Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

22, నవంబర్ 2021, సోమవారం

Andhra Pradesh Jobs: రూ.53,500 వేతనంతో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిశద్‌ ఆస్పత్రుల్లో 896 ఉద్యోగాలు | దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 1 మధ్యాహ్నం 12 గంటలు

APVVP Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిశద్‌ ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ (Application Process) కొనసాగుతోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.

Gemini Internet

ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిశద్‌ ఆస్పత్రుల్లో (APVVP Hospitals) రెగ్యులర్ పద్ధతిలో ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 896 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వం మరిన్ని ఖాళీలను భర్తీ చేసే అలోచనలో ఉంది కాబట్టి నియామక ప్రక్రియ ముగిసే నాటికి పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ప్యాథాలజీ, ఆప్తమాలజీ, రేడియాలజీ, సైకియాట్రి, డెర్మటాలజీ, ఈఎన్‌టీ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 1 చివరి తేదీ. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి.

APVVP Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...

 మొత్తం ఖాళీలు 896
 గైనకాలజీ 302
 పీడియాట్రిక్స్ 120
 అనస్తీషియా 118
 జనరల్ మెడిసిన్ 61
 జనరల్ సర్జరీ 53
 ఆర్థోపెడిక్స్ 29
 ప్యాథాలజీ 19
 ఆప్తమాలజీ 29
 రేడియాలజీ 21
 సైకియాట్రి 8
 డెర్మటాలజీ 13
 ఈఎన్‌టీ 21
 సీఎఎస్ జనరల్  86
 డీఏఎస్ 16

APVVP Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 21
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 1 మధ్యాహ్నం 12 గంటలు
వేతనం- రూ.53,500

విద్యార్హతలు- సీఏఎస్ జనరల్ పోస్టులకు ఎంబీబీఎస్ పాస్ కావాలి. సీఏఎస్ స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ పాస్ కావాలి. డీఏఎస్ పోస్టులకు బీడీఎస్ పాస్ కావాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్, ఏపీ డెంటల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.

వయస్సు- 2021 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1,500. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు రూ.1,000.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

APVVP Recruitment 2021: దరఖాస్తు విధానం

Step 1- అభ్యర్థులు https://dmeaponline.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
For New Applicant Register Here పైన క్లిక్ చేయాలి.
Step 2- యూజర్ నేమ్, పాస్‌వర్డ్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
Step 3- ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
Step 4- లాగిన్ అయిన తర్వాత మొదటి స్టెప్‌లో వ్యక్తిగత వివరాలు, రెండో స్టెప్‌లో స్కూల్ ఎడ్యుకేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.
Step 5- మూడో స్టెప్‌లో మెడికల్ ఎడ్యుకేషన్ వివరాలు, నాలుగో స్టెప్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
Step 6- ఐదో స్టెప్‌లో టెన్త్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీన్‌బీ సర్టిఫికెట్స్, మార్క్స్ మెమో, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.
Step 7- చివరగా వివరాలన్నీ సరిచూసుకొని ఫీజు చెల్లించాలి.
Step 8- దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.

 

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1,317 ఉద్యోగాలు. దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 5

Andhra Pradesh Jobs | ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. మరో 1317 పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల వారీగా వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేసింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ (Job Notification) విడుదల చేస్తూనే ఉంది. తాజాగా ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ లాంటి పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జిల్లాల వారీగా వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 1,317 పోస్టుల్ని భర్తీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, సానిటరీ అటెండర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. దరఖాస్తు ప్రక్రియ ముగిసేనాటికి పోస్టుల సంఖ్య పెరగొచ్చు.


ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిశద్‌ ఆస్పత్రుల్లో రెగ్యులర్ పద్ధతిలో 896 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 డిసెంబర్ 1 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక తాజాగా ప్రకటించిన 1,317 పోస్టులకు పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 5 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి వివరాలు తెలుసుకోవాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు, విద్యార్హతలు తెలుసుకోండి.

Gemini Internet


దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 21

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 5

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

ఎంపిక విధానం- మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం- అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. అభ్యర్థులు సంబంధిత జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి.

