Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

4, డిసెంబర్ 2020, శుక్రవారం

TTD News and Music Classes Admissions


డిసెంబ‌‌రు 6 నుండి 10వ తేదీ వరకు
తిరుమ‌ల శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో '' బాలాలయ మహాసంప్రోక్షణ ''

        తిరుమలలోని శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 6 నుండి 10వ తేదీ వరకు ''బాలాలయ మహాసంప్రోక్షణ'' కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగనుంది.  

ఈ కార్యక్రమానికి డిసెంబ‌రు 5వ తేదీ రాత్రి అంకురార్పణం జరుగనుంది.

         ఆలయంలోని యాగశాలలో డిసెంబ‌రు 6 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు.

డిసెంబరు 10వ తేదీ ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మకర లగ్నంలో బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.

____________________________________________________________________________________


తిరుమ‌ల‌లో ప‌విత్ర ఉద్యాన‌వ‌నాలు ఏర్పాటు - టిటిడి ఈవో

• 10 ఎకరాల్లో వరాహ పురాణం మొక్కులు
• 20 ఎక‌రాల్లో సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్
• జిఎన్సి టోల్ గేట్ వద్ద 5 ఎకరాల్లో ఉద్యానవనం

భూలోక నంద‌న వ‌నంగా భాసిల్లుతున్న తిరుమ‌లలో పురాణాల‌లో పేర్కొన్న విధంగా శ్రీ‌వారి సేవ‌కు వినియోగించే ‌మొక్క‌లతో ప‌విత్ర ఉద్యాన‌వ‌నాలు త్వ‌ర‌లో ఏర్పాటు చేయునున్న‌ట్లు ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి తెలిపారు.

తిరుమ‌ల‌లోని  వివిధ‌ ప్రాంతాలలో ఉన్న ఉద్యాన‌వ‌నాల‌ను ఈవో, అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి శుక్ర‌వారం ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ వ‌రాహ‌పురాణంలోని 38వ అధ్యాయంలో పేర్కొన్న విధంగా స‌ప్త‌గిరులలోని శ్రీ వెంక‌టాచ‌లంపై వెల‌సి ఉన్న ‌స్వామివారు భ‌క్తులకు కోరిన వ‌రాలు ప్ర‌సాదించే క‌ల్ప‌వృక్షంగా, కామ‌ధేనువుగా, చింతామ‌ణిగా భాసిలుతున్న‌ట్లు పేర్కొన‌డం జ‌రిగింద‌న్నారు.

10 ఎకరాల్లో వరాహ పురాణం మొక్కులు

వ‌రాహ‌పురాణంలో పేర్కొన్న విధంగా దాదాపు 10 ఎక‌రాల విస్తీర్ణంలో పూల మొక్క‌ల‌ను పెంచ‌నున్న‌ట్లు తెలిపారు. ఇందులో ఏడు ఆకులు క‌లిగిన అర‌టి చెట్లు, తుల‌సి, ఉసిరి, మోదుగ‌, జువ్వి‌, జ‌మ్మి, ద‌ర్భ‌, సంపంగి, మామిడి, పారిజాతం, క‌దంబం, రావి, శ్రీ‌గంథం, అడ‌వి మ‌ల్లి, మొగ‌లి, పున్నాగ‌, అశోక‌, పొగ‌డ‌, య‌ర్ర గ‌న్నెరు‌, తెల్ల గ‌న్నెరు ఉన్నాయి. వీటితో పాటు నాబి, మాదిఫ‌ల‌, బొట్టుగు‌, భాందిరా వంటి వృక్షా‌లను కూడా అభివృద్ధి చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. తెలియ‌జేశారు.

జిఎన్సి టోల్ గేట్ వద్ద 5 ఎకరాల్లో ఉద్యానవనం

తిరుమ‌ల‌లోని జిఎన్‌సి టోల్ గేట్ వ‌ద్ద గ‌ల గీతా ఉద్యాన‌వ‌నం, శ్రీ ప‌ద్మావ‌తి వ‌స‌తి స‌ముదాయాల వ‌ద్ద ఐదు ఎక‌రాల‌ను జిఎంఆర్ స‌హ‌కారంతో టిటిడి ఉద్యాన‌వ‌న విభాగం, అట‌వీ విభాగం ఆధ్వ‌ర్యంలో అభివృద్ది చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు వివ‌రించారు.

