Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

11, డిసెంబర్ 2021, శనివారం

NEET Counselling: నీట్ యూజీ కౌన్సెలింగ్ నెలరోజులు ఆలస్యం.. అధికారికంగా ప్రకటించిన ఎంసీసీ

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (National Eligibility cum Entrance Test) 2021 క్వాలిఫై అయిన అభ్యర్థులు కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. నీట్ ఫలితాలను ప్రకటించి ఒక నెల దాటినా, కౌన్సెలింగ్ (Counselling), అడ్మిషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే నీట్ కౌన్సెలింగ్‌ ప్రారంభమయ్యేందుకు మరో నెల రోజుల సమయం పడుతుందని చెబుతోంది మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (Medical Counselling Committee). దీనికి సంబంధించి సంస్థ అధికారిక ప్రకటన వెల్లడించింది. మెడికల్ కాలేజీ అడ్మిషన్ల (Admissions)కు సంబంధించి అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

సుప్రీంకోర్టులో కొనసాగుతున్న కేసు కారణంగా నీట్ కౌన్సెలింగ్ ఆలస్యమవుతోందని MCC తెలియజేసింది. మెడికల్ అడ్మిషన్ల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన EWS కోటాను పొందేందుకు రూ.8 లక్షలు పరిమితిగా ఉంచడంపై సుప్రీంకోర్టు (Supreme Court) లో విచారణ జరుగుతోంది. ఈ కేసు తదుపరి విచారణ జనవరి 6న జరగనుంది.

Gemini Internet

ఆ తరువాతే ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు రానుంది. కాబట్టి తీర్పుకు ముందు కౌన్సెలింగ్ ప్రక్రియ (Counselling Process)ప్రారంభమయ్యే అవకాశం లేదు.

‘30.07.2021 నాటి ఆఫీస్ మెమోరాండం సుప్రీం కోర్టు విచారణ పరిధిలో ఉంది. తదుపరి ప్రొసీడింగ్స్ 2022 జనవరి 6న జరగనున్నాయి. NEET-UG- 2021 కౌన్సెలింగ్‌లో పాల్గొనాలనుకునే అభ్యర్థులకు సమాచారం కోసం ఈ ప్రకటన చేస్తున్నాం’ అని మెడికల్ కౌన్సిల్ కమిటీ పేర్కొంది.

కౌన్సెలింగ్ ఎందుకు ఆలస్యం అవుతోంది?
కేంద్ర ప్రభుత్వం ఓబీసీ *(OBC) విద్యార్థులకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఇది UG, PG అడ్మిషన్స్ రెండింటికీ వర్తిస్తుంది. EWS కేటగిరీ సీట్లు పొందేవారి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల కంటే తక్కువ ఉండాలనే నిబంధన ఉంది. అయితే ఈ పరిమితిని ఏ ప్రాతిపదికన నిర్ణయించారని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని (Central Govt) ప్రశ్నించింది. దీనిపై విచారణ జరుగుతోంది.
 
గత విచారణలో ఈ అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. EWS కోటా నిబంధనలను పునఃసమీక్షించడానికి ప్రభుత్వం ఒక కమిటీని రూపొందిస్తుందని చెప్పారు. ఈ కమిటీ నాలుగు వారాల్లో తాజా నిర్ణయం తీసుకుంటుందని మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఒకవేళ ఈ పరిమితిని మారిస్తే, కొత్తగా ప్రవేశపెట్టిన EWS కోటా సీట్లు పొందేందుకు ఎక్కువ లేదా తక్కువ మంది విద్యార్థులు (Students) అర్హులవుతారు. అందువల్ల అప్పటి వరకు యూజీ, పీజీ వైద్య కళాశాలల అడ్మిషన్లకు కౌన్సెలింగ్‌ నిలిచిపోయింది. ఒకవేళ EWS కోటాను మారిస్తే, ఈ కేటగిరీ కింద ప్రయోజనం పొందేందుకు అర్హులైన అభ్యర్థుల సంఖ్య పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఈ నిర్ణయం వైద్య కళాశాల (Medical Colleges) ప్రవేశాల పై ప్రభావం చూపుతుంది.

 

TTD: టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయం.. తెరపైకి మూడో ఘాట్ రోడ్డు.. వైకుంఠ ఏకాదశికి గుడ్ న్యూస్



TTD Key Decesions:  తిరుమల తిరుపతి దేవస్తానం (Tirumala Tirupati Devastnam) పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో.. వారి అందరికి ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు .. 10 రోజులు పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం అని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి (YV Subbareddy) అన్నారు. జనవరి 13 న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు.. రాష్ట్రంలో కోవిడ్ నిభందనలు (Kovid Rules) సడలిస్తే.. పండుగ తరువాత సర్వదర్శనం పెంపు, ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామన్నారు. మొత్తం 11 మంది చిన్నపిల్లలుకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స నిర్వహించారు. చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భక్తులుకు ఉదయాస్తమాన సేవకు అనుమతించేలా అవకాశం కల్పిస్తాం అన్నారు. 500 ఉదయాస్తమాన సేవా టిక్కేట్లు ప్రస్తుతం ఖాళీగా వున్న వాటిని భక్తులుకు కేటాయిస్తామని.. బోర్డ్ సభ్యులు కూడా కోంత మంది విరాళాలు అందించేందుకు అంగీకరించారు అని తెలిపారు.

అలాగే వివాదాస్పదంగా మారిన హనుమంతుడి జన్మస్థలమైనా అంజనాద్రి ప్రాంతాని అభివృద్ధి చేస్తామన్నారు. నాదనీరాజనం మండపం దగ్గర శాశ్వత ప్రాతిపాదికన మండపాన్ని నిర్మిస్తామన్నారు. భక్తులు సౌకర్యార్థం అన్నమయ్య నడకమార్గాని.. మూడో రోడ్డు గా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. హిందు దర్మప్రచారంలో భాగంగా ప్రతి జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నమన్నారు. వర్షం కారణంగా అన్నమయ్య ప్రాజెక్ట్ వద్ద కోట్టుకుపోయిన ఆలయాలను తిరిగి పున: నిర్మిస్తామన్నారు. ఐటి విభాగాన్ని పటిష్టవంతంగా నిర్వహించేందుకు ఉద్యోగ నియామకాలు చేస్తాం. 2.6 కోట్ల రూపాయల వ్యయంతో నూతన పరకామణి మండపంలో యంత్రాలు కొనుగోలు చేసామన్నారు. శ్రీశైలం ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేస్తామన్నారు. తాళ్లపత్ర కందిరీగలను పరిరక్షించడానికి ఎస్వీ వేద విద్యాలయంలో మ్యాన్ స్ర్కిప్ట్ విభాగాని ఏర్పాటు చేస్తామన్నారు.

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులకు ఉచితంగా దర్శనభాగ్యాం కల్పిస్తామన్నారు. భక్తులుకు శ్రీవేంకటేశ్వర నామ కోటి పుస్తకాలను అందిస్తామన్నారు. కళ్యాణకట్ట క్షురకులుకు ఇచ్చే పీస్ రేటును 11 నుంచి 15 రూపాయలకు పెంచామన్నారు. 3 కోట్ల రూపాయల వ్యయంతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎఫ్ఎంస్ కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులతో కమిటీ వేశాం. కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు టీటీడీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సీఎం హామీ మేరకు టీటీడీలో పనిచేసే కార్మికులను ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్‌లో కలిపాం. కాంట్రాక్టర్ కింద పని చేసే కార్మికులను ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో కలపలేం. ఇప్పటి దాకా టీటీడీకి ప్రత్యేకమైన ఐటీ వింగ్ లేదు. టీటీడీ ఐటీ వింగ్ కోసం అర్హత కలిగిన ఉద్యోగులతో ప్రత్యేక టీటీడీ ఐటీ వింగ్ ఏర్పాటు చేస్తాం' అని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

 

 

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...