 

 

ది అనంతపురం డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ లో డిగ్రీ ఆ పై అర్హత ఉన్న వారికి ఉద్యోగాలు | The Ananthapuramu District Co Operative Central Bank Ltd 2021-22

The Ananthapuramu District Co Operative Central Bank Ltd 2021-22

Gemini Internet

అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు కోసం లింక్ క్రింద ఇవ్వబడింది

The link for application to the post of ASSISTANT MANAGER and STAFF ASSISTANT is given below 

Jobs purely for Local Candidates only

Click here for Application link

Click here to download notification for Staff Assistants

Click here to download notification for Assistant Managers

DCCB బ్యాంకు అనంతపురం జిల్లాలో 86 అసిస్టెంట్ మేనేజర్, క్లర్కు ప్రభుత్వ ఉద్యోగాలు అప్లికేషన్లకు చివరి తేది డిసెంబర్ 03-2021

ఏపీ, అనంతపురం జిల్లాలోని ది అనంతపురం డిస్ట్రిక్ట్ కో అపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (ఎడిసిసిబి) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. అప్లికేషన్లకోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం.

ఉద్యోగాల పేర్లుః 1) అసిస్టెంట్ మేనేజర్లు 20 | 2) స్టాఫ్ అసిస్టెంట్లు / క్లర్కులు 66 మొత్తం ఖాళీలు 86

విద్యార్హతలుః 

అసిస్టెంట్ మేనేజర్లుః కనీసం 60 శాతం  మార్కులతో గ్రాడ్యుయేషన్, ఎకనమిక్స్ / స్టాటిస్టిక్స్ తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారి ప్రాధాన్యం, అలాగే కంప్యూటర్ లో పరిజ్ఞానం కలిగిఉండాలి. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ ఖచ్చితంగా చూడగలరు.

క్లర్కు/స్టాఫ్ అసిస్టెంట్ః గ్రాడ్యుయేషన్, ఇంగ్లీషు, తెలుగు భాషలో ప్రావీణ్యం, కంప్యూటర్ లో  ప్రావీణ్యం ఉండాలి. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ ఖచ్చితంగా చూడగలరు.

వయస్సుః పోస్టును అనుసరించి 30 ఏళ్ళు మించకుండా ఉండాలి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు కలదు

వేతనంః పోస్ట్ ని బట్టి నెలకు 35,000/- నుండి 1,20,000/- వరకు 

ఫీజు వివరాలుః జనరల్ కు 590/-, SC/ST లకు 413/-

ఎంపికః ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు

ప్రారంభమైన తేదిః నవంబరు 19

చివరి తేదిః డిసెంబర్ 3

అప్లికేషన్ లింక్ కోసం Click here for Application link

Click here to download notification for Staff Assistants స్టాఫ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

Click here to download notification for Assistant Managers అసిస్టెంట్ మేనేజర్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

 

 



Tirupati: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ .. టికెట్లు ఉండి ఆ తేదీల్లో దర్శనానికి వెళ్లని భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్..

Tirupati: తిరుమల, తిరుపతిలో గత మూడు రోజుల్లో కురిసిన వర్షాలకు జనజీవనం అస్త్యవ్యస్తమైంది.  శ్రీవారి భక్తులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇదే విషయంపై టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్పందిస్తూ.. తిరుమల, తిరుపతి లో కురిసిన వర్షాలు గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదని తెలిపారు. ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగి పొర్లి కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంపునకు గురి చేశాయన్నారు. ఈ వర్షాల వలన తిరుమల లో రూ 4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.

మొదటి ఘాట్ రోడ్ లోని అక్కగార్ల గుడి వద్ద రక్షణ గోడ దెబ్బతిని, ఘాట్ రోడ్ లో నాలుగు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయన్నారు. టిటిడి సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి వీటిని తొలిగించి తాత్కాలిక రక్షణ ఏర్పాట్లతో ట్రాఫిక్ ను పునరుద్ధరించారని సుబ్బారెడ్డి చెప్పారు. అంతేకాదు రెండవ ఘాట్ రోడ్లో 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి. ఐదు చోట్ల రక్షణ గోడలు దెబ్బతిన్నాయన్నారు.  ఈ ఘాట్ రోడ్డులో కూడా టీటీడీ సిబ్బంది కొండ చరియలను తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారని చెప్పారు. తిరుమల నారాయణగిరి గెస్ట్ హౌస్ ను ఆనుకొని ఉన్న రక్షణ గోడ పడిపోవడంతో మూడు గదులు దెబ్బతిన్నాయన్నారు.తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుక వైపు ఉన్న గోడ తో పాటు, రాంనగర్, వినాయక నగర్, జి ఎంబి క్వార్టర్స్,  శ్రీనివాసం విశ్రాంతి గృహం కాంపౌండ్ వాల్స్ దెబ్బ తిన్నట్లు ఆయన తెలిపారు. అధికారులు నారాయణ గిరి, ఎస్వీ అతిథి గృహాల్లోని యాత్రికులను ముందు జాగ్రత్త గా ఇతర ప్రాంతాలకు తరలించారని చైర్మన్ వివరించారు.

