30, అక్టోబర్ 2023, సోమవారం

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) 2023 సంవత్సరానికి స్పోర్ట్స్‌ కోటాలో 272 కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ), గ్రూప్‌-సి, నాన్‌-గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

సశస్త్ర సీమా బల్‌లో కానిస్టేబుల్‌ అవుతారా?

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) 2023 సంవత్సరానికి స్పోర్ట్స్‌ కోటాలో 272 కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ), గ్రూప్‌-సి, నాన్‌-గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) 2023 సంవత్సరానికి స్పోర్ట్స్‌ కోటాలో 272 కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ), గ్రూప్‌-సి, నాన్‌-గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదోతరగతి పాసై.. నిర్దేశించిన క్రీడల్లో పాల్గొన్న పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసినప్పటికీ పర్మనెంట్‌ చేసే అవకాశం ఉంది.

భ్యర్థుల వయసు 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు పదేళ్లు, ఓబీసీలకు ఎనిమిదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.  

ఏ క్రీడలు: ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, బాడీ బిల్డింగ్‌, బాస్కెట్‌బాల్‌, సైక్లింగ్‌, ఈక్వెస్ట్రియన్‌, ఫెన్సింగ్‌, జిమ్నాస్టిక్స్‌, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, పెన్‌కాక్‌ సిలాట్‌, పవర్‌లిఫ్టింగ్‌, షూటింగ్‌ స్పోర్ట్స్‌, స్విమ్మింగ్‌, తైక్వాండో, వాలీబాల్‌, రెజ్లింగ్‌, ఉషూ, వాటర్‌ స్పోర్ట్స్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌.  

ఎంపిక: క్రీడా విజయాలు, రాత పరీక్ష, ఫీల్డ్‌ ట్రయల్‌, స్కిల్‌ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, రివ్యూ మెడికల్‌ ఎగ్జామినేషన్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ మొదలైన వాటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా లేదా భారత భూభాగం వెలుపలా సేవలు అందించాలి.

అంతర్జాతీయ క్రీడాపోటీల్లో పాల్గొని దేశం తరపున ప్రాతినిథ్యం వహించినవారికి మొదటి ప్రాధాన్యమిస్తారు. బంగారు పతకం సాధించినవారికి 30 మార్కులు, వెండి పతకానికి 29, కాంస్య పతకానికి 28, పాల్గొన్నవారికి 26 మార్కులు కేటాయిస్తారు.

రెండో ప్రాధాన్యం జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొన్నవారికి ఇస్తారు. రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల తరపున జాతీయ క్రీడల్లో జూనియర్‌ లేదా సీనియర్‌ స్థాయిలో పాల్గొని.. బంగారు పతకం సాధిస్తే 25 మార్కులు, వెండి పతకం సాధిస్తే 24, కాంస్య పతకానికి 23 మార్కులు కేటాయిస్తారు. ముందుగా అభ్యర్థుల విద్యార్హతలు, వయసు, కులం, క్రీడల్లో సాధించిన విజయాలకు సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. దీంట్లో అర్హత సాధించినవారికి ఫీల్డ్‌ ట్రయల్‌/ స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. దీనికి 50 మార్కులు ఉంటాయి. అన్ని కేటగిరీల అభ్యర్థులూ 60 శాతం మార్కులు సాధించాలి. దీంట్లో గెలుపొందిన అభ్యర్థులకు ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌డీ) నిర్వహిస్తారు.

పీఎస్‌టీ: జనరల్‌ పురుష అభ్యర్థులు 170 సెం.మీ. ఎత్తు, చాతీ 80 సెం.మీ. ఉండి గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. వరకూ వ్యాకోచించాలి. మహిళా అభ్యర్థుల ఎత్తు 157 సెం.మీ. ఉండాలి. ఎస్టీ పురుష అభ్యర్థుల ఎత్తు 162.5 సెం.మీ., చాతీ 76-81 సెం.మీ. ఉండాలి. ఎస్టీ మహిళల ఎత్తు 150 సెం.మీ. ఉండాలి. అభ్యర్థులు ఎత్తూ, వయసుకు సరిపడినట్టుగా ఎంత బరువు ఉండాలనేది నోటిఫికేషన్‌లో వివరంగా తెలియజేశారు. పీఎస్‌టీలో అర్హత సాధించినవారికి వైద్య పరీక్ష నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

గుర్తుంచుకోవాల్సినవి  

  • డాక్యుమెంటేషన్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌, మెడికల్‌ టెస్టులకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్‌ కార్డ్‌ను తీసుకెళ్లాలి.
  • ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి దివ్యాంగులు అర్హులు కారు.
  • దరఖాస్తు ప్రింటవుట్‌ను అభ్యర్థులు భద్రపరుచుకోవాలి.
  • గవర్నమెంట్‌/ సెమీ గవర్నమెంట్‌, పబ్లిక్‌ సెక్టర్‌ అండర్‌ టేకింగ్స్‌లో పనిచేసే అభ్యర్థులు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను సమర్పించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు. 21.10.2023 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

వెబ్‌సైట్‌: www.ssbrectt.gov.in

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

తాజా ఇంటర్న్ షిప్‌లు work from Home

తాజా ఇంటర్న్ షిప్‌లు

సంస్థ: ఇండియా యూత్‌ ఫర్‌ సొసైటీ స్టైపెండ్‌: నెలకు రూ.3,000-6,000 దరఖాస్తు గడువు: నవంబరు 2 అర్హతలు: ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యం


విజయవాడ, వైజాగ్‌, హైదరాబాద్‌ల్లో..

