-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- SBI Clerk Recruitment: 8,773 క్లర్క్ ఖాళీలకు ఎస్‌బీఐ నోటిఫికేషన్
* ఏదైనా డిగ్రీతో దరఖాస్తుకు అవకాశం
* ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగా ఎంపిక
దేశంలోని
అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)
నుంచి క్లర్క్ (జూనియర్ అసోసియేట్) జాబ్ నోటిఫికేషన్ వెలువడింది. 8773
ఖాళీలు భర్తీ కానున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్
17 నుంచి డిసెంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏదైనా
విభాగంలో గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్/ చివరి
సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 20 ఏళ్ల నుంచి 28
ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు,
పీడీబ్ల్యూడీ(జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ
వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్
ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
నోటిఫికేషన్
SBI Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త; ఎస్బీఐ లో 8 వేలకు పైగా పోస్ట్ ల భర్తీ; డిగ్రీ ఉంటే చాలు..
SBI
Clerk Recruitment 2023 notification: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో
జూనియర్ అసోసియేట్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందుకు
సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది.
SBI
Clerk Recruitment 2023: క్లర్క్ పోస్ట్ ల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్
ఇండియా (State Bank of India SBI) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ
నోటిఫికేషన్ ద్వారా ఎస్బీఐ మొత్తం 8283 జూనియర్ అసోసియేట్ (Junior
Associate) పోస్ట్ లను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్
ప్రక్రియ నవంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
ఆన్ లైన్ అప్లికేషన్..
ఎస్బీఐ (SBI)
లో 8283 జూనియర్ అసోసియేట్ పోస్ట్ లకు అప్లై చేసుకోవాలనుకునే అర్హత కలిగిన
అభ్యర్థులు ఆన్ లైన్ లో ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in. ద్వారా
అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ డిసెంబర్ 7. కస్టమర్
సపోర్ట్ అండ్ సేల్స్ విభాగంలో ఈ 8283 జూనియర్ అసోసియేట్ పోస్ట్ లను ఎస్బీఐ
భర్తీ చేస్తోంది.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభ తేదీ: నవంబర్ 17, 2023
- దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 7, 2023
- ప్రిలిమినరీ పరీక్ష: జనవరి 2024
- ప్రధాన పరీక్ష: ఫిబ్రవరి 2024
Eligibility: అర్హత, ఇతర వివరాలు..
ఈ
పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన
విశ్వవిద్యాలయం నుంచి, ఏదైనా విభాగంలో కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి
ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత అయినా కలిగి
ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) సర్టిఫికేట్ కలిగి ఉన్న
అభ్యర్థులు కూడా అర్హులే. వారు డిసెంబర్ 31, 2023 నాటికి ఐడీడీ సర్టిఫికెట్
పొంది ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య
ఉండాలి.
Selection: ఎంపిక ప్రక్రియ
ఈ
పోస్ట్ ల ఎంపిక ప్రక్రియలో ముందుగా ప్రిలిమినరీ పరీక్ష, స్థానిక భాషకు
సంబంధించిన పరీక్ష ఉంటుంది.ఈ పరీక్ష 2024, జనవరిలో జరిగే అవకాశం ఉంది. ఈ
ప్రిలిమ్స్ పరీక్ష 100 మార్కులకు గానూ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఈ
పరీక్షను ఆన్ లైన్ లో రాయాల్సి ఉంటుంది. మొత్తం 100 మల్టిపుల్ చాయిస్
ప్రశ్నలకు గంట వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. ప్రిలిమ్స్ లో ఇంగ్లీష్,
న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీలపై ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రిలిమ్స్ లో
ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
Application Fees: అప్లికేషన్ ఫీజు
ఈ
పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థుల్లో జనరల్, ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన
వర్గాల వారు రూ. 750 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ,
దివ్యాంగులు ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు ను ఆన్
లైన్ లోనే చెల్లించాలి.
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html