Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

28, ఏప్రిల్ 2021, బుధవారం

నేవీలో 2500 సెయిల‌ర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది: 30.04.2021

 



భారత నావికా దళం(ఇండియన్‌ నేవీ).. 2500 సెయిలర్‌ పోస్టుల భర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌(ఏఏ)–500, సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌)–2000 ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
Jobs పోస్టులు: సెయిలర్‌
కోర్సు ప్రారంభం: ఆగస్టు 2021
మొత్తం పోస్టుల సంఖ్య: 2500(ఏఏ–500, ఎస్‌ఎస్‌ఆర్‌–2000).

ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌(ఏఏ): 500
అర్హత: ఇంటర్మీడియెట్‌/10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌ చదివి ఉండాలి.
వయసు: 01.02.2001 నుంచి 31.07.2004 మధ్య జన్మించి ఉండాలి.

సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌)–2000
అర్హత: ఇంటర్మీడియెట్‌/10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌ చదివి ఉండాలి.
వయసు: 01.02.2001 నుంచి 31.07.2004 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం..
రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌చేస్తారు. మొత్తం 2500 సెయిలర్‌ పోస్టులకు దాదాపు 10వేల మందిని రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టుకు పిలుస్తారు.

పరీక్ష విధానం..
ప్రశ్న పత్రం హిందీ/ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ప్రశ్న పత్రంలో నాలుగు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్‌ నాలెడ్జ్‌పై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న పత్రం ఇంటర్మీడియెట్‌ స్థాయిలో ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు అదే రోజు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. ఏడు నిమిషాల్లో 1.6 కిలోమీటర్ల పరుగు పూర్తిచేయాలి. అలాగే 20 ఉటక్‌ భైటక్, 10 ఫుష్‌ అప్స్‌చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేది: 30.04.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in/

ఐడీబీఐలో వివిధ ఖాళీలు.. దరఖాస్తుకు చివరి తేది మే 3..



ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsమొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: చీఫ్‌ డేటా ఆఫీసర్‌–01, హెడ్‌–ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ –ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) కాంప్లియన్స్‌–01, డిప్యూటీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌(ఛానల్స్‌)–01, డిప్యూటీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌(డిజిటల్‌)–01, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌–01, హెడ్‌–డిజిటల్‌ బ్యాంకింగ్‌–01.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం బ్యాచిలర్స్‌/మాస్టర్స్‌ డిగ్రీ ఇన్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు వివిధ టెక్నికల్‌ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: recruitment@idbi.co.in

దరఖాస్తులకు చివరి తేది: 03.05.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.idbibank.in

ఆర్మీ డెంటల్‌ కాఫ్స్‌లో 37 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లు.. దరఖాస్తుకు చివరి తేది మే 18..

 


ఇండియన్‌ ఆర్మీకి చెందిన ఆర్మీ డెంటల్‌ కాఫ్స్‌లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Jobsఆర్మీ డెంటల్‌ కాఫ్స్‌లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్లు.
మొత్తం పోస్టుల సంఖ్య: 37
అర్హత: బీడీఎస్‌(చివరి ఏడాది బీడీఎస్‌లో కనీసం 55శాతం మార్కులు సాధించాలి)/ఎండీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. 31.03.2021 నాటికి ఏడాదిపాటు రొటేటరీ ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 31.12.2021 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: నీట్‌(ఎండీఎస్‌)–2021 ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 18.05.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in

డీఎఫ్‌సీసీఐఎల్‌లో 1074 పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేది మే 23..

 



భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(డీఎఫ్‌సీసీఐఎల్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsమొత్తం పోస్టుల సంఖ్య: 1074
పోస్టుల వివరాలు: జూనియర్‌ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌.
విభాగాలు: సివిల్, ఆపరేషన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ తదితరాలు.

అర్హతలు:
జూనియర్‌ మేనేజర్‌: సంబంధిత విభాగాన్ని అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ(సివిల్‌ ఇంజనీరింగ్‌/మెకానికల్‌ ఇంజనీరింగ్‌/ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌/మెకట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌/ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌/ ఆటోమొబైల్‌/ కంట్రోల్‌/ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇంజనీరింగ్‌), ఎంబీఏ/పీజీడీబీఏ/పీజీడీబీఎం/పీజీడీఎం ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.50వేల నుంచి 1,60,000 వరకూ లభిస్తుంది.

ఎగ్జిక్యూటివ్‌: సంబంధిత విభాగాన్ని అనుసరించి డిప్లొమా(సివిల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/పవర్‌ సప్లయ్‌/ఇండస్ట్రియల్‌/ అప్లయిడ్‌ ఎలక్ట్రానిక్స్, మైక్రోప్రాసెసర్‌/ కమ్యూనికేషన్‌/డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.30వేల నుంచి రూ.1,20,000 వరకూ లభిస్తుంది.

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: 10వ తరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం : నెలకు రూ.25వేల నుంచి రూ.68వేల వరకూ అందుతుంది.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌/ఇంటర్వూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 23.05.2021

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేది: జూన్‌ 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://dfccil.com/

AP Mineral Development Corporation || 1 లక్ష రూపాయిలు జీతం ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ప్రభుత్వ ఉద్యోగాలు

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.  

కేవలం ఈ మెయిల్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చును అనీ ఈ ప్రకటనలో పొందుపరిచారు.

AP Mineral Development Corporation

ముఖ్యమైన తేదీలు :

ఈమెయిల్ దరఖాస్తుకు చివరి తేదిమే 22, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

జనరల్ మేనేజర్ (మార్కెటింగ్ )1
జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ )1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఎన్విరాన్మెంటల్ )1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (కాంట్రాక్టు మేనేజ్మెంట్ )1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (F&A /టాక్సషన్ )1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (CSR)1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్ )1
మేనేజర్ (సర్వే /GIS)1
మేనేజర్ (ఫైనాన్స్ )4
మేనేజర్ (కాంట్రాక్టు అడ్మిన్ )1
మేనేజర్ (ఐటీ )1
మేనేజర్ (మైనింగ్ )3
మేనేజర్ (కంపెనీ సెక్రటరీ )1
AP Mineral Development Corporation

అర్హతలు :

సంబంధిత విభాగాల ఉద్యోగాలను అనుసరించి డిప్లొమా (సివిల్ /మైనింగ్ )/బీ. టెక్ (ఐటీ )/ మైనింగ్ ఇంజనీరింగ్/ బీ. కామ్/సీఏ /ఎంబీఏ (మార్కెటింగ్ /ఫైనాన్స్ )/ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చును.

ఈ ఉద్యోగాల విద్యా అర్హతలకు సంబందించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీషియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 60 సంవత్సరాలకు మించరాదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ ఈమెయిల్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.


జీతం :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు  60,000 రూపాయలు నుండి 1,00,000 రూపాయలు పైన జీతముగా లభించనుంది.

ఈమెయిల్ అడ్రస్ :

apmdchrdrecruitments@gmail.com

Website 

Notification

 

Tirupati latest jobs || పరీక్ష లేదు, తిరుపతిలో ఉద్యోగాలు, 3- 5 లక్షల వరకూ జీతం

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు.

APSSDC ఆధ్వర్యంలో భర్తీ చేయబోతున్న ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల పని తీరును బట్టి ఈ పోస్టులను పేర్మినెంట్ చేయనున్నారు.

భారీ స్థాయిలో జీతములు లభించే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుపతి నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు .

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిఏప్రిల్  29, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 9గంటలకు

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్, చెల్ల కాంప్లెక్స్, 6-1-68/B-1, కే. టీ. రోడ్, తిరుపతి – 517501.

Tirupati latest jobs

విభాగాల వారీగా ఖాళీలు :

ఏజెన్సీ డెవలప్ మెంట్ మేనేజర్స్5
ఏజెన్సీ మేనేజర్స్20

అర్హతలు :

గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఏజెన్సీ డెవలప్ మెంట్ మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.సంబంధిత విభాగాలలో 3-6 సంవత్సరాలు అనుభవం అవసరం.

ఆర్మీ /నేవీ /ఎయిర్ ఫోర్స్ /రిటైర్డ్ /వీఆర్ఎస్ /ఫార్మా /బ్యాంకింగ్ /ఫైనాన్స్ /సేల్స్ పీపుల్ తదితర రంగాలలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును అనీ ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఇంటర్మీడియట్ మరియు ఆపైన అర్హతలు కలిగి ఉన్నావారు ఏజెన్సీ మేనేజర్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

హోం మేకర్స్ /చిట్ ఓనర్స్ /రిటైర్డ్ /వీఆర్ఎస్ /ఫైనాన్స్ /డిస్ట్రిబ్యూషన్ /అన్ ఎంప్లాయిస్ /డీఎస్ఏ /డీఎంఏ /లోన్ ఎగ్జిక్యూటివ్స్ తదితరులు అందరూ ఈ ఏజెన్సీ మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనీ ప్రకటన ద్వారా తెలుపుతున్నారు.

వయసు :

ఏజెన్సీ డెవలప్ మెంట్ మేనేజర్స్ ఉద్యోగాలకు 30నుండి 40 సంవత్సరాలు వయసు కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏజెన్సీ మేనేజర్స్ పోస్టులకు 30 నుండి 70 సంవత్సరాలు వయసు కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఏజెన్సీ డెవలప్ మెంట్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 3నుండి 5 లక్షల రూపాయలు వరకూ జీతం లభించనున్నది.

మరియు ఇన్సెంటివ్స్ +బోనస్ +ప్రొవిడెంట్ ఫండ్ + ఉచిత ఇన్సూరెన్స్ కవరేజ్ లాంటి సౌకర్యాలు కల్పించనున్నారు.

ఏజెన్సీ మేనేజర్స్ పోస్టులకు ఎంపిక కాబడిన అభ్యర్థులకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు వరకూ జీతం మరియు ఇన్సెంటివ్స్ +బోనస్ +కెరీర్ గ్రోత్  ప్రమోషన్స్ వంటి సౌకర్యాలు లభించనున్నాయి.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

7799300659

8374421195

1800-425-2422

Registration Link 

Website

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...