శ్రీవారి మెట్టు మార్గంలో కొంతమేరకు రోడ్డు, కొంతమేరకు ఫుట్ పాత్ భారీ వర్షాలకు దెబ్బతిన్నాయన్నారు. కపిలతీర్థం ఆలయంలో ఒక మండపం వర్షాలకు దెబ్బతిందని, దీని మరమ్మతులకు 70 లక్షల రూపాయలు ఖర్చు కావచ్చని అధికారులు అంచనా వేశారన్నారు.

వర్షం వల్ల టీటీడీ సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం కలిగిందన్నారు. ఐటి విభాగం అధికారులు, సిబ్బంది వెంటనే పునరుద్ధరించి భక్తుల సేవలకు ఇబ్బంది లేకుండా చేశారని ఆయన చెప్పారు.  స్వామివారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు మరియు మూడో సత్రాల్లో వసతి, ఆహారం ఏర్పాటు చేశామన్నారు.

టికెట్లు ఉండి దర్శనానికి రాలేక పోయిన భక్తులను వర్షాలు తగ్గాక స్వామివారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని  సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల తిరుపతిలో దెబ్బతిన్న రోడ్లు, ఇతర మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.

 

Gemini Internet

మాజీ సైనికుల పిల్లలకు స్కాలర్ షిప్స్ | Scholarships for Ex Army Children -2021-22

పత్రికా ముఖంగా ప్రకటన

కేంద్రీయ సైనిక బోర్డు వారు 2021-22 విద్యా సంవత్సరంలో ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు, ఉన్నత విద్యా కోర్సులు మొదటి ఏడాది చదువుతున్న మాజీ సైనికుల పిల్లలు ప్రధాన మంత్రి ఉపకార వేతన పథకానికి దరఖాస్తు గడువును డిసెంబరు 31వ తేదీ వరకు పొడిగించామని జిల్లా సైనిక సంక్షేమాధికారి వి.భక్తవత్సలరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులను www.ksb.in వెబ్ సైట్లో పొందుపచరాలన్నారు.

Gemini Internet


 

RFCL- 2021-22 నోటిఫికేషన్… దరఖాస్తు చేసుకోండి Last Date 24 నవంబర్ 2021

RFCL ఉద్యోగ నోటిఫికేషన్:: NFL,FCIL,EIL… జాయింట్ వెంచర్ అయిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ వివిధ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం 2021లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత ఉన్న విద్యార్థులు ఈ పోస్టులకు 24 నవంబర్ 2021 వరకు లేదా అంతకు లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం రెగ్యులర్ గా మూడు సంవత్సరాల బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులతో పాస్ కావాలి, ఈ అర్హత గల విద్యార్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి

కెమికల్ ల్యాబ్ -1

జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-08

ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ ప్రొడక్షన్ 8

ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ మెకానికల్ 4

ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ ఎలక్ట్రానిక్ 2

Godan కీపర్ 1

స్టోర్ అసిస్టెంట్ 1

అసిస్టెంట్ గ్రేడ్-3

అసిస్టెంట్ గ్రేడ్-3 – రవాణా 3

అర్హతలు

జూనియర్ ఇంజనీరింగ్ గ్రేడ్ 2 (కెమికల్ ల్యాబ్)/జనరల్ ఓ బి సి/ews విద్యార్థులకు మొత్తంగా కనీసం 50 శాతం మార్కులతో కెమిస్ట్రీ తో రెగ్యులర్ గా మూడు సంవత్సరాల బీఎస్సీ, ఎస్సీ ఎస్టీలకు 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి.

జూనియర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ గ్రేడ్ 2 (ప్రొడక్షన్)-రెగ్యులర్ మూడు సంవత్సరాల బీఎస్సీ (ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్) obc వారికి 50 శాతం మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి

 

కెమికల్ ఇంజనీరింగ్ లో రెగ్యులర్ 

మూడు సంవత్సరాల డిప్లమా

ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేట్ 2

రెగ్యులర్ మూడు సంవత్సరాల బీఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లతో జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు, మెకానికల్ ఇంజనీరింగ్ లో మూడు సంవత్సరాల డిప్లమా

మరియు రిజర్వ్ చేయబడినది స్థానాలకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉండాలి.

ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి https://www.nationalfertilizers.com/ అనే వెబ్ సైట్ ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు.

 

Gemini Internet

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...