Alerts

15, మార్చి 2024, శుక్రవారం

Group1 Mains: 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు

Group1 Mains: 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు

* తాజాగా పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశం
* ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టీకరణ
* ఏపీపీఎస్సీ, రాష్ట్రప్రభుత్వం తీరుపై తీవ్ర ఆక్షేపణ
* మూల్యాంకనం నిష్పాక్షికంగా జరగలేదని వెల్లడి

2018 నాటి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ (27/2018) ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్‌) జవాబుపత్రాల మాన్యువల్‌ మూల్యాంకనంలో (చేత్తో దిద్దడం) అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జవాబుపత్రాల మూల్యాంకనానికి రాష్ట్రప్రభుత్వం, ఏపీపీఎస్సీ అనుసరించిన విధానం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. రెండోసారి, మూడోసారి చేపట్టిన మూల్యాంకనాలూ చట్టవిరుద్ధమని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ప్రధాన పరీక్షకు అర్హులుగా పేర్కొంటూ 2022 మే 26న ఏపీపీఎస్సీ జారీచేసిన జాబితాను రద్దుచేసింది. తాజాగా ప్రధాన పరీక్ష నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వాన్ని, ఏపీపీఎస్సీని ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాలని పేర్కొంది. పరీక్షకు ముందు అభ్యర్థులకు కనీసం రెండు నెలల సమయం ఇవ్వాలని, ఎంపిక ప్రక్రియను ఆరునెలల్లో పూర్తిచేయాలని ఆదేశించింది. ఇప్పటికే ఎంపికై పోస్టింగ్‌ తీసుకున్న అభ్యర్థులు హైకోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని, భవిష్యత్తులో హక్కులను కోరబోమని న్యాయస్థానం ఆదేశాలతో ఏపీపీఎస్సీకి అఫిడవిట్‌ ఇచ్చారని గుర్తుచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు బుధవారం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు. 2018 గ్రూప్‌-1 ప్రధానపరీక్ష జవాబుపత్రాల మాన్యువల్‌ మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఆ ప్రక్రియను రద్దుచేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. డిజిటల్‌ మూల్యాంకనంలో 326 మందిని ఏపీపీఎస్సీ అర్హులుగా తేల్చిందని, ఆ తర్వాత జరిగిన మాన్యువల్‌ మూల్యాంకనంలో వారిలో 202 మందిని (62%) అనర్హులుగా నిర్ణయించారని, జవాబుపత్రం ఒకటే అయినప్పుడు ఎలా మూల్యాంకనం చేసినా అంతమంది ఎలా అనర్హులవుతారని ప్రశ్నించారు. వ్యాజ్యాలపై హైకోర్టు పలు దశల్లో విచారణ జరిపింది. గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలో ఎంపికైనవారికి ఇంటర్వ్యూ, ఎంపిక ప్రక్రియ కొనసాగించుకునేందుకు 2022 జూన్‌ 24న హైకోర్టు ధర్మాసనం.. ఏపీపీఎస్సీకి అనుమతిచ్చింది. నియామకాలు జరిపితే.. అవి తుది తీర్పునకు లోబడి ఉంటాయని వెల్లడించింది. పోస్టింగ్‌ ఉత్తర్వుల్లోనూ ఈ విషయాన్ని పొందుపరచాలని పేర్కొంది. హైకోర్టు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ప్రధాన వ్యాజ్యాలపై ఇటీవల తుది విచారణ జరిపి బుధవారం తీర్పు ఇచ్చారు.

అందులో వివరాలు ఇలా..
 
‘‘హాయ్‌ల్యాండ్‌ ఆవాస రిసార్ట్స్‌లో 2021 డిసెంబరు 5 నుంచి 2022 ఫిబ్రవరి 26 మధ్య తొలిసారి మాన్యువల్‌ మూల్యాంకనం చేసినట్లు పిటిషనర్లు ఆధారాలతో రుజువు చేశారు. మాన్యువల్‌ మూల్యాంకనం కోసం అవసరమైన సామగ్రి ముద్రణ, సరఫరా కోసం డేటాటెక్‌ మెథడాక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు ఏపీపీఎస్సీ 2021 నవంబరులో రూ.17,936 చెల్లించింది. మూల్యాంకనం ఏర్పాట్లకు రూ.20.06 లక్షలు చెల్లించారు. అక్కడ ప్రక్రియ జరగకపోతే సొమ్ము చెల్లించక్కర్లేదు. ఈ చెల్లింపులపై వివరణ ఇచ్చే విషయంలో ఏపీపీఎస్సీ, రాష్ట్రప్రభుత్వం విఫలమయ్యాయి.

