6, ఫిబ్రవరి 2021, శనివారం

SSC MTS Recruitment only 10th Apply Now 2021 || స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 10వ తరగతి తో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ

భారత ప్రభుత్వ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్ మంత్రిత్వ శాఖ మరియు పర్సనల్ ట్రైనింగ్ శాఖలలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటనను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా విడుదల చేసినది. తక్కువ విద్యార్హతలతో భర్తీ చేయబోయే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. SSC MTS Recruitment only 10th Apply Now 2021

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేది

ఫిబ్రవరి 5,2021

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది

మార్చి 21,2021

ఆన్లైన్ పేమెంట్ కు చివరి తేది

మార్చి

ఆఫ్ లైన్ చలానా జనరేషన్ కు చివరి తేది

మార్చి    25,2021

చలానా పేమెంట్ కు చివరి తేది

మార్చి 29,2021

టైర్ -1 (CBT ) పరీక్ష తేది

జూలై 1,2021 నుండి జూలై 20,2021 వరకూ

టైర్ -2(డిస్క్రిప్టివ్ ) పరీక్ష తేది

నవంబర్ 21,2021

విభాగాల వారీగా ఖాళీలు :

అతి త్వరలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైటు లో ఖాళీలను పొందుపరచనున్నారు. సుమారుగా 5000 కు పైగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్  ఉద్యోగాల భర్తీని చేయనున్నారు.

అర్హతలు :

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 తరగతి లో ఉత్తీర్ణత ను సాధించవలెను.

వయసు :

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-27 సంవత్సరాల మధ్యన ఉండాలి.

ఎస్సీ /ఎస్టీ కేటగిరీ కు చెందిన అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ కు చెందిన అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

జనరల్ /ఓబీసీ కేటగిరి అభ్యర్థులు 100 రూపాయలు ను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

అన్ని కేటగిరీల మహిళలకు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరి అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

టైర్ -1 (ఆబ్జెక్టివ్ ) మరియు టైర్ -2(డిస్క్రిప్టివ్ ) పరీక్షల విధానం ద్వారా  అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు లెవెల్ 7th పే కమిషన్ పద్దతిలో జీతములు లభించనున్నాయి.

సుమారుగా నెలకు  25000 పైన జీతములు లభించనున్నాయి.

పరీక్ష కేంద్రముల ఎంపిక :

ఇరు తెలుగు రాష్ట్రముల అభ్యర్థులు ఉద్యోగాలకు అప్లై చేస్తున్నపుడు పరీక్ష కేంద్రాలుగా క్రింది ప్రదేశాలను ఎంపిక చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ :

చీరాల , గుంటూరు , కాకినాడ , కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ మరియు విశాఖపట్నం.

తెలంగాణ :

హైదరాబాద్ , వరంగల్ మరియు కరీంనగర్.

Website

Apply Now

Login

Notification

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి