అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
Alerts
ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications
తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.
3, డిసెంబర్ 2020, గురువారం
Andhra University Recruitment 2020
TTD News
🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
🕉 *గో సేవతో సమస్త దేవతలనూ పూజించిన ఫలితం : కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి వారు*
➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల : గోమాతను పూజించడం ద్వారా సమస్త దేవతలను పూజించిన ఫలితం లభిస్తుందని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి అన్నారు.
👉 అలిపిరి పాదాల మండపం సమీపంలో టీటీడీ ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితుడు శ్రీ శేఖర్ రెడ్డి సహకారంతో నిర్మిస్తున్న సప్త గో ప్రదక్షిణ మందిరంను బుధవారం సాయంత్రం స్వామి పరిశీలించారు.
★ ప్రదక్షిణ మందిరం ముందు ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ స్వామి విగ్రహానికి స్వామి పూలమాలలు వేసి పూజించారు.
గో ప్రదక్షిణ శాలలో 24 గంటలూ ఏడు గోవులు ఉంటాయని అధికారులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి కి వివరించారు. తిరుమలకు నడకదారిలో వెళ్లే భక్తులు, వాహనాల్లో వెళ్ళే భక్తులు వేర్వేరు ద్వారాల ద్వారా వచ్చి గో ప్రదక్షిణ చేసుకుని వెళ్లే ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు.
👉 ఇదే ప్రాంతంలో గో తులాభారం మందిరం తో పాటు సుమారు 30 గోవులు ఉండటానికి అన్ని సదుపాయాలతో గో సదన్ నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు. స్వామి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
👉 ఈ సందర్భంగా విజయేంద్ర సరస్వతి స్వామి మీడియాతో మాట్లాడారు. గోమాత కామధేనువన్నారు. గోవు మానవుల వ్యవసాయ అవసరాలకు, ఆరోగ్య రక్షణకు కూడా ఉపయోగపడుతోందని అన్నారు. గో పూజా ఫలితం గురించి అనేక పురాణాల్లో వివరించారన్నారు. దక్షిణ భారతదేశంలో గోశాలలు, ఉత్తర భారత దేశంలో వేద పాఠశాలలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్వామి చెప్పారు. గో సంరక్షణకు టీటీడీ తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. తిరుమల ఆలయ వైకుంఠ ద్వారాన్ని 10 రోజుల పాటు తెరచి ఉంచాలని ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్వామి స్పందించారు. శాస్త్రానికి, సంప్రదాయానికి ఇబ్బంది కలగని మంచి ఎక్కడ ఉన్నా స్వీకరించడం తప్పుకాదన్నారు. దేశంలోని అనేక ప్రముఖ విష్ణు క్షేత్రాల్లో ఉత్తర ద్వారం పది రోజులు తీసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారని స్వామి చెప్పారు. భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకుని, ఎక్కువ మందికి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించడాన్ని తప్పు పట్టాల్సిన పని లేదని ఆయన చెప్పారు.
■ టీటీడీ ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ శేఖర్ రెడ్డి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్వీ గో సంరక్షణ శాల సంచాలకులు శ్రీ హరనాథ్ రెడ్డి పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD.*
ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్‌లైన్ టెస్ట్ (AFCAT) -2021
బ్రాంచ్: ఫ్లయింగ్ బ్రాంచ్‌లోని షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) మరియు గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్) బ్రాంచ్‌లలో శాశ్వత కమిషన్ (పిసి) మరియు షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి). ఎన్‌సిసి స్పెషల్ ఎంట్రీ స్కీమ్ (ఫ్లయింగ్ బ్రాంచ్ ) కోసం పిసి / ఎస్‌ఎస్‌సి మంజూరు కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తారు.
ఖాళీలు: 235 పోస్టులు
- ఫ్లయింగ్ బ్రాంచ్- ఎస్ఎస్సి 69
- ఫ్లయింగ్ బ్రాంచ్- ఎన్‌సిసి 10% సీట్లు
- గ్రౌండ్ డ్యూటీ- టెక్నికల్- 95 పోస్ట్లు
- గ్రౌండ్ డ్యూటీ- నాన్ టెక్నికల్- 67 పోస్ట్లు
ఉపాధి రంగం: కేంద్ర ప్రభుత్వం
అర్హత: గుర్తింపు పొందిన సంస్థల నుండి బీఈ, బీటెక్, డిగ్రీ, పీజీ
జీతం: రూ. 56,100 - 1,77,500/-
ఉద్యోగ స్థానం: ఆల్ ఓవర్ ఇండియా
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 30-డిసెంబర్ -2020
వయోపరిమితి: (ఎ) ఫ్లయింగ్ బ్రాంచ్. 01 జనవరి 2022 నాటికి 20 నుండి 24 సంవత్సరాలు
(బి) గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ / నాన్-టెక్నికల్) శాఖలు). 01 జనవరి 2022 నాటికి 20 నుండి 26 సంవత్సరాలు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, AFSB ఇంటర్వ్యూ
ఎలా దరఖాస్తు చేయాలి:
వివిధ కేంద్రాల్లో AFCAT ప్రవేశానికి ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించబడుతుంది.
