Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

28, డిసెంబర్ 2020, సోమవారం

JEE Mains info

జేఈఈ-మెయిన్.. ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష! ఐఐటీల్లో ప్రవేశానికి జరిగే జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు కూడా అర్హత పరీక్ష జేఈఈ-మెయిన్! గతేడాది వరకు.. ఏటా రెండుసార్లు జరిగిన ఈ పరీక్షను.. వచ్చే సంవత్సరం (2021) నుంచి నాలుగుసార్లు నిర్వహించనున్నారు!

విద్యార్థులు తమ అభీష్టంమేరకు నాలుగుసార్లూ హాజరు కావచ్చు. ఒకటి కంటే ఎక్కువసార్లు రాస్తే.. ర్యాంకుల కేటాయింపులో బెస్ట్ స్కోర్‌నే పరిగణనలోకి తీసుకుంటారు. మరోవైపు..ఇంటర్మీడియెట్‌లో కనీసం 75 శాతం మార్కులు; లేదా బోర్డ్ పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్‌లో ఉన్న వారికే సీట్ల కేటాయింపు జరుగుతుందనే నిబంధనపై విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. జేఈఈ-మెయిన్-2021 విధి విధానాలు.. కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు.. విద్యార్థులు బెస్ట్ స్కోర్ సాధించడానికి ప్రిపరేషన్ ప్రణాళికపై ప్రత్యేక కథనం...

జేఈఈ-మెయిన్-2021లో ప్రధానంగా ప్రస్తావించాల్సిన మార్పు.. పరీక్షను నాలుగుసార్లు నిర్వహించాలనే నిర్ణయం! ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో జేఈఈ-మెయిన్‌ను నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమకు నచ్చిన సెషన్‌లో హాజరయ్యే అవకాశం ఉంది. అటెంప్ట్‌ల పరంగా ఎలాంటి పరిమితి లేదు. నాలుగుసార్లు హాజరవ్వచ్చు. ఇలా ఒకటి కంటే ఎక్కువసార్లు హాజరైతే.. ఏ సెషన్‌లో అత్యుత్తమ స్కోర్ సాధిం చారో దానినే పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిం చనున్నారు. ఉదాహరణకు ఫిబ్రవరి సెషన్‌లో తక్కువ స్కోర్, ఏప్రిల్ సెషన్‌లో ఎక్కువ స్కోర్ వస్తే.. ఏప్రిల్ సెషన్ స్కోర్‌నే ర్యాంకుల కేటాయింపులో పరిగణిస్తారు.

పదమూడు భాషల్లో పరీక్ష..
జేఈఈ-మెయిన్-2021ను ఇంగ్లిష్, హిందీ సహా మొత్తం పదమూడు భాషల్లో నిర్వహించనున్నారు. ఇంగ్లిష్, హిందీ,తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠి, మళయాళం, పంజాబీ, తమిళం, ఉర్దూ మీడియంలలో విద్యార్థి తనకు నచ్చిన భాషలో పరీక్షరాసే అవకాశం ఉంది. దీనివల్ల ఇంటర్మీడియెట్ ప్రాంతీయ లేదా మాతృభాషలో చదివిన విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పశ్నల అనువాదంలో లోపాలు లేకుండా చూస్తేనే ప్రాంతీయ భాషల్లో నిర్వహణ ఉద్దేశం నెరవేరుతుందని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొంటున్నారు.

ఛాయిస్ విధానం..
జేఈఈ-మెయిన్-2021లో మరో కీలక మార్పు.. పరీక్షలో ఛాయిస్ విధానానికి శ్రీకారం చుట్టడం! పార్ట్-ఎ, పార్ట్-బిలుగా జరిగే పరీక్షలో.. పార్ట్-బిలోని పది ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలకు సమాధానం గుర్తిస్తే సరిపోతుంది. కొవిడ్ పరిస్థితులు, ఆన్‌లైన్ క్లాస్‌లు.. ఆయా బోర్డ్‌లు సిలబస్‌ను కుదించిన నేపథ్యంలో విద్యార్థులకు సానుకూలంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాని మొత్తంగా సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. గతంతో పోలిస్తే ఎలాంటి మార్పు లేకుండా యథా తథంగా ఉంచడంపై విద్యార్థుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పార్ట్-ఎ సిలబస్‌లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో.. 2020-21లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది.


మెయిన్ ఉత్తీర్ణత ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021కు మాత్రం రెండు అటెంప్ట్‌ల విధానాన్నే కొనసాగించారు.

అంటే.. ప్రస్తుతం జేఈఈ-అడ్వాన్స్‌డ్ నిబంధనల ప్రకారం-వరుసగా రెండేళ్లలో రెండుసార్లు మాత్రమే అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. 2020లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధించిన వారు, అదే విధంగా 2021లో ఉత్తీర్ణత సాధించనున్న విద్యార్థులే జేఈఈ అడ్వాన్స్‌డ్-2021కు అర్హులవుతారు.

