హిందూపురం పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 23-05-2020
శుక్రవారం తాజాగా హిందూపురంలో ని అంబేడ్కర్ నగర్ లో ఐదుగురికి, ఆజాద్ నగర్ లో మరొకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. కూరగాయల తోపుడు బండి వ్యాపారికి కరోనా పాజిటివ్ అని తేలడంతో గురువారం నుండి కె బసవనపల్లిలో సదరు వ్యాపారికి కాంటాక్ట్ లో ఉన్నవారిలో భయం మొదలయింది. అయితే కరోనా వైరస్ పై భయపడాల్సిన పని లేదని ఏఎస్పీ ఓ సమావేశంలో తెలిపారు. రెడ్ జోన్ ప్రాంతాలలో శ్యాంపుల్స్ సేకరించడంతో కరోనా కేసులు నమోదయ్యాయని వారి ప్రైమరి, సెకండరీ కాంటాక్ట్ లను వేగవంతంగా గుర్తించి వారికి పరీక్షలు చేయిస్తున్నామని అనవసరంగా బయట తిరిగే వారి పై చర్యలు తీసుకుని 1200 వాహనాలకు పైగా సీజ్ చేశామన్నారు. కొంత మంది ఇటీవల సామాజిక మాధ్యమాలలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా పోస్టులు పెడుతున్నారని అలాంటి వారి పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు.
హిందూపురం పట్టణంలో ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు వెళ్ళేలా ఏర్పాట్లు చేశామని సరుకులు రాకపోతే వార్డు సచివాలయంలోని అడ్మిన్ సెక్రటరీకి సమాచారం ఇవ్వాలని లేని పక్షంలో మునిసిపల్ కార్యాలయం కోవిడ్ 19 ఫ్రీ నెంబరు 180042526338 కి ఫిర్యాదు చేయాలని మునిసిపల్ కమీషనర్ భవానీప్రసాద్ శుక్రవారం తెలిపారు.
టిటిడి ఆన్ లైన్ సేవల వెబ్ సైట్ పేరును tirupatibalaji.ap.gov.in గా మార్చారు. స్వామి వారి సేవలను బుక్ చేసుకోవడంతో పాటు ఈ హుండీ, ఈ డొనేషన్స్ సౌకర్యాలకు కొత్త వెబ్ సైట్ శనివారం నుండి మొదలు కానుందని భక్తులు గమనించగరలని టిటిడి కోరింది. శుక్రవారం నుండి లడ్డూ తయారీని మొదలు పెట్టి 24వ తేదీ నాటికి లక్షా యాభైవేల లడ్డూలను తయారుచేస్తామని, జిల్లాకు 10 వేల లడ్డూల ప్రకారం లారీల్లో టిటిటి కళ్యాణ మండపాలకు పంపి 25వ తేదీ నుంచి విక్రయిస్తారు. లడ్డూ ప్రసాదానికి సంబంధించిన సమాచారం కోసం టిటిడి కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబరు 18004254141, 1800425333333లలో సంప్రదించవచ్చు. అలాగే 1000 కి పైగా లడ్డూలు కావాలనుకుంటే భక్తులు తమ పేరు, పూర్తి చిరునామా, మొబైల్ నెంబరు వివరాలను 5 రోజుల ముందుగా tmlbulkladdus@gmail.com కు మెయిల్ పంపడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
కొత్త వొకేషనల్ కాలెజీలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది, వయబిలిటీ
ఉన్న ప్రదేశాల జాబితా వెబ్ సైట్ లో చూడొచ్చు, రిజిస్టర్డ్ ఎద్యుకేషన్
సొసైటీలు లేదా ట్రస్ట్ లకు మాత్రమే కాలేజీల కోసం దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. 2020-21 విద్యాసంవత్సరానికి కొత్తగా ప్రైవేటు అన్ ఎయిడెడ్
వొకేషనల్ జూనియర్ కాలేజీలు స్థాపనకు ఆసక్తి ఉన్న మేనేజ్ మెంట్ల నుంచి
కోరుతున్న ఈ దరఖాస్తులకు చివరి తేది జులై 1. https://bie.ap.gov.in/
విశాఖపట్టణంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 193 ఉద్యోగాలు
స్టాఫ్ నర్స్ - 139
టెక్నీషియన్ - 54
స్టాఫ్ నర్స్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన ఇన్ స్టిట్యూట్ లో బి ఎస్సి నర్సింగ్ పూర్తి చేసి లేదా ఎ పి ప్రభుత్వంలో జి ఎన్ ఎం కోర్స్ పూర్తి చేసి ఉండాలి అలాగే ఎ పి నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి
మొత్తం పోస్టుల్లో అనుభవం ఉన్న వారికి 60 శాతం పోస్టులను భర్తీ చేయనున్నారు
టేక్నీషియన్లకు
ఇంటర్ తో డిప్లొమా అనస్తీషియా టేక్నాలజీ చేసి ఉండాలి అలాగే ఆంధ్ర ప్రదేశ్ పారా మెడికల్ బోర్డ్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయస్సు 18 నుండి 44 మధ్య ఉండాలి
స్టాఫ్ నర్స్ కు 34 వేలు, టేక్నీషియన్లకు 23100 రూపాయల జీతం ఉంటుంది
అకాడమిక్ మెరిట్ మరియు టెక్నికల్ మెరిట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది
దరఖాస్తు ఫారం నింపి ధృవపత్రాల నకళ్ళను జత చేసి ఆఫీస్ దగ్గర ఇవ్వవలసి ఉంటుంది
కామెంట్‌లు