అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
18, జనవరి 2021, సోమవారం
విద్యా సమాచారం
*టెన్త్ విద్యార్థులకు*
*రెండు పూటలా తరగతుల*
*♦రేపటి నుంచి అమలు*
*♦103 రోజుల ప్రణాళిక*
*♦అదే రోజు నుంచి ఇంటర్*
*♦ఫస్టియర్ క్లాసులూ ప్రారంభం*
*♦వేసవి సెలవులు రద్దు*
పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి రెండు పూటలా తరగతులు జరగనున్నాయి. వీరికోసం ప్రత్యేంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సర తరగతులు కూడా సోమవారం నుంచే ప్రారంభంకానున్నాయి. 10వ తరగతి విద్యార్థులకు రోజుకు 8 పీరియడ్లు నిర్వహిస్తారు. ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4.20గంటల వరకూ తరగతులు జరుగుతాయి. జాతీయ, ఇతర పండుగలు మినహా ఆదివారాల్లో కూడా తరగతులు నిర్వహిస్తారు. ఆదివారం ఒక పూట ఒక సబ్జెక్టులో మాత్రమే తరగతులు జరుగుతాయి. అన్ని పాఠశాలల్లో సోమవారం నుంచి ఈ ప్రణాళికను అమలు చేయాలని డీఈవో సుబ్బారావు ఆదేశించారు.
*♦రేపటి నుంచి ఆరో తరగతి క్లాసులు*
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి క్లాసులు సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు డీఈవో సుబ్బారావు తెలిపారు. వీరికి రోజుమార్చి రోజు తరగతులు నిర్వహిస్తారన్నారు.
*♦ఇంటర్‌కు 106 పనిదినాలు*
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతున్నాయి. అందుకు సంబంధించి ఇంటర్ బోర్డు సవరించిన వార్షిక క్యాలెండర్‌ను ప్రకటించింది. ఆ ప్రకారం 106 పని దినాలు ఉంటాయి. మే 31 వరకూ తరగతులు జరుగుతాయి. రెండో శనివారం కూడా కళాశాలలు నడుస్తాయి. వేసవి సెలవులను కూడా రద్దు చేశారు. 2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...