20 ఎక‌రాల్లో సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్

నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాలు, శిలాతోర‌ణంను ప‌రి‌శీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అదేవిధంగా తిరుమ‌ల విద్యుత్ అవ‌స‌రాల‌కు ధ‌ర్మ‌గిరి అటవీ ప్రాంతంలో 20 ఎక‌రాల‌లో సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్ ఏర్పాటు చేయాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలిపారు. 

--------------------------------------------------------------------------------------------------------------------

డిసెంబ‌రు 8 నుండి 26వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.

కళాశాలలో గాత్రం, వీణ, వేణువు, వయోలిన్‌, నాదస్వరం, డోలు, మృదంగం, ఘ‌టం, భరతనాట్యం, కూచిపూడి నృత్యం, హరికథ విభాగాలున్నాయి. బి.మ్యూజిక్‌, బి డ్యాన్స్‌, విశారద, ప్రవీణ కోర్సులున్నాయి.

ఎస్వీ నాదస్వర పాఠశాలలో సర్టిఫికేట్‌, డిప్లొమా రెగ్యులర్‌ కోర్సులతోపాటు సాయంత్రం కళాశాల పార్ట్‌టైమ్‌ కోర్సులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో రూ.50/- చెల్లించి దరఖాస్తు పొందొచ్చు.

రెగ్యులర్‌ కోర్సులకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సాయంత్రం కళాశాలకు 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అన్ని కోర్సుల వారికి డిసెంబ‌రు 28 నుండి 31వ తేదీ వ‌ర‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు.

ఇతర వివరాలకు కళాశాల కార్యాలయ పనివేళల్లో 0877-2264597 నంబరులో సంప్రదించగలరు.

---------------------------------------------------------------------------------------------------------------------

క‌పిల‌తీర్థంలో సంకష్టహర గణేశ వ్ర‌తం

       కార్తీక మాస దీక్ష‌ల్లో భాగంగా శుక్రవారం తిరుప‌తిలోని శ్రీ క‌పిలేశ్వ‌రాల‌య ప్రాంగ‌ణంలో శ్రీ సంకష్టహర గణేశ వ్ర‌తం శాస్త్రోక్తంగా జరిగింది. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

         ఈ సంద‌ర్భంగా పండితులు శ్రీ ప‌వ‌నకుమార శ‌ర్మ వ్ర‌తం విశిష్ట‌త‌ను తెలియ‌జేశారు. చతుర్థి తిథికి అధిపతి గణపతి అని, కార్తీక పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి నాడు ఈ వ్రతం నిర్వహించడం ఎంతో విశేషమని అన్నారు. వినాయకుడు సమస్తమైన ఆపదలు తొలగించి, కలియుగంలో శీఘ్రంగా ఫలాన్ని అనుగ్రహిస్తారని వివరించారు.

         ముందుగా పార్వతి పరమేశ్వరులు, వినాయకుడి చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేశారు.  సంక‌ల్పంతో వ్రతాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ వ్ర‌తం ముగిసింది.

1367 పోస్టులకు నోటిఫికేషన్


1367 పోస్టులకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పారేషన్ లిమిటెడ్(HDFC) బ్యాంక్ శుభవార్త చెప్పింది. సంస్థలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పీవో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్లర్క్, అస్టిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 1367 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొంది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 31 లోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

విద్యార్హత- పోస్టును బట్టి బ్యాచిలర్ డిగ్రీ మరియు మాస్టర్ డిగ్రీ.

పోస్టుల వివరాలు- మొత్తం 1367 పోస్టులు. అందులో ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ , ఎగ్జిక్యూటివ్‌తో పాటు ఇతర పోస్టులు ఉన్నాయి.

వయోపరిమితి- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారి కనీస వయసు 21 సంవత్సరాలుగా, గరిష్టంగా 26 ఏళ్లుగా నిర్ణయించారు.

జీతం- వివిధ పోస్టులకు ఎంపికైనా అభ్యర్థులకు ప్రారంభ వేతనం నెలకు రూ. 58,200గా ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ప్రత్యక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు.

దరఖాస్తు ఎక్కడ చేయాలంటే.. దరఖాస్తు చేయడం కోసం హెచ్‌డీఎఫ్‌సీ అధికారిక వెబ్‌సైట్ www.hdfcbank.com/ను సందర్శించండి.

