దేశవ్యాప్తంగా అన్ని పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్
పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్… తెలుగు రాష్ట్రాల్లో కూడా వేల
సంఖ్యలో ఖాళీలను భర్తీ చేస్తోంది. తెలంగాణలో 1150 పోస్టుల్ని,
ఆంధ్రప్రదేశ్‌లో 2296 పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల
చేసింది. తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్
చేయండి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి దరఖాస్తు
ప్రక్రియ కొనసాగుతోంది. 2021 ఫిబ్రవరి 26 లోగా అప్లై చేయాలి. ఈ
నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://appost.in/
వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల్ని మాత్రమే స్వీకరిస్తోంది
ఇండియా పోస్ట్. ఫిజికల్ అప్లికేషన్లను స్వీకరించేట్లేదన్న విషయాన్ని
అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఈ పోస్టులకు అప్లై చేసే ముందు నోటిఫికేషన్
మొత్తం చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ప్రాంతాలవారీగా ఖాళీల వివరాలు
నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
India Post Gramin Dak Sevak Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లోని ఖాళీల వివరాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు- 2296
జనరల్ లేదా అన్ రిజర్వ్‌డ్- 947
ఓబీసీ- 507
ఈడబ్ల్యూఎస్- 324
PWD-A- 18PWD-B- 34
PWD-C- 35
PWD-DE- 9
ఎస్సీ- 279
ఎస్టీ- 143
India Post Gramin Dak Sevak Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 26
విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి. మ్యాథ్స్, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషకు సంబంధించిన సబ్జెక్ట్స్‌లో పాస్ కావాలి.
ఇతర అర్హతలు- స్థానిక భాషకు సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి.
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్‌వుమెన్, దివ్యాంగులకు ఫీజు లేదు.
వయస్సు- 2021 జనవరి 27 నాటికి 18 నుంచి 40 ఏళ్లు
ఎంపిక విధానం- మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక
వేతనం- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-BPM పోస్టుకు రూ.12,000, అసిస్టెంట్ బ్రాంచ్
పోస్ట్ మాస్టర్-ABPM, గ్రామీణ డాక్ సేవక్- GDS పోస్టుకు రూ.10,000.
Indian Navy Recruitment 2021: ఇండియన్ నేవీలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్… ఖాళీల వివరాలు ఇవే
Singareni Jobs 2021: సింగరేణిలో 372 ఉద్యోగాలకు అప్లై చేయండిలా… మరో 4 రోజులే గడువు
India Post Gramin Dak Sevak Recruitment 2021: అప్లై చేయండి ఇలా
అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు https://appost.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో మొదటి స్టేజ్ కోసం Registration పైన క్లిక్ చేయాలి.
పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది.
రెండో స్టేజ్‌లో ఫీజ్ పేమెంట్ చేయాలి. ఆన్‌లైన్‌లో పేమెంట్ చేస్తే సెటిల్మెంట్ కోసం 72 గంటల సమయం పట్టొచ్చు.
ఆఫ్‌లైన్‌లో పోస్ట్ ఆఫీసులో పేమెంట్ చేయాలి. పేమెంట్ స్వీకరించే పోస్ట్ ఆఫీస్ జాబితా https://appost.in/ వెబ్‌సైట్‌లో ఉంటుంది.
పేమెంట్ తర్వాత మూడో స్టేజ్ దరఖాస్తు ఉంటుంది.
అందులో మొదటి స్టెప్‌లో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
రెండో స్టెప్‌లో డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
మూడో స్టెప్‌లో పోస్టు ఎంచుకోవాలి.
మూడు స్టెప్స్ పూర్తైన తర్వాత దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.