GEMINI TIMES హిందూపురం పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 26-05-2020
ఈ నెల 13 వ తేదీన సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం అనంతపురం సర్వజానస్పత్రిలో డీఅడిక్షన్ సెంటర్ల్ లో వివిధ పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్టులను అనంతపురం వెబ్ సైట్ లో ఉంచినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్ తెలిపారు. అభ్యర్థులు అభ్యంతరాలుంటే మూడు రోజుల్లో తమ తెలియజేయాలన్నారు. www.ananthapuramu.ap.gov.in
రెండు నెలలుగా శ్రీవారి దర్శన భాగ్యంనోచుకోని భక్తులకు శ్రీవారి ప్రసాద వితరణ కోసం 20 వేల లడ్డూలను అనంతపురం జిల్లా రామచంద్రానగర్ లోని టిటిడి కళ్యాణ మండపంలో ఉదయం భక్తులకు విక్రయం జరిపారు, కాని మధ్యాహ్నం లోపే లడ్డూ ప్రసాదం అయిపోవడంతో మంగళవారం 10 వేల లడ్డూలను తెప్పిస్తున్నామన్నామని.
అనంతపురం డిపో నుండి ఇతర జిల్లాలకు ప్రతి రోజూ వెళ్ళే బస్సుల సమయం వివరాలు
విజయవాడకు - సాయంత్రం 6.30 లకు
నెల్లూరుకు - ఉదయం 6.30 లకు
తిరుపతి - ఉదయం 6.00 లకు, 7.30లకు
మదనపల్లి -ఉదయం 6.30 లకు, 7.00 లకు, 9.00లకు
ఆదోని -ఉదయం 7.30 లకు
కర్నూలు -ఉదయం 6.00 లకు, 7.00లకు, 10.00 లకు
కడప -ఉదయం 6.00 లకు, 7.00లకు, 8.00లకు
www.apsrtconline.in
దీని ప్రకారం మీప్రయాణానికి ప్రణాళికలు వేసుకోండి
భక్తుల మనోభావాలను గౌరవిస్తూ టీటీడి కి చెందిన 50 ఆస్తులను వేలం వేయాలని గత ప్రభుత్వం 2016 జనవరి 30వ తేదీన చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తున్నామని, ఈ విషయమై సోమవారం రాత్రి జిఎడీ ముఖ్యకారదర్శి ప్రవీణ్ ప్రకాశ్ జోవో ఆర్ టి నెం 888 ను జారీ చేశారు.
కోవిడ్ -19 దృష్ట్యా పదవ తరగతి పరీక్ష హాలులో ఒక్కో గదికి కేవలం 12 మంది విద్యార్థులను మాత్రమే పరిమితం చేస్తూ పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో పరీక్ష కేంద్రాల సంఖ్య 315 కు పెరిగాయి. ఇదే సందర్భంలో సి బి ఎస్ ఇ పరీక్షల కేంద్రాలు 15 వేలకు పెంచారు ఈ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మనవి. గతంలో 3 వేల కేంద్రాలనుకున్నా ప్రస్