📋 ఆయుష్ విభాగంలో 107 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల 📋 APMSRB Issues Notification to Fill 107 AYUSH Department Vacancies
అమరావతి, నవంబర్ 1 (ఈనాడు): రాష్ట్రంలోని ఆయుష్ విభాగంలో మొత్తం 107 ఖాళీ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు (APMSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు జాతీయ ఆయుష్ మిషన్ కింద ఒప్పంద పద్ధతిలో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో స్టేట్ ప్రోగ్రాం అధికారి మరియు ఫైనాన్స్ మేనేజర్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున, జిల్లా ప్రోగ్రాం అధికారి పోస్టులు 26, సైకియాట్రిస్ట్ పోస్టులు 3, ఆయుర్వేద వైద్య పోస్టులు 51, హోమియోపతి వైద్య పోస్టులు 15, యునానీ వైద్య పోస్టులు 6 భర్తీ చేయనున్నారు. అదనంగా, పొరుగు సేవల కింద 4 యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీఎంఎస్ఆర్బీ మెంబర్ సెక్రటరీ ఎం.వి. సూర్యకళ సూచించారు. Amaravati, November 1 (Eenadu): The Andhra Pradesh Medical Services Recruitment Board (APMSRB) has released a notification to fill 107 vacancies in the AYUSH Department across the state. These recruitments will be made on a contractual basis under the National AYUSH ...