అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
Alerts
ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications
తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.
25, నవంబర్ 2021, గురువారం
HPCL Recruitment 2021: ఇంజనీరింగ్ చేసిన వారికి శుభవార్త.. HPCLలో రూ. 25 వేతనంతో ఉద్యోగాలు
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) నుంచి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. దరఖాస్తుకు డిసెంబర్ 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
2.మెకానికల్ ఇంజనీరింగ్ (Mechanical engineering)
3.ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (Electrical engineering)
4.ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (Electrical and electronics engineering)
5.ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (Electronics and telecommunication engineering)
6.ఇన్ట్ర్సుమెంటేషన్ ఇంజనీరింగ్ (Instrumentation engineering)
7.కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Computer science engineering or information technology)
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించిన తేదీ: నవంబర్ 22.
దరఖాస్తుల ప్రక్రియ ముగిసే తేదీ: డిసెంబర్ 6.
ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు మొదట NATS పోర్టల్ లో ఎన్ రోల్ చేసుకోవాలి.
Step 2: అనంతరం USER lD/Email lD ఐడీ మరియు పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి.
Gemini Internet
SBI ATM Card: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు ఉందా? లక్ష రూపాయల లోన్ ఇస్తున్న బ్యాంక్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు గుడ్ న్యూస్. కస్టమర్లకు అనేక
లోన్ ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటుంది ఎస్‌బీఐ. షాపింగ్ కోసం డబ్బులు
కావాలనుకునేవారికి క్షణాల్లో లోన్ ఇచ్చే ఆఫర్ ఒకటి ఉంది. ఈ ఆఫర్ ద్వారా
కస్టమర్లకు రూ.8,000 నుంచి రూ.1,00,000 వరకు ఇన్‌స్టంట్ లోన్ ఇస్తోంది ఎస్‌బీఐ. ఈఎంఐ ఫెసిలిటీ కోసం ఈ లోన్ ఉపయోగించుకోవచ్చు. ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఉన్నవారు ఈ రుణం పొందడానికి అర్హులు. క్రెడిట్ కార్డ్
ఉన్నవారు ఎలాగూ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటారు. కానీ క్రెడిట్
కార్డ్ లేనివాళ్లు కూడా ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డు ఉంటే
చాలు. షాపింగ్ చేసి ఈఎంఐగా మార్చుకోవచ్చు. ఇలా రూ.8,000 నుంచి రూ.1,00,000
మధ్య ఎంతైనా షాపింగ్ చేయొచ్చు.
ప్రీ-అప్రూవ్డ్ పద్ధతి ద్వారా ఈ లోన్
ఇస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే కస్టమర్లకు ముందుగానే లోన్
అప్రూవ్ చేస్తుంది. ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఈఎంఐ కావాలనుకునే కస్టమర్లు ఈ
ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్‌లో లేదా బయట వ్యాపారుల దగ్గర షాపింగ్ చేసిన
తర్వాత ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ స్వైప్ చేసి ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవాల్సి
ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఈ ఆఫర్
పొందొచ్చు. మరి మీరు ఎస్‌బీఐ కస్టమర్ అయితే డెబిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా మీకు
ఎంత వరకు లోన్ వస్తుందో తెలుసుకోవడానికి ఒక ఎస్ఎంఎస్ పంపిస్తే చాలు.
Gemini Internet
click here for official tweet https://twitter.com/i/status/1458343629680832514
Step 1- ఏదైనా షాపులో మీ షాపింగ్ పూర్తైన తర్వాత పాయింట్ ఆఫ్ సేల్ (POS) మెషీన్‌లో మీ ఏటీఎం కార్డు సెలెక్ట్ చేయాలి.
Step 2- ఆ తర్వాత బ్రాండ్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవాలి.
Step 3- ఆ తర్వాత బ్యాంక్ ఈఎంఐ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 4- మీరు ఎంత మొత్తం వాడుకుంటున్నారో అమౌంట్ ఎంటర్ చేయాలి.
Step 5- ఆ తర్వాత ఎన్ని నెలల్లో తిరిగి చెల్లించాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయాలి.
Step 6- 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు, 18 నెలల ఆప్షన్ ఎంచుకోవచ్చు.
Step 7- ఆ తర్వాత మీ డెబిట్ కార్డ్ పిన్ ఎంటర్ చేయాలి.
ఆన్‌లైన్‌లో కూడా దాదాపుగా ఇదే పద్ధతిలో ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. ఇక ప్రతీ నెలా మీ అకౌంట్ నుంచి ఈఎంఐ కట్ అవుతూ ఉంటుంది. మీరు ఉపయోగించుకున్న మొత్తానికి 14.70 శాతం వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్ ఉపయోగించుకున్నవారికి ప్రాసెసింగ్ ఫీజు లేదని చెబుతోంది బ్యాంకు. డాక్యుమెంటేషన్ కూడా లేదు. ఇన్‌స్టంట్‌గా లోన్ మంజూరవుతుంది. సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్‌ను కూడా బ్లాక్ చేయమని చెబుతోంది బ్యాంకు.
SBI Alert: సంవత్సరానికి ఓసారి రూ.342 చెల్లిస్తే చాలు... రూ.4,00,000 విలువైన బెనిఫిట్స్
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు అలర్ట్. భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. రెండు ఇన్స్యూరెన్స్ స్కీమ్స్ ద్వారా రూ.4,00,000 వరకు బీమా సదుపాయాన్ని (Insurance) అందిస్తోంది. ఇందుకోసం కేవలం రూ.342 చెల్లిస్తే చాలు. ఈ వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది ఎస్‌బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)
2. కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ఇన్స్యూరెన్స్ తీసుకోవాలన్న స్పృహ ప్రజల్లో పెరిగింది. ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలు కూడా ఉన్నాయి. ఈ పథకాల ప్రయోజనాలు కస్టమర్లకు అందించేందుకు ఎస్‌బీఐ కృషి చేస్తోంది. అందులో భాగంగా ఈ పథకాలపై తమ కస్టమర్లకు అవగాహన కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రెండు పథకాల ద్వారా కస్టమర్లు రూ.4,00,000 బీమా ప్రయోజనాలు పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరించిన మొదటి ఇన్స్యూరెన్స్ పథకం ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY). ఈ పథకం ద్వారా రూ.2,00,000 ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. ఇది యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ పాలసీ. ప్రతీ ఏటా కేవలం రూ.12 ప్రీమియం చెల్లిస్తే చాలు. ఈ పాలసీహోల్డర్ ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.2,00,000 బీమా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ప్రమాదంలో గాయపడి, పూర్తిగా వికలాంగులుగా మారితే రూ.2,00,000 బీమా ద్వారా ఆదుకుంటుంది ప్రభుత్వం. పాక్షికంగా అంగవైకల్యం ఏర్పడితే రూ.1,00,000 వరకు బీమా లభిస్తుంది. 18 నుంచి 70 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ పాలసీ మాత్రమేనని గుర్తుంచుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఎస్‌బీఐ వివరించిన మరో ఇన్స్యూరెన్స్ పథకం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY). ఈ పాలసీ ద్వారా రూ.2,00,000 బీమా లభిస్తుంది. ప్రతీ ఏటా రూ.330 ప్రీమియం చెల్లించాలి. ఈ పాలసీహోల్డర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.2,00,000 బీమా చెల్లించి ఆర్థికంగా ఆదుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇది టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు ఉన్నవారు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీల ద్వారా జూన్ 1 నుంచి మే 31 వరకు ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పాలసీకి రూ.12, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీకి రూ.330 కలిపి మొత్తం రూ.342 ప్రీమియం చెల్లిస్తే రూ.4,00,000 బీమా లభిస్తుంది.
7. ఈ పాలసీలు తీసుకోవాలనుకునే కస్టమర్లు సమీపంలో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌కు
వెళ్లి వివరాలు ఇవ్వాలి. వారికి ఎస్‌బీఐలో అకౌంట్ ఉండాలి. ఈ పాలసీ
తీసుకున్న తర్వాత అకౌంట్ క్లోజ్ చేస్తే పాలసీ కూడా క్యాన్సిల్ అవుతుంది.
ప్రతీ ఏటా గడువు లోగా ప్రీమియం చెల్లించడానికి అకౌంట్‌లో బ్యాలెన్స్
లేకపోయినా పాలసీ రద్దయ్యే అవకాశం ఉంది.
పాత కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మారిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా?
Convert Diesel And Petrol Car To Electric Car: ఢిల్లీ ప్రభుత్వం ఆటోమొబైల్ రంగం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పాత డీజిల్ వెహికల్స్‌ను ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం ఎలక్ట్రిక్ కిట్‌లను తయారు చేసే సంస్థ ఢిల్లీ రవాణా శాఖ ఒప్పందం కుదుర్చుకోనుందని ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గహ్లోట్ తెలిపారు.
2015లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, 2018లో సుప్రీంకోర్టు 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ పాత డీజిల్ వాహనాలు,15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ పాత పెట్రోల్ వాహనాలు ఢిల్లీ -ఎన్సీఆర్ (National Capital Region) లో నడపరాదని ఆదేశించింది. ఈ తీర్పు కారణంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని వినియోగదారులు తమ వాహనాల్ని మూలన పెట్టేశారు. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఢిల్లీలోని 10 ఏళ్లకు పై బడిన పెట్రో వాహనాల యజమానులకు ఉపశమనం కలగనుంది.
పాత కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మారిస్తే అయ్యే ఖర్చు
మనదేశంలో ఈవీ కన్వర్షన్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి ధర రూ.1లక్ష నుంచి రూ.4లక్షల వరకు ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ఈట్రియో ఇప్పటికే మారుతీ ఆల్టో,డిజైర్స్ వంటి పెట్రోల్ -డీజిల్ వాహనలను ఒకే ఛార్జ్‌పై 150 కిలోమీటర్ల వరకు బ్యాటరీ పరిధి కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తోంది. ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ ధర దాదాపు రూ.4లక్షలుగా ఉంది.
2012లో బెంగళూరు కేంద్రంగా ఆల్టిగ్రీన్ సంస్థ పెట్రో వాహనాల్ని హైబ్రిడ్ వెర్షగా మార్చేస్తున్నాయి. ఆల్ట్రిగ్రీన్ హైబ్రిడ్ కిట్ ఇంజిన్‌ను అమర్చుతుంది. డ్యూయల్ ఎలక్ట్రిక్ మెషిన్, జనరేటర్, వైర్‌జీను,పవర్, కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ తో పాటు 48వీ బ్యాటరీ ప్యాక్ 4లీడ్ యాసిడ్ బ్యాటరీలతో డిజైన్ చేస్తుంది. ఈ ప్లగ్ ఇన్ సిస్టమ్ ధర రూ.60వేల నుంచి రూ.80వేల మధ్య ఉంటుంది.
ఢిల్లీకి చెందిన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ రెట్రోఫిట్
కారు కంపెనీ ఏదైనా మాన్యువల్ గేర్ బాక్స్ ఇంజిన్ కారును రూ.1 నుంచి
రూ.2లక్షలకు, తయారీతో పాటు మోడల్ ఆధారంగా హైబ్రిడ్‌గా మార్చేస్తుంది.
అయితే ఈ కిట్ ధర రూ.5 లక్షల వరకు ఉండనుందని తెలుస్తోంది. మరి పాతకార్లపై
భారీ మొత్తాన్ని వెచ్చించి వాటిని ఈవీ వెహికల్స్‌గా ఎందుకు
మార్చుకుంటారనేది ప్రశ్నార్ధకంగా మారింది. పైగా కొత్త ఎలక్ట్రిక్
వెహికల్‌ను కొనుగోలు చేసినందుకు ఆయా ప్రభుత్వాలు రాయితీతోపాటు, ట్యాక్స్‌లో
రాయితీ పొందవచ్చు.
Gemini Internet
Bank FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా.. ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసా.
Bank latest fixed deposit rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన పెట్టుబడి ఎంపిక. ఎఫ్‌డిలలో పెట్టుబడి పెట్టే ముందు ఎవరైనా పెట్టుబడిదారుడు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చడం చాలా ముఖ్యం. వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను తనిఖీ చేయకుండా, మీరు FD పొందడానికి నష్టాన్ని కూడా భరించవలసి ఉంటుంది. అందువల్ల, వడ్డీ రేటును తనిఖీ చేసిన తర్వాత పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం ప్రయోజనకరం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ICICI బ్యాంక్, HDFC బ్యాంక్‌తోపాటు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులైన యాక్సిస్ బ్యాంక్ వంటి రుణదాతలు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తున్నాయి. వివిధ బ్యాంకుల FD వడ్డీ రేట్లు డిపాజిట్ మొత్తం డిపాజిట్ కాలవ్యవధి డిపాజిటర్ ఆధారంగా మారుతూ ఉంటాయి. యాక్సిస్ బ్యాంక్, SBI, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ అందించే తాజా FD రేట్లు ఇక్కడ ఉన్నాయి.
SBI తాజా FD వడ్డీ రేట్లు
SBI 7 రోజుల నుండి 10 సంవత్సరాల మధ్య FDలపై సాధారణ కస్టమర్లకు 2.9 శాతం నుండి 5.4 శాతం వరకు వడ్డీని ఇస్తుంది. ఈ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు అదనంగా 50 బేసిస్ పాయింట్లను పొందుతారు. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న రిటైల్ FDలపై SBI సవరించిన రేట్లు జనవరి 8, 2021 నుండి అమలులోకి వస్తాయి.
7 రోజుల నుండి 45 రోజుల వరకు – 2.9%
46 రోజుల నుండి 179 రోజులు – 3.9%
180 రోజుల నుండి 210 రోజులు – 4.4%
211 రోజులు.. 1 సంవత్సరం కంటే తక్కువ – 4.4%
1 సంవత్సరం, 2 సంవత్సరాల కంటే తక్కువ – 5%
2 సంవత్సరాలు , 3 సంవత్సరాల కంటే తక్కువ – 5.1%
3 సంవత్సరాలు, 5 సంవత్సరాల కంటే తక్కువ – 5.3%
5 సంవత్సరాలు , 10 సంవత్సరాల వరకు – 5.4%
HDFC బ్యాంక్ FD వడ్డీ రేట్లు
HDFC బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 2.50% నుండి 5.50% వరకు వడ్డీని అందిస్తుంది. ఈ రేట్లు 21 మే 2021 నుండి అమలులోకి వస్తాయి. HDFC బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై సీనియర్ సిటిజన్‌లకు 3% నుండి 6.25% వడ్డీ రేటును అందిస్తుంది.
7 – 14 రోజులు- 2.50%
15 – 29 రోజులు- 2.50%
30 – 45 రోజులు – 3%
61 – 90 రోజులు – 3%
91 రోజులు – 6 నెలలు – 3.5%
6 నెలలు 1 రోజు – 9 నెలలు – 4.4%
9 నెలలు 1 రోజు < 1 సంవత్సరం – 4.4%
1 సంవత్సరం- 4.9%
1 సంవత్సరం 1 రోజు – 2 సంవత్సరాలు – 4.9%
2 సంవత్సరాలు 1 రోజు – 3 సంవత్సరాలు – 5.15%
3 సంవత్సరాలు 1 రోజు – 5 సంవత్సరాలు – 5.30%
5 సంవత్సరాలు 1 రోజు – 10 రోజులు – 5.50%
ICICI బ్యాంక్ FD రేట్లు
ICICI బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 2.5% నుండి 5.50% వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు 21 అక్టోబర్ 2020 నుండి వర్తిస్తాయి. సీనియర్ సిటిజన్లు ఇతరులతో పోలిస్తే 50 bps అధిక వడ్డీ రేటును పొందడం కొనసాగుతుంది.
