Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

2, నవంబర్ 2023, గురువారం

అనంతపురం జిల్లాలోని నిరుద్యోగులకు సువర్ణ అవకాశం కలదు. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వారికి అనంతపురం నగరంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. వారి అర్హతను బట్టి ఉద్యోగాలు పొందవచ్చు.

అనంతపురం జిల్లాలోని నిరుద్యోగులకు సువర్ణ అవకాశం కలదు. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వారికి అనంతపురం నగరంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. వారి అర్హతను బట్టి ఉద్యోగాలు పొందవచ్చు. వివిధ కంపెనీలలో ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలోనే జాబ్ మేళాను నిర్వహించనున్నారు.

నవంబర్ 03, 2023 ఉదయం 9 గంటలకు APSSDC డిస్టిక్ ఆఫీస్ అనంతపురం నందు జాబ్ మేళా నిర్వహిస్తారు. ఇందులో ప్రముఖ సంస్థలు మొబైల్స్ మరియు టీం లెస్ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సంవత్సరంలో క్యాషియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మరియు సేల్స్ అసోసియేట్స్ మరియు డి మార్ట్, స్విగ్గి, విభాగాలలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. వీటి కోసం పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఆపై చదువు వారికి అర్హతగా నిర్ణయించారు.

వీటిలో ఉద్యోగం పొందిన నిరుద్యోగులకు అనంతపురం హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలలో ఉద్యోగం చేయవలసి ఉంటుంది. మరియు అర్హత సాధించిన వారికి 12 వేల రూపాయల నుంచి 15 వేల రూపాయల వరకు నెల జీతం అందిస్తారు.పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పిస్తారు. ఈ కంపెనీలలో నూట పది ఉద్యోగాల వరకు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం నిరుద్యోగ మహిళలు పురుషులు పాల్గొనవచ్చు. వీటిలో పాల్గొనే వారి వయసును 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలని అర్హతగా నిర్ణయించారు. మరింత సమాచారం కోసం APSSDCవెబ్సైట్ను సంప్రదించవచ్చు.

NFL: ఎన్‌ఎఫ్‌ఎల్‌లో 74 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్- దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్‌ యూనిట్లు/ కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

NFL: ఎన్‌ఎఫ్‌ఎల్‌లో 74 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 

నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్- దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్‌ యూనిట్లు/ కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

ఖాళీల వివరాలు:

1. మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్): 60 పోస్టులు

2. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎఫ్‌&ఎ): 10 పోస్టులు

3. మేనేజ్‌మెంట్ ట్రైనీ (లా): 04 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 74.

అర్హత: పోస్టును అనుసరించి ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీడీఎం, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ, ఎల్‌ఎల్‌బీ, బీఎల్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.40000 - రూ.140000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01/12/2023.

దరఖాస్తు సవరణ తేదీలు: 03, 04/12/2023.

మరింత సమాచారం... మీ కోసం!

‣ బీటెక్‌తో ఆర్మీలో ఉద్యోగాలు

‣ నాలుగేళ్ల కోర్సు.. నైపుణ్యాలతో మెరుగు!

‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Important Links

Posted Date: 02-11-2023

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Joint CSIR-UGC NET: జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2023

Joint CSIR-UGC NET: జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2023 

సైన్స్‌ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించే.. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌) డిసెంబర్‌-2023కు నోటిఫికేషన్‌ విడుదలైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహించనుంది. సైన్స్‌ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తోపాటు లెక్చరర్‌షిప్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హతల కోసం నిర్వహించే పరీక్ష- సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని రిసెర్చ్‌ సెంటర్లలో, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్‌షిప్‌కు అర్హత పొందితే విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఎంపికకావచ్చు.

పరీక్ష వివరాలు...

జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2023 

సబ్జెక్టు వివరాలు: పరీక్షను అయిదు సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. 

1. కెమికల్‌ సైన్సెస్ 

2. ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌

3. లైఫ్‌ సైన్సెస్

4. మ్యాథమేటికల్‌ సైన్సెస్

5. ఫిజికల్‌ సైన్సెస్‌

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ తత్సమాన ఉత్తీర్ణులు/ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌- ఎంఎస్‌/ బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ/ ఎంబీబీఎస్‌  ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ(ఎన్‌సీఎల్‌), ఎస్సీ, ఎస్టీ, థర్డ్‌జెండర్‌, దివ్యాంగ అభ్యర్థులు అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు పొందాలి. 

వయసు: జేఆర్‌ఎఫ్‌కు అర్హతకు సంబంధించి జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 01.07.2023 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ(నాన్‌ క్రిమిలేయర్‌)లకు మూడేళ్ల గరిష్ఠ వయోసడలింపు లభిస్తుంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/ లెక్చరర్‌షిప్‌కు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి నిబంధన లేదు.

పరీక్ష విధానం: పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల పద్ధతిలో పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్న పత్రంలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. 

దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.1100, జనరల్ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ(ఎన్‌సీఎల్‌) రూ.550, ఎస్సీ/ఎస్టీలకు రూ.275, థర్డ్ జెండర్ రూ.275, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు...

ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.11.2023.

దరఖాస్తు సవరణ తేదీలు: 02.12.2023 నుంచి 04.12.2023 వరకు.

పరీక్ష తేదీలు: 26, 27 & 28-12-2023.

Important Links

Posted Date: 02-11-2023

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

JEE మెయిన్ 2024: జైంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) - 2024 జైంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్-2024 తొలి విడత పరీక్షలను జనవరి 24వ తేదీ నుంచి, చివరి విడతను ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) ప్రకటించింది. జనవరి పరీక్షకు సంబంధించిన దరఖాస్తులను నవంబర్ 30వ తేదీ రాత్రి 9 గంటల వరకు సమర్పించవచ్చు. ఈ మేరకు ఎన్టీఏ నోటిఫికేషన్ జారీ చేసింది.

JEE మెయిన్ 2024: జైంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) - 2024 

జైంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్-2024 తొలి విడత పరీక్షలను జనవరి 24వ తేదీ నుంచి, చివరి విడతను ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) ప్రకటించింది. జనవరి పరీక్షకు సంబంధించిన దరఖాస్తులను నవంబర్ 30వ తేదీ రాత్రి 9 గంటల వరకు సమర్పించవచ్చు. ఈ మేరకు ఎన్టీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. 

ప్రకటన వివరాలు:

జైంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) - 2024

అర్హత: అభ్యర్థులకు వయోపరిమితి లేదు. 2022, 2023లో 12వ తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా 2024లో వయస్సుతో సంబంధం లేకుండా 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ (మెయిన్) - 2024 పరీక్షకు హాజరు కావచ్చు.

* తొలి విడతను వచ్చే జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు, చివరి విడత ఏప్రిల్‌ 1 నుంచి 15వ తేదీ వరకు జరుపుకుంటామని ఎన్‌టీఏ తేదీ. మొదటి ఒకట్రెండు రోజులు బీఆర్క్‌, బీ-ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పేపర్‌-2, మిగిలిన రోజుల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి పేపర్‌-1 పరీక్ష జరుగుతుంది. విద్యార్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను జనవరి రెండో వారంలో చేర్చారు.

* హాల్‌టికెట్లను జనవరి మూడో వారంలో వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఏప్రిల్‌లో జరిగే చివరి విడతకు ఫిబ్రవరి 2 నుంచి మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు..

దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీటెక్‌ సీట్లను జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో చేరాలంటే జేఈ అడ్వాన్స్‌డ్ రాయాలి. మెయిన్‌లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది.

ఇంటర్ మార్కుల నిబంధన

గతంలో కనీస మార్కులతో ఇంటర్‌లో ఉత్తీర్ణులైతే చాలు ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశం పొందేలా వెసులుబాటు కల్పించారు. ఈసారి మళ్లీ మార్కుల నిబంధన విధించారు. జేఈఈ మెయిన్‌లో ఎంత ర్యాంకు వచ్చినా ఇంటర్‌లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 65 శాతం, మిగిలిన వారికి 75 మార్కులు తప్పనిసరిగా రావాలని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు

తెలంగాణ: హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.

ఏపీ: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, పాపం పారే, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి , తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ముఖ్యాంశాలివీ..

* పరీక్షలను తెలుగు, ఆంగ్లం సహా మొత్తం 13 భాషల్లో నిర్వహించారు. ఇతర భాషల్లో హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, మలయాళం, తమిళం, ఒడియా, పంజాబీ, ఉర్దూ ఉన్నాయి. ప్రశ్నపత్రాన్ని ఆంగ్లంతోపాటు అభ్యర్థులు కోరుకున్న ప్రాంతీయ భాషలోనూ ఇస్తారు. పేపర్‌-1 300 మార్కులకు, పేపర్‌-2 400 మార్కులకు ఉంటాయి.

* పరీక్షలు కంప్యూటర్ ఆధారంగా సాగుతాయి. బీఆర్క్ విద్యార్థులకు ఆఫ్‌లైన్ విధానంలో డ్రాయింగ్ పరీక్ష కూడా ఉంటుంది.

* పరీక్ష రెండు షిప్టుల్లో జరుగుతుంది. తొలి షిఫ్టు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో షిఫ్టు సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుంది.

* ప్రశ్నపత్రాల్లో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-బీలో 10 ప్రశ్నల్లో అయిదుకు సమాధానాలు గుర్తించాలి. రెండు సెక్షన్లలోనూ తప్పు సమాధానాలకు మైనస్‌ మార్కులుంటాయి.

* దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులు లేదా తమ తల్లిదండ్రులకు సంబంధించిన మొబైల్ నంబర్‌, ఈ-మెయిల్‌ చిరునామాను అందించండి.

* ఏమైనా సమస్యలు ఉంటే 011 40759000 నంబరుకు ఫోన్ చేయవచ్చు. 

ముఖ్య తేదీలు:

సెషన్-1: జేఈఈ (మెయిన్) - జనవరి 2024:

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 01-11-2023 నుంచి 30-11-2023 వరకు.

పరీక్ష తేదీలు: 2024, జనవరి నుండి ఫిబ్రవరి 1 వరకు.

పరీక్ష కేంద్రాల ప్రకటన: 2024, జనవరి రెండో వారం.

ఫలితాల వెల్లడి: 12.02.2024.

సెషన్-2: జేఈఈ (మెయిన్) - ఏప్రిల్ 2024:

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 02-02-2024 నుంచి 02-03-2024 వరకు.

పరీక్ష తేదీలు: 2024, ఏప్రిల్ 1 నుంచి 14 వరకు.

పరీక్ష కేంద్రాల ప్రకటన: 2024, మార్చి మూడో వారం.

ఫలితాల వెల్లడి: 25.04.2024.

ముఖ్యమైన లింకులు

పోస్ట్ చేసిన తేదీ: 02-11-2023

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Current Affairs - 02/11/2023 (Telugu / English)

Current Affairs - 02/11/2023
                (Telugu / English)

        
1. జాతీయ ఐక్యతా దినోత్సవం రోజున "మేరా యువ భారత్ సంగతన్"ని ఎవరు ప్రారంభించారు?

 జ:- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

 2. విమాన ఇంజిన్ విడిభాగాలను తయారు చేసేందుకు సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో ఏ భారతీయ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది?

 జ:- HAL.

 3. భారతదేశంలో ఐఫోన్‌ను ఏ కంపెనీ తయారు చేస్తుంది?

 జ:- టాటా గ్రూప్ ద్వారా.

 4. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి రాబోయే 5 సంవత్సరాలలో ప్రతిరోజూ 2 కొత్త పాఠశాలలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?

 జ:- అస్సాం ముఖ్యమంత్రి.

 5. భారతదేశం అంతటా 31 అక్టోబర్ 2023న ఏ రోజును జరుపుకుంటారు?

 జ:- జాతీయ ఐక్యతా దినోత్సవం.

 6. CCI (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) ఎంత మంది సభ్యుల ICN (ఇంటర్నేషనల్ కాంపిటీషన్ నెట్‌వర్క్)లో సభ్యుడిగా మారింది?

 జ:- 18-సభ్యులు.

 7. జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజనను ఏ రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వం ఆవిష్కరించింది?

 జ:- ఢిల్లీ.

 8. 15వ గిరిజన యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం ఏ నగరంలో ప్రారంభించబడింది?

 జ:- ముంబైలో.

 9. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహ ఆధారిత గిగాబిట్ బ్రాడ్‌బ్యాండ్ సేవను ప్రారంభించిన సంస్థ ఏది?

 జ:- జియో.

 10. పారా ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది?

 జ:- 111 పతకాలు.

 11. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలోని మెహసానా జిల్లాలో రూ. 5,900 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు?

 జ:- గుజరాత్ రాష్ట్రం.

 12. భారతదేశంలో జరగనున్న ఆర్థిక వాణిజ్య ప్రతినిధుల సదస్సులో ఏ దేశ మాజీ రక్షణ మంత్రి పీటర్ డటన్ పాల్గొంటారు?

 జ:- ఆస్ట్రేలియా.

 13. నితిన్ గడ్కరీ జీ 2024లో రూ. 20 వేల కోట్ల విలువైన రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులను ఏ రాష్ట్రంలో ప్రకటించారు?

 జ:- మిజోరంలో.

 14. హర్యానా, పంజాబ్ మరియు జాతీయ రాజధాని ప్రాంతంలో ఈ సంవత్సరం పొట్ట దహనం సంభవం ఎంత శాతం తగ్గింది?

 జ:- 50 శాతం.

 15. మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ (MFN) 13వ ఎడిషన్‌లో మహిళల స్ట్రావెయిట్ విభాగంలో ఏ రాష్ట్రానికి చెందిన సోనమ్ జోంబా టైటిల్ గెలుచుకుంది?

 జ:- అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం.

1. Who has launched "Mera Yuva Bharat Sangathan" on National Unity Day?

Ans:- Prime Minister Narendra Modi

2. Which Indian company has signed an agreement with Safran Aircraft to manufacture aircraft engine parts?

Ans:- HAL.

3. Which company will manufacture iPhone in India?

Ans:- By Tata Group.

4. The Chief Minister of which state has set a target of building 2 new schools every day for the next 5 years?

Ans:- Chief Minister of Assam.

5. Which day is celebrated all over India on 31 October 2023?

Ans:- National Unity Day.

6. CCI (Competition Commission of India) has become a member of how many member ICN (International Competition Network)?

Ans:- 18-member.

7. Which state/union territory government has unveiled the Jai Bhim Mukhyamantri Pratibha Vikas Yojana?

Ans:- Delhi.

8. In which city the 15th Tribal Youth Exchange Program has been inaugurated?

Ans:- In Mumbai.

9. Which company has launched India's first Satellite-Based Gigabit Broadband Service?

Ans:- Jio.

10. How many medals has India won in the Para Asian Games 2023?

Ans:- 111 medals.

11. Prime Minister Narendra Modi has inaugurated and laid the foundation stone of several development projects worth Rs 5,900 crore in Mehsana district of which state?

Ans:- Of Gujarat state.

12. Which country's former Defense Minister Peter Dutton will participate in the Economic Trade Delegation Summit to be held in India?

Ans:- Australia.

13. In which state has Nitin Gadkari ji announced road construction projects worth Rs 20 thousand crores to start in 2024?

Ans:- In Mizoram.

14. By how much percent has the incidence of stubble burning decreased this year in Haryana, Punjab and National Capital Region?

Ans:- By 50 percent.

15. Which state's Sonam Zomba has won the title in the women's strawweight category in the 13th edition of Matrix Fight Night (MFN)?

Ans:- Of Arunachal Pradesh state.‌‌
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

6,329 Teaching & Non-Teaching Posts: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌ కొలువులు.. రాత పరీక్షలో రాణించేలా ప్రిపేర్ అవ్వాలంటే ఇలా చేయండి

ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌ కొలువు కోరుకునే వారికి చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది! జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని..ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో.. టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా టీచింగ్, నాన్‌–టీచింగ్‌ విభాగాల్లో మొత్తం 6,329 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. టీచింగ్‌ విభాగంలో 5,660 టీజీటీ పోస్టులున్నాయి. ఈ నేపథ్యంలో.. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ప్రత్యేకత, భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం తదితర వివరాలు..


  • టీచింగ్,నాన్‌–టీచింగ్‌ విభాగాల్లో 6,329 కొలువులు
  • టీజీటీ హోదాలో మొత్తం 5,660 పోస్ట్‌లు
  • కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నోటిఫికేషన్‌
  • రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా నియామకాలు

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన విద్యా సంస్థలు.. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌. ప్రస్తుతం జాతీయ స్థాయిలో మొత్తం 740 పాఠశాలలు ఉండగా.. తెలుగు రాష్ట్రాలైన ఏపీలో 28, తెలంగాణలో 23 స్కూల్స్‌ ఉన్నాయి. వీటిలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు.. పూర్తిగా గురుకుల విధానంలో విద్యాబోధన సాగుతోంది. 

మొత్తం 6,329 పోస్ట్‌లు

తాజా నియామక ప్రక్రియ ద్వారా టీచింగ్, నాన్‌–టీచింగ్‌ విభాగాల్లో మొత్తం 6,329 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. టీచింగ్‌ విభాగంలో ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ) 5,660 పోస్ట్‌లు, నాన్‌ టీచింగ్‌ పోస్ట్‌ల విభాగంలో 669 హాస్టల్‌ వార్డెన్‌ పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపడతారు.

వేతనాలు

  • టీజీటీ(తృతీయ భాష) వేతన శ్రేణి–రూ.44,900–రూ.1,42,400. 
  • టీజీటీ(ఇతర విభాగాలు) వేతన శ్రేణి–రూ.35,400–రూ.1,12,400. 
  • హాస్టల్‌ వార్డెన్స్‌ వేతన శ్రేణి రూ.29,200–రూ,92,300.

అర్హతలు

  • అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకుంటున్న సబ్జెక్ట్‌తో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత సబ్జెక్ట్‌ మెథడాలజీలో బీఈడీ పాసై ఉండాలి. 
  • థర్డ్‌ లాంగ్వేజ్‌ పోస్ట్‌ల అభ్యర్థులు మూడేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీలో సదరు భాషను ఎలక్టివ్‌ సబ్జెక్ట్‌గా మూడేళ్ల పాటు చదివుండాలి. –సీటెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
  • ఎన్‌సీటీఈ నిర్వహించే నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సు పూర్తి చేసుకున్న వారికి బీఈడీ అర్హత నిబంధన అవసరం ఉండదు.
  • మ్యూజిక్‌ టీచర్‌ పోస్ట్‌ల అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మ్యూజిక్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
  • ఆర్ట్‌ టీచర్‌: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫైన్‌ ఆర్ట్స్‌/క్రాఫ్ట్‌లో ఉత్తీర్ణత లేదా రీజనల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ నుంచి ఫైన్‌ ఆర్ట్స్‌లో బీఈడీ పాసవ్వాలి.
  • టీజీటీ–పీఈటీ: బీపీఈడీ ఉత్తీర్ణత ఉండాలి. 
  • లైబ్రేరియన్‌: ర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌ ఉత్తీర్ణులవ్వా­లి. లేదా బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతగా లైబ్రరీ సైన్స్‌లో ఏడాది వ్యవధిలోని డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
  • హాస్టల్‌ వార్డెన్‌: బ్యాచిలర్‌ డిగ్రీ లేదా ఎస్‌సీటీఈ నిర్వహించే నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సు ఉత్తీర్ణులవ్వాలి.

వయసు

  • అన్ని పోస్ట్‌లకు 18.08.2023 నాటికి వయసు 18–35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ

ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో పోస్ట్‌ల భర్తీకి జాతీయ స్థాయిలో ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ ఎగ్జామ్‌(ఈఎస్‌ఈఈ)ను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా తుది జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు.

120 మార్కులకు టీజీటీ పరీక్ష

టీజీటీ పోస్ట్‌లకు సంబంధించి రాత పరీక్షను నాలుగు విభాగాలుగా మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్‌–1 జనరల్‌ అవేర్‌నెస్‌ 10 ప్రశ్నలు–10 మార్కులు; పార్ట్‌–2 రీజనింగ్‌ ఎబిలిటీ 10 ప్రశ్నలు–10 మార్కులు; పార్ట్‌–3 ఐసీటీ నాలెడ్జ్‌ 10 ప్రశ్నలు–10 మార్కులు; పార్ట్‌–4 టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ 10 ప్రశ్నలు–10 మార్కులు; పార్ట్‌–5 సంబంధిత సబ్జెక్ట్‌ 80 ప్రశ్నలు–80మార్కులు.. ఇలా మొత్తం 120 ప్రశ్నలు–120 మార్కులకు పరీక్ష జరుగుతుంది. టీజీటీ పరీక్ష వ్యవధి మూడు గంటలు. 

హాస్టల్‌ వార్డెన్‌ రాత పరీక్ష

ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో భర్తీ చేయనున్న హాస్టల్‌ వార్డెన్‌ పోస్ట్‌లకు పత్యేక రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆరు విభాగాల్లో 120 మార్కులకు ఉంటుంది. పార్ట్‌–1 జనరల్‌ అవేర్‌నెస్‌ 10 ప్రశ్నలు–10 మార్కులు; పార్ట్‌–2 రీజనింగ్‌ ఎబిలిటీ 20 ప్రశ్నలు–20 మార్కులు; పార్ట్‌–3 ఐసీటీ నాలెడ్జ్‌ 20 ప్రశ్నలు–20 మార్కులు; పార్ట్‌–4 పోస్కో, బాలల భద్రతకు సంబంధించిన చట్టాలు 10 ప్రశ్నలు–10 మార్కులు; పార్ట్‌–5 అడ్మినిస్ట్రేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 30 ప్రశ్నలు–30 మార్కులు; పార్ట్‌–6 లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ(హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాష) 30 ప్రశ్నలు–30 మార్కులు.. ఇలా మొత్తం 120 ప్రశ్నలు–120 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు.

లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌

  • టీజీటీ, హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులకు అయిదు విభాగాల్లో పరీక్షతోపాటు.. ప్రత్యేకంగా లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ను 30 మార్కులకు నిర్వహిస్తారు. అ­భ్యర్థులు తాము పరీక్షకు హాజరవుతున్న మాధ్యమానికి సంబంధించిన భాషలో ఈ టెస్ట్‌ ఉంటుంది. ఇందులో జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి 10 ప్రశ్నలు, హిందీ నుంచి 10 ప్రశ్నలు, ఎంచుకున్న లాంగ్వేజ్‌ నుంచి 10 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. 
  • లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌లో భాగంగా మొత్తం 18 భాషల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశముంది. బెంగాలీ, డోంగ్రి, గారో, గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ, ఖాసీ, మళయాళం, మణిపురి, మరాఠి, మిజో, నేపాలి, ఒడియా, సంథాలి, తెలుగు, ఉర్దూ బాషల్లో ఏదో ఒక భాషను రీజనల్‌ లాంగ్వేజ్‌గా ఎంచుకోవచ్చు.
  • టీజీటీ పోస్ట్‌లకు సంబంధించి లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ను కేవలం అర్హత విభాగంగానే పేర్కొన్నారు. ఇందులో ఇంగ్లిష్, హిందీ, రీజనల్‌ లాంగ్వేజ్‌ మూడు భాషల్లోనూ 40 శాతం మార్కులు చొప్పున పొందాల్సి ఉంటుంది. అప్పుడే మిగతా విభాగాలను మూల్యాంకన చేస్తారు.

నెగెటివ్‌ మార్కులు

టీజీటీతోపాటు హాస్టల్‌ వార్డెన్‌.. ఈ రెండు పరీక్షలు ఓఎంఆర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా పెన్‌–పేపర్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు మార్కు తగ్గిస్తారు. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 18.08.2023
  • ఈఎస్‌ఈఈ పరీక్ష తేదీ: నవంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది.
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్‌.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://emrs.tribal.gov.in/

రాత పరీక్షలో రాణించేలా

జనరల్‌ అవేర్‌నెస్‌

ఈ విభాగంలో మంచి మార్కుల కోసం స్టాక్‌ జీకేతో పాటు కరెంట్‌ అఫైర్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగిన జాతీయ–అంతర్జాతీయ ఒప్పందాలు, కేంద్ర ప్రభుత్వ తాజా సంస్కరణలు/విధానాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి.

రీజనింగ్‌ ఎబిలిటీ

పజిల్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, డేటా సఫిషియన్సీ, వెర్బల్‌ రీజనింగ్, బ్లడ్‌ రిలేషన్స్, సీక్వెన్సెస్, సిరీస్, డైరెక్షన్స్, అసెర్షన్‌ అండ్‌ రీజన్, వెన్‌ డయాగ్రమ్‌లను ప్రాక్టీస్‌ చేయాలి.

టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌

ఈ విభాగం కోసం టీచింగ్‌ విధానాలు, భావన లు,లక్ష్యాలు, ప్రాథమిక అవసరాలు, అభ్యాసకు ల ధర్మాలు, టీచింగ్‌ను ప్రభావితం చేసే అంశాలు, టీచింగ్‌ మెథడ్స్, టీచింగ్‌ ఎయిడ్స్, మూల్యాంకన విధానాలపై అవగాహన పెంచుకోవాలి.

ఐసీటీ నాలెడ్జ్‌

ఈ విభాగం కోసం కంప్యూటర్‌ సిస్టమ్‌ ప్రాథమిక భావనలు, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ బేసిక్స్, ఎంఎస్‌ ఆఫీస్, కీ–బోర్డ్‌ షాట్‌ కర్ట్స్, కంప్యూటర్‌కు సంబంధించిన పదజాలం, అబ్రివేషన్లు, కంప్యూటర్‌ నెటవర్క్స్, సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్నెట్‌ సంబంధిత అంశాలపై దృష్టి పెట్టాలి.

సబ్జెక్ట్‌ మెథడాలజీ

పార్ట్‌–5గా ఉండే డొమైన్‌ నాలెడ్జ్‌లో.. సబ్జెక్ట్‌ మెథడాలజీ నుంచి 65 ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో తాము చదివిన సబ్జెక్ట్‌లపై అవగాహన పెంచుకోవాలి. ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తే..ఏ కోణంలో ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.

పెడగాజీపైనా

పార్ట్‌–5లోనే యాక్టివిటీ బేస్డ్‌ పెడగాజీ, కేస్‌ ఆధారిత ప్రశ్నలు 10 అడుగుతారు. అభ్యర్థులు.. విద్యా దృక్పథాలు, పెడగాజీ, చైల్డ్‌ డెవలప్‌మెంట్, శిశు వికాసం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. పెడగాజికి సంబంధించి సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం–నాయకత్వం–గైడెన్స్‌–కౌన్సెలింగ్‌ గురించి అధ్యయనం చేయాలి. ఎడ్యుకేషన్‌కు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన పొందాలి. ముఖ్యంగా నూతన విద్యా విధానం–2020పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 

లైబ్రేరియన్‌ రాత పరీక్ష

లైబ్రేరియన్‌ పోస్ట్‌లకు నిర్వహించే రాత పరీక్షలో రాణించేందుకు.. లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ ఫౌండేషన్, నాలెడ్జ్‌ ఆర్గనైజేషన్, ఇన్ఫర్మేషన్‌ ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బేసిక్స్, మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ లైబ్రరీస్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్స్‌/ ఇన్‌స్టిట్యూషన్స్, ఇన్ఫర్మేషన్‌ సోర్సెస్, సర్వీసెస్, లైబ్రరీ యూజర్స్‌కు సంబంధించి అన్ని అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

November Month Exams: నవంబర్‌లో జరిగే ఉద్యోగ రాత పరీక్షలివే.. * పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

November Month Exams: నవంబర్‌లో జరిగే ఉద్యోగ రాత పరీక్షలివే..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

ఈనాడు ప్రతిభ డెస్క్‌: టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ తదితర నియామక సంస్థలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అర్హులైన అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. పలు ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి నియామక పరీక్షలు నవంబర్‌ నెలలో జరుగనున్నాయి. ఆ వివరాలు ఇవిగో...
నవంబర్‌లో జరుగనున్న పరీక్షల తేదీల వివరాలు..

నియామక పరీక్ష                తేదీ
ఎస్‌బీఐ పీవో ప్రిలిమ్స్‌                 నవంబర్‌ 1-6
ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ టైర్‌-2             నవంబర్‌ 2
ఎన్‌ఐసీ సైంటిస్ట్‌-బి                 నవంబర్‌ 4
ఐబీపీఎస్‌ పీవో మెయిన్స్‌                 నవంబర్‌ 5
టీఎస్‌పీఎస్‌సీ ఫిజికల్‌ డైరెక్టర్‌                 నవంబర్‌ 14
దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎగ్జామ్‌             నవంబర్‌ 14 - డిసెంబర్‌ 3
బార్క్‌ స్టైపెండరీ ట్రైనీ                 నవంబర్‌ 18 - 24


- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌(నిమ్‌హాన్స్‌).. రెగ్యులర్‌ ప్రాతిపదికన నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. Nursing Officer Jobs: నిమ్‌హాన్స్, బెంగళూరులో 161 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

మొత్తం పోస్టుల సంఖ్య: 161
అర్హత: బీఎస్సీ(ఆనర్స్‌) నర్సింగ్‌/బీఎస్సీ నర్సింగ్‌ లేదా బీఎస్సీ(పోస్ట్‌ సర్టిఫికేట్‌)/పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్‌: నెలకు రూ.9300 నుంచి రూ.34,800.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు, రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 18.11.2023.

వెబ్‌సైట్‌: https://nimhans.ac.in/

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Airport Authority of India AAI Recruitment 2023 Apply Online Junior Executive 496 Post | ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా AAI రిక్రూట్‌మెంట్ 2023 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ 496 పోస్ట్

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC అడ్వాట్ నం 05/2023 నోటిఫికేషన్ 2023ని జారీ చేసింది. ఈ AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్ ATC రిక్రూట్‌మెంట్ 2023లో ఆసక్తి ఉన్న అభ్యర్థులెవరైనా నవంబర్ 2023 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 30 నవంబర్ 2023. రిక్రూట్‌మెంట్ వివరాల కోసం, పే స్కేల్, వయోపరిమితి, ఎంపిక విధానం, ఉద్యోగ సమాచారం మరియు అన్ని ఇతర సమాచారం కోసం, ప్రకటనను చదివి, ఆపై దరఖాస్తు చేసుకోండి.

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)

ఎయిర్‌పోర్ట్ అథారిటీ AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ ATC రిక్రూట్‌మెంట్ 2023

AAI JE ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అడ్వాట్ నెం. 05/2023 : నోటిఫికేషన్ యొక్క సంక్షిప్త వివరాలు

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం: 01/11/2023
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 30/11/2023
  • పరీక్ష రుసుము చెల్లించండి చివరి తేదీ : 30/11/2023
  • పరీక్ష తేదీ : షెడ్యూల్ ప్రకారం
  • అడ్మిట్ కార్డ్ అందుబాటులో ఉంది : పరీక్షకు ముందు 

దరఖాస్తు రుసుము

  • జనరల్ / OBC / EWS : 1000/-
  • SC / ST : 0/-
  • అన్ని వర్గం స్త్రీలు : 0/-
  • డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పరీక్ష రుసుమును చెల్లించండి లేదా E చలాన్ ద్వారా ఆఫ్‌లైన్‌లో చెల్లించండి 

AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్ ATC రిక్రూట్‌మెంట్ 2023: 30/11/2023 నాటికి వయోపరిమితి

  • గరిష్ట వయస్సు: NA
  • గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు
  • AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్ ATC అడ్వాట్ నెం. 05/2023 రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ 2023 రిక్రూట్‌మెంట్ రూల్స్ ప్రకారం వయో సడలింపు అదనపు. 

పోస్ట్ పేరు

మొత్తం పోస్ట్

AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్ ATC అర్హత

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)

496

  • ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్‌తో సైన్స్ B.Scలో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఏదైనా బ్రాంచ్‌లో BE / B.Tech డిగ్రీ (ఫిజిక్స్ & మ్యాథమెటిక్స్ సెమిస్టర్‌లో ఏదైనా ఒక సబ్జెక్ట్‌గా) 

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి

ఇక్కడ నొక్కండి

నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేయండి

ఇక్కడ నొక్కండి

 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

APPSC: నెలాఖరులోగా గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లు * డిగ్రీ, జూనియర్‌ కళాశాలల లెక్చరర్లు, ఇతర పోస్టుల భర్తీకీ... * మొత్తం 1,603 పోస్టులు

APPSC: నెలాఖరులోగా గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లు

* డిగ్రీ, జూనియర్‌ కళాశాలల లెక్చరర్లు, ఇతర పోస్టుల భర్తీకీ... 

* మొత్తం 1,603 పోస్టులు

 


ఈనాడు, అమరావతి: ప్రభుత్వ శాఖల్లోని 1,603 ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లను ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. గ్రూపు-1 కింద 88, గ్రూపు-2 కింద 989 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బుధవారం (నవంబర్‌ 1) విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. గ్రూపు-1 కింద అదనంగా మరికొన్ని క్యారీ ఫార్వర్డ్‌ కేటగిరీ (నోటిఫికేషన్‌ జారీ చేసినప్పటికీ భర్తీ కానివి) పోస్టులు కలుస్తాయని పేర్కొంది. ‘గ్రూపు-1 పరీక్షలు, మూల్యాంకనానికి కొత్త విధానాన్ని రూపొందిస్తున్నాం. ఐఐటీ, హెచ్‌సీయూ, రిక్రూటింగ్‌ ఏజెన్సీలు, మేధావులు, రాష్ట్రంలోని ఆంధ్రా, నాగార్జున, శ్రీవేంకటేశ్వర, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాల సీనియర్‌ ప్రొఫెసర్లు, ఇతర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల నిపుణులు, నిరుద్యోగులతో చర్చించి... వారి సలహాలతో సిలబస్, పరీక్షల్లో సమూల మార్పులు తెస్తాం. గ్రూపు-1, గ్రూపు-2 తోపాటు డిగ్రీ, జూనియర్‌ కళాశాలల లెక్చరర్ల భర్తీ తదితర నోటిఫికేషన్లను ఈ నెలలోనే విడుదల చేస్తాం. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి డిసెంబరులో రాత పరీక్షలు ఉంటాయి’ అని కమిషన్‌ కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్‌ పేర్కొన్నారు. 

ఏ పోస్టులు ఎన్నంటే... 

డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టులు-267, పాలిటెక్నిక్‌ కళాశాలల అధ్యాపకులు-99, టీటీడీ డీఎల్, జేఎల్‌-78, జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు-47, డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌-38, ఇంగ్లిష్‌ రిపోర్టర్స్‌ (ఏపీ లెజిస్లేచర్‌ సర్వీస్‌)-10, గ్రంథపాలకులు (కళాశాల విద్య)-23, ఏపీఆర్‌ఈఐ సొసైటీ కింద 10 జేఎల్, 05 డీఎల్‌ పోస్టులు, ఫిషరీస్‌ డిపార్ట్‌మెంట్‌లో 4 డెవలప్‌మెంట్‌ ఆఫీసర్, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో 4 గ్రంథ పాలకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఇవే కాకుండా... భూగర్భ నీటిపారుదల శాఖ, జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ సర్వీసెస్, ఏపీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టరేట్‌ సర్వీస్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ సర్వీసెస్, ఏపీ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్, ఏపీ మున్సిపల్‌ ఎకౌంట్స్‌ సబ్‌ సర్వీసెస్‌లో జూనియర్‌ ఎకౌంట్‌ ఆఫీసర్‌ కేటగిరీ-2, సీనియర్‌ ఎకౌంటెంట్‌ కేటగిరీ-3, జూనియర్‌ ఎకౌంటెంట్‌ కేటగిరీ-4 కింద మరికొన్ని పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్లను ఈ నెలలోనే ఏపీపీఎస్సీ జారీ చేయనుంది. 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు ఒకవేళ కట్టమని అడిగితే కట్టకండి





- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రైనీలకు సెయిల్‌ స్వాగతం! స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌), బొకారో స్టీల్‌ ప్లాంట్‌ 85 అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశాయి. మెట్రిక్యులేషన్‌ పాసై.. అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రైనీలకు సెయిల్‌ స్వాగతం!

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌), బొకారో స్టీల్‌ ప్లాంట్‌ 85 అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశాయి.    మెట్రిక్యులేషన్‌ పాసై.. అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌), బొకారో స్టీల్‌ ప్లాంట్‌ 85 అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశాయి. మెట్రిక్యులేషన్‌ పాసై.. అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మొత్తం 85 పోస్టుల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 35, ఎస్సీలకు 10, ఎస్టీలకు 22, ఓబీసీలకు 10, ఈడబ్ల్యూఎస్‌లకు 8 కేటాయించారు. జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, డిపార్ట్‌మెంటల్‌, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.100. ఈ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

01.05.2023 నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో.. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఈఎస్‌ఎంలకు మూడేళ్లు, సెయిల్‌ ఉద్యోగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు మెడికల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. పురుష అభ్యర్థుల ఎత్తు 155 సెం.మీ., బరువు 45 కేజీలు ఉండాలి. ఛాతీ 75 సెం.మీ. ఉండి, గాలి పీల్చినప్పుడు 79 సెం.మీ. వరకూ పెరగాలి. మహిళా అభ్యర్థుల ఎత్తు 143 సెం.మీ. ఉండి, బరువు 35 కేజీలు ఉండాలి. అభ్యర్థులకు దృష్టి లోపాలు ఉండకూడదు. 

ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల శిక్షణ, ఏడాది ప్రొబేషన్‌ ఉంటుంది. మొదటి ఏడాది శిక్షణ సమయంలో నెలకు రూ.12,900 చెల్లిస్తారు. రెండో ఏడాది నెలకు రూ.15,000 చెల్లిస్తారు. శిక్షణ సమయంలో ఉద్యోగి, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం ఉంటుంది. కంపెనీ నిబంధనల ప్రకారం సెలవులు ఉంటాయి. శిక్షణ కాలం విజయవంతంగా పూర్తిచేసిన వారిని శాశ్వత ఉద్యోగులుగా నియమిస్తారు.

ఎంపిక: అర్హులైన అభ్యర్థులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించినవారిని స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఈ సమాచారాన్ని వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేస్తారు. స్కిల్‌/ట్రేడ్‌ టెస్ట్‌ అర్హత పరీక్ష మాత్రమే. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

సీబీటీ: దీంట్లో మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో మూడు సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఎ) జనరల్‌ నాలెడ్జ్‌ బి) లాజికల్‌ రీజనింగ్‌ సి) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీలో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ 1/4 మార్కు తగ్గిస్తారు. ఇండివిడ్యువల్‌ టెస్ట్‌పైనా, టోటల్‌ స్కోర్‌ మీద కటాఫ్‌లను రెండు దశల్లో అమలుచేస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఈ పరీక్ష పాసవ్వాలంటే.. అన్‌రిజర్వుడ్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 40 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. 

స్కిల్‌/ట్రేడ్‌ టెస్ట్‌: రాత పరీక్ష ప్రతిభ చూపిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో స్కిల్‌/ట్రేడ్‌ టెస్ట్‌కు ఎంపికచేస్తారు. ఈ టెస్ట్‌కు హాజరయ్యేందుకు అవసరమైన కాల్‌ లెటర్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచి.. ఆ సమాచారాన్ని అభ్యర్థుల ఈమెయిల్‌కు తెలియజేస్తారు. 

దరఖాస్తుల ప్రారంభం: 04.11.2023 నుంచి
దరఖాస్తుకు చివరి తేదీ: 25.11.2023
వెబ్‌సైట్‌:  http://www.sailcareers.com/


సన్నద్ధత ఇలా

  • పరీక్షకు నెల రోజుల ముందే సిలబస్‌లోని అన్ని అంశాలూ పూర్తిచేసేలా ప్రణాళిక వేసుకోవాలి.
  • జనరల్‌ నాలెడ్జ్‌, లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి మార్కెట్‌లో అందుబాటులో ఉండే పుస్తకాలను చదువుకోవచ్చు.
  • బ్యాంక్‌, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీల పాత ప్రశ్నపత్రాలను సాధించడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది.
  • నిర్ణీత సమయంలోనే ప్రశ్నపత్రాన్ని పూరించగలగాలి. మొదట్లో ఇది సాధ్యంకాకపోయినా సాధన చేసేకొద్దీ అలవాటు అవుతుంది.
  • ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో తెలుసుకుని వాటికి అదనపు సమయాన్ని కేటాయించాలి.
  • నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి.
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కరెన్సీ ముద్రణ సంస్థలో కొలువులు | మొత్తం 117 పోస్టుల్లో.. 1) సూపర్‌వైజర్‌ (టెక్నికల్‌ ఆపరేషన్‌-ప్రింటింగ్‌) - 02, 2) సూపర్‌వైజర్‌ (అఫీషియల్‌ లాంగ్వేజ్‌) - 01, 3) ఆర్టిస్ట్‌ (గ్రాఫిక్‌ డిజైనర్‌) -01, 4) సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌-01, 5) జూనియర్‌ టెక్నీషియన్‌ (ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫిట్టర్‌, ఎయిర్‌ కండిషనింగ్‌, ప్రింటింగ్‌/కంట్రోల్‌) -112 ఉన్నాయి.

కరెన్సీ ముద్రణ సంస్థలో కొలువులు

మహారాష్ట్ర నాసిక్‌లోని మినీరత్న కేటగిరీకి చెందిన కరెన్సీ నోట్ల ముద్రణ సంస్థ (కరెన్సీ నోట్‌ప్రెస్‌)... సూపర్‌వైజర్‌, ఆర్టిస్ట్‌, సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌.. మొదలైన 117 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మహారాష్ట్ర నాసిక్‌లోని మినీరత్న కేటగిరీకి చెందిన కరెన్సీ నోట్ల ముద్రణ సంస్థ (కరెన్సీ నోట్‌ప్రెస్‌)... సూపర్‌వైజర్‌, ఆర్టిస్ట్‌, సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌.. మొదలైన 117 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్షలో సాధించిన మార్కులతో నియామకాలు చేపడతారు.

మొత్తం 117 పోస్టుల్లో.. 1) సూపర్‌వైజర్‌ (టెక్నికల్‌ ఆపరేషన్‌-ప్రింటింగ్‌) - 02, 2) సూపర్‌వైజర్‌ (అఫీషియల్‌ లాంగ్వేజ్‌) - 01, 3) ఆర్టిస్ట్‌ (గ్రాఫిక్‌ డిజైనర్‌) -01, 4) సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌-01, 5) జూనియర్‌ టెక్నీషియన్‌ (ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫిట్టర్‌, ఎయిర్‌ కండిషనింగ్‌, ప్రింటింగ్‌/కంట్రోల్‌) -112 ఉన్నాయి.

1) సూపర్‌వైజర్‌ (టెక్నికల్‌ ఆపరేషన్‌-ప్రింటింగ్‌): ఇంజినీరింగ్‌ (ప్రింటింగ్‌) డిప్లొమా మొదటిశ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలి. లేదా బీటెక్‌/బీఈ/బీఎస్సీ ఇంజినీరింగ్‌ (ప్రింటింగ్‌) పాసవ్వాలి. అభ్యర్థుల వయసు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

2) సూపర్‌వైజర్‌ (అఫీషియల్‌ లాంగ్వేజ్‌): హిందీ లేదా ఇంగ్లిష్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పాసవ్వాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్‌ సబ్జెక్టుగా చదివుండాలి. హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి, ఇంగ్లిష్‌ నుంచి హిందీలోకి అనువదించడంలో ఏడాది అనుభవం ఉండాలి. సంస్కృత భాషా పరిజ్ఞానం లేదా ఏదైనా ఇతర భాష తెలిసి ఉండాలి. హిందీలో కంప్యూటర్‌పైన పనిచేయగలిగినవారికి ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థుల వయసు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

3) ఆర్టిస్ట్‌ (గ్రాఫిక్‌ డిజైన్‌): ఫైనార్ట్స్‌/విజువల్‌ ఆర్ట్స్‌/ఒకేషనల్‌ (గ్రాఫిక్స్‌) డిగ్రీ పాసవ్వాలి. గ్రాఫిక్‌ డిజైన్‌/కమర్షియల్‌ ఆర్ట్స్‌లో 55 శాతం మార్కులు పొందాలి.

4) సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌: 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, ఇంగ్లిష్‌/హిందీ స్టెనోగ్రఫీ పాసవ్వాలి. ఇంగ్లిష్‌/హిందీ టైపింగ్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. సెక్రటేరియల్‌ జాబ్‌ నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. అభ్యర్థుల వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ పరీక్షతోపాటు స్టెనోగ్రఫీ, టైపింగ్‌ టెస్ట్‌ కూడా ఉంటుంది.

5) జూనియర్‌ టెక్నీషియన్‌ (ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫిట్టర్‌, ఎయిర్‌ కండిషనింగ్‌, ప్రింటింగ్‌/కంట్రోల్‌): సంబంధిత ట్రేేడ్‌లో ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటి నుంచి ఫుల్‌టైమ్‌ ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి. వయసు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 

గుర్తుంచుకోవాల్సినవి

  • పరీక్షల తేదీ, ఇతర వివరాలకు సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు తరచూ వెబ్‌సైట్‌ను చూస్తుండాలి.
  • ప్రస్తుతం వాడుకలో ఉన్న మొబైల్‌ నంబర్‌, ఈమెయిల్‌ ఐడీలనే దరఖాస్తులో రాయాలి.
  • చివరితేదీ అయిన 18.11.2023 నాటికి తగిన విద్యార్హతలు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేయాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18.11.2023
  • ఆన్‌లైన్‌ పరీక్ష: జనవరి/ఫిబ్రవరి 2024

https://cnpnashik.spmcil.com

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ప్రభుత్వ ఉద్యోగాలు | అసోసియేట్‌ ప్రోగ్రాం మేనేజర్‌, ప్రోగ్రాం మేనేజర్‌లు | సీడ్యాక్‌లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌లు | ఎయిమ్స్‌ గోరఖ్‌పుర్‌లో ట్యూటర్‌, స్టాఫ్‌ నర్స్‌లు | ఎయిమ్స్‌ గోరఖ్‌పుర్‌లో ట్యూటర్‌, స్టాఫ్‌ నర్స్‌లు |

ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌- ఒప్పంద ప్రాతిపదికన 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసోసియేట్‌ ప్రోగ్రాం మేనేజర్‌, ప్రోగ్రాం మేనేజర్‌లు

ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌- ఒప్పంద ప్రాతిపదికన 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ప్రోగ్రాం మేనేజర్‌: 01  
  • అసోసియేట్‌ ప్రోగ్రాం మేనేజర్‌: 03
  • డేటా అనలిస్ట్‌: 01  
  • ప్రాజెక్టు అసోసియేట్‌(అకౌంట్స్‌): 01

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతోపాటు పని అనుభవం తప్పనిసరి.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 08-11-2023

వెబ్‌సైట్‌: https://thsti.res.in/en/Jobs


సీడ్యాక్‌లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌లు

బెంగళూరులోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడ్యాక్‌).. ఒప్పంద ప్రాతిపదికన 90 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంసీఏ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్షతో.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17-11-2023.

వెబ్‌సైట్‌ : www.cdac.in/


ఎయిమ్స్‌ గోరఖ్‌పుర్‌లో ట్యూటర్‌, స్టాఫ్‌ నర్స్‌లు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) గోరఖ్‌పుర్‌.. 42 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ట్యూటర్‌/ క్లినికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌- 15  
  • స్టాఫ్‌ నర్స్‌ గ్రేడ్‌-1- 57
  • మెడికల్‌ సోషల్‌ వర్క్‌- 1
  • అసిస్టెంట్‌ ఎన్‌ఎస్‌- 1
  • లైబ్రేరియన్‌ గ్రేడ్‌-2- 1
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌/ టెక్నీషియన్‌- 1
  • స్టోర్‌ కీపర్‌- 2
  • హాస్టల్‌ వార్డెన్‌- 2
  • పీఏ టు ప్రిన్సిపల్‌- 1
  • ల్యాబ్‌ టెక్నీషియన్‌- 8
  • స్టెనోగ్రాఫర్‌- 1
  • క్యాషియర్‌- 2
  • ల్యాబ్‌ అటెండెంట్‌ గ్రేడ్‌-2- 8
  • లైబ్రరీ అటెండెంట్‌ గ్రేడ్‌-2- 1
  • ఎల్‌డీసీ (లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌)- 1
  • హాస్పిటల్‌ అటెండెంట్‌ గ్రేడ్‌-ఖిఖిఖి (నర్సింగ్‌ ఆర్డర్లీ)- 40

అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1770. ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1416. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21-11-2023.

వెబ్‌సైట్‌: https://aiimsgorakhpur.edu.in/


వాక్‌-ఇన్స్‌

టెక్నికల్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ సంస్థలో...

చెన్నై తారామణిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌(ఎన్‌ఐటీటీటీఆర్‌).. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • రిసెర్చ్‌ అసిస్టెంట్‌: 01  
  • ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌: 01

అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, ఎంఫిల్‌తోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 06-11-2023
వేదిక: ఎన్‌ఐటీటీటీఆర్‌, తారామణి, చెన్నై.

వెబ్‌సైట్‌: https://www.nitttrc.ac.in/

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...