అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
Alerts
12, సెప్టెంబర్ 2025, శుక్రవారం
🏗️🔥 APCRDA Recruitment 2025 | ఏపీసిఆర్డిఏలో 132 ఇంజనీర్ & ఫైర్ సేఫ్టీ నిపుణుల ఉద్యోగాలు ✨
### 🚀📢 ISRO Jobs 2025 | ఇస్రోలో ఉద్యోగాలు 🎓 అసిస్టెంట్ (రాజభాష) – గ్రాడ్యుయేషన్ with 60% Marks అవసరం ✨
🎓 **యూపీఎస్సీ రిక్రూట్మెంట్ 2025 – లెక్చరర్, మెడికల్ ఆఫీసర్ పోస్టులు | UPSC Recruitment 2025 – Lecturer, Medical Officer Posts** 📢 👉 **అర్హతలు | Qualifications** 🎓 **ఎల్ఎల్బీ (LLB), ఎంబీబీఎస్ (MBBS), ఇతర సంబంధిత అర్హతలు** 🩺📚
📢 ఆయుష్ కోర్సు అడ్మిషన్స్ 2025 – డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ నోటిఫికేషన్ విడుదల 🎓 | Ayush Course Admissions 2025 – Dr. NTR UHS Notification Released 🎓
హైదరాబాద్, ఈనాడు డిజిటల్: చదువుకోవాలన్న తపన, సమాజం కోసం ఏదైనా చేయాలనే ఆలోచన ఉంటే, అవకాశాలు అపారమని మరోసారి రుజువైంది. ప్రతిష్టాత్మక చీవెనింగ్ స్కాలర్షిప్ కోసం భారత్ నుంచి మొత్తం 54 మందిని ఎంపిక చేయగా, అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు యువకులు అఖిల బందం, నవీన్ కుమార్ ముళ్లపూడి చోటు దక్కించుకున్నారు. ఈ స్కాలర్షిప్ తో వీరు 2025-28 విద్యాసంవత్సరంలో యూకేలో ఉచిత విద్యాభ్యాసం చేసుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా దరఖాస్తు చేయగా, వారిలో కేవలం వెయ్యిమందికే అవకాశం లభించింది.
చీవెనింగ్ స్కాలర్షిప్ అనేది వృత్తి, విద్యా నైపుణ్యాలు పెంపొందించుకుని ప్రపంచ నాయకులుగా ఎదగాలనుకునేవారికి యూకే ప్రభుత్వం అందించే ప్రత్యేక అవకాశం. ఎంపికైన వారికి పీజీ చదువులకు కావాల్సిన ట్యూషన్ ఫీజు, ప్రయాణ ఖర్చులు, ప్రతి నెలా స్టైపెండ్లను ప్రభుత్వం భరిస్తుంది. అఖిల బందం యూనివర్సిటీ ఆఫ్ లండన్లో బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్ లో బిఎస్సీ చేసి, రాజకీయ కన్సల్టెన్సీలో ఐదేళ్లకు పైగా అనుభవం సొంతం చేసుకుంది. ఆమె చీవెనింగ్ స్కాలర్షిప్ తో యూనివర్సిటీ కాలేజీ లండన్లో ఎంపిఏ ప్రైమేట్, ఇన్నోవేషన్, సస్టెయినబిలిటీ పాలసీ చదవనుంది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి ప్రవేశించి, ప్రజాసేవ చేయాలనే లక్ష్యం ఉందని తెలిపింది.
నవీన్ కుమార్ ముళ్లపూడి వరంగల్ ఎన్విటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో బిటెక్, బిట్స్ పిలానిలో ఎంటెక్ పూర్తి చేసి, ప్రస్తుతం బిహెచ్ఎల్ లో సీనియర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. ఆయన చీవెనింగ్ స్కాలర్షిప్ తో యూకే లోని క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీలో కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ సిఎఫ్ డి లో ఎంఎస్సీ చేయబోతున్నారు. స్వదేశీ ఆధునిక యంత్రాల తయారీలో తన వంతు కృషి చేస్తానని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు తోడ్పడతానని పేర్కొన్నారు.
చీవెనింగ్ స్కాలర్షిప్ కి దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, కనీసం రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. నాలుగు అంశాలపై వ్యాసాలు రాసి, వాటి ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వయోపరిమితి ఏదీ లేదు, ఎన్నిసార్లైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 2026-27 విద్యాసంవత్సరానికి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమై, తుది గడువు అక్టోబర్ 7గా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు www.chevening.org ను సందర్శించవచ్చు.
? 🎙️.Recent
✅ *SSC GD Constable Correction/ Edit Form 2026* 👇
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...