

11, నవంబర్ 2023, శనివారం

ITBP: ఐటీబీపీలో 248 కానిస్టేబుల్ (జనరల్‌ డ్యూటీ) పోస్టులు ఖాళీల వివరాలు: అర్హతలు: వయోపరిమితి: పే స్కేల్: పరీక్ష రుసుము: | ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 13-11-2023. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-11-2023.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

ITBP: ఐటీబీపీలో 248 కానిస్టేబుల్ (జనరల్‌ డ్యూటీ) పోస్టులు 

భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)... స్పోర్ట్స్ కోటా-2023 కింద కానిస్టేబుల్ (జనరల్‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి నియామక ప్రకటనను విడుదలచేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 248 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 28లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

కానిస్టేబుల్(జనరల్‌ డ్యూటీ) గ్రూప్ 'సి' నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్): 248 పోస్టులు

క్రీడాంశాలు: అథ్లెటిక్స్, ఆక్వాటిక్స్, ఈక్వెస్ట్రియన్, స్పోర్ట్స్ షూటింగ్, బాక్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, ఉషు, కబడ్డీ, రెజ్లింగ్, ఆర్చరీ, కయాకింగ్, కానోయింగ్, రోయింగ్.

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత క్రీడాంశంలో ప్రతిభావంతులై ఉండాలి.

వయోపరిమితి: 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.21,700-రూ.69,100.

పరీక్ష రుసుము: యూఆర్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 13-11-2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-11-2023.

Important Links

Posted Date: 11-11-2023

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఇంజినీరింగ్‌ మూడో విడతలో 1,510 సీట్ల కేటాయింపు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

ఇంజినీరింగ్‌ మూడో విడతలో 1,510 సీట్ల కేటాయింపు  

ఇంజినీరింగ్‌ మూడో విడత ప్రత్యేక కౌన్సెలింగ్‌లో 1,510 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు కన్వీనర్‌ నాగరాణి తెలిపారు. కేవలం ప్రైవేటు కళాశాలల్లో మిగిలిన సీట్లకు మాత్రమే కౌన్సెలింగ్‌ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 221 ప్రైవేటు కళాశాలల్లో 27,764 సీట్లు ఉండగా.. 1,510 సీట్లు భర్తీ అయ్యాయి. బ్రాంచిలు, కళాశాలల ఎంపికకు 1,735 మంది వెబ్‌ ఐచ్ఛికాలు నమోదు చేసుకున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 14లోపు కళాశాలల్లో చేరాలని కన్వీనర్‌ సూచించారు.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

అక్రెడిటెడ్‌ జర్నలిస్టులకు మూడు సెంట్ల స్థలం | రెండో విడత నర్సింగ్ కౌన్సెలింగ్లో 3109 సీట్ల భర్తీ | Driving License డీఎల్, Vehicle R C ఆర్సీ కార్డుల జారీ ప్రారంభం | డిజిటల్ లాకర్ సిస్టంపై అవగాహన

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

అక్రెడిటెడ్‌ జర్నలిస్టులకు మూడు సెంట్ల స్థలం 

షరతులు వర్తిస్తాయి
రెవెన్యూ శాఖ ఉత్తర్వుల జారీ

రాష్ట్రంలోని అక్రెడిటెడ్‌ జర్నలిస్టులకు కొన్ని షరతులతో మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ స్థలానికి అయ్యే వ్యయంలో ప్రభుత్వం 60% చెల్లిస్తుందని, మిగిలిన 40% జర్నలిస్టులు భరించాలని వెల్లడించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సాయిప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘ప్రస్తుతం అక్రెడిటేషన్‌ కలిగి ఉండి... మీడియాలో కనీసం అయిదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. జర్నలిస్టులు పనిచేస్తున్న/ నివాసం ఉంటున్న జిల్లాలోనే స్థలం కేటాయిస్తారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఛైర్మన్‌గా ఏర్పడే కమిటీ అర్హుల జాబితాను ఖరారు చేస్తుంది. ఇళ్ల నిర్మాణాలకు అనువైన స్థలాలను ఎంపిక చేస్తుంది’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

షరతులు:

* స్థలాన్ని అందజేసిన తేదీ నుంచి పదేళ్లలోగా స్థలంలో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలి. లేదంటే స్థల కేటాయింపు రద్దవుతుంది. 

* ఇల్లు కట్టుకుని ‘ఫిజికల్‌ పొజిషన్‌’ పొందిన పదేళ్ల తర్వాత ప్రభుత్వ అనుమతి లేకుండానే అమ్ముకోవచ్చు.

దరఖాస్తు చేసే జర్నలిస్టు దంపతుల్లో ఎవరి పేరు మీదా ఇంటి స్థలం, ఇల్లు, ఫ్లాట్‌ (పనిచేసే ప్రాంతంలో లేదా నివాసం ఉండేచోట) ఉండకూడదు.

గతంలో ప్రభుత్వం నుంచి ఇల్లు/ స్థలం పొంది ఉండకూడదు.

కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, పీఎస్‌యూలలో పని చేస్తున్నా అనర్హులవుతారు.

సమాచారశాఖ పేర్కొన్న తేదీ నుంచి 45 రోజుల్లోగా సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

*అర్హులైన అక్రెడిటెడ్‌ జర్నలిస్టుల జాబితాను జిల్లా కలెక్టర్లకు సమాచార శాఖ పంపుతుంది.

రెండో విడత నర్సింగ్ కౌన్సెలింగ్లో 3109 సీట్ల భర్తీ

ఆరోగ్య విశ్వవిద్యాలయం: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని 225 నర్సింగ్ కళాశాలల్లో మొదటి విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన 4135 బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్ల కోర్సు సీట్లకు విజయవాడ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నిర్వహించిన కన్వీనర్ కోటా రెండో విడత కౌన్సెలింగ్ 3109 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 1026 సీట్లు ఖాళీగా ఉన్నట్లు విశ్వవిద్యాలయం ప్రకటించింది. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల్లోగా ఆయా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.

All Qualified Candidates in APEAPCET- 2023 are Eligible for B.Sc(Nursing) Course. 

Provisional Allotment Order - Phase - II by clicking the below.

https://ugnursing.ysruhs.com/ugnu_allotment/index.php 

డీఎల్, ఆర్సీ కార్డుల జారీ ప్రారంభం

అనంతపురం అర్బన్, నవంబరు 10: డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల జారీ ప్రక్రియను తిరిగి ప్రారంభించామని జిల్లా ట్రాన్స్పోర్టు అధికారి వీర్రా జు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ వరకు జిల్లాలో 32 వేల డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు, 55 వేల ఆర్సీ కార్డులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. పక్షం రోజులుగా ప్రింటింగ్ జరుగుతోందని, ఇప్పటిదాకా 32 వేల డ్రైవింగ్ లైసెన్స్ కార్డులను ప్రింట్ చేశామని తెలిపారు. మరో పదిరోజుల్లో పోస్టల్ ద్వారా వాహనదారుల ఇంటికే కార్డులను పంపుతామని తెలిపారు. ఇప్పటి వరకు 12 వేల ఆర్సీ కార్డుల ప్రింటింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు. డిసెంబరు నెలాఖరులోగా కార్డులను వాహనదారుల ఇంటికి పంపుతామని పేర్కొన్నారు. 
డిజిటల్ లాకర్ సిస్టంపై అవగాహన కల్పించండి

అనంతపురం విద్య, నవంబరు 10: డిజిటల్ లాకర్ సిస్టంను ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ సెల్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని, విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని డీఈఓ నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలు, విశ్వవిద్యాలయాలు. విద్యాసంస్థలకు ఈ డీజీ లాకర్ను అమలు చేయాలని ఆదేశాలిచ్చిందన్నారు. డీజీలాకర్లో 10వ తరగతి, ఇంటర్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, కుల, ఆదాయ, జననధ్రువీకరణ పత్రాలు, ఓబీసీ సర్టిఫికెట్లు, మైగ్రేషన్ సర్టిఫికెట్లు, ఈబీసీ సర్టిఫికెట్లు, రేషన్ కార్డు తదితర సర్టిఫికెట్లను డిజిటల్ రూపంలో భద్రపరుచుకోవచ్చునన్నారు. వీటిని ఎక్కడైనా పేపర్ లెన్గా డిజిటల్ రూపంలో వినియోగించుకోవచ్చునన్నారు. డీజీ లాకటర్ ఓపెన్ చేయడానికి ఎలాంటి రుసుం అవసరమూ లేదన్నారు. ఈ క్రమంలో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను చైతన్యపరిచి పిల్లల పేరుతో ఈ డీజీ లాకర్ను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. తమ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డీజీ లాకర్ అనే యాప్ డౌన్ డౌన్లోడ్ చేసుకోవచ్చనని తెలిపారు. మరిన్ని వివరాలకు http://etgovernment.com/s/arzx6qr

సంప్రదించాలని సూచించారు.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Central Jobs: రెండు వారాల్లో నోటిఫికేషన్ జారీ * పదో తరగతి అర్హతతో దరఖాస్తు అవకాశం * ఫిబ్రవరి 20 నుంచి రాత పరీక్షలు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రంగం సన్నద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో కానిస్టేబుల్(గ్రౌండ్‌ డ్యూటీ) ఖాళీలు భర్తీకానున్నాయి. పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్‌సీబీలో సిపాయి పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) సమాయత్తమవుతోంది. ఎస్‌ఎస్‌సీ వార్షిక క్యాలెండర్‌ ప్రకారం నవంబర్‌ 24న నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 28 పూర్తి కానుంది. రాత పరీక్ష తేదీలను ఎస్‌ఎస్‌సీ ఇటీవలే వెల్లడించింది. పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. కానిస్టేబుల్(గ్రౌండ్‌ డ్యూటీ) రాత పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29; మార్చి 1, 5, 6, 7, 11, 12వ తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరుగుతుందని పేర్కొంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్‌ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.

గతేడాది 50,187 ఖాళీల భర్తీ

గతేడాది నవంబర్‌లో భారీ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది సైతం అంత కంటే ఎక్కువ సంఖ్యలోనే పోస్టులు భర్తీ కానున్నాయి. 

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...