28, ఏప్రిల్ 2020, మంగళవారం

హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ Hindustan Ship Yard Visakhapatnam Recruitment

హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగినది. మరియు ఫిక్సిడ్ టెన్యూర్ కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ గురించి గతంలో ఒక సారి చెప్పొకోవడం జరిగింది. అయితే కరోనా వైరస్ కారణంగా దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించడం జరిగింది. మొదట వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 14 ఏప్రిల్ 2020 వరకు ఇవ్వడం జరిగింది. కాని ఏప్రిల్ 30 కి పొడిగించడం జరిగింది. ఆసక్తి కలిగింన అభ్యర్థులు అప్లై చేసుకోండి. HSL Vizag Jobs 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 51 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ8 మార్చి 2020
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ7 ఏప్రిల్ 2020
ఆన్ లైన్ అప్లికేషన్ యొక్క కాపీని ప్రింట్ తీసుకోవడానికి చివరి  తేదీ30ఏప్రిల్ 2020

అర్హతలు:

డిజైనర్ మెకానికల్:

మెకానికల్/ మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్/ మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్/ మెరైన్ ఇంజనీరింగ్ లో కనీసం 60 శాతం మార్కులతో ఫుల్ టైం డిప్లమా చేసి ఉండాలి.
మరియు ఆటో క్యాడ్/ Tribon/ క్యాషియ/ aveva మెరైన్ లో సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.

డిజైనర్ ఎలక్ట్రికల్:

ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లో కనీసం 60 శాతం మార్కులతో ఫుల్ టైం డిప్లమా చేసి ఉండాలి.
మరియు ఆటో క్యాడ్/ Tribon/ క్యాషియ/ aveva మెరైన్ లో సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.

జూనియర్ సూపర్వైజర్ మెకానికల్:

మెకానికల్/ మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్/ మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్/ మెరైన్ ఇంజనీరింగ్ లో కనీసం 60 శాతం మార్కులతో ఫుల్ టైం డిప్లమా చేసి ఉండాలి.

జూనియర్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్:

ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లో కనీసం 60 శాతం మార్కులతో ఫుల్ టైం డిప్లమా చేసి ఉండాలి.

జూనియర్ సూపర్వైజర్ సివిల్:

సివిల్/ సివిల్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఫుల్ టైం డిప్లమా చేసి ఉండాలి.

ఆఫీస్ అసిస్టెంట్ సెక్రటేరియల్:

కనీసం 60 శాతం మార్కులతో ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. మరియు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లో హైయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్ కలిగి ఉండాలి. మరియు MS ఆఫీస్ లో డిప్లమో లేదా సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి. మరియు లోయర్ షార్ట్ హ్యాండ్ ను కలిగి ఉండాలి.

జూనియర్ ఫైర్ ఇన్స్పెక్టర్:

గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి మరియు గుర్తింపు పొందిన ఫైర్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ నుండి సబ్ ఆఫీసర్స్ కోర్స్ సర్టిఫికెట్ చేసి ఉండాలి.

డ్రైవర్:

SSC/ పదో తరగతి పాస్ అయి ఉండాలి మరియు వ్యాలిడ్ హెవీ లేదా లైట్ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
మరియు అన్ని పోస్టులకు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.

వయస్సు:

పోస్ట్ ని బట్టి కొన్ని పోస్టులకు 25 సంవత్సరాలు మరి కొన్ని పోస్టులకు 28 సంవత్సరాలు మరి కొన్ని పోస్టులకు 30 సంవత్సరాల వయసు మించి ఉండరాదు. మరియు కేటగిరీలను బట్టి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కలదు

జీతం:

అన్ని అలవెన్సులు తో కలిపి మొత్తం 24, 000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక చేసుకునే విధానం:

పోస్టులు బట్టి రిటన్ ఎగ్జామినేషన్ మరియు ట్రేడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

చెల్లించవలసిన ఫీజు:

SC/ST/PH అండ్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 200 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

కామెంట్‌లు లేవు: