Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

19, అక్టోబర్ 2021, మంగళవారం

Sainik School Admissions 2021: నాణ్య‌మైన విద్య‌కు చిరునామా.. సైనిక్‌స్కూల్స్‌ ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తు వివ‌రాలు, ప‌రీక్ష‌ విధానం

నాణ్య‌మైన విద్యాకు చిరునామా సైనిక్ స్కూల్స్‌. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) ల‌లో ప్ర‌వేశాల కోసం నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేష‌న్‌ ద్వారా ఆరోత‌ర‌గ‌తి, తొమ్మిదో త‌ర‌గ‌తుల‌కు సైనిక్ స్కూల్‌లో ప్ర‌వేశాల‌కు ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 26, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) ల‌లో ప్ర‌వేశాల కోసం నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేష‌న్‌ ద్వారా ఆరోత‌ర‌గ‌తి, తొమ్మిదో త‌ర‌గ‌తుల‌కు సైనిక్ స్కూల్‌లో ప్ర‌వేశాల‌కు ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ సెప్టెంబ‌ర్ 27, 2021 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 26, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ప్ర‌వేశ ప‌రీక్ష (Entrance Test) జ‌న‌వ‌రి 9, 2022న నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష ఫీజు ( Exam Fee) నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ సంద‌ర్శించండి.

ముఖ్య స‌మాచారం ..

ద‌ర‌ఖాస్తు ప్రారంభంసెప్టెంబ‌ర్ 27, 2021
ద‌ర‌ఖాస్త‌కు చివ‌రి తేదీఅక్టోబ‌ర్ 26, 2021
స‌వ‌ర‌ణ‌ల‌కు అవ‌కాశంఅక్టోబ‌ర్ 28, 2021 నుంచి న‌వంబ‌ర్ 2, 2021
ప‌రీక్ష ఫీజు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు రూ.400
ప‌రీక్ష తేదీజ‌న‌వ‌రి 9, 2022
ప‌రీక్ష స‌మ‌యం ఆరోత‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు 150 నిమిషాలు,                                       తొమ్మిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు 180 నిమిషాలు
అధికారిక వెబ్‌సైట్https://aissee.nta.nic.in/      www.nta.ac.in

అర్హ‌త‌లు..
ప్రస్తుతం ఐదోత‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థులు 6వ తరగతికి.. ఎనిమిది చ‌దివే విద్యార్థులు తొమ్మిదో త‌ర‌గ‌తికి ప్ర‌వేశాల‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వ‌య‌సు 31.03.2021 నాటికి ఆరో త‌ర‌గ‌తికి 10 నుంచి 12, తొమ్మిదో త‌ర‌గ‌తికి 13 నుంచి 15 ఏళ్ల మ‌ధ్య ఉన్న వారు అర్హులు.

ఆరోత‌ర‌గ‌తి ప్ర‌వేశాలకు ప‌రీక్ష విధానం..
టాపిక్ప్ర‌శ్న‌ల సంఖ్యప్ర‌తీ ప్ర‌శ్న‌కు మార్కులుమొత్తం మార్కులు
మ్యాథ‌మెటిక్స్503150
ఇంట‌లిజెన్స్‌25250
లాగ్వేజ్‌25250
జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌25250
మొత్తం125
300


తొమ్మిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే ప్ర‌వేశ ప‌రీక్ష విధానం..
టాపిక్ప్ర‌శ్న‌ల సంఖ్యప్ర‌తీ ప్ర‌శ్న‌కు మార్కులుమొత్తం మార్కులు
మ్యాథ‌మెటిక్స్504200
ఇంట‌లిజెన్స్‌25250
లాగ్వేజ్‌25250
 జ‌న‌ర‌ల్ సైన్స్‌25250
సోష‌ల్ సైన్స్‌25250
మొత్తం150
500


ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 :  ద‌ర‌ఖాస్తు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.

Step 2 : ముందుగా అధికారిక‌ వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ ను సంద‌ర్శించాలి.

Step 3 : అనంత‌రం అధికారిక బ్రౌచ‌ర్‌ను పూర్తిగా చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

Step 4 : అప్లికేష‌న్ ఫాంలో ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబ‌ర్ స‌రిగా ఇవ్వాలి.

Step 5 : జేపీజీ / జేపీఈజే ఫార్మేట్‌లో ఫోటోను అప్లోడ్ చేయాలి. సాఫ్ట్ కాపీ సైజ్ నిర్దేశించిన ఫార్మెట్‌లో ఉండాలి.

Step 6 : విద్యార్హ‌త స‌ర్టిఫికెట్‌, క్యాస్ట్ స‌ర్టిఫికెట్ సంబంధిత స‌ర్టిఫికెట్ల‌ను సాఫ్ట్ కాపీ రూపంలో అప్లోడ్ చేయాలి.

 

SSC Recruitment 2021 : ప‌ది, ఇంట‌ర్ విద్యార్థుల‌కు మంచి అవ‌కాశం.. ఎస్ఎస్‌సీలో 1,775 పోస్టులు

SSC Recruitment 2021 : ప‌ది, ఇంట‌ర్ విద్యార్థుల‌కు మంచి అవ‌కాశం.. స్టాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్ (Staff Selection Commission) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 3,261 పోస్టులు భర్తీ చేయ‌నున్నారు.  ఈ పోస్టుల‌లో ప‌ది, ఇంట‌ర్ విద్యార్హ‌త‌తో 1,775 ఉద్యోగాలు ఉన్నాయి. వాటి ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 25 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

స్టాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్ (Staff Selection Commission) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా వేర్వేరు విభాగాల్లో ఎస్ఎస్‌సీ ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తుంది. ఈ నోటిఫికేష‌న్(Notification) ద్వారా మొత్తం 3,261 పోస్టులు భర్తీ చేయ‌నున్నారు.  ఈ పోస్టుల‌లో ప‌ది, ఇంట‌ర్ (Inter) విద్యార్హ‌త‌తో ఎస్ఎస్‌సీలో 1,775 ఉద్యోగాలు ఉన్నాయి.  పోస్టుల ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 25, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ద‌ర‌ఖాస్తు అనంత‌రం ఫీజు (Fee) చెల్లించేందుకు అక్టోబ‌ర్ 28, 2021 రాత్రి 11.30 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. బ్యాంక్ ద్వారా చ‌లాన్ (Bank challan) రూపంలో ఫీజు చెల్లించేందుకు న‌వంబ‌ర్ 1, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. పోస్టుల ఎంపిక ప‌రీక్ష ద్వారా నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష జ‌న‌వ‌రి 2022 లేదా ఫిబ్ర‌బ‌రి 2022లో జ‌రిగే అవ‌కాశం ఉంది. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్త‌యిన త‌రువాత ప‌రీక్ష తేదీలు విడుద‌ల చేస్తారు. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

ఎంపిక విధానం..
Step 1 :  ఈ పోస్టుల భ‌ర్తీకి ప్రాథ‌మికంగా కంప్యూట‌ర్ బెస్డ్ (Computer Based Exam) ప‌రీక్ష నిర్వ‌హిస్తున్నారు.  ప‌రీక్ష స‌మ‌యం - 60 నిమిషాలు
Step 2 :  ఇది అబ్జెక్టీవ్ టైప్ (Objective type) ప్ర‌శ్న‌ల‌ను క‌లిగి ఉంటుంది. అయితే పోస్టును బ‌ట్టి విద్యార్హ‌త‌ను బ‌ట్టి మూడు ప‌రీక్ష‌ల వ‌ర‌కు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది.

Step 3 :  ప‌రీక్ష రాసే అభ్య‌ర్థులు ఆచితూచి స‌మాధానం పెట్టాలి. ప్ర‌తీ త‌ప్పు ప్ర‌శ్న‌కు 0.50 మార్కులు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.


Step 4 :  ప‌రీక్ష ఉత్తీర్ణులైన వారిని నైపుణ్య (Skill) ప‌రీక్ష‌కు పిలుస్తారు. ఎంపిక విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకొన్న‌ పోస్టుల ఆధారంగా ఉంటుంది.

ప‌రీక్ష విధానం
స‌బ్జెక్టుప్ర‌శ్న‌లుమార్కులు
జ‌న‌ర‌ల్ ఇంట‌లిజ‌న్స్2550
జ‌న‌రల్ అవెర్నెస్2550
క్వాంటిటేవ్ ఆప్టిట్యూడ్2550
ఇంగ్లీష్ లాంగ్వేజ్2550

విద్యార్హ‌త‌, వ‌యోప‌రిమితి..
విద్యార్హతలు పోస్టుల వారీగా మారుతూ ఉంటుంది. ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణతతో కొన్ని ఉద్యోగాలు, 12వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో కొన్న ఉద్యోగాలు ఉండ‌గా ప‌లు పోస్టుల‌కు గ‌రిష్ట విద్యార్హ‌త గ్రాడ్యుయేషన్‌గా ఉంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుచేసుకోవ‌డానికి అర్హ‌త క‌నీస వ‌య‌సు 18 సంత్స‌రాలు ఉంది. చాలా పోస్టుల‌కు గ‌రిష్ట వ‌య‌సు 30 ఏళ్లుగా ఉంది. అయితే రిజ‌ర్వేష‌న్‌ల ప్ర‌కారం ఆయా విభాగాల వారీకి వ‌యోప‌రిమిత (Age Limit) స‌డ‌లింపు ఉంటుంది.



ద‌ర‌ఖాస్తు విధానం..
Step 1:  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ రెండు భాగాలుగా ఉంటుంది.

Step 2: ముందుగా అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ను సంద‌ర్శించాలి.

Step 3: అందులో NOTICES లోకి వెళ్లి. OTHERS విభాగంలో నోటిఫికేష‌న్ చ‌ద‌వాలి. అనంత‌రం హోం పేజీకి వ‌చ్చి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ మొద‌లు పెట్టాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

Step 4: మొద‌ట వ‌న్‌టైం రిజ‌స్ట్రేష‌న్ చేసుకోవాలి.



Step 5: అభ్య‌ర్థి ప్రాథ‌మిక విద్యార్హ‌త‌, పాస్‌పోర్టు ఫోటో, సంత‌కం అప్‌లోడ్ చేసి ఫాం స‌బ్‌మిట్ చేయాలి.

Step 6: ఈ ప్ర‌క్రియ అనంత‌రం అభ్య‌ర్థికి రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్‌, పాస్ వ‌ర్డ్ వ‌స్తాయి.

Step 7: రెండో భాగంలో రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్ (Registration Number) పాస్ వ‌ర్డ్‌తో లాగిన్ అవ్వాలి.

Step 8: అనంత‌రం ఏ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేస్తున్నారో క్లిక్ చేసి స‌మాచారం , ఫీజు చెల్లించి స‌బ్‌మిట్ చేయాలి.

Step 9: ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, ఈఎస్ఎం క్యాట‌గిరీ అభ్య‌ర్థుల‌కు, మ‌హిళ‌ల‌కు ప‌రీక్ష ఫీజు లేదు.

 

Microsoft Internship 2021: డిగ్రీ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌లో వర్చువల్ ఇంటర్న్‌షిప్... రేపే లాస్ట్ డేట్

Microsoft Internship 2021 | డిగ్రీ చదువుతున్నవారికి, డిగ్రీ పాస్ అయినవారికి ఇంటర్న్‌షిప్ (Internship) అవకాశం ఇస్తోంది మైక్రోసాఫ్ట్. 85000 మంది వర్చువల్ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనొచ్చు. ఈ ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి

డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు గుడ్ న్యూస్. ఐటీ రంగ దిగ్గజం అయిన మైక్రోసాఫ్ట్ ఇంటర్‌షిప్స్ ప్రకటించింది. రెండో బ్యాచ్‌లో 85,000 మందికి వర్చువల్ ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఇస్తోంది. భారతదేశంలో ఇటీవల డిగ్రీ పూర్తి చేసినవారంతా ఈ ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్-ఏ నాస్‌కామ్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) డిజిటల్ స్కిల్ ఇనషియేటీవ్, ఎర్న్‌స్ట్ అండ్ యంగ్ (EY), గిట్‌హబ్, క్వెస్ కార్ప్ లాంటి సంస్థలతో కలిపి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది మైక్రోసాఫ్ట్. ఆసక్తి గల విద్యార్థులు ఏఐసీటీఈ తులీప్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. 2021 అక్టోబర్ 20 లోగా రిజిస్టర్ చేయాలి.


కెరీర్‌లో అడుగుపెట్టాలనుకునే విద్యార్థులు అందుకు తగ్గట్టుగా సిద్ధం కావడానికి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. విద్యార్థుల కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ రెడీ టాలెంట్ ప్రోగ్రామ్‌ను గత నెలలో మైక్రోసాఫ్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రెండో బ్యాచ్ ద్వారా 85,000 మంది విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్‌షిప్ అవకాశం ఇస్తోంది.

వర్చువల్ ఇంటర్న్‌షిప్ మొత్తం 8 వారాలు ఉంటుంది. 2021 లో డిగ్రీ పాస్ అయిన విద్యార్థులతో పాటు రాబోయే రెండేళ్లలో ఉద్యోగాల్లో చేరాలనుకునేవారు ఈ ఇంటర్న్‌షిప్ చేయొచ్చు. అంటే 2022, 2023లో డిగ్రీ పాస్ అయ్యేవారు కూడా అప్లై చేయొచ్చు. ఏఐసీటీఈ తులీప్ పోర్టల్‌లో 2021 అక్టోబర్ 20 లోగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు 8 వారాలపాటు అంకితభావంతో పూర్తి సమయం కేటాయించి ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనాలి.



ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు గిట్‌హబ్ స్టూడెంట్ డెవలపర్ ప్యాక్‌కు యాక్సెస్ లభిస్తుంది. ఇందులోనే 100 డాలర్ల విలువైన అజ్యూర్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది. డిస్కౌంటెడ్ సర్టిఫికేషన్స్ కూడా లభిస్తాయి. 8 వారాల ఇంటర్న్‌షిప్ పూర్తి చేసినవారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ లభిస్తుంది. కెరీర్ సపోర్ట్ సేవలు కూడా పొందొచ్చు. మొత్తం 190 గంటల లెర్నింగ్ సెషన్స్, ఆన్ ల్యాబ్ సెషన్స్ ఉంటాయి.

ఆసక్తిగల విద్యార్థులు ఏఐసీటీఈ తులీప్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయాలి. విద్యాసంస్థ పేరు, స్టూడెంట్ ఐడీ, విద్యార్థి పేరు, ఊరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలతో రిజిస్టర్ చేయాలి. విద్యార్థుల మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయిన తర్వాత ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు. ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ప్యూచర్ రెడీ కోర్సుల వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 

TTD Calender 2021

Gemini Internet












IRCTC Tirumala Tour: విజయవాడ నుంచి రూ.3,220 ధరకే తిరుపతి టూర్ ప్యాకేజీ... శ్రీవారి ప్రత్యేక దర్శనం కూడా


IRCTC Tirumala Tour: విజయవాడ నుంచి రూ.3,220 ధరకే తిరుపతి టూర్ ప్యాకేజీ... శ్రీవారి ప్రత్యేక దర్శనం కూడా (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Tirumala Tour | ఐఆర్‌సీటీసీ టూరిజం విజయవాడ నుంచి తిరుపతికి టూర్ (Vijayawada Tirupati Tour) ప్యాకేజీ ప్రకటించింది. కేవలం రూ.3,220 ధరకే ఈ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.


తిరుమల వెళ్లాలనుకునే విజయవాడ పరిసర ప్రాంతా వాసులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ టూరిజం కార్పొరేషన్‌కు (IRCTC) చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం తక్కువ ధరకే తిరుపతి టూర్ (Tirupati Tour) ప్యాకేజీ ప్రకటించింది. విజయ్ గోవిందం పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమల, తిరుచానూర్ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ బుక్ చేసిన పర్యాటకుల్ని రైలులో తిరుపతి తీసుకెళ్లనుంది ఐఆర్‌సీటీసీ. తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. వీకెండ్‌లో రెండు రోజులు తిరుపతి టూర్ ప్లాన్ చేసుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది.

ఐఆర్‌సీటీసీ విజయ్ గోవిందం ప్యాకేజీ ధర ఎంతంటే


ఐఆర్‌సీటీసీ టూరిజం విజయ్ గోవిందం టూర్ ప్యాకేజీ స్టాండర్డ్ ధరలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.3,220 కాగా, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.3,300, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.3,920 చెల్లించాలి. కంఫర్ట్ ధరలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.5,080 కాగా, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.5,160, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.5,780 చెల్లించాలి. స్టాండర్డ్ ప్యాకేజీ బుక్ చేసుకునేవారికి రైలులో స్టాండర్డ్ క్లాస్‌లో, కంఫర్ట్ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారికి థర్డ్ ఏసీ క్లాస్‌లో బెర్త్ లభిస్తుంది.

రైలు టికెట్లతో పాటు ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. రైలులో భోజనం, ఐటినరీలో చెప్పిన స్థలాలు కాకుండా ఇతర ప్రాంతాలకు సైట్ సీయింగ్, వ్యక్తిగత ఖర్చులు, ఎంట్రెన్స్ టికెట్స్ లాంటివి ఈ టూర్ ప్యాకేజీలో కవర్ కావు. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు. పర్యాటకులు ఇదే వెబ్‌సైట్‌లో ప్యాకేజీ బుక్ చేసుకోవాలి.

టూర్ సాగేది ఇలాగే...

మొదటి రోజు రాత్రి 10.50 గంటలకు విజయవాడలో 07209 నెంబర్ గల ఎక్స్‌ఫ్రెస్ రైలు ఎక్కితే మరుసటి రోజు ఉదయం 5.25 గంటలకు తిరుపతి చేరుకుంటారు. పర్యాటకులు తెనాలిలో కూడా రైలు ఎక్కొచ్చు. ఈ రైలు తెనాలికి రాత్రి 11.20 గంటలకు చేరుకుంటుంది. పర్యాటకుల్ని ఐఆర్‌సీటీసీ సిబ్బంది హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత 8.50 గంటలకు తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు.

తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత గోవిందరాజ స్వామి ఆలయానికి తీసుకెళ్తారు. సమయాన్ని బట్టి తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి దర్శనం ఉంటుంది. రెండో రోజు రాత్రి 8.30 గంటలకు తిరుపతిలో రైలు ఎక్కితే మరుసటి రోజు తెల్లవారుజామున 2.10 గంటలకు తెనాలికి, 3.10 గంటలకు విజయవాడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

IBPS PO Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 4,135 ఉద్యోగాలకు నోటిఫికేషన్... డిగ్రీ పాస్ అయితే చాలు

IBPS PO Recruitment 2021 | ఐబీపీఎస్ ప్రభుత్వ బ్యాంకుల్లో (Govt Bank Jobs) ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగాలు (Bank Jobs) కోరుకునేవారికి అలర్ట్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 4,135 ఉద్యోగాలున్నాయి. మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ పోస్టుల్ని భర్తీ చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనెరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు 2021 అక్టోబర్ 20న దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 10 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఖాళీల వివరాలు, విద్యార్హతల వివరాలు తెలుసుకోండి.

IBPS PO Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం2021 అక్టోబర్ 20
 దరఖాస్తుకు చివరి తేదీ 2021 నవంబర్ 10
 దరఖాస్తు ఫీజు చెల్లింపు 2021 అక్టోబర్ 20 నుంచి నవంబర్ 10
ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్ విడుదల 2021 నవంబర్ లేదా డిసెంబర్
 ప్రిలిమినరీ ఎగ్జామ్ 2021 డిసెంబర్ 4 నుంచి 12
 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాల విడుదల 2021 డిసెంబర్ లేదా 2022 జనవరి
 మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ విడుదల 2021 డిసెంబర్ లేదా 2022 జనవరి
 మెయిన్ ఎగ్జామ్ 2022 జనవరి
 మెయిన్ ఎగ్జామ్ ఫలితాల విడుదల 2022 జనవరి లేదా ఫిబ్రవరి
 ఇంటర్వ్యూ కాల్ లెటర్ విడుదల 2022 ఫిబ్రవరి
 ఇంటర్వ్యూ 2022 ఫిబ్రవరి లేదా మార్చి
 ప్రొవిజనల్ అలాట్‌మెంట్ 2022 ఏప్రిల్

IBPS PO Recruitment 2021: ఖాళీల వివరాలు


 మొత్తం ఖాళీలు 4,135
 బ్యాంక్ ఆఫ్ ఇండియా 588
 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 400
 కెనెరా బ్యాంక్ 650
 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 620
 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 98
 పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 427
 యూకో బ్యాంక్ 440
 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 912
 పంజాబ్ నేషనల్ బ్యాంక్ పోస్టుల సంఖ్యను వెల్లడించాల్సి ఉంది
 ఇండియన్ బ్యాంక్ పోస్టుల సంఖ్యను వెల్లడించాల్సి ఉంది
 బ్యాంక్ ఆఫ్ బరోడా పోస్టుల సంఖ్యను వెల్లడించాల్సి ఉంది

IBPS PO Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి.

ఎంపిక విధానం- ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ.

వయస్సు- 2021 అక్టోబర్ 1 నాటికి 20 నుంచి 30 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- రూ.850. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు రూ.175.

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 

SSC Recruitment 2021: రూ.85,500 వేతనంతో 3261 జాబ్స్... సెలెక్షన్ ప్రాసెస్ ఇదే

SSC Recruitment 2021: రూ.85,500 వేతనంతో 3261 జాబ్స్... సెలెక్షన్ ప్రాసెస్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

SSC Recruitment 2021 | ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 3261 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు ఎలా ఎంపిక చేస్తారో (Exam Pattern), సిలబస్ ఎలా ఉంటుందో తెలుసుకోండి.


స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఫేజ్ 9 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3261 పోస్టుల్ని భర్తీ చేస్తోంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు 2021 అక్టోబర్ 25 లోగా అప్లై చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలతో పాటు దరఖాస్తు విధానం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 10+2, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. 2021 జనవరి 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులు. ఎంపికైనవారికి రూ.25,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.85,500 వేతనం లభిస్తుంది. మరి ఈ పోస్టులకు ఎలా ఎంపిక చేస్తారు? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఏం చదవాలి? తెలుసుకోండి.

SSC Phase 9 Recruitment 2021: ఎంపిక విధానం ఇదే...

Exam Pattern: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 3261 పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేయనుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 2022 జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారికి ఎగ్జామ్ ప్యాటర్న్ వేర్వేరుగా ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ 60 నిమిషాలకు ఉంటుంది. నాలుగు సబ్జెక్ట్స్‌లో 25 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ప్రతీ సెక్షన్‌కు 50 మార్కులు ఉంటాయి. అంటే మొత్తం 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. 60 నిమిషాల్లో ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.


Subjects: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌లో జనరల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్‌కు 25 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ సబ్జెక్ట్‌కు 25 ప్రశ్నలకు 50 మార్కులు, క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్ (బేసిక్ ఆర్థమెటిక్ స్కిల్) సబ్జెక్ట్‌కు 25 ప్రశ్నలకు 50 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్) సబ్జెక్ట్‌కు 25 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారికి ఈ సబ్జెక్ట్స్‌లో ప్రశ్నల స్థాయి వేర్వేరుగా ఉంటుంది. ప్రతీ తప్పు సమాధానానికి సగం మార్కు తగ్గుతుంది. అంటే రెండు సమాధానాలు తప్పైతే ఒక మార్కు తగ్గుతుంది.


Skill Test: కొన్ని పోస్టులకు స్కిల్ టెస్టులు కూడా ఉంటాయి. ఆ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్‌లో ఈ వివరాలు ఉంటాయి. టైపింగ్, డేటా ఎంట్రీ, కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ లాంటివి ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయినవారికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. ఓబీసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాలి. ఇతర కేటగిరీలు 25 శాతం మార్కులు సాధించాలి. స్కిల్ టెస్ట్ విజయవంతంగా పూర్తి చేసినవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

IGNOU Recruitment 2021: ఇగ్నోలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. జీతం రూ.35,000 ద‌ర‌ఖాస్తుకు ఈ రోజే ఆఖరు తేది (19-10-2021)

ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీ (Indira Gandhi National Open University)లో పలు నాన్ టీచింగ్ (Non Teaching) పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 19, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఆయా పోస్టుల ఆధారంగా రూ.35,000 వేత‌నం అందించ‌నున్నారు.

ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీ (Indira Gandhi National Open University)లో పలు నాన్ టీచింగ్ (Non Teaching) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ (Technical Assistant) , టెక్నికల్ మేనేజర్ (Technical Manager) విభాగంలో 07 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 19, 2021 వరకు అవకాశం ఉంది. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ (Skill test) అనంతరం ఇంటర్వ్యూ (Interview) ద్వారా ఉంటుంది. ఎంపికైన టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.9300-రూ.34800 జీతం అందిస్తారు. అలాగే టెక్నికల్ మేనేజర్‌కు జీతం రూ.15600- రూ.39100 వ‌ర‌కు అందిస్తారు.  దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్ లైన్ లోనే ఉంటుంది. నోటిఫికేషన్ అప్లికేషన్ విధానం సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ http://ignou.ac.in/ లోని జాబ్స్ విభాగాన్ని సందర్శించాలి.

అర్హతలు.. ఖాళీల వివరాలు
పోస్టు పేరుఅర్హతలుఖాళీలు
టెక్నికల్ అసిస్టెంట్కంప్యూర్ సైన్స్/ఐటీలో 55 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంసీఏ/బీటెక్/బీఈ/ఎంఎస్ఈ పూర్తి చేసి ఉండాలి. పరిశ్రమలు/పీఎస్‌యూ/జీఓఐ ప్రాజెక్ట్‌లు లేదా ప్రైవేట్‌లో కనీసం 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.05
టెక్నికల్ మేనేజర్కంప్యూర్ సైన్స్/ఐటీలో 55 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంసీఏ/బీటెక్/బీఈ/ఎంఎస్ఏ పూర్తి చేసి ఉండాలి. లేదా బీసీఏ/ బీఎస్సీ(మల్టీమీడియా)/ B.Voc (మల్టీమీడియా)/ బీఏ చేసి ఉండాలి. పరిశ్రమలు/పీఎస్‌యూ/జీఓఐ ప్రాజెక్ట్‌లు లేదా ప్రైవేట్‌ సెక్టార్లో కనీసం 4 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.02

ఎంపిక విధానం..

Step 1 : ముందుగా అభ్యర్థికి రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ (Skill Test) నిర్వహిస్తారు.

Step 2 : అనంతరం సెలక్టయిన అభ్యర్థికి ఇంటర్వ్యూ (Interview) నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం..

Step 1: అభ్యర్థులు కేవలం ఆన్ లైన్ (Online) ద్వారానే ఎంపిక చేస్తారు.

Step 2: ముందుగా అభ్యర్థి అధికారిక వెబ్ సైట్ http://ignou.ac.in/ లోని జాబ్స్ పోర్టల్ కు వెళ్లాలి.



Step 3: అనంతరం నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)

Step 4: అనంతరం ఆన్ లైన్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి ( ఆన్ లైన్ అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి)

Step 5: దరఖాస్తు ఫాం తప్పులు లేకుండా నింపాలి.

Step 6: అప్లికేషన్ నింపిన తరువాత దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

Step 7: జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/మహిళలకు రూ.600 ఫీజు చెల్లించాలి.

Step 8: దరఖాస్తు పూర్తయిన తరువాత హార్డు కాపీ డౌన్లోడ్ చేసుకోవాలి.

Step 9:  దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 19, 2021 వరకు అవకాశం ఉంది

 

Daily Updates 19-10-2021
























Gemini Internet

Ananthapuramu | Kurnool | Cuddappah | Chittoor District Classifieds 19-10-2021

Gemini Internet








విద్యా ఉద్యోగ సమాచారం | Education and Jobs Info.







Gemini Internet

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...