7 రోజుల నుండి 14 రోజుల వరకు – 2.50%
15 రోజుల నుండి 29 రోజులు – 2.50%
30 రోజుల నుండి 45 రోజుల వరకు – 3%
46 రోజుల నుండి 60 రోజుల వరకు – 3%
61 రోజుల నుండి 90 రోజులు – 3%
91 రోజుల నుండి 120 రోజులు – 3.5%
121 రోజుల నుండి 184 రోజులు – 3.5%
185 రోజుల నుండి 210 రోజులు – 4.40%
211 రోజుల నుండి 270 రోజులు – 4.40%
271 రోజుల నుండి 289 రోజులు – 4.40%
290 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ – 4.40%
1 సంవత్సరం నుండి 389 రోజులు – 4.9%
390 రోజుల నుండి <18 నెలల వరకు – 4.9%
18 నెలల నుండి 2 సంవత్సరాల వరకు – 5%
2 సంవత్సరాల 1 రోజు నుండి 3 సంవత్సరాల వరకు – 5.15%
3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు – 5.35%
5 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాల వరకు – 5.50%
యాక్సిస్ బ్యాంక్ తాజా FD వడ్డీ రేట్లు
ప్రైవేట్ రంగ రుణదాత యాక్సిస్ బ్యాంక్ నవంబర్ 10, 2021 నుండి FDలపై వడ్డీ రేట్లను సవరించింది. తాజా సవరణ తర్వాత, యాక్సిస్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై 2.50% నుండి 5.75% వరకు వడ్డీ రేటును అందిస్తోంది.
7 రోజుల నుండి 14 రోజులు 2.50%
15 రోజుల నుండి 29 రోజులు 2.50%
30 రోజుల నుండి 45 రోజులు 3%
46 రోజుల నుండి 60 రోజులు 3%
61 రోజులు < 3 నెలలు 3%
3 నెలలు < 4 నెలలు 3.5%
4 నెలలు < 5 నెలలు 3.5%
5 నెలలు < 6 నెలలు 3.5%
6 నెలలు < 7 నెలలు 4.40%
7 నెలలు < 8 నెలలు 4.40%
8 నెలలు < 9 నెలలు 4.40%
9 నెలలు < 10 నెలలు 4.40%
10 నెలలు < 11 నెలలు 4.40%
11 నెలలు < 11 నెలలు 25 రోజులు 4.40%
11 నెలలు 25 రోజులు < 1 సంవత్సరం 4.4%
1 సంవత్సరం < 1 సంవత్సరం 5 రోజులు 5.10%
1 సంవత్సరం 5 రోజులు < 1 సంవత్సరం 11 రోజులు 5.15%
1 సంవత్సరం 11 రోజులు < 1 సంవత్సరం 25 రోజులు 5.20%
1 సంవత్సరం 25 రోజులు < 13 నెలలు 5.20%
13 నెలలు < 14 నెలలు 5.10%
14 నెలలు < 15 నెలలు 5.10%
15 నెలలు < 16 నెలలు 5.10%
16 నెలలు < 17 నెలలు 5.10%
17 నెలలు < 18 నెలలు 5.10%
18 నెలలు < 2 సంవత్సరాలు 5.25%
2 సంవత్సరాలు < 30 నెలలు 5.40%
30 నెలలు < 3 సంవత్సరాలు 5.40%
3 సంవత్సరాలు < 5 సంవత్సరాలు 5.40%
5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు 5.75%
Gemini Internet
Sabarimala: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్
Sabarimala: శబరిమల యాత్రికులను సన్నిధానంలో బస చేసేందుకు, నీలిమల మార్గం దాటేందుకు అనుమతించే అంశాన్ని పరిశీలిస్తామని సమావేశం అనంతరం దేవస్వం మంత్రి రాధాకృష్ణన్ తెలిపారు.
Gemini Internet
భారీ వర్షాలు, వరదలు, కరోనా కారణంగా శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులు అనేక ఆంక్షలు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా పలు ఆంక్షలను కేరళ ప్రభుత్వం తొలగించింది. పంపా నది నీటి మట్టం తగ్గడంతో అక్కడ అయ్యప్ప భక్తుల స్నానానికి అనుమతి ఇచ్చింది. సంప్రదాయ మార్గంలో పర్వతారోహణను అనుమతించడం కూడా పరిశీలనలో ఉంది.
