Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

18, జులై 2024, గురువారం

GDS POSTAL JOBS: తపాలా శాఖలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు GDS POSTAL JOBS: 44,228 Gramin Dak Sevak Vacancies in Postal Department

GDS POSTAL JOBS: తపాలా శాఖలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు  

  Vacancy Details  



దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 44,228 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ప్రకటన(నోటిఫికేషన్‌ నంబర్‌ 17-03/2024) వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈనియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 5 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌లో 1,355, తెలంగాణలో 981 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్‌ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్‌/ కంప్యూటర్‌/ స్మార్ట్‌ ఫోన్‌ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్‌ తొక్కడం రావాలి. 

ఖాళీల వివరాలు...........

* గ్రామీణ డాక్ సేవక్స్- బ్రాంచ్ పోస్టు మాస్టర్/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్/ డాక్ సేవక్: 44,228 పోస్టులు

సర్కిల్ వారీగా ఖాళీలు:

1. ఆంధ్రప్రదేశ్- 1355

2. అస్సాం- 896

3. బిహార్- 2558

4. ఛత్తీస్‌గఢ్- 1338

5. దిల్లీ - 22

6. గుజరాత్- 2034

7. హరియాణా- 241

8. హిమాచల్‌ప్రదేశ్- 708

9. జమ్మూ అండ్‌ కశ్మీర్- 442

10. జార్ఖండ్- 2104

11. కర్ణాటక- 1940

12. కేరళ- 2433

13. మధ్యప్రదేశ్- 4011

14. మహారాష్ట్ర- 3170

15. నార్త్ ఈస్ట్రన్‌- 2255

16. ఒడిశా- 2477

17. పంజాబ్- 387

18. రాజస్థాన్- 2718

19. తమిళనాడు- 3789

20. తెలంగాణ- 981

21. ఉత్తర్‌ ప్రదేశ్- 4588

22. ఉత్తరాఖండ్- 1238

23. పశ్చిమ్‌ బెంగాల్- 2543

మొత్తం ఖాళీల సంఖ్య: 44,228.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కటం వచ్చి ఉండాలి. 

వయసు: 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
జీత భత్యాలు: నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380; ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం నియామకాలు చేపడతారు. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్‌డ్‌/ అన్‌ రిజర్వ్‌డ్‌ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదానికి ఆప్షన్‌ 1 తర్వాత దానికి ఆప్షన్‌ 2... ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్‌ కేటాయిస్తారు. ఎంపికైన వారికి సమాచారం ఎస్‌ఎంఎస్‌/ ఈమెయిల్‌/ పోస్టు ద్వారా అందుతుంది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.వంద చెల్లించాలి.

బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం): ఈ పోస్టుకు ఎంపికైనవారు సంబంధిత బ్రాంచ్‌ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్‌ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్లు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూసుకోవాలి. తపాలాకు సంబంధించిన మార్కెటింగ్‌ వ్యవహారాలూ చక్కబెట్టాలి. బృంద నాయకుడిగా సంబంధిత బ్రాంచ్‌ను నడిపించాలి. పోస్టల్‌ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.

అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌(ఏబీపీఎం): ఈ ఉద్యోగంలో చేరినవాళ్లు స్టాంపులు/ స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూడటం, ఇండియన్‌ పోస్టు పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలు చక్కబెట్టాలి. బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ నిర్దేశించిన పనులు పూర్తి చేయాలి. వివిధ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి.

డాక్‌ సేవక్‌: ఈ విధుల్లో చేరినవారు ఉత్తరాలు పంపిణీ చేయాలి. అలాగే స్టాంపులు/ స్టేషనరీ అమ్మకాలు చేయాలి. బీపీఎం, ఏబీపీఎం సూచించిన పనులు పూర్తిచేయాలి. రైల్వే మెయిల్‌ సర్వీస్‌, పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు విధులు చూసుకోవాలి. పోస్టల్‌ పథకాలు ప్రచారం చేయాలి.

దరఖాస్తు విధానం: దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 15.07.2024.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 05.08.2024.

దరఖాస్తు సవరణలకు అవకాశం: 06.08.2024 నుంచి 08.08.2024 వరకు.

