హిందూపురం పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 24-05-2020
రాష్ట్ర సరిహద్దులు దాటే వారికి మినహా రాష్ట్రంలో జిల్లాలు దాటి కారులో వెళ్ళేందుకు ప్రత్యేక అనుమతులేవీ ఇక పై అవసరం లేదని అయితే కారులో ముగ్గురికి మించి ప్రయాణం చేయకూడదని, మాస్కులు ఉండి తీరాలని డి జి పి గౌతం సవాంగ్ తెలిపారు.
జూన్ 6 వరకు పరిశ్రమలకు రీస్టార్ట్ ప్యాకేజి రుణాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా పరిశ్రమల శాఖాధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఎపీ పరిశ్రమల శాఖ వెబ్ పోర్టల్ రీస్టార్ ప్యాకేజి ఆప్షన్ లో నమోదు చేసుకోవాలన్నారు. అర్హత ధృవీకరణ పత్రం పొందిన వారికి మాత్రమే వర్తిస్తుందన్నారు. కొత్త రుణాలు తీసుకోవాలనే పరిశ్రమలు జూన్ 6 లోపు సంబంధిత పత్రాలైన నాలుగు నెలల విద్యుత్ బిల్లు, జిఎస్టీ, పాన్, ఆధార్ కార్డులను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు. వివరాలకు జిల్లా పరిశ్రమల శాఖ కార్ర్యాలయంలో సంప్రదించవచ్చు. www.apindustries.gov.in
ఏటా పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించే వాహనమిత్ర పథకానికి గ్రామ వాలంటీర్ లేదా వార్డు వాలంటీర్ సహాయంతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా రెండవ విడత వాహనమిత్ర ఆర్థిక సాయం జూన్ 4 వ తేదీన ఇవ్వనున్నారు.
లాక్ డౌన్ లో సీజ్ చేసిన వాహనాలను, నియమాలను మళ్ళీ ఉల్లంఘించబోమనే
డిక్లరేషన్ తీసుకుని జరిమానాను 100 రూపాయలకు పరిమితం చేసి వాటిని వదిలేయాలని సి ఎం వై ఎస్
జగన్ పోలీసుశాఖను ఆదేశించారు. అయితే ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకే
వాహనాలకు అనుమతి ఉంటుందని రాత్రి సమయంలో లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు
జరుగుతాయన్నారు.
బాలల చట్టాలు మొదలుకుని, తప్పిపోయిన పిల్లల సమాచారం దేశం నలుమూలలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుతం ట్రాక్ చైల్డ్ పేరుతో పోర్టల్ ను నడుపుతోంది. ఇందుకు సంబంధించి ఎవరికి ఫిర్యాదు చేయాలి, వారికి దగ్గరలోని పోల్లీస్ స్టేషన్ వివరాలను అలాగే ఎంత మంది తప్పిపోయారు, వారిలో గుర్తించిన వారి వివరాలను కూడా ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. https://trackthemissingchild.gov.in/trackchild/index.php
2020-21 విద్యా సంవత్సరానికి ఒక సంవత్సర కాల వ్యవధి కలిగిన, కంప్యూటర్ అధారిత, లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎల్పీసెట్-2020) పరీక్ష జూన్ 26న జరగనుంది. ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకునే ఈ దరఖాస్తు చివరి తేది జూన్ 11, హాల్ టికెట్లు జూన్ 19 నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.https://aplpcet.apcfss.in/
గీతం
డీమ్డ్ యూనివర్సిటీ సెమిస్టర్ వైస్, ట్రైమిస్టర్ విధానంలో జరిగిన ఎంబిఎ,
ఐఎంబిఎ, బీఆర్క్, ఎంఆర్క్ ఆఖరి సంవత్సర పరీక్ష ఫలితాలను విడుదల చేశారు,
ఫలితాలను గీతం వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.
షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసే ICLSA లో 13 ఖాళీలు
అర్హత- డిగ్రీ/లా తో పాటు అనుభవం
వయసు-50 ఏళ్ళు మించకూడదు
వేతనం - 65 వేల నుండి ఒక లక్ష వరక్కు
దరఖాస్తుకు చివరి తేది మే 29 http://www.mca.gov.in/
ICCR లో 31 ఖాళీలు
ప్రోగ్రామ్ అఫీసర్ - 8
అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ -10
అసిస్టెంట్ -7
Sr స్టెనోగ్రాఫర్ - 2
జూనియర్ స్టెనోగ్రాఫర్ -2
ఎల్‌డిసి -3ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చవరి తేది జూన్ 6
విద్యార్హత, జీతం, వయస్సు, ఫీజు తదితర వివరాల కోసం స్పీడ్ జాబ్ అలర్ట్స్ . బ్లాగ్ స్పాట్ . కామ్ ను చూడవచు.
కామెంట్‌లు