సన్నిధానంలో భక్తులను కంచుకోటకు అనుమతిచాలా వద్దా అనే అంశంపై కూడా త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. శబరిమల తీర్థయాత్రకు కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకు దేవస్వం బోర్డు కృషి చేస్తోంది. ఒక్కరోజులో శబరిమలలో ప్రవేశించే భక్తుల సంఖ్య 45 వేలకు పెరిగింది. ప్రస్తుతం భక్తులు పంపా నుంచి స్వామి అయ్యప్పన్ రోడ్డు మీదుగా సన్నిధానం వరకు ప్రయాణిస్తున్నారు.
నీలిమల మీదుగా రహదారిని తెరిచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. పంపాలో జరిగిన దేవస్వం బోర్టు సమీక్షా సమావేశం అనంతరం ఈ నిర్ణయాలు తీసుకున్నారు. శబరిమల యాత్రికులను సన్నిధానంలో బస చేసేందుకు, నీలిమల మార్గం దాటేందుకు అనుమతించే అంశాన్ని పరిశీలిస్తామని సమావేశం అనంతరం దేవస్వం మంత్రి రాధాకృష్ణన్ తెలిపారు.
భారీ వర్షాలు కొనసాగితే వచ్చే మూడు రోజుల పాటు శబరిమలలో భక్తుల సంఖ్యను నియంత్రించాలని కేరళ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. వర్షాల కారణంగా నీటి మట్టం ప్రమాదకరంగా ఉండటంతో పంపా స్నానానికి అనుమతి లేదు. ఇతర స్నానాలకు దిగవద్దని సూచించారు.
పంపాలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో భక్తులకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు అనుమతులు ఇస్తామని మంత్రి తెలిపారు. దర్శనం అయిన వెంటనే తిరిగి రావాల్సి రావడంతో యాత్రికులు శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని సన్నిధానంలో ఉండేందుకు అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం 300 గదుల్లో భక్తులకు వసతి కల్పించారు. మిగిలిన 200 గదులకు మరమ్మతులు చేయాల్సి ఉంది. రెండేళ్లుగా గదులు నిరుపయోగంగా ఉండడంతో మరమ్మతులు చేయాల్సి వస్తోంది. సన్నిధానంలో భక్తులు బస చేసేందుకు దేవస్వం డార్మెటరీలను సిద్ధం చేస్తుంది.
షబరిమల Q దర్శన్ కోసం అప్లై చేయడానికి సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం.
DJ music సౌండుకు 63 కోళ్లు మృతి -పక్కా ఆధారాలతో పౌల్ట్రీ ఓనర్ కేసు.. చివరికి.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం(Air Pollution) పై నానా రభస జరుగుతుండగా, తూర్పు రాష్ట్రం ఒడిశాలో ధ్వని కాలుష్యానికి సంబంధించి సంచలన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. డీజే మ్యూజిక్ సౌండుకు తట్టుకోలేక తన పౌల్ట్రీ ఫామ్ లోని 63 కోళ్లు చనిపోయాయని ఆరోపిస్తూ దీనికి బాధ్యులైనవారిపై మర్డర్ కేసు (Murder case) పెట్టాల్సిందిగా ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కోళ్ల మరణం ముమ్మాటికీ డీజీ సౌండ్ వల్లే సంభవించిందని వెటర్నరీ డాక్టర్ ఇచ్చిన రిపోర్టును సైతం ఆయన పోలీసుల ముందు ఉంచాడు. చరిత్రలో ఏనాడూ ఇలాంటి ఆరోపణల్ని విని ఎరుగని పోలీసులు ఈ కేసును ఎలా డీల్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఉన్నతాధికారులు సైతం ఈ వివాదంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఒడిశాలోని బాలోసోర్ జిల్లా నీలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ అనూహ్య ఘటన వివరాలివి..
బాలాసోర్ జిల్లాలోని
కందగరాది గ్రామానికి చెందిన రంజిత పారిదా(22) ఇంజనీరింగ్ గ్రాడ్యువేట్.