ఈవెంట్స్‌ కోఆర్డినేషన్‌

సంస్థ: ఇండియా యూత్‌ ఫర్‌ సొసైటీ

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-6,000

దరఖాస్తు గడువు: నవంబరు 2

అర్హతలు: ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యం

internshala.com/i/bc1fad


హైదరాబాద్‌లో..

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: మెగామైండ్స్‌ ఐటీ సర్వీసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: నవంబరు 2

అర్హతలు: డిజిటల్‌ ఎడ్వర్టైజింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/536b9a


విజయవాడలో..

ఆపరేషన్స్‌

సంస్థ: ఐకుశల్‌ స్పేసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: నవంబరు 3

అర్హతలు: ఆపరేషన్స్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/e440fd


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

డెవోప్స్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: బ్లాక్‌కాఫర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: నవంబరు 9

అర్హతలు: సీఐ/సీడీ…, డెవోప్స్‌, డాకర్‌, ఈఆర్‌పీ ఇంప్లిమెంటేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యాలు

internshala.com/i/32505f


ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌

సంస్థ: కొరిజొ ఎడ్యు-టెక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000-10,000

దరఖాస్తు గడువు: నవంబరు 9

అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/cea063


హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: అగ్నిహోత్రి సెక్యూరిటీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: నవంబరు 9

అర్హతలు: హ్యూమన్‌ రిసోర్సెస్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/9f5ec1

 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

నోటిఫికెషన్స్ | ముంబయిలోని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ), రెగ్యులర్‌ ప్రాతిపదికన 56 ఆఫీసర్‌ (అనలిస్ట్‌) ఖాళీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. | ముంబయిలోని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ), రెగ్యులర్‌ ప్రాతిపదికన 56 ఆఫీసర్‌ (అనలిస్ట్‌) ఖాళీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. | కల్యాణిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌), వివిధ విభాగాల్లో పదవీకాల ప్రాతిపదికన 74 జూనియర్‌ రెసిడెంట్‌ (నాన్‌-అకడమిక్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. | సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌- జనవరి 2024 సెషన్‌కు సంబంధించి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో దరఖాస్తులు కోరుతోంది.|

ముంబయిలోని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ), రెగ్యులర్‌ ప్రాతిపదికన 56 ఆఫీసర్‌ (అనలిస్ట్‌) ఖాళీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో ఆఫీసర్‌లు

ముంబయిలోని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ), రెగ్యులర్‌ ప్రాతిపదికన 56 ఆఫీసర్‌ (అనలిస్ట్‌) ఖాళీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

స్ట్రీములు: లెండింగ్‌ ఆపరేషన్స్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ట్రెజరీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఆపరేషన్స్‌, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, లీగల్‌, ఇంటర్నల్‌ ఆడిట్‌ అండ్‌ కంప్లయన్స్‌, కంపెనీ సెక్రటేరియట్‌, అకౌంట్స్‌, స్ట్రాటజిక్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌, ఎకనామిస్ట్‌.

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ/ పీజీ, ఐసీడబ్ల్యూఏ/ సీఎఫ్‌ఏ/ సీఎంఏ/ సీఏతో పాటు పని అనుభవం.

వయసు: 01-10-2023 నాటికి 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 13.11.2023.

పరీక్ష/ ఇంటర్వ్యూ నిర్వహణ: నవంబర్‌/ డిసెంబర్‌ 2023.

వెబ్‌సైట్‌: https://nabfid.org/


ఐఐటీ హైదరాబాద్‌లో స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌

సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ (ఐఐటీహెచ్‌) కింది ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ-ఎన్‌సీఎల్‌/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులకు స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది.  

1. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 3. ప్రొఫెసర్‌

విభాగాలు: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, బయోటెక్నాలజీ, లిబరల్‌ ఆర్ట్స్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, మెటీరియల్స్‌ సైన్స్‌ అండ్‌ మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ అండ్‌ ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, డిజైన్‌ అండ్‌ ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఫిజిక్స్‌, డిజైన్‌.

వయసు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 35 ఏళ్లు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు 45 ఏళ్లు. ప్రొఫెసర్‌కు 55 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: విద్యార్హత, పని అనుభవం, రిసెర్చ్‌, పబ్లికేషన్‌ రికార్డులు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

అర్హతలు: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీతో పాటు బోధన/ పరిశోధన అనుభవం.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్‌ 13

వెబ్‌సైట్‌: https://www.iith.ac.in/careers/


వాక్‌-ఇన్స్‌

ఎయిమ్స్‌ కల్యాణిలో జూనియర్‌ రెసిడెంట్‌లు

కల్యాణిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌), వివిధ విభాగాల్లో పదవీకాల ప్రాతిపదికన 74 జూనియర్‌ రెసిడెంట్‌ (నాన్‌-అకడమిక్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ: 17.11.2023.

వేదిక: అడ్మినిస్ట్రేటివ్‌ భవనం, గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఎయిమ్స్‌, కల్యాణి.

వెబ్‌సైట్‌: https://aiimskalyani.edu.in/


ప్రవేశాలు

ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ

సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌- జనవరి 2024 సెషన్‌కు సంబంధించి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌, బయోటెక్నాలజీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజినీరింగ్‌, క్లైమేట్‌ చేంజ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, డిజైన్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ.

దరఖాస్తుకు చివరి తేదీ: 02-11-2023.

వెబ్‌సైట్‌: https://iith.ac.in/news/2023/10/12/PhD-Admission-Portal-is-now-open/


 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html