Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

12, ఏప్రిల్ 2024, శుక్రవారం

ITI /Degree అర్హతతో సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో అవకాశాలు

సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో అవకాశాలు 

హైదరాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌ 96 జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ, ధృవపత్రాల పరిశీలనతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  


ఏ పోస్టులు.. ఎన్ని? 


సూపర్‌వైజర్‌ (టీవో-ప్రింటింగ్‌)-2


సూపర్‌వైజర్‌ (టెక్‌-కంట్రోల్‌)-5 బీ సూపర్‌వైజర్‌ (ఓఎల్‌)-1


జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌-12


జూనియర్‌ టెక్నీషియన్‌ (ప్రింటింగ్‌/ కంట్రోల్‌): 68


జూనియర్‌ టెక్నీషియన్‌ (ఫిట్టర్‌): 3


జూనియర్‌ టెక్నీషియన్‌ (వెల్డర్‌): 1


జూనియర్‌ టెక్నీషియన్‌ (ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌):3


ఫైర్‌మ్యాన్‌:1


ప్రింటింగ్‌/ కంట్రోల్, ఇంజినీరింగ్, రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. 


వయసు: సూపర్‌వైజర్‌/ సూపర్‌వైజర్‌ (టెక్నికల్‌ కంట్రోల్‌) పోస్టులకు 18-30 సంవత్సరాలు, జూనియర్‌ టెక్నీషియన్‌ (ప్రింటింగ్‌/ కంట్రోల్‌) జూనియర్‌ టెక్నీషియన్‌ - ఫిట్టర్‌/ వెల్డర్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ పోస్టులకు 18-25 ఏళ్లు, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 18-28 ఏళ్ల మధ్య ఉండాలి. 


గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10-15 ఏళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు గరిష్ఠ వయసు లేదు. 


దరఖాస్తు రుసుము: రూ.600. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.200.


1. జూనియర్‌ టెక్నీషియన్‌ (ప్రింటింగ్‌/కంట్రోల్‌) - 68: ప్రింటింగ్‌ ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ/ ఎస్‌సీవీటీ గుర్తింపు పొందిన ఫుల్‌టైమ్‌ ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి. లిథో ఆఫ్‌సెట్‌ మెషీన్‌ మైండర్‌/ లెటర్‌ ప్రెస్‌ మెషీన్‌ మైండర్‌/ ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌/ ప్లేట్‌మేకింగ్‌/ ఎలక్ట్రో ప్లేటింగ్‌/ ఫుల్‌టైమ్‌ ఐటీఐ ఇన్‌ ప్లేట్‌ మేకర్‌ కమ్‌ ఇంపోజిటర్‌/ హ్యాండ్‌ కంపోజింగ్‌ ఉండాలి. లేదా ప్రింటింగ్‌ టెక్నాలజీలో ఫుల్‌టైమ్‌ డిప్లొమా ఉండాలి.  


2. జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ - 12: 55 శాతం మార్కులతో డిగ్రీ పాసవ్వాలి. కంప్యూటర్‌పైన టైపింగ్‌ స్పీడ్‌ ఇంగ్లిష్‌లో నిమిషానికి 40 పదాలు/ హిందీలో 30 పదాలు.  


ఎంపిక: జూనియర్‌ టెక్నీషియన్‌ (ప్రింటింగ్‌/ కంట్రోల్‌/ ఫిట్టర్‌/ వెల్డర్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌), ఫైర్‌మెన్‌ పోస్టులకు..


ప్రశ్న పత్రంలో పార్ట్‌-ఎ, బి ఉంటాయి. 120 ప్రశ్నలకు, 150 మార్కులు. వ్యవధి 120 నిమిషాలు. 


పార్ట్‌-ఎలో: జనరల్‌ అవేర్‌నెస్‌ 15 ప్రశ్నలు - 15 మార్కులు, అరిథ్‌మెటిక్‌ 15 ప్రశ్నలు - 15 మార్కులు, బేసిక్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ స్కిల్స్‌ - 15 ప్రశ్నలు - 15 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 15 ప్రశ్నలు - 15 మార్కులు. 


పార్ట్‌-బిలో: టెక్నికల్‌ సబ్జెక్ట్‌ (విద్యార్హతలకు సంబంధించిన) 60 ప్రశ్నలకు 90 మార్కులు. 


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.04.2024


వెబ్‌సైట్‌: https://spphyderabad.spmcil.com/en/

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...