IOCL APPRENTICE ADMIT CARDS

Download Admit Card

Click Here

Apply Online

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

T T D News



🕉  *డిసెంబ‌రు 14న విశాఖ‌లో శ్రీ‌వారి కార్తీక స‌హ‌స్ర దీపోత్స‌వం ఏర్పాట్ల‌పై టిటిడి జెఈవో స‌మీక్ష‌*
        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌ :  విశాఖ‌ప‌ట్ట‌ణంలో హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో డిసెంబ‌రు 14వ తేదీన శ్రీ‌వారి కార్తీక స‌హ‌స్ర దీపోత్స‌వం నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌పై జెఈవో శ్రీ పి.బ‌సంత్ కుమార్ బుధ‌వారం సాయంత్రం తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో అధికారుల‌తో స‌మీక్ష జ‌రిపారు.

👉 ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ ప్ర‌పంచాన్ని ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా వైర‌స్‌ను నాశ‌నం చేయాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ న‌వంబ‌రు 30వ తేదీ టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం మైదానంలో కార్తీక మ‌హాదీపోత్స‌వ కార్య‌క్ర‌మం వైభ‌వంగా నిర్వ‌హించిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఇదే స్థాయిలో విశాఖ‌లో శ్రీ‌వారి కార్తీక స‌హ‌స్ర దీపోత్స‌వం నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేయాల‌ని ఆయా శాఖల అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు.

       ◆  వేదిక మీద వెయ్యి దీపాల న‌డుమ శ్రీ‌వారి ఉయ్యాల సేవ, స్వామివారికి అభిముఖంగా శ్రీ సూక్తం యాగం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు.
  అలాగే భ‌క్తుల‌కు విశాఖ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానంద స్వామివారు అనుగ్ర‌హ భాష‌ణం ఇచ్చేందుకు స్వామిని కోర‌తామ‌న్నారు. భ‌క్తిగీతాలాప‌న‌, అష్ట‌ల‌క్ష్మీ వైభ‌వం నృత్యం, సామూహిక ల‌క్ష్మీనీరాజ‌నం(దీపాలు వెలిగించడం)తో పాటు కుంభ హార‌తి, న‌క్ష‌త్ర హార‌తి, మంగ‌ళ‌హార‌తి నిర్వ‌హించేలా కార్య‌క్ర‌మాన్ని రూపొందించాల‌న్నారు. అధికారుల బృందం విశాఖ‌కు వెళ్లి కార్య‌క్రమ నిర్వ‌హ‌ణ‌కు అనువైన ప్ర‌దేశాన్ని త్వ‌రిత‌గ‌తిన నిర్ణ‌యించాల‌న్నారు.

👉 ఈ స‌మీక్ష‌లో జెఈవో(ఆరోగ్యం, విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు డైరెక్ట‌ర్ ఆచార్య ద‌క్షిణామూర్తి, క‌ల్యాణోత్స‌వం ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ గోపాల్‌, గార్డెన్ డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు పాల్గొన్నారు.
 *Dept.Of PRO TTD.*
https://t.me/ttdnews  
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.
    👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

TTD N e w s


🕉  *గో సేవతో సమస్త దేవతలనూ పూజించిన ఫలితం : కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి వారు*
        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌ :  గోమాతను పూజించడం ద్వారా సమస్త దేవతలను పూజించిన ఫలితం లభిస్తుందని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి అన్నారు.

👉 అలిపిరి పాదాల మండపం సమీపంలో  టీటీడీ ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితుడు శ్రీ శేఖర్ రెడ్డి  సహకారంతో నిర్మిస్తున్న సప్త గో ప్రదక్షిణ మందిరంను బుధవారం సాయంత్రం స్వామి పరిశీలించారు.

★ ప్రదక్షిణ మందిరం ముందు ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ స్వామి విగ్రహానికి స్వామి పూలమాలలు వేసి పూజించారు.
గో ప్రదక్షిణ శాలలో 24 గంటలూ ఏడు గోవులు ఉంటాయని అధికారులు శ్రీశ్రీశ్రీ  విజయేంద్ర సరస్వతి కి వివరించారు. తిరుమలకు నడకదారిలో వెళ్లే భక్తులు, వాహనాల్లో వెళ్ళే భక్తులు వేర్వేరు ద్వారాల ద్వారా వచ్చి గో ప్రదక్షిణ చేసుకుని వెళ్లే ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు.