చదువయ్యాక ఉద్యోగం దొక్కపోవడంతో కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని
సొంత గ్రామంలోనే కోళ్ల ఫారం పెట్టుకున్నాడు. రెండేళ్లుగా ఆ ఫారం ఫర్వాలేదనే
స్థాయిలో నడుస్తోంది. కాగా, మొన్న ఆదివారం నాడు రంజిత్ పొరుగున ఉండే
రామచంద్ర ఇంట్లో వివాహ వేడుక జరిగింది. పెళ్లి ఊరేగింపులో డీజీ మ్యూజిక్
పెట్టారు. పెద్ద ఎత్తున పటాకులుసైతం కాల్చారు. భారీ శబ్దాలతో పెళ్లి
ఊరేగింపు.. రంజిత్ పౌల్ట్రీ ఫారం ముందు నుంచి ఊరు దాటింది. బారత్ లో డీజీ
చప్పుళ్లు, పటాకుల పేలుళ్లకు ఫారంలో కోళ్లన్నీ బెదిరిపోయాయి..
Gemini Internet
India Post GDS Results 2021: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల అభ్యర్థులకు అలర్ట్... గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు ఎప్పుడంటే..?
India Post GDS Results 2021 | మీరు గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) ఉద్యోగానికి అప్లై చేశారా? ఇటీవల మీ ఆప్షన్స్ మార్చారా? పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే అలర్ట్. ఫలితాలు ఎప్పట్లోపు రావొచ్చో తెలుసుకోండి.
1. ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు (Post Office Jobs)
భర్తీ చేయడంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ డాక్ సేవక్
(Gramin Dak Sevak) పోస్టుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు
నోటిఫికేషన్ల ద్వారా 3,446 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి
దరఖాస్తుల్ని స్వీకరించింది. 2021 జనవరి 27 నుంచి 2021 మార్చి 1 వరకు
దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది.
Gemini Internet
2. సాధారణంగా రెండు నెలల్లోపే ఫలితాలు వస్తుంటాయి. కానీ కొన్ని నెలలైనా ఫలితాలు విడుదల కాకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల ఇండియా పోస్ట్ ఈ ఫలితాలను వెల్లడించలేదు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటీవ్ ట్రిబ్యునల్, హైదరాబాద్ ఆదేశాల మేరకు విత్‌హెల్డ్ పోస్టుల స్థానంలో అభ్యర్థులు ఆప్షన్స్ ఎంచుకునే అవకాశం కల్పించింది ఇండియా పోస్ట్.
3. 2021 జనవరి 27 నుంచి 2021 మార్చి 1 మధ్య గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ కొత్త ఆప్షన్స్ ఎంచుకోవడానికి 2021 నవంబర్ 18 వరకు అవకాశం ఇచ్చింది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు https://appost.in/ వెబ్‌సైట్‌లో ఆప్షన్స్ మార్చుకున్నారు. ఇప్పుడు ఆ అభ్యర్థులు అంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
4. గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ దరఖాస్తు గడువు ముగిసిన రెండు నెలల్లోపు ఫలితాలు విడుదల చేస్తుంది ఇండియా పోస్ట్. ఆప్షన్స్ మార్చుకునే గడువు నవంబర్ 18న ముగియడంతో డిసెంబర్ లోగా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. https://appost.in/ వెబ్‌సైట్‌లో Results Under Process స్టేటస్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నోటిఫికేషన్స్ కనిపిస్తున్నాయి.
5. గ్రామీణ డాక్ సేవక్ ఫలితాల కోసం అభ్యర్థులు ట్విట్టర్‌లో ఇండియా పోస్ట్‌ను సంప్రదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్ ఫలితాల కోసం APCO, విజయవాడ ఇమెయిల్ ఐడీ rectt.ap@indiapost.gov.in లో సంప్రదించాలని ఇండియా పోస్ట్ తెలిపింది. లేదా 0866 - 2429822 నెంబర్‌కు కాల్ చేయాలని కోరుతోంది. ఇక తెలంగాణ అభ్యర్థులు tcgds2021@gmail.com మెయిల్ ఐడీలో లేదా 040-23463617 ఫోన్ నెంబర్‌లో సంప్రదించొచ్చు. (Source: Twitter)
6. తెలంగాణలో 1150 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. వీటిలో రిజర్వేషన్ వారీగా పోస్టుల వివరాలు చూస్తే మొత్తం ఖాళీలు- 1150, జనరల్ లేదా అన్ రిజర్వ్‌డ్- 484, ఓబీసీ- 279, ఈడబ్ల్యూఎస్- 130, PWD-A- 9, PWD-B- 14, PWD-C- 15, ఎస్సీ- 154, ఎస్టీ- 65 పోస్టుల్ని కేటాయించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 2296 ఖాళీలు ఉన్నాయి. రిజర్వేషన్ వారీగా పోస్టుల వివరాలు చూస్తే జనరల్ లేదా అన్ రిజర్వ్‌డ్- 947, ఓబీసీ- 507, ఈడబ్ల్యూఎస్- 324, PWD-A- 18, PWD-B- 34, PWD-C- 35, PWD-DE- 9, ఎస్సీ- 279, ఎస్టీ- 143 పోస్టులున్నాయి.
7. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌లో 266 పోస్టులు, ఉత్తరప్రదఏశ్‌లో 4264 పోస్టులు, ఉత్తరాఖండ్‌లో 581 పోస్టులు, పశ్చిమ బెంగాల్‌లో 2357 పోస్టులు, బీహార్‌లో 1940 పోస్టులు, మహారాష్ట్రలో 2428 పోస్టులు, ఢిల్లీలో 233 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు సంబంధించిన ఫలితాలు కూడా విడుదల కావాల్సి ఉంది. ఈ ఫలితాలను ఒకదాని వెంట మరొకటి విడుదల చేయనుంది ఇండియా పోస్ట్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫలితాలు రెండు నెలల్లో రిలీజ్ కావొచ్చు.
Bank of Baroda Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 376 ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు
Gemini Internet
బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్
విడుదల చేసింది. రిలేషన్‌షిప్ మేనేజర్ (Relationship Manager) పోస్టుల్ని
భర్తీ చేస్తోంది. మొత్తం 376 ఖాళీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని
బ్యాంకింగ్ రీజియన్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్‌లో 12 పోస్టులు
ఉన్నట్టు నోటిఫికేషన్‌లో వెల్లడించింది బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda). డిగ్రీ పాస్ అయినవారితో పాటు బ్యాంకింగ్ రంగంలో రెండేళ్ల లోపు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 9 చివరి తేదీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.
Bank of Baroda Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
| మొత్తం ఖాళీలు | 376 | విద్యార్హతలు | అనుభవం | వయస్సు |
| సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్ | 326 (హైదరాబాద్- 12) | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ పాస్ కావాలి. మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా పాస్ అయినవారికి, NISM, IRDA రెగ్యులేటరీ సర్టిఫికేషన్స్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. | ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఫారిన్ బ్యాంకులు, బ్రోకింగ్ సంస్థలు, సెక్యూరిటీ సంస్థలు, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో వెల్త్ మేనేజ్‌మెంట్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. | 24 నుంచి 35 ఏళ్లు |
| ఇ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్ | 50 | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ పాస్ కావాలి. మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా పాస్ అయినవారికి, NISM, IRDA రెగ్యులేటరీ సర్టిఫికేషన్స్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. | ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఫారిన్ బ్యాంకులు, బ్రోకింగ్ సంస్థలు, సెక్యూరిటీ సంస్థలు, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో వెల్త్ మేనేజ్‌మెంట్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా ఏడాదిన్నర పనిచేసిన అనుభవం ఉండాలి. | 23 నుంచి 35 ఏళ్లు |
దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 19
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 9
ఎంపిక విధానం- పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.100.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Bank of Baroda Recruitment 2021: అప్లై చేయండి ఇలా
Step 1- అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ https://www.bankofbaroda.in/ లో కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి.
Step 2- Current Opportunities క్లిక్ చేస్తే సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, ఇ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్ నోటిఫికేషన్స్ వేర్వేరుగా ఉంటాయి.
Step 3- మీరు ఏ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పోస్టుకు సంబంధించిన Apply Now పైన క్లిక్ చేయాలి.
Step 4- కొత్త పేజీ అవుతుంది. పోస్ట్ పేరు సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
Step 5- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇతర వివరాలన్నీ ఎంటర్ చేయాలి.
Step 6- ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
Step 7- ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.
Recent
10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification
ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