  1. జేఈఈ-మెయిన్-2021కు మాత్రం 2019, 2020లో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. అలాగే 2021లో ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు మెయిన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ-అడ్వాన్స్‌డ్ నిబంధనను పరిగణనలోకి తీసుకుంటే.. ఐఐటీల్లో చేరాలనుకునే 2019 బ్యాచ్ విద్యార్థులకు మెయిన్ అటెంప్ట్‌ల పెంపు పరంగా ఎలాంటి ప్రయోజనం ఉండదు. వారు ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలకే పరిమితం కావాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జేఈఈ- అడ్వాన్స్‌డ్‌కు కూడా 2019లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు.


ఒత్తిడికి ఆస్కారం..
జేఈఈ-మెయిన్‌ను నాలుగుసార్లు నిర్వహించడంవల్ల విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురయ్యే ఆస్కారముందనే వాదన కూడా వినిపిస్తోంది. వరుసగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించే ఈ పరీక్షల్లో బెస్ట్ స్కోర్‌నే తుది ర్యాంకుల కేటాయింపులో పరిగణిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఫిబ్రవరిలో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు.. మార్చి, ఏప్రిల్ నెలల్లో వార్షిక పరీక్షలు, ప్రాక్టికల్స్ కోసం సంసిద్ధం కావాల్సి ఉంటుంది. అలాంటి వారు మళ్లీ మే నెలలోనే మెయిన్‌పై దృష్టి కేంద్రీకరించే పరిస్థితి ఉంటుంది. ఇదే సమయంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో పరీక్షలకు హాజరయ్యే వారు తమకంటే మంచి స్కోర్ సాధిస్తారేమో, తాము వెనుకబడి పోతామేమోనని విద్యార్థులు ఆందోళన చెందే ఆస్కారముంది. అంతేకాకుండా మంచి స్కోర్ సాధించే వరకు.. నిరంతరం ప్రిపరేషన్ సాగించాల్సిన ఒత్తిడి కూడా ఎదురవుతుందని అంటున్నారు.

బీఈ/బీటెక్ కోసం జరిగే జేఈఈ మెయిన్ కంప్యూట్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో మూడు సబ్జెక్టులు.. ప్రతి సబ్జెక్టుపై రెండు సెక్షన్లలో నిర్వహిస్తారు. ఆ వివరాలు..

సబ్జెక్ట్సెక్షన్-ఎసెక్షన్-బి
{పశ్నల సంఖ్య{పశ్నల సంఖ్యమార్కులు
మ్యాథమెటిక్స్2010100
ఫిజిక్స్2010100
కెమిస్ట్రీ2010100
మొత్తం90 ప్రశ్నలు300

  1. సెక్షన్-ఎలో బహుళైచ్ఛిక ప్రశ్నలే అడుగుతారు.
  2. సెక్షన్-బిలో న్యూమరికల్ వాల్యూ ఆధారిత ప్రశ్నలు అడుతారు.
  3. సెక్షన్-బిలో అభ్యర్థులు 10 ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలు ఛాయిస్ లభిస్తుంది. ఠ సెక్షన్-ఎలో 0.25 శాతం నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది. సెక్షన్ బీలో నెగిటివ్ మార్కులు ఉండవు.


బీఆర్క్ పరీక్ష స్వరూపం..
ఇది పేపర్ 2ఏ.. ఇందులో మ్యాథమెటిక్స్(పార్ట్-1), అప్టిట్యూడ్ టెస్ట్(పార్ట్-2) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో.. డ్రాయింగ్ టెస్ట్(పార్ట్-3) పెన్-పేపర్ విధానంలో జరుగుతుంది. ఈ పరీక్షనకు మూడు విభాగాలు నిర్వహిస్తారు. వివరాలు..

సబ్జెక్ట్

ఎంసీక్యూలు

న్యూమరికల్ ప్రశ్నలు

మార్కులు

మ్యాథమెటిక్స్(పార్ట్-1)2010100
ఆప్టిట్యూడ్ టెస్ట్(పార్ట్-2)50-200
డ్రాయింగ్ టెస్ట్(పార్ట్-3)02-100
మొత్తం ప్రశ్నలు---82---400

  1. మ్యాథమెటిక్స్‌లో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు అదే విభా గంలో న్యూమరికల్ ప్రశ్నలలో 5 ప్రశ్నలు ఛాయిస్‌గా ఉంటాయి.
  2. డాయింగ్ టెస్ట్‌లో మాత్రం రెండు అంశాలను ఇచ్చి డ్రాయింగ్ వేయమంటారు. ఒక్కో టాపిక్‌కు 50 మార్కులు.


బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ పరీక్ష స్వరూపం..
ఇందులో మ్యాథమెటిక్స్(పార్ట్-1), అప్టిట్యూడ్ టెస్ట్(పార్ట్-2), ప్లానింగ్ బేస్డ్ ప్రశ్నలు(పార్ట్-3) అన్నీ కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరుగుతాయి.

సబ్జెక్ట్{పశ్నలన్యూమరికల్మార్కులు
సంఖ్య{పశ్నల సంఖ్య
మ్యాథమెటిక్స్2010100
ఆప్టిట్యూడ్ టెస్ట్50-200
ప్లానింగ్ ఆధారిత ప్రశ్నలు25-100
మొత్తం ప్రశ్నల సంఖ్య:105 ప్రశ్నలుమార్కులు400


ఫిబ్రవరి సెషన్ సమాచారం..

  1. అర్హత: 2019, 2020లో ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. 2021లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా అర్హులే.
  2. ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: డిసెంబర్ 16, 2020 నుంచి జనవరి 16, 2021 వరకూ
  3. దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: జనవరి 17, 2021
  4. దరఖాస్తుల సవరణ అవకాశం: జనవరి 19, 2021 నుంచి జనవరి 21, 2021 వరకూ
  5. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ సదుపాయం: ఫిబ్రవరి రెండో వారం
  6. పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 23, 24, 25, 26
  7. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
  8. ఆంధ్రప్రదేశ్: అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం.
  9. తెలంగాణ: హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట
  10. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://jeemain.nta.nic.in


 

Intermediate Admissions latest update 2020 || ఇంటర్మీడియట్ ప్రవేశాల అడ్మిషన్స్ పై ముఖ్య ప్రకటన

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత విధానంలోనే ఇంటర్మీడియట్ ప్రవేశాల  అడ్మిషన్స్ ను కొనసాగించాలని ఏపీ హై కోర్టు తీర్పునివ్వడంతో  ఏపీలో పాత విధానంలోనే ఇంటర్మీడియట్ ప్రవేశాలకు అడ్మిషన్స్ ఇవ్వనున్నారు. Intermediate Admissions latest update 2020

వీటికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే విడుదల కానున్నాయి.

ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ విషయంలో నూతనంగా తీసుకువచ్చిన విధానాలను వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేసుకోవచ్చునని ఆదేశాలు రావడంతో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ కాలేజ్ లలో ఆన్లైన్ అడ్మిషన్స్ విధానం కొనసాగనుంది అని చెప్పవచ్చు.

AP DSC Latest Update in telugu 2020 || టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో బ్యాక్ లాగ్ మరియు రెగ్యులర్ డీఎస్సీల నిర్వహణ

 

టీచర్ పోస్టుల భర్తీకి లిమిటెడ్ మరియు రెగ్యులర్ డీఎస్సీల నిర్వహణ :

రాష్ట్రంలో ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేసి, గవర్నమెంట్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకీ నిర్వహించే డీఎస్సీ నోటిఫికేషన్ గురించి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.

ఏపీ లో రాబోయే సంవత్సరం 2021లో  ఖాళీగా ఉన్న ప్రభుత్వ టీచర్స్ ఉద్యోగాల భర్తీకి రెండు డీఎస్సీ లను నిర్వహించనున్నారు.

తాజా వార్తల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత డీఎస్సీ లలో భర్తీ కాకుండా  మిగిలి ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి 403 పోస్టులతో లిమిటెడ్ బ్యాక్ లాగ్ డీఎస్సీ నోటిఫికేషన్ ను ముందుగా త్వరలో విడుదల చేయనున్నారు.

ఈ లిమిటెడ్ డీఎస్సీ పూర్తి అయిన తరువాత సుమారు 15,000 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ను ఏపీ ప్రభుత్వం నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తుంది.

అయితే ఈ డీఎస్సీ కంటే ముందు ఏపీ లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ) ను నిర్వహించనున్నారు.

ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఈ సారి ఏపీ టెట్ సిలబస్ లో మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ టెట్ పరీక్ష సిలబస్ మార్పులపై ఏపీ ఎస్సీఈఆర్టీ సభ్యులు కసరత్తులు ప్రారంభించినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తుంది.

SSC CGL Notification Update 2020 Telugu || రేపు విడుదల కానున్న ఎస్‌ఎస్‌సి సిజిఎల్ 2020 నోటిఫికేషన్

 

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) పరీక్ష యొక్క అధికారిక నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) డిసెంబర్ 29 న విడుదల చేయనుంది.

వివిధ గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయడానికి ఎస్‌ఎస్‌సి సిజిఎల్ నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.

ఈ పరీక్షలకు ధరకాస్తు చేసుకోడానికి అభ్యర్ధులు కనీస విద్యా అర్హత గా గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసి ఉండవలెను.

ఎంపికా విధానం రెండు కంప్యూటర్ పరీక్షల ద్వారా అనగా వివరణాత్మక పేపర్ పరీక్ష మరియు కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష లేదా డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ ద్వారా పరీక్ష జరుగుతుంది.

పత్రాలు ధృవీకరించబడిన తరువాత మెరిట్ జాబితా విడుదల విడుదల చేస్తుంది.

ఈ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ యొక్క మొదటి కంప్యూటర్ పరీక్ష మే 29 నుండి జూన్ 7 వరకు జరుగుతుంది.

పరీక్షా తేదీలలో ఎలాంటి మార్పులు చేయాలనే దానిపై ఇప్పటివరకు ఎస్ఎస్సి ఏటువంటి సమాచారం లేదు.

Website

 

Eenadu Anantapuramu District Classifieds

 

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...