Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

20, అక్టోబర్ 2021, బుధవారం

HDFC Scholarship : రూ.75,000 స్కాల‌ర్‌షిప్ పొందే అవ‌కాశం.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు

క‌రోనా మహమ్మారి (Covid-19 pandemic) కారణంగా దెబ్బ‌తిన్న కుటుంబాల విద్యార్థుల‌కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చేయూత‌నందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప‌రివ‌ర్త‌న్ కోవిడ్ క్రైసిస్ స‌పోర్ట్ స్కాల‌ర్‌షిప్ పేరుతో విద్యార్థుల‌కు రూ.75,000 అందించ‌నుంది. కరోనా కార‌ణంగా చ‌దువుకోవ‌డానికి ఇబ్బంది ప‌డుతున్న వారికి ఇది చ‌క్క‌ని అవ‌కాశం. ఈ స్కాల‌ర్‌షిప్ ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి అక్టోబ‌ర్ 31, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది

కరోనా మహమ్మారి (Covid-19 pandemic)కారణంగా వేలాది మంది పిల్లలు నిరాశ్రయులయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారి చదువు, భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అటువంటి పిల్లలకు హెచ్‌డీఎఫ్‌సీ చేయూత నందిస్తోంది. వారికి కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) ప‌రివ‌ర్త‌న్ కోవిడ్ క్రైసిస్ స‌పోర్ట్ స్కాల‌ర్‌షిప్‌ను ప్ర‌వేశ పెట్టింది. క‌రోనా కార‌ణంగా త‌ల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు. జీవ‌నోపాధి కోల్పోయిన కుటంబ విద్యార్థ‌లుకు ఈ స్కాల‌ర్‌షిప్‌(Scholarship)  ను అందించ‌నున్నారు. ఈ కుటుంబాల‌కు చెందిన విద్యార్థుల‌కు ఒకసారి ఆర్థిక సాయం రూపంలో రూ.15,000 నుంచి రూ.75,000 వ‌ర‌కు హెచ్‌డీఎఫ్‌సీ అందిస్తోంది. ఈ స్కాల‌ర్‌షిప్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 31, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

స్కాల‌ర్‌షిప్ వివ‌రాలు..
- 1 నుంచి 5 త‌ర‌గ‌తుల‌కు రూ. 15,000
- 6 నుంచి 8 త‌ర‌గ‌తుల‌కు రూ.25,000

- 9 నుంచి 12 త‌ర‌గ‌తుల‌కు రూ. 21,000
- డిప్ల‌మా కోర్సుల‌కు రూ. 20,000
- గ్రాడ్యుయేష‌న్ కోర్సులు (బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ త‌దిత‌ర‌) - రూ.30,000
- పోస్టు గ్రాడ్యుయేష‌న్ (ఎంకామ్‌, ఎంఏ త‌దిత‌ర‌) - రూ.35,000

- ప్రొఫెష‌న‌ల్ (బీటెక్‌, ఎంబీబీఎస్‌, ఎల్ఎల్‌బీ, బీఆర్కె, న‌ర్సింగ్ ) రూ. 50,000
- పోస్టు గ్రాడ్యుయేష‌న్ ( ఎంటెక్‌, ఎంబీఏ) కోర్సులు - రూ. 55,000 నుంచి రూ. 75,000
విద్యార్థుల త‌మ చ‌దువుకు ట్యూష‌న్ ఫీజు, ఇంట‌ర్నెట్ స‌దుపాయం కోసం, ఆన్‌లైన్ ల‌ర్నింగ్, స్టేష‌నరీల కోసం వినియోగించుకోవ‌చ్చ‌ని హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) పేర్కొంది. ఈ స్కాల‌ర్‌షిప్ విద్యార్థుల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పేర్కొంది.

స్కాల‌ర్‌షిప్ కోసం అందించాల్సి డాక్యుమెంట్స్‌
- 2019-2020 చ‌దివిన కోర్సుకు సంబంధించి డాక్యుమెంట్స్ (Documents) అంతే కాకుండా 2018-2019 సంవ‌త్స‌రానికి సంబంధించిన కోర్సు వివ‌రాలు కూడా స‌మ‌ర్పించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం సంవ‌త్స‌రం చ‌దివేందుకు అవ‌స‌ర‌మైన ర‌సీదు వివ‌రాలు అడ్మిష‌న్ స‌మాచారం అందించాలి.
- ఆధార్‌ (Aadhar)/ ఓట‌ర్ / పాన్ కార్డు / డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) ఏదో ఒక‌టి స‌మ‌ర్పించాలి.
- త‌ల్లిదండ్రుల్లో ఎవ‌రు మృతి చెందారో వారి డెత్ స‌ర్టిఫికెట్. అంతే కాకుండా జీవ‌నోపాధి కోల్పోయిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రం స‌ర్పించాలి.
- ద‌ర‌ఖాస్తు దారు లేదా త‌ల్లిదండ్రి బ్యాంక్ ఖాతా అందించాలి.

ద‌ర‌ఖాస్తు చేసే విధానం..

Step 1 :  ఈ స్కాల‌ర్‌షిప్‌కు కేవ‌లం ఆన్‌లైన్ (Online) ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

Step 2 :  ముందుగా https://www.buddy4study.com/scholarships వెబ్‌సైట్‌లో రిజిస్ట‌ర్ చేసుకోవాలి.

Step 3 :  రిజిస్ట్రేష‌న్ (Registration) పూర్తి చేసిన త‌రువాత హెచ్‌డీఎఫ్‌సీ ప‌రివ‌ర్త‌న్ కోవిడ్ కోర్సుల లింక్‌లోకి వెళ్లాలి.

Step 4 :  హెచ్‌డీఎఫ్‌సీ ప‌రివ‌ర్త‌న్ కోవిడ్ కోర్సు లింక్
https://www.buddy4study.com/page/hdfc-bank-parivartans-covid-crisis-support-scholarship-program

Step 5 :  ద‌ర‌ఖాస్తు ఫాం పూర్తిగా నింపాలి.

Step 6 :  స్టార్ట్ బ‌ట‌న్ నొక్క‌డం ద్వారా అప్లికేష‌న్ ఫాం (Application Form) లో అడిగిన వివ‌రాలు అందించాలి.

Step 7 :  అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు పూర్తిగా అందించాలి.

Step 7 :  ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 31, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

 

AIIMS Recruitment 2021 : ఎయిమ్స్ బీబీ న‌గ‌ర్‌లో 68 ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(All India Institute of Medical Sciences), బీబీన‌గ‌ర్ లో పలు ఉద్యోగా భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌లైంది. దీని ద్వారా నాన్ అక‌డామిక్ విభాగంలో 68 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 9, 2021 వ‌ర‌కు

ఎయిమ్స్ బీబీన‌గ‌ర్‌

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(All India Institute of Medical Sciences), బీబీన‌గ‌ర్ లో పలు ఉద్యోగా భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌లైంది. దీని ద్వారా నాన్ అక‌డామిక్ విభాగంలో 68


ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(All India Institute of Medical Sciences), బీబీన‌గ‌ర్ లో పలు ఉద్యోగా భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌లైంది. ఏయిమ్స్ రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేష‌న్ ద్వారా నాన్ అక‌డ‌మిక్ విభాగంలో 68 సీనియ‌ర్ రెసిడెంట్లు (Senior Resident), జూనియ‌ర్ రెసిడెంట్లు (Junior Resident) పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ ఖాళీల భ‌ర్తీ ఎటువంటి ప‌రీక్ష లేకుండా కేవ‌లం మెరిట్ ద్వారా ఎంపిక చేయ‌నున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్ మోడ్‌లో ఉంటుంది.  పోస్టుల ఆధారంగా ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల గ‌రిష్ట‌ వ‌య‌సు 37ఏళ్లు, 45 ఏళ్లు మించ‌కూడ‌దు. ద‌రాఖాస్తు విధానం, నోటిఫికేష‌న్ స‌మాచారం ప్ర‌కారం అధికారిక వెబ్‌సైట్ https://aiimsbibinagar.edu.in/seniorresident.html ను సంద‌ర్శించాలి.

పోస్టుల స‌మాచారం.. అర్హ‌త‌లు
పోస్టు పేరుఅర్హ‌త‌లుఖాళీలు
సీనియ‌ర్ రెసిడెంట్లుగుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో మైక్రోబ‌యోల‌జీ, ఫార్మ‌కాల‌జీ, రేడియాల‌జీ, ఆప్త‌మాల‌జీ త‌దిత‌ర విభాగాల్లో ఎండీ/ఎంఎస్‌/ డీఎం/ఎంసీహెచ్ /డీఎన్‌బీ మెడిక‌ల్ విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. ద‌ర‌ఖాస్తుదారు వ‌య‌సు 45 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు.38
జూనియ‌ర్ రెసిడెంట్లుగుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా ఎంసీఐ లేదా రాష్ట్ర‌లో గుర్తింపు పొంది ఉండాలి.25

ఎంపిక విధానం..
- పోస్టుల క‌న్నా ద‌ర‌ఖాస్తు మూడు రెట్లు ఎక్కువ వ‌స్తే రాత ప‌రీక్ష (Written Test) నిర్వ‌హిస్తారు.
- త‌క్కువ అప్లికేష‌న్‌లు వ‌స్తే మెరిట్ (Merit) ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూ (Interview) చేసి తుది ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 : ద‌ర‌ఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్ (Online) ద్వారా ఉంటుంది.


Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://aiimsbibinagar.edu.in/seniorresident.html ను సంద‌ర్శించాలి.

Step 3 : సీనియ‌ర్ రెసిడెంట్లు.. జూనియ‌ర్ రెసిడెంట్ల‌కు వేర్వేరుగా నోటిఫికేష‌న్‌లు ఉన్నాయి వాటిని చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

Step 4 : నోటిఫికేష‌న్‌ను చివ‌ర‌న అప్లికేష‌న్ ఫాం (Application Form) ను డౌన్‌లోడ్ చేసుకొని అప్లికేష‌న్ నింపాలి.

Step 5 : అనంత‌రం అప్లికేష‌న్‌ను స్కాన్ చేసి అవ‌స‌ర‌మై ద‌ర‌ఖాస్తుల‌ను మెయిల్ (Mail) ద్వారా పంపాలి.

Step 6 : ద‌ర‌ఖాస్తు చేయాల్సిన మెయిల్‌ ace.aiimsbbnagar@gmail.com

Step 7 : ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 9, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

 

 

Andhra Pradesh Jobs: అనంత‌ర‌పురం ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌లో ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ఇవే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (Andhra Pradesh State Housing Corporation Limited) లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 30, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (Andhra Pradesh State Housing Corporation Limited) లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. నోటిఫికేష‌న్ ద్వారా ఐటీ మేనేజ‌ర్‌, డేటా ఎంట్రీ ఆప‌రేటర్‌ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు పూర్తిగా ఆఫ్‌లైన్ విధానంలో ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసుకోనే వారి గ‌రిష్ట వ‌య‌సు సెప్టెంబ‌ర్ 30, 2021నాటికి 42 ఏళ్లుమించి ఉండ‌కూడ‌దు. ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 30, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష (Written Test) ద్వారా ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు విధానం, నోటిఫికేష‌న్ వివ‌రాల కోసం అధికారికి వెబ్‌సైట్ https://ananthapuramu.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

పోస్టుల వివ‌రాలు.. అర్హ‌త‌లు

పోస్టు పేరుఅర్హ‌త‌లుఖాళీలుజీతం
ఐటీ మేనేజ‌ర్‌గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో బీటెక్ లేదా ఎంసీఏ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో ప‌ని అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి01రూ.25,000
డేటా ఎంట్రీ ఆప‌రేటర్‌గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో పీజీడీసీ/ బీకాం కంప్యూట‌ర్స్ / ఎంసీఏ/ బీటెక్ / బీఎస్సీ కంప్యూట‌ర్స్ చేసి ఉండాలి.05రూ.15,000

ఎంపిక విధానం..
- ద‌ర‌ఖాస్తు చేసుకొన్న వారిని ప‌రీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఈ ప‌రీక్ష‌ను అనంత‌ర‌పురంలోని నేష‌న‌ల్ ఇన్ఫ‌ర్మేటిక్ సెంట‌ర్ వారు నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 : ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://ananthapuramu.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాలి.


Step 3 : అనంత‌రం నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌దివి అర్హ‌త ఉన్న పోస్టుల‌కు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

Step 4 : నోటిఫికేష‌న్ చివ‌ర‌న అప్లికేష‌న్ ఫాం (Application Form) ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.

Step 5 : అప్లికేష‌న్ ఫాం పూర్తిగా నింపి ద‌ర‌ఖాస్తుకు అవ‌స‌రం అయిన డాక్యుమెంట్ల‌ను పొందుప‌రిచి పోస్ట్ పంపాలి.
- ద‌ర‌ఖాస్త‌కు కావాల్సిన స‌ర్టిఫికెట్లు
- ప‌దోత‌ర‌గ‌తి స‌ర్టిఫికెట్‌ ( 10th Certificate), డిగ్రీ త‌త్స‌మ అర్హ‌త స‌ర్టిఫికెట్‌
- స్ట‌డీ అండ్ కాస్ట్ స‌ర్టిఫికెట్‌
- అవ‌స‌ర‌మైన విభాగాల‌కు అనుభ‌వం ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

Step 6 :  ద‌ర‌ఖాస్తు పంపాల్సి చిరునామా
ప్రాజెక్టు డైరెక్ట‌ర్‌,
ఏపీహెచ్‌సీఎల్‌, డీఆర్‌డీఏ కాంపౌండ్‌,
అనంత‌పురం

Step 7 : ద‌ర‌ఖాస్తుకు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 30, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

 

 

FCI Recruitment 2021 : ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో 380 ఉద్యోగాలు.. జీతం రూ. 23,000

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Food Corporation of India) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఐదు, ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో 380 వాచ్‌మెన్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 19, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Food Corporation of India) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఐదు, ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో 380 వాచ్‌మెన్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ (Online) ప‌ద్ధ‌తిలో ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 19, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. పోస్టులకు ఎంపికైన అభ్య‌ర్థికి నెల‌కు రూ.23,000 నుంచి రూ. 64,000 జీతం చెల్లిస్తారు.  ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారు అప్లికేష‌న్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://fci.gov.in/ లేదా https://www.recruitmentfci.in/ వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు.

ముఖ్య‌మైన స‌మాచారం..

పోస్టు పేరుఖాళీలుఅర్హ‌త‌లువ‌య‌సుజీతం
వాచ్‌మెన్380ఐదు, ఎనిమిద‌వ త‌ర‌గ‌తి చ‌దివి ఉండాలిసెప్టెంబ‌ర్ 1, 2021 నాటికి 25 ఏళ్లు నిండ‌కూడ‌దురూ.23,000 నుంచి రూ.64,000

 ఎంపిక విధానం..
- ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థికి రాత ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
- రాత ప‌రీక్ష 120 మార్కుల మ‌ల్టిపుల్ చాయిస్ ప్ర‌శ్న‌లు ఉంటాయి.
- ప‌రీక్ష ఇంగ్లీష్‌, హిందీ, పంజాబీలో నిర్వ‌హిస్తారు.
- ప‌రీక్ష‌లో ఎటువంటి నెగెటీవ్ మార్కింగ్ లేదు.
- మెరిట్ ద్వారా ఎంపికైన వారిని పోస్టులోకి తీసుకొంటారు.

ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 :  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.

Step 2 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.recruitmentfci.in/ ను సంద‌ర్శించాలి.

Step 3 :  వెబ్‌సైట్‌ల Category IV Recruitment లింక్‌లోకి వెళ్లాలి.

Step 4 :  అనంత‌రం నోటిఫికేష‌న్ చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

Step 5 :  అర్హ‌త‌లు అన్ని చూసుకొన్న త‌రువాత ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి https://fciharyana-watch-ward.in/login లింక్‌లోకి వెళ్లాలి.

Step 6 :  అనంత‌రం కుడివైపు పైన Register Here క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తు విధానాన్ని ప్రారంభించాలి.

Step 7 :  క్లిక్ చేసిన త‌రువాత ఇన్‌స్ట్ర‌క్ష‌న్‌లు వ‌స్తాయి. చ‌ద‌వాలి.

Step 8 :  ఇన్‌స్ట్ర‌క్ష‌న్ చ‌ద‌విన త‌రువాత కింద చెక్ బాక్స్ టిక్ చేసి Apply Now లోకి వెళ్లాలి.

Step 9 :  పేరు, ఫోటో ఐడీ, ఈమెయిల్‌, మొబైల్ నంబ‌ర్ ఇచ్చి అనంత‌రం విద్యార్హ‌త‌లు ఇవ్వాలి.

Step 10 :  రిజిస్ట్రేష‌న్ పూర్తియిన త‌రువాత రూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Step 11 :  ద‌ర‌ఖాస్తు పూర్త‌యిన త‌రువాత ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.

Step 12 :  ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 19, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

 

Amazon Recruitment 2021 : అమెజాన్‌లో ఉద్యోగాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌, ప‌రీక్ష విధానం వివ‌రాలు

ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ ప‌లు పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను ఇప్ప‌టికే మొద‌లు పెట్టింది. ఈ నేప‌థ్యంలో సెల్లర్ సపోర్టు అసోసియేట్ (Seller Support Associate) పోస్టులు దరఖాస్తుల‌ను స్వీక‌రిస్తోంది. ఈ పోస్టుల‌కు ఎంపికైన వారిని వర్క్ ఫ్రం హోం (Work From Home) ఇవ్వ‌నున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం ఆస‌క్తి ఉన్న‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోండి. 

అమెజాన్ (Amazon)నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.  పలు వర్క్ ఫ్రం హోం (Work From Home) ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది.  సెల్లర్ సపోర్టు అసోసియేట్ (Seller Support Associate) పోస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.  ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి  ఏదైన డిగ్రీ చేసి ఉంటే చాలు. పూర్తి


అమెజాన్ (Amazon)నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.  పలు వర్క్ ఫ్రం హోం (Work From Home) ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది.  సెల్లర్ సపోర్టు అసోసియేట్ (Seller Support Associate) పోస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.  ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి  ఏదైన డిగ్రీ చేసి ఉంటే చాలు. పూర్తి వివరాలకు అధికారి వెబ్ సైట్ https://www.amazon.jobs/en సందర్శించవచ్చు. ఈ  ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం పూర్తిగా ఆన్లైన్ (Online) ద్వారా నిర్వహిస్తారు. ఎంపిక అనంతరం ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగికి వర్క్ ఫ్రం హోం  అవకాశం ఇస్తోంది అమెజాన్ (Amazon). ప్రస్తుతం భర్తీ చేయనున్న సెల్లర్ సపోర్టు అసోసియేట్ ఉద్యోగాల దరఖాస్తు చేసుకోవాలను కొంటున్న అభ్యర్థులు ఈ వివరాలు తెలుసుకోండి.

ముఖ్య సమాచారం..
పోస్టు పేరుసెల్లర్ సపోర్టు అసోసియేట్ (Seller Support Associate)
జీతంసీటీసీ - సంవత్సరానికి రూ. 2,75,000 నుంచి రూ.4,00,000
విద్యార్హతఏదైనా డిగ్రీ చేసి ఉండాలి
అప్లికేషన్ లింక్https://amazonvirtualhiring.hirepro.in 

జాబ్ స్కిల్స్.. పని విధానం

- ఇంగ్లీష్ లో మంచి భాషా నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ (Communication Skills) ఉండాలి.
- 24/7 షిఫ్ట్ లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి.
- వర్క్ ఫ్రం హోంకు అవసరమైన  ఇంటర్నెట్ ఫెసిలిటీ బాధ్యత ఉద్యోగిదే.
- వారానికి 5 పని దినాలు, రెండు రోజులు సెలవులు (Holydays) ఇంటర్నెట్, బ్రౌజర్లను సమర్థవంతంగా వినియోగించుకొనే సామర్థ్యం ఉండాలి.
- ఉద్యోగి హైదరాబాద్ లో సంస్థకు అందుబాటులో ఉండాలి.

దరఖాస్తు విధానం.. ఎంపిక ప్రక్రియ

Step 1 : ముందుగా అభ్యర్థి అధికారిక వెబ్ సైట్ https://amazonvirtualhiring.hirepro.in  ను సందర్శించాలి. (అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 2 : అనంతరం మీ పూర్తి వివరాలను అందించాలి.
Step 3 : మీరు దరఖాస్తు చేసుకొన్నట్టు ధ్రువీకరిస్తూ మెయిల్ వస్తుంది.
Step 4 : అనంతరం మీ దరఖాస్తును పరిశీలించి ఆన్లైన్ పరీక్ష (Online Exam)కు ఆహ్వానిస్తూ మెయిల్ వస్తుంది.
Step 5 : మెయిల్ వచ్చిన అభ్యర్థికి ఆన్ లైన్ లో పరీక్ష నిర్వహిస్తారు.
Step 6 : అభ్యర్థి కచ్చింతా మంచి ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉండాలి.
Step 6 : మీ ఇంగ్లీష్ (English) సామర్థ్యం పై ఎక్కువగా ప్రశ్నలు అడుతారు.
Step 7 : రెండు లేదా మూడు రౌండ్లు పరీక్ష నిర్వహిస్తారు.
Step 8 : ఎంపికైన అభ్యర్థిని ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.

 

Aadhaar Hackathon 2021: ఆధార్‌ హ్యాకథాన్‌ను నిర్వహించనున్న UIDAI... రూ.3,00,000 గెలుచుకోవచ్చు

Aadhaar Hackathon 2021 | యూఐడీఏఐ మొదటి ఆధార్ హ్యాకథాన్ నిర్వహిస్తోంది. ఈ హ్యాకథాన్‌లో పాల్గొన్నవారు రూ.3,00,000 వరకు ప్రైజ్ మనీ (Prize Money) గెలుచుకోవచ్చు. ఈ హ్యాకథాన్ థీమ్, పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఆధార్ కార్డులను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తొలిసారిగా హ్యాకథాన్ (ఎక్కువ మంది ప్రజలు ఏదైనా కంప్యూటర్ కార్యకలాపంలో పాల్గొనడం) ను నిర్వహించనుంది. 'ఆధార్ హ్యాకథాన్ 2021' (Aadhaar Hackathon) పేరుతో యువ ఆవిష్కర్తలను లక్ష్యంగా చేసుకొని వివిధ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్లకు చెందిన యువతను ఇందులో భాగం చేయనుంది. ఇది ఆధార్ టీమ్ తొలిసారిగా నిర్వహిస్తున్న కార్యక్రమం. అక్టోబరు 28 అర్ధరాత్రి నుంచి అక్టోబరు 31 వరకు ఈ హ్యాకథాన్ ను నిర్వహిస్తామని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

ఆధార్ హ్యాకథాన్ 2021 థీమ్

నమోదు, నవీకరణ (Enrolment and Update) అనే రెండు అంశాలపై ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రెండు థీమ్స్ ఉన్నాయి. 'ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్' మొదటి థీమ్‌ను యూఐడీఏఐ ఎంచుకుంది. ఇది నివాసితులు వారి చిరునామాను అప్డేట్ చేస్తున్నప్పుడు ఎదుర్కొంటున్న కొన్ని నిజ జీవిత సవాళ్లను కవర్ చేస్తుంది.

థీమ్ కింద ఆధార్ నంబర్ లేదా ఎలాంటి డెమోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకుండా గుర్తింపును నిరూపించడానికి యూఐడీఏఐ వినూత్న పరిష్కారాలను కోరుతుంది. అలాగే నూతనంగా ప్రారంభించిన ఫేస్ అథెంటికేషన్ అయిన.. APIకి సంబంధించిన అంశాలు సైతం ఇందులో భాగంగా ఉన్నాయి.

నివాసితులు వారి అవసరాలను పరిష్కరించుకోవడానికి ఇప్పటికే ఉన్నవాటితో పాటు నూతనంగా వచ్చిన ఏపీఐలో కొన్నింటిని పాపులర్ చేయాలనే లక్ష్యంతో UIDAI పనిచేస్తుంది. అధునాతన సాంకేతిక పరిష్కారాల ద్వారా ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ సంస్థ ఇంజనీరింగ్ కళాశాలల యువతను కార్యక్రమంలో భాగం చేస్తోంది.

ఆధార్ హ్యాకథాన్ 2021 విజేతలు ప్రైజ్ మనీ

ప్రతి థీమ్ విజేతలకు ప్రైజ్ మనీతో పాటు ఇతర లాభదాయకమైన ప్రయోజనాలను UIDAI అందించనుంది. కొన్ని రివార్డులను కూడా ప్రకటించనుంది. ప్రతీ థీమ్‌లో మొదటి బహుమతి రూ.3,00,000, రెండో బహుమతి రూ.2,00,000, మూడో బహుమతి కింద రెండు టీమ్స్‌కు రూ.1,00,000 చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనుంది యూఐడీఏఐ.

ఎలా నమోదు చేసుకోవాలి

ఆధార్ హ్యాకథాన్ 2021 కోసం ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ ఫారంలు https://hackathon.uidai.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గలవారు వెబ్‌సైట్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని UIDAI ప్రకటించింది.


 

 

 

విద్యా ఉద్యోగ సమాచారం | Education and Jobs Info




Gemini Internet

Ananthapuramu | Chittoor | Cuddappah | Kurnool District Classifieds 20-10-2021

Gemini Internet







Daily Updates 20-10-2021































Indian Navy Recruitment: ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. 2500 ఖాళీల భర్తీతో భారీ నోటిఫికేషన్‌..

Indian Navy Recruitment 2021: ఇండియన్‌ నేవీ భారీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌ (ఏఏ), సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) విభాగాల్లో కలిసి మొత్తం 2500 ఖాళీలను..

Indian Navy Recruitment 2021: ఇండియన్‌ నేవీ భారీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌ (ఏఏ), సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) విభాగాల్లో కలిసి మొత్తం 2500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌ భాగంగా ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌ (ఏఏ), సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌ (ఏఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 60 శాతం మార్కులతో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ/ బయోలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 60 శాతం మార్కులతో గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ/ బయోలజీ / కంప్యూటర్‌ సైన్స్‌లో 10+2 ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* అవివాహిత పురుషులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

* అభ్యర్థులను రాతపరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* రాత పరీక్ష హిందీ, ఇంగ్లిష్‌లో ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌ అభ్యర్థులకు 09 వారాలు, సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌ అభ్యర్థులకు 22 వారాలు శిక్షణ ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు 2022 ఫిబ్రవరి నుంచి కోర్సు ప్రారంభమవుతుంది.

* శిక్షణా కాలంలో అభ్యర్థులకు నెలకు రూ.14,600 చెల్లిస్తారు. అనంతరం డిఫెన్స్‌ పే మ్యాట్రిక్స్‌ ఆధారంగా రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇండియన్‌ నేవీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి..

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...