* రెండోసారి మాన్యువల్‌ మూల్యాంకనానికి 49,000 ఓఎంఆర్‌ బార్‌కోడ్‌ షీట్ల ముద్రణ, సరఫరా నిమిత్తం ప్రభుత్వం డేటాటెక్‌ సంస్థకు రూ.3.34 లక్షలు చెల్లించింది. దీన్నిబట్టి రెండుసార్లు మాన్యువల్‌ మూల్యాంకనం చేసినట్లు స్పష్టమవుతోంది. ఇలా ఎందుకు చేశారో ప్రభుత్వానికి, ఏపీపీఎస్సీకే తెలుసు.

* 2022 మార్చి 25 నుంచి 2022 మే 25 మధ్య రెండోసారి మాన్యువల్‌ మూల్యాంకనం జరిగినట్లు పిటిషనర్లు రుజువు చేశారు.

* ప్రజల్లో విశ్వాసం కలిగించేలా రాష్ట్రప్రభుత్వం, యంత్రాంగాలు నిష్పాక్షికంగా పరీక్షలు నిర్వహించాలి. మూడు మూల్యాంకనాల్లో అక్రమాలకు పాల్పడి లబ్ధి పొందినవారిని గుర్తించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో పరీక్షను రద్దుచేయడమే ఉత్తమం.

* మూల్యాంకనంలో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నాయని పిటిషనర్లు సమర్పించిన ఆధారాలు రుజువు చేస్తున్నాయి. నిష్పక్షపాతంగా మూల్యాంకనం చేయడంలో ఏపీపీఎస్సీ, ప్రభుత్వం విఫలమయ్యాయి. జవాబుపత్రాలను చేత్తో దిద్దాలని హైకోర్టు ఆదేశించాక ఏపీపీఎస్సీ, రాష్ట్రప్రభుత్వం మరిన్ని అవకతవకలకు పాల్పడ్డాయి. ఈ అవకతవకలే ఎంపిక ప్రక్రియ చట్టబద్ధతను వేలెత్తి చూపడానికి కారణం అయ్యాయి. ఏపీపీఎస్సీ, రాష్ట్రప్రభుత్వం తీరుతో జవాబుపత్రాల మూల్యాంకనం నిష్పాక్షికంగా, న్యాయబద్ధంగా జరగలేదు. రెండు, మూడుసార్లు మాన్యువల్‌ మూల్యాంకనం చేయడం ద్వారా ప్రతిభావంతులైన అభ్యర్థులను అనర్హులుగా పేర్కొని.. నచ్చినవారిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాన్యువల్‌ విధానంలో మూల్యాంకనాన్ని రద్దు చేస్తున్నాం’’ అని తీర్పులో పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు జంధ్యాల రవిశంకర్‌, ఎం.విజయ్‌కుమార్‌, న్యాయవాదులు జె.సుధీర్‌, ఫణికుమార్‌, తాండవ యోగేశ్‌ తదితరులు వాదనలు వినిపించారు.

రద్దుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: రాష్ట్ర ప్రభుత్వం
 
గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ‘హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యర్థులు ఆందోళన చెందనక్కర్లేదు. ఉద్యోగాలకు ఎంపికైన వారి ప్రయోజనాల్ని కాపాడతాం. వారి తరఫున న్యాయపోరాటం చేస్తాం’ అని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. హైకోర్టు ఆదేశాలపై అప్పీలు చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ మరో ప్రకటనలో తెలిపారు.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

OICL: ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ ఖాళీలు | అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌, డిగ్రీ (లా), ఐసీఏఐ/ ఐసీడబ్ల్యూఏఐ/ బీకాం, ఎంబీఏ (ఫైనాన్స్‌), బీఈ/బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.

OICL: ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ ఖాళీలు 

న్యూదిల్లీలోని ది ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్... డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

* అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ (స్కేల్‌-1): 100 పోస్టులు

విభాగాలు: అకౌంట్స్‌, అక్చూరియల్‌, ఇంజినీరింగ్‌, ఇంజినీరింగ్‌ (ఐటీ), మెడికల్‌ ఆఫీసర్‌, లీగల్‌.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌, డిగ్రీ (లా), ఐసీఏఐ/ ఐసీడబ్ల్యూఏఐ/ బీకాం, ఎంబీఏ (ఫైనాన్స్‌), బీఈ/బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.

వేతనం: నెలకు రూ.50,925- రూ.96,765.

వయో పరిమితి: 31-12-2023 నాటికి 21 నుంచి 30 మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు గరిష్ఠంగా అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్‌, మెయిన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు.

దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 21-03-2024.

దరఖాస్తు చివరి తేది: 12-04-2024

రాత పరీక్ష తేది: మే/ జూన్‌లో.

Important Links

Posted Date: 14-03-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

AP TET Key: ఏపీ టెట్‌ తుది కీ విడుదల * ఫలితాల వెల్లడికి అవకాశం

AP TET Key: ఏపీ టెట్‌ తుది కీ విడుదల

* ఫలితాల వెల్లడికి అవకాశం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫిబ్రవరి 2024 తుది కీ విడుదలైంది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా మార్చి 14వ తేదీనే టెట్‌ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. ఉపాధ్యాయ నియామక పరీక్షలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

  ఏపీ టెట్‌ తుది కీ కోసం క్లిక్‌ చేయండి 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

14, మార్చి 2024, గురువారం

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ (యూజీ)-2024): పూర్తి వివరాలు | Common University Entrance Test (CUET (UG) 2024) – Details Here

Common University Entrance Test (CUET (UG) 2024) – Details Here

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ (యూజీ)-2024): పూర్తి వివరాలు

====================

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (యూజీ)-2024 కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ యూజీ కోర్సుల్లో చేరొచ్చు. ప్రైవేట్, డీమ్డ్ టు బీ యూనివర్సిటీలు సైతం అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోరును ఆధారంగా చేసుకోవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. పరీక్ష నిర్వహణ బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అప్పగించింది. ఈ పరీక్ష ద్వారా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇగ్నో, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, దిల్లీ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి మరెన్నో ప్రముఖ విద్యాసంస్థల్లో సీటు సంపాదించొచ్చు. మేలో ప్రవేశ పరీక్ష జరుగనుంది.

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (యూజీ)-2024

అర్హత: ఇంటర్మీడియట్ / తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష మాధ్యమం: 13 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, మరాఠీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ, పంజాబీ, ఒడియా) రాయొచ్చు.

పరీక్ష విధానం: యూజీ పరీక్ష మూడు సెక్షన్లుగా జరుగుతుంది. మొదటి సెక్షన్(1, 1బి) లాంగ్వేజ్లో, రెండో సెక్షన్ స్పెసిఫిక్ సబ్జెక్టులో, మూడో సెక్షన్ జనరల్ టెస్ట్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. మొదటి సెక్షన్లో 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. రెండో సెక్షన్లో 45/50 ప్రశ్నలకు గానూ 35/40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మూడో సెక్షన్లో 60 ప్రశ్నలకు గానూ 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరాఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 27-02-2024.

ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 26-03-2024

పరీక్ష తేదీలు: 15-05-2024 నుంచి 31-05-2024

====================

INFORMATION BULLETIN

APPLY HERE

WEBSITE

====================

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

SHRESHTA 2024 కోసం అవసరమయ్యే వివరాలు : Required Documents శ్రేష్ఠ పథకం ద్వారా 9,11 తరగతులలో ప్రవేశాలు - సీబీఎస్ఈ అనుబంధ ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాల పరీక్ష వివరాలు

NETS: National Entrance Test for SHRESHTA

SHRESHTA: Scheme for Residential Education for Students in High Schools in Targeted Areas

=====================

కేంద్ర సామాజిక న్యాయం-సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ (SHRESHTA) (NETS) 2024 పథకానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులు సీబీఎస్ఈ (CBSE) అనుబంధ ప్రముఖ ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడం ద్వారా వారి సామాజిక, ఆర్ధిక అభివృద్ధికి చేయూతనందించే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ శ్రేష్ఠ విద్యా పథకం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 3వేల సీట్లను భర్తీ చేయనున్నారు.

అర్హతలు: 2024-25 విద్యా సంవత్సరంలో ఎనిమిది, పదో తరగతి చదువుతోన్న విద్యార్థులు ఈ ఎంట్రన్స్ పరీక్షకు అర్హులు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించరాదు.

రాతపరీక్ష విధానం: ఈ పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటాయి. మ్యాథమెటిక్స్, సైన్సు, సోషల్సైన్స్, జనరల్ అవేర్నెస్/నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉండవు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష రాసే విద్యార్థులు.. ఎన్సీఈఆర్టీ సిలబస్ లో ఎనిమిదో తరగతి సిలబస్ చదవాలి. 11వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష రాసే విద్యార్థులు ఎన్సీఈఆర్టీ పదో తరగతి సిలబస్ చదవాలి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:

ఏపీ: విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం, అమరావతి.

తెలంగాణ: హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 12-03-2024   

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 04-04-2024  

అడ్మిట్ కార్డుల విడుదల: 12-05-2024

ప్రవేశ పరీక్ష తేదీ: 24-05-2024

=====================

APPLY HERE

INFORMATION BULLETIN

WEBSITE

Requirements for the application

Candidate Name

Father Name

Mother Name

Date of birth 

Gender

Aadhaar Details

Address Details

Email for otp

Phone Number for otp

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

Recent

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...