Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

23, జూన్ 2021, బుధవారం

టాటా మెమోరియల్‌ సెంటర్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021

 



భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన టాటా మెమోరియల్‌ సెంటర్‌(టీఎంసీ) ఆధ్వర్యంలోని టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌.. సీనియర్‌ రెసిడెంట్లు/ఫెలో/మెడికల్‌ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
మొత్తం పోస్టుల సంఖ్య: 64
విభాగాలు: బయో కెమిస్ట్రీ, ఆంకాలజీ, హెమటోపాథాలజీ, మెడికల్‌ ఆంకాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్, పాథాలజీ, మైక్రోబయాలజీ, రేడియేషన్‌ ఆంకాలజీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, ఎండీ/డీఎన్‌బీ/పీజీ, ఎండీఎస్, ఎంఎస్‌/ఎంసీహెచ్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం–ఆయా కేటగిరీని అనుసరించి 3 నుంచి 10ఏళ్ల వరకూ వయసులో సడలింపు లభిస్తుంది.
వేతనం: మెడికల్‌ ఆఫీసర్లకు నెలకు రూ.84,000; ఫెలోకు నెలకు రూ.89,000; సీనియర్‌ రెసిడెంట్లకు నెలకు రూ.1,01,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వూ్య ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://tmc.gov.in

ఏఎస్సీ సెంటర్‌(సౌత్‌)–2 ఏటీసీలో 100 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది: 12.07.2021



బెంగళూరులోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఏఎస్సీ సెంటర్‌ (సౌత్‌)–2.. ఏటీసీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 100
పోస్టుల వివరాలు: సివిల్‌ మోటార్‌ డ్రైవర్‌–42, క్లీనర్‌–40, కుక్‌–15, సివిలియన్‌ కేటరింగ్‌ ఇన్‌స్పెక్టర్‌–03.
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడులో ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్‌/డిప్లొమా అర్హత ఉండాలి. అనుభవం తప్పనిసరి.
వయసు: 18–25ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌/ఫిజికల్‌/ప్రాక్టికల్‌/టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. ఇందులో 25 మార్కులకు జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్, 50 మార్కులకు జన రల్‌ అవేర్‌నెస్, 50 మార్కులకు జనరల్‌ ఇంగ్లిష్, 25 మార్కులకు న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షా సమయం 2 గంటలు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ప్రిసైడింగ్‌ ఆఫీసర్, సివిలియన్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్, సీహెచ్‌క్యూ, ఏఎస్సీ సెంటర్‌(సౌత్‌)–ఏటీసీ, అగ్రాం,బెంగళూరు చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 12.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.indianarmy.nic.in/home

పోస్టల్‌ డిపార్ట్‌మెంట్, చెన్నైలో పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది: 25.06.2021

 



భారత ప్రభుత్వానికి చెందిన పోస్టల్‌ డిపార్ట్‌మెంట్,చెన్నైలోని మెయిల్‌ మోటార్‌ సర్వీస్‌ సీనియర్‌ మేనేజర్‌ కార్యాలయం.. స్టాఫ్‌ కారు డ్రైవర్‌(ఆర్డినరీ గ్రేడ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
మొత్తం పోస్టుల సంఖ్య: 25
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/బోర్డ్‌ నుంచి పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. మూడేళ్ల లైట్‌ అండ్‌ హెవీ మోటార్‌ వెహికల్స్‌ వాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు మోటార్‌ మెకానిజం తెలిసి ఉండాలి.
వయసు: 18–27ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ. 63,200+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హత, వాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ప్రాతిపదికన అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు స్కిల్‌ టెస్ట్, డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌(స్పీడ్‌ పోస్టు ద్వారా మాత్రమే)లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్‌ మేనేజర్, మెయిల్‌ మోటార్‌ సర్వీస్, నెం.37, గ్రీమ్స్‌ రోడ్, చెన్నై–600006 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 25.06.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.indiapost.gov.in

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...