👉 ఇదే ప్రాంతంలో గో తులాభారం మందిరం తో పాటు సుమారు 30 గోవులు ఉండటానికి అన్ని సదుపాయాలతో  గో సదన్ నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు.  స్వామి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

👉 ఈ సందర్భంగా విజయేంద్ర సరస్వతి స్వామి మీడియాతో మాట్లాడారు. గోమాత కామధేనువన్నారు. గోవు మానవుల వ్యవసాయ అవసరాలకు, ఆరోగ్య రక్షణకు కూడా ఉపయోగపడుతోందని అన్నారు. గో పూజా ఫలితం గురించి అనేక పురాణాల్లో వివరించారన్నారు. దక్షిణ భారతదేశంలో గోశాలలు, ఉత్తర భారత దేశంలో వేద పాఠశాలలు  ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్వామి చెప్పారు. గో సంరక్షణకు టీటీడీ తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.  తిరుమల ఆలయ వైకుంఠ ద్వారాన్ని 10 రోజుల పాటు తెరచి ఉంచాలని ధర్మకర్తల  మండలి తీసుకున్న నిర్ణయంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్వామి స్పందించారు. శాస్త్రానికి, సంప్రదాయానికి ఇబ్బంది కలగని మంచి ఎక్కడ ఉన్నా స్వీకరించడం తప్పుకాదన్నారు. దేశంలోని అనేక ప్రముఖ విష్ణు క్షేత్రాల్లో ఉత్తర ద్వారం పది రోజులు తీసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారని స్వామి చెప్పారు. భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకుని, ఎక్కువ మందికి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించడాన్ని తప్పు పట్టాల్సిన పని లేదని ఆయన చెప్పారు.  

■ టీటీడీ ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ శేఖర్ రెడ్డి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్వీ గో సంరక్షణ శాల సంచాలకులు శ్రీ హరనాథ్ రెడ్డి పాల్గొన్నారు.
 *Dept.Of PRO TTD.*

TTD News



🕉  *డిసెంబ‌రు 5న టిటిడి ఆధీనంలోకి శ్రీ క‌ల్యాణ వేంక‌ట‌ర‌మ‌ణ‌‌స్వామివారి ఆల‌యం*
        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌ :  చిత్తూరు జిల్లా పుంగ‌నూరులోని శ్రీ క‌ల్యాణ వేంక‌ట‌ర‌మ‌ణ‌‌స్వామివారి ఆలయాన్ని డిసెంబ‌రు 5వ తేదీ ఉద‌యం 11.26 నుండి 12.26 గంట‌ల మ‌ధ్య టిటిడిలోకి విలీనం చేసుకోనున్నారు.

రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ఆల‌యానికి సంబంధించిన రికార్డులు, ఇత‌ర ప‌త్రాల‌ను టిటిడి అధికారుల‌కు అంద‌జేస్తారు.
 *Dept.Of PRO TTD.*

TTD NEWS




🕉  *శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న కంచి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి పారాయ‌ణం,*
🕉 *కార్తీక మాస పూజా కార్య‌క్ర‌మాలు బాగున్నాయ‌ని ప్ర‌శంస‌*
        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌ : కంచి కామకోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి బుధ‌వారం ఉద‌యం తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ముందుగా పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు స్వామీజీ చేరుకున్నారు.
◆  టిటిడి అర్చకస్వాములు, అధికారులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు.
◆ శ్రీ బేడి ఆంజనేయస్వామివారిని ద‌ర్శించుకున్న అనంత‌రం మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లి దర్శనం చేయించారు.

◆ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం ఆల‌యం వెలుప‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి మీడియాతో మాట్లాడుతూ పారాయ‌ణ కార్య‌క్ర‌మాలు, కార్తీక మాస పూజా కార్య‌క్ర‌మాలను టిటిడి నిర్వ‌హిస్తుండ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.
👉 ఈ కార్య‌క్ర‌మాలు బాగున్నాయ‌ని ప్ర‌శంసించారు. నాద‌నీరాజ‌నం వేదిక‌పై సుంద‌ర‌కాండ‌, విరాట‌ప‌ర్వం, భ‌గ‌వ‌ద్గీత, శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేద పారాయ‌ణం, వ‌సంత‌మండ‌పంలో విష్ణుపూజ‌లు, తిరుప‌తిలోని క‌పిల‌తీర్థంలో హోమాలు, పూజ‌లు నిర్వ‌హిస్తున్నార‌ని వివ‌రించారు. వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా ప‌ది రోజులపాటు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాన్ని టిటిడి క‌ల్పించ‌నుంద‌ని తెలిపారు.
◆  ప్ర‌జ‌లంద‌రూ ధ‌ర్మాన్ని ఆచ‌రించాల‌ని, త‌ద్వారా వ్య‌క్తి వికాసంతోపాటు దేశ వికాసం క‌లుగుతుంద‌ని వివ‌రించారు.

