హిందూపుర పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 25-05-2020
డిఎస్సీ 2018 లో ఎంపికైన ఉపాధ్యాయులు జూన్ 10 లోపు యాంటిసిటెన్స్ కోసం నాలుగు సెట్ల మార్క్స్ కార్డులు, ఎస్ ఆర్ తదితర డాక్యుమెంట్ల జిరాక్స్ కపీలను సంబంధిత ఎంఇఓ, ప్రధానోపాధ్యాయులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు జిల్లా ఆసుపత్రులను బోధనాస్పత్రులుగ మార్చేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా వివిధ కళాశాలల ఏర్పాటుకు అంగీకారం తెలిపగా హిందూపురంలోని జిల్లా ఆసుపత్రిలో త్వరలో వైద్యకళాశాల ఏర్పాటు కానుంది ఇప్పటికే కళాశాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను జిల్లా అధికార యంత్రాంగం పరిశీలన చేస్తోంది.
కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ప్రజలు కోవిడ్ -19 ఏపి యాప్ ద్వారా లేదా ఐవీఆర్ ఎస్ 8297104104 నెంబరుకు ఫోన్ చేయడం లేదా వాట్సప్ చాట్ బోట్ నెంబరు 8297104104 కు మెసేజ్ చేయవచ్చని అనంతపురం జిల్లా కలెక్టరు తెలిపారు.
తిరుపతి వేంకటేశ్వర స్వామికి చెందిన ఆస్తులను అమ్మడం చట్ట విరుద్ధమని భక్తులు సమర్పించిన ఆస్తులను అమ్మే హక్కు ఎవరు ఇచ్చారని హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా జగన్ ప్రభుత్వం ప్రవర్తిస్తోందని విమర్శిస్తూ ఆస్తుల విక్రయాలు అపాలంటూ బిజేవైఎం కార్యకర్తలు ఆదివారం తహశిల్దార్ శ్రీనివాసులుకు వినతి పత్రం అందించారు.
జూన్ 30 వరకు ఆన్ లైన్, పోస్టాఫీసు, ఇ దర్శన్ కౌంటర్ల ద్వారా, శ్రీవారి దర్శనానికి, ఆర్జిత సేవలు, వసతి టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు రిఫండ్ చేయనున్నట్టు టిటిడి తెలిపింది. రీఫండ్ కోసం భక్తులు సంబంధిత టికెట్ వివరాలతో పాటు బ్యాంకు ఖాతా నెంబరు, ఐ ఎఫ్ ఎస్ సి కోడ్ ను ఎక్సెల్ లో టైపు చేసి refunddesk1@tirumala.org మెయిల్ ఐడీకి పంపాలని టీటీడీ కోరింది. అలాగే తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదానికి సంబంధించిన సమాచారం కోసం 18004254141 లేదా 1800425333333 టోల్ ఫ్రీ నెంబర్లక్కుక ఫోన్ చేయవచ్చు.
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ 2020-21 విద్యా సంవత్సరానికి వివిధ యుజి, పిజి, పి హెచ్ డి ఇతర డిప్లొమా / సర్టిఫికేట్ కోర్సుల్లో దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదల. ఎంపిక విధానం పిహెచ్ డి, ఎంటెక్, ఎంబిఏ, ఎంసిఎ, ఎంఇడి, బిఇడి, బిటెక్, డిఇఎల్ఇడి, పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు ప్రవేశ పరీక్శ ద్వారా, మిగతా కోర్సులకు, అర్హత కోర్సులో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
ప్రవేశ పరీక్షలున్న కోర్సులకు చివరి తేది జూన్ 10
ప్రవేశ పరీక్ష లేని కోర్సులకు చివరి తేది ఆగస్టు 10
ఇంటర్వ్యూ ఆధారంగా ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసెస్ అకాడమీ అఫీసు సిబ్బంది నియామకానికి దరఖాస్తులు, ఖాళీలు 13 -
సీనియర్ కన్సల్టెంట్లు 3 , కన్సల్టెంట్లు 3, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 1, కంపెనీ సెక్రటరీ 4, స్టెనోగ్రాఫర్ 1, గ్రాఫిక్ డిజైనర్ 1
అర్హత - డిగ్రీ లేదా సి ఎస్ (ఎగ్జిక్యూటివ్) ఉత్తీర్ణత తో పాటు కార్పొరేట్ లా పరిజ్ఞానం ఉండాలి
ఈ మెయిల్ ద్వారా పంపే ఈ దరఖాస్తుకు చివరి తేది మే 29.
e-mail recruitment.iclsa@gmail.com
వాకిన్ ఇంటర్య్వూ ద్వారా నలంద సైనిక్ స్కూల్ ఉద్యోగాలు - ఖాళీలు 17
ఆర్ట్ మాస్టర్ -1, బ్యాండ్ మాస్టర్ -1, సాధారణ ఉద్యోగి - 12, వార్డు బాయ్స్ - 3 పోస్టులు
విద్యార్హత - పది / బ్యాండ్ మాస్టర్ / డ్రమ్ మేజర్ కోర్సు / మాస్టర్ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్
ఇంటర్వ్యూకు చివరి తేది జూన్ 5 మరియు 6వ తేదీలలో
http://sainikschoolnalanda.bih.nic.in
ఆర్ట్ మాస్టర్ -1, బ్యాండ్ మాస్టర్ -1, సాధారణ ఉద్యోగి - 12, వార్డు బాయ్స్ - 3 పోస్టులు
విద్యార్హత - పది / బ్యాండ్ మాస్టర్ / డ్రమ్ మేజర్ కోర్సు / మాస్టర్ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్
ఇంటర్వ్యూకు చివరి తేది జూన్ 5 మరియు 6వ తేదీలలో
http://sainikschoolnalanda.bih.nic.in
కామెంట్‌లు