AFCAT ఎంట్రీ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు రూ. 250 / - పరీక్ష ఫీజుగా.
అభ్యర్థులు https://careerindianairforce.
ఫ్లైయింగ్
అండ్ గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్) బ్రాంచెస్‌లో
కమీషన్డ్ ఆఫీసర్లుగా భారత వాయు శక్తి యొక్క ఒక భాగం. ఆన్‌లైన్ దరఖాస్తుల
కోసం రిజిస్ట్రేషన్ 30 DEC 2020 ద్వారా మూసివేయబడుతుంది https://careerindianairforce.
| వివరాలు | లింకులు / పత్రాలు |
| అధికారిక నోటిఫికేషన్ | Download |
| దరఖాస్తు ఫారం | Click Here |
TTD News
🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
🕉 *డిసెంబరు 14న విశాఖలో శ్రీవారి కార్తీక సహస్ర దీపోత్సవం ఏర్పాట్లపై టిటిడి జెఈవో సమీక్ష*
➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల : విశాఖపట్టణంలో హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబరు 14వ తేదీన శ్రీవారి కార్తీక సహస్ర దీపోత్సవం నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్ బుధవారం సాయంత్రం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష జరిపారు.
👉 ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ను నాశనం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ నవంబరు 30వ తేదీ టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక మహాదీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే స్థాయిలో విశాఖలో శ్రీవారి కార్తీక సహస్ర దీపోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆయన ఆదేశించారు.
◆ వేదిక మీద వెయ్యి దీపాల నడుమ శ్రీవారి ఉయ్యాల సేవ, స్వామివారికి అభిముఖంగా శ్రీ సూక్తం యాగం నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
అలాగే భక్తులకు విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామివారు అనుగ్రహ భాషణం ఇచ్చేందుకు స్వామిని కోరతామన్నారు. భక్తిగీతాలాపన, అష్టలక్ష్మీ వైభవం నృత్యం, సామూహిక లక్ష్మీనీరాజనం(దీపాలు వెలిగించడం)తో పాటు కుంభ హారతి, నక్షత్ర హారతి, మంగళహారతి నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించాలన్నారు. అధికారుల బృందం విశాఖకు వెళ్లి కార్యక్రమ నిర్వహణకు అనువైన ప్రదేశాన్ని త్వరితగతిన నిర్ణయించాలన్నారు.
👉 ఈ సమీక్షలో జెఈవో(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్‌రెడ్డి, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, హెచ్‌డిపిపి కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య దక్షిణామూర్తి, కల్యాణోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ గోపాల్, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD.*
నిరుద్యోగులకు శుభవార్త, డిసెంబర్ 4న జాబ్ మేళా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం నగరంలో డిసెంబర్ 4వ తేదీన వివిధ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో భాగంగా జాబ్ మేళా ను నిర్వహించనున్నారు.
సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ( సిడాప్ ) మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలు సంయుక్తంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు.
ముఖ్యమైన సమాచారం :
| జాబ్ మేళా నిర్వహణ తేదీ | డిసెంబర్ 4,2020 |
| జాబ్ మేళా నిర్వహణ సమయం | ఉదయం 9 గంటలకు |
| జాబ్ మేళా నిర్వహణ ప్రదేశం | TTDC ట్రైనింగ్ సెంటర్, బాలయోగీ ఘాట్ ప్రక్కన,నల్ల వంతెన, అమలాపురం,తూర్పుగోదావరి జిల్లా,ఆంధ్రప్రదేశ్. |
సంస్థల వారీగా ఉద్యోగ అవకాశాలు :
న్యూ ల్యాండ్స్ లేబరేటరీ సంస్థ (హైదరాబాద్ ):
ఈ సంస్థలో ఖాళీగా ఉన్న మాన్యుఫాక్చరింగ్ అసిస్టెంట్ ఉద్యోగ అవకాశాలను ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులకు కల్పించనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపీసీ /బైపీసి విభాగాలలో ఇంటర్మీడియట్ ను పూర్తి చేసి ఉన్న మరియు B.Sc ను మధ్యలో వదిలివేసిన పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలను ఎంపిక చేసుకోవచ్చు.
శ్రీ సిటీ, తడ :
ఈ సంస్థలో హ్యుందాయ్ మోటార్ ఆపరేషన్స్, హీరో క్రాప్ మోటార్స్ ప్రొడక్షన్స్ ఆపరేటర్స్ ఉద్యోగాలను కల్పించనున్నారు.
ఫ్లెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్స్ :
ఈ జాబ్ మేళా ద్వారా ఫ్లెక్ ఇండియా సంస్థలో ఆపరేటర్ /లైన్ లీడర్ ఉద్యోగాలను నిరుద్యోగులకు కల్పించనున్నారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి /ఇంటర్మీడియట్ /డిప్లొమా /డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన స్త్రీలు మాత్రమే అర్హులు.
వేతనాలు :
ఈ జాబ్ మేళా ద్వారా వివిధ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,000 రూపాయలు నుండి 14,500 రూపాయలు వరకూ జీతం అందనుంది.
Junior Lecturer Jobs 2020 || గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పలు బోధన విభాగాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ప్రకటన విడుదల అయినది. అర్హతలు గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కృష్ణ లంక గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న బోధన విభాగాలకు గాను అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు
ముఖ్యమైన తేదీలు :
| దరఖాస్తుకు చివరి తేదీ | డిసెంబర్ 5,2020 సాయంత్రం 4 గంటల లోపు. |
బోధన విభాగాల వారీగా అధ్యాపక పోస్టులు :
బోటనీ
సివిక్స్
అర్హతలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ (PG) కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల్లో పనిచేసిన విశ్రాంత అధ్యాపకులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటనలో పొందుపరిచారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కృష్ణ లంక గవర్నమెంట్ జూనియర్ కళాశాలను నేరుగా సంప్రదించవచ్చును.
South Western Railway Jobs Recruitment 2020 || భారతీయ రైల్వే స్పోర్ట్స్ కోటా లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
భారతీయ రైల్వే బోర్డు నుంచి మరో మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.
సౌత్ వెస్ట్రన్ రైల్వే లో స్పోర్ట్స్ కోటా లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయినది.
ఈ ఉద్యోగాలకు ఇరుతెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ రైల్వే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
| దరఖాస్తు ప్రారంభం తేదీ | నవంబర్ 30,2020 |
| దరఖాస్తుకు చివరి తేదీ | డిసెంబర్ 28,2020 |
విభాగాల వారీగా ఉద్యోగాలు :
సౌత్ వెస్ట్రన్ రైల్వే లో స్పోర్ట్స్ కోటా లో ఈ క్రింది విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
| అథ్లెటిక్స్ ( మెన్ ) | 3 |
| అథ్లెటిక్స్ ( ఉమెన్ ) | 2 |
| బాడ్మింటన్ (మెన్ ) | 2 |
| క్రికెట్ ( మెన్ ) | 3 |
| వెయిట్ లిఫ్టింగ్ ( మెన్ ) | 2 |
| టేబుల్ టెన్నిస్ (మెన్ ) | 1 |
| హాకీ ( మెన్ ) | 4 |
| స్విమ్మింగ్ ( మెన్ ) | 2 |
| గోల్ఫ్ ( మెన్ ) | 2 |
మొత్తం ఖాళీలు :
మొత్తం 21 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి / ఇంటర్మీడియట్ విద్యా కోర్సులను గుర్తింపు పొందిన బోర్డుల నుండి పూర్తి చేసి ఉండాలి. క్రీడా సంబంధిత విభాగాల్లో ప్రత్యేకమైన కోర్సులు చేసి ఉండవలెను.జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడ అంశాలలో ప్రావీణ్యత అవసరం అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
వయోపరిమితి :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయసు 1-1-2021 నాటికీ 18 – 25 సంవత్సరాల మధ్యన ఉండవలెను.
దరఖాస్తు విధానం :
ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం :
ఫీల్డ్ ట్రయిల్స్, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలలో విజయాల మదింపు మరియు మెడికల్ టెస్టుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
వేతనం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు VII సీపీసి విధానంలో జీతములు లభించనున్నాయి.
ఫీజు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే జనరల్ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు దరఖాస్తు రుసుముగా చెల్లించవలెను.400 రూపాయలు రిఫండ్ వస్తాయి. మిగిలిన కేటగిరీ అభ్యర్థులు 250 రూపాయలును దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటులను మరియు నోటిఫికేషన్ ను చూడగలరు.
Website
website 2
Notification
Recent
10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification
ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