🟢 *మాన‌వ నాగ‌రిక‌త‌కు మూలం వేదం :  కంచి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి*

🟢 *రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేద‌పారాయ‌ణానికి విచ్చేసిన స్వామీజీ*

         మాన‌వ నాగ‌రిక‌త‌కు మూలం వేదాల‌ని, మోక్షసాధ‌న కోసం ఇవి మార్గ‌ద‌ర్శ‌క‌త్వం చేస్తాయ‌ని కంచి కామకోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి ఉద్ఘాటించారు. బుధ‌వారం ఉద‌యం తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలో జ‌రిగిన వేద‌పారాయ‌ణానికి స్వామీజీ విచ్చేశారు.

👉ఈ సంద‌ర్భంగా స్వామీజీ అనుగ్ర‌హ భాష‌ణం చేస్తూ భూలోక వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమ‌ల‌లో వేద‌ప్ర‌తిపాద్యుడైన శ్రీ‌వారి స‌న్నిధిలో లోక‌క‌ల్యాణం కోసం వేద‌పారాయ‌ణం నిర్వ‌హించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. ఏప్రిల్ 13 నుండి వేద‌పారాయ‌ణం జ‌రుగుతోంద‌ని, కృష్ణ‌య‌జుర్వేద పారాయ‌ణం పూర్త‌యింద‌ని, ప్ర‌స్తుతం జ‌ఠా పారాయ‌ణం జ‌రుగుతోంద‌ని, అనంత‌రం ఘ‌న పారాయ‌ణం నిర్వ‌హిస్తార‌ని చెప్పారు. ధ‌ర్మాచార‌ణ‌తో సుఖం, ఐశ్వ‌ర్యం, విద్య‌, ఆరోగ్యం ప్రాప్తిస్తాయ‌న్నారు. ధ‌ర్మానికి మూలం వేదం అని, ఇది భ‌గ‌వంతుని స్వ‌రూప‌మ‌ని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ స‌త్య‌మార్గంలో న‌డ‌వాల‌ని, అప్ప‌డే విజ‌యం చేకూరుతుంద‌ని వివ‌రించారు. ప్ర‌తి గ్రామంలో వేద ఘోష వినిపించాల‌ని స్వామీజీ ఆకాంక్షించారు.
 టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ శ్రీ జ‌గ‌న్మోహ‌నాచార్యులు పాల్గొన్నారు.
 *Dept.Of PRO TTD.*

NTPC Jobs Recruitment 2020 Telugu || NTPC లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ

భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్  థెర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC)లో ఖాళీగా ఉన్న  ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకీ సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయినది. NTPC Jobs Recruitment 2020 Telugu

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అర్హతలను బట్టి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదీడిసెంబర్ 1,2020
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 15,2020

ఉద్యోగాలు – వివరాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్టీపీసీ లో ఖాళీగా ఉన్న జనరల్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విభాగాలవారీగా ఉద్యోగాలు :

జనరల్ మేనేజర్ ( మైనింగ్ )1
జనరల్ మేనేజర్ (డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ )1
జనరల్ మేనేజర్ (కార్పొరేషన్ కమ్యూనికేషన్ )1

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్ డిగ్రీ మైనింగ్, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ /పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కమ్యూనికేషన్ కోర్సులను పూర్తి చేయాలి. మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయసు 57 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తు చేయు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ ల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

వేతనం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 5,00,000 వరకూ జీత భత్యాలు లభించనున్నాయి.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

Website

Notification

NTA CSIR NET Answer key

Some Useful Important Links

Download Answer Key

Click Here

How to Check Answer Key (Video Hindi)

Click Here

Download Admit Card

Click Here

How to Download Admit Card (Video Hindi)

Click Here

Download Exam Notice

Click Here

Apply Online (Re-Open)

Click Here

Download Reopen Notice

Click Here

Download Date Extended Notice

Click Here

Download Notification

Click Here

How to Fill Form (Video Hindi)

Click Here

Download Syllabus

Click Here

Official Website

Click Here

Tenali Private Jobs

 

Sales Men

  Subham Grand
  Bose Road, Tenali
  Vancacies : 01     Start date : 03-12-2020     End date : 10-12-2020  


Job Details

Qualification
Any Degree
Experience
0-1 Year
Age Limit
21-30
Salary
Negotiable

Ongole Private Jobs

 

Ambulance Driver

  Apple Scan & Diagnostic
  Ongole
  Vancacies : 02     Start date : 03-12-2020     End date : 10-12-2020  


Job Details

Qualification
10/Inter and above
Experience
Any
Age Limit
Above 25
Salary
Best In Market

Sweeper

  Apple Scan & Diagnostic
  Ongole
  Vancacies : 02     Start date : 03-12-2020     End date : 10-12-2020  


Job Details

Qualification
No Qualification Required
Experience
Any
Age Limit
Above 25
Salary
Best In Market

Security Guard

  Apple Scan & Diagnostic
  Ongole
  Vancacies : 02     Start date : 03-12-2020     End date : 10-12-2020  


Job Details

Qualification
10/Inter
Experience
Any
Age Limit
Above 30
Salary
Best In Market
 

X-Ray Technician

  Apple Scan & Diagnostic
  Ongole
  Vancacies : 02     Start date : 03-12-2020     End date : 10-12-2020  


Job Details

Qualification
Diploma in X-Ray Technology
Experience
Any
Age Limit
21-30
Salary
Best In Market
 

Lab Technician

  Apple Scan & Diagnostic
  Ongole
  Vancacies : 02     Start date : 03-12-2020     End date : 10-12-2020  


Job Details

Qualification
MLT/DMLT
Experience
Any
Age Limit
21-30
Salary
Best In Market
 
 

Public Relationship Officer

  Apple Scan & Diagnostic
  Ongole
  Vancacies : 01     Start date : 03-12-2020     End date : 10-12-2020  


Job Details

Qualification
Any Graduate
Experience
Any
Age Limit
21-30
Salary
Best In Market

Guntur Private Jobs

 

Sales Executive

  KVR Agro Solutions
  Auto Nagar, Guntur
  Vancacies : 02     Start date : 03-12-2020     End date : 09-12-2020  


Job Details

Contact No
Qualification
Any Degree
Experience
Any
Age Limit
21-30
Salary
Negotibale

Vizag Private Jobs

 

SalesBoys

  Pionner Trends Ready Made Mensware
  Vizag
  Vancacies : 02     Start date : 03-12-2020     End date : 09-12-2020  


Job Details

Contact No
Qualification
10/Inter
Experience
Any
Age Limit
19-28
Salary
Negotiable

Executives

  Gojhsons
  Vishakapatnam
  Vancacies : 05     Start date : 03-12-2020     End date : 09-12-2020  


Job Details

Address
Beside Padmaja Hospital, Near 38 Bus stop, Old Gajuwaka, Vishakapatnam.
Contact No
Qualification
Inter and above
Experience
0-1 Year
Age Limit
Above 21
Salary
Negotiable
Skills
Telugu & English and Hindi Speaking

Lab Technician

  Varaha Lakshmi Narasimha Swamy Educational Trust
  57th Division, Narava, Visakhapatnam
  Vancacies : 02     Start date : 08-12-2020     End date : 08-12-2020  


Job Details

Qualification
Btech/Diploma/ITI in Relevant Subjects
Experience
Any
Age Limit
Above 25
Salary
As per AICTE Norms

 

Lab Assistant

  Varaha Lakshmi Narasimha Swamy Educational Trust
  57th Division, Narava, Visakhapatnam
  Vancacies : 02     Start date : 08-12-2020     End date : 08-12-2020  


Job Details

Qualification
Btech/Diploma/ITI in Relevant Subjects
Experience
Any
Age Limit
Above 25
Salary
As per AICTE Norms

Lecturer-For Diploma

  Varaha Lakshmi Narasimha Swamy Educational Trust
  57th Division, Narava, Visakhapatnam
  Vancacies : 03     Start date : 08-12-2020     End date : 08-12-2020  


Job Details

Qualification
As per AICTE
Experience
Any
Age Limit
Above 25
Salary
As per AICTE Norms
 

Professor/Asst Professor

  Varaha Lakshmi Narasimha Swamy Educational Trust
  57th Division, Narava, Visakhapatnam
  Vancacies : 03     Start date : 08-12-2020     End date : 08-12-2020  


Job Details

Qualification
As per AICTE
Experience
Any
Age Limit
Above 25
Salary
As per AICTE Norms

 
 

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...