Details need for AP POSTAL JOBS WITH 10TH CLASS BASE | 10వ తరగతి అర్హతతో AP పోస్టల్ ఉద్యోగాల కోసం అవసరమైన వివరాలు

 

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

IBPS Clerks: ఐబీపీఎస్ - 6,128 క్లర్కు ఉద్యోగాలు IBPS Clerks: IBPS - 6,128 Clerk Jobs

IBPS Clerks: ఐబీపీఎస్ - 6,128 క్లర్కు ఉద్యోగాలు 

దేశ వ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,128 క్లర్కు ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు 2025-2026 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్ (సీఆర్పీ)-XIV నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో 105, తెలంగాణలో 104 ఖాళీలు ఉన్నాయి. తగిన విద్యార్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 

వివరాలు

పోస్టులు: 6,128 క్లర్కులు

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వయసు: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ.850.

ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సిండికేట్‌ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్. 

ముఖ్యమైన తేదీలు;

ఆన్‌లైన్ దరఖాస్తు: జులై 1, 2024 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. 21 వరకు దరఖాస్తు చేతసుకోవచ్చు.

ప్రీ-ఎగ్జామ్‌ ట్రైనింగ్‌ నిర్వహణ తేదీలు: 12 ఆగస్టు, 2024 నుంచి 17 ఆగస్టు 2024 వరకు.

ఆన్‌లైన్‌ ప్రిలిమిన‌రీ పరీక్ష తేదీలు: 2024 ఆగస్టు 24, 25, 31.

ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల విడుదల: సెప్టెంబర్, 2024.

ఆన్‌లైన్‌ మెయిన్ పరీక్ష: 13 అక్టోబరు, 2024.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు; తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్. ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం. 

IBPS Clerks: IBPS - 6,128 Clerk Jobs

Institute of Banking Personnel Selection (IBPS) has released a notification for the recruitment of 6,128 clerk jobs in 11 public sector banks across the country. To this end, Common Recruitment Process (CRP)-XIV will be conducted for the year 2025-2026. There are 105 vacancies in Andhra Pradesh and 104 in Telangana. Candidates with suitable educational qualifications and interest can apply for these jobs through online mode.

Details

Posts: 6,128 Clerks

Eligibility: Any degree pass along with computer knowledge.

Age: Should be between 20-28 years.

Selection Process: Selection will be based on Preliminary and Mains Written Examinations.

Application Fee: Rs.175 for SC/ST/Disabled/Ex-Servicemen candidates. Rs.850 for others.

Banks providing jobs: Bank of Baroda, Canara Bank, Indian Overseas Bank, UCO Bank, Bank of India, Central Bank of India, Punjab National Bank, Punjab and Syndicate Bank, Union Bank of India, Bank of Maharashtra, Indian Bank.

Important dates;

Online Application: Application process started from 1st July 2024. Application can be made till 21.

Dates of Conduct of Pre-Exam Training: 12th August, 2024 to 17th August, 2024.

Online Preliminary Exam Dates: 24, 25, 31 August 2024.

Release of Preliminary Exam Result: September, 2024.

Online Main Exam: 13th October, 2024.

Exam Centers in Telugu States; Hyderabad, Secunderabad, Karimnagar in Telangana. Guntur, Vijayawada, Kurnool, Visakhapatnam in Andhra Pradesh. 


 

 

Important Links

Posted Date: 01-07-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

Details need for AP POSTAL JOBS WITH 10TH CLASS BASE | 10వ తరగతి అర్హతతో AP పోస్టల్ ఉద్యోగాల కోసం అవసరమైన వివరాలు

Details need for AP POSTAL JOBS WITH 10TH CLASS BASE | 10వ తరగతి అర్హతతో AP పోస్టల్ ఉద్యోగాల కోసం అవసరమైన వివరాలు
1. Mobile Number (Enter 10 Digit Mobile Number) *    
2. Email *    
3. Applicant's Name (As per Secondary school pass certificate) *
Note: Any deviation may lead to the cancellation of candidature.    
4. Father's Name/ Mother's Name (As per Secondary school pass certificate) *    
5. Date of Birth *    
6. Gender *    
7. Community *    
8. Circle in which Secondary school passed * Select Circle (STATE)
9. Year of passing Secondary school*    
Select
10. Aadhaar Number    
11. Are you a Person with Disability *    
Select
11(a). Type of Disability    
11(a)(i). Select PWD SubCategory    
12. Languages studied in Secondary school*    Assamese/AsomiyaBengaliBodoBhutiaDogriEnglishGaroGujaratiHindiKak barakKannadaKashmiriKhasiKonkaniLepchaMaithiliMalayalamManipuriMarathiMizoNepaliOriyaPunjabiSanskritSanthaliSindhiTamilTeluguUrdu
13. Whether employed *    
13(a). Whether employer NOC is available    
14. Upload Photo *
15. Upload Signature *

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...