28, జూన్ 2022, మంగళవారం

Army Jobs 2022: టెరిటోరియల్‌ ఆర్మీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 01.07.2022 ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.07.2022

న్యూఢిల్లీలోని టెరిటోరియల్‌ ఆర్మీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 13 (పురుషులు–12, మహిళలు–01)
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.
వయసు: 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌1లో రీజనింగ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ నుంచి 100 ప్రశ్నలు, పేపర్‌2లో జనరల్‌ నాలెడ్జ్, ఇంగ్లిష్‌ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం పేపర్‌1కి 2 గంటలు, పేపర్‌2కి 2 గంటలు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 01.07.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.07.2022
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రం: హైదరాబాద్‌
పరీక్ష తేది: 25.09.2022

వెబ్‌సైట్‌: https://www.territorialarmy.in/

 

Gemini Internet

విద్యా ఉద్యోగ వివరాలు వార్తా పత్రికల ద్వారా సేకరణ

 




Gemini Internet

27, జూన్ 2022, సోమవారం

Cell phone / Mobile Phone / Smart Phone * సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న బాధితుల కోసం " CHAT BOT"

* సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న బాధితుల కోసం " CHAT BOT" సేవలను ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు  ప్రారంభించారు.

* పోలీసు స్టేషన్ కు వెళ్లకుండా FIR నమోదు చేయకుండా కేవలం వాట్సాప్ మేసేజీతో చోరీ/ మిస్ అయిన సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందిస్తున్న విషయం తెలిసిందే

* " CHAT BOT" సేవలతో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రజలకు సేవలు మరింత సులువుగా ఉంటుంది

* మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు ముందుగా 9440796812 నంబర్ వాట్సాప్ కు HI లేదా HELP అని పంపాలి... ఆ తర్వాత వెనువెంటనే Welcome to Anantapur police పేరున ఒక లింకు HI లేదా HELP అని పంపిన మొబైల్ కు వస్తుంది

* ఆ లింకులో గూగుల్ ఫార్మట్ ఓపెన్ అవుతుంది. ఆ వివరాలను పూరించాలి. డిస్ట్రిక్ట్ , పేరు, వయస్సు, తండ్రి, చిరునామా, కాంటాక్టింగ్ నంబర్ , మిసయిన మొబైల్ మోడల్ ,IMEI నంబర్, మిస్ అయిన ప్లేస్ , తదితర వివరాలను సబ్ మిట్ చేయాలి. వెంటనే కంప్లైంట్ లాడ్జి అవుతుంది

* CHAT BOT" సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఎస్పీ విజ్ఞప్తీ చేశారు

* కేవలం వాట్సాప్ మెసేజీ సమాచారంతో రికవరీ చేసిన సెల్ ఫోన్లలో ఈరోజు జిల్లా ఎస్పీ 300 మొబైల్ ఫోన్లను సంబంధిత బాధిత ప్రజలకు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అందజేశారు.

* ఇప్పటి వరకు రూ. ఒక కోటి విలువ చేసే  1079 సెల్ ఫోన్లు రికవరీ చేశారు. వీటిలోచాలా వరకు సెల్ ఫోన్లను బాధితులకు ముట్టజెప్పారు. మిగితా వారికి కూడా ఇంకా  సెల్ ఫోన్లను అందజేసేందుకు బాధితులకు సమాచారం కూడా పంపారు. వీటిని కూడా త్వరలోనే అందజేయనున్నారు.

* CHAT BOT ను రూపొందించడంలో సహకరించిన మణికంఠను జిల్లా ఎస్పీ శాలువా కప్పి సన్మానం చేశారు.

* ఫోన్ చోరీకి గురయినా... మిస్ అయినా వెంటనే జిల్లా పోలీస్ వాట్సాప్ నంబర్ 9440796812 కు HI లేదా HELP అని మెసేజీ పంపాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు

* ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, పోలీస్ టెక్నికల్ వింగ్ ఎస్సై సుధాకర్ యాదవ్ , తదితరులు పాల్గొన్నారు.
#APPOLICE100
#dgpapofficial
#traced
#lostmobiletraced

Gemini Internet

26, జూన్ 2022, ఆదివారం

BSF Recruitment 2022: బీఎస్‌ఎఫ్, న్యూఢిల్లీలో 110 ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులు

న్యూఢిల్లీలోని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) డైరెక్టరేట్‌ జనరల్‌ కార్యాలయం.. గ్రూప్‌ బి, గ్రూప్‌ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 110
పోస్టుల వివరాలు: సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఐ)–22, కానిస్టేబుల్‌–88.

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఐ): 
విభాగాలు: వెహికిల్‌ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్, స్టోర్‌ కీపర్‌. 
అర్హత: సంబంధిత ఇంజనీరింగ్‌ సబ్జెక్టుల్లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ. 35,400 నుంచి రూ.1,12,400వరకు చెల్లిస్తారు.

కానిస్టేబుల్‌: 
విభాగాలు: ఆటో ఎలక్ట్రిక్, వెహికల్‌ మెకానిక్, వెల్డర్, టర్నర్, పెయింటర్‌ తదితరాలు.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి/సంబంధిత ట్రేడుల్లో అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in

 

 

Gemini Internet

Specialist Officer Posts: ఐడీబీఐలో 226 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఐడీబీఐ).. వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 226
విభాగాలు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్, ఫ్రాడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్, డిజిటల్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఎమర్జింగ్‌ పేమెంట్స్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, లీగల్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని పర్సనల్‌ ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆ«ధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 25.06.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.07.2022

వెబ్‌సైట్‌: https://www.idbibank.in/

 

Gemini Internet

Bank of Baroda బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. కార్పొరేట్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ క్రెడిట్‌ విభాగాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 325
పోస్టుల వివరాలు: రిలేషన్‌ల్‌షిప్‌ మేనేజర్లు–175, క్రెడిట్‌ అనలిస్టులు–150.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌తోపాటు ఫైనాన్స్‌ విభాగంలో పీజీ డిగ్రీ/సీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, సైకోమెట్రిక్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 225 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 150 నిమిషాలు ఉంటుంది. దీనిలో రీజనింగ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, క్వాంటì టేటివ్‌ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 22.06.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.07.2022

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

 

 

Gemini Internet

25, జూన్ 2022, శనివారం

Supreme Court of India JCA Junior Court Assistant Recruitment 2022 Online Form | Bachelor Degree in Any Stream at Any Recognized University in India.

Apply Online

Click Here

Download Notification

Click Here

 SCI Junior Court Assistant 2022 Vacancy Details Total 210 Post

Post Name

Total Post

SCI Junior Court Assistant Eligibility

Junior Court Assistant (JCA)

210

  • Bachelor Degree in Any Stream at Any Recognized University in India.
  • English Computer Typing : 35 WPM
  • Knowledge of Computer Operation.

Supreme Court Junior Translator Age Limit as on 01/07/2022

  • Minimum Age : 18 Years.
  • Maximum Age : 30 Years.
  • Age Relaxation Extra as per Supreme Court of India Junior Court Assistant Recruitment Rules.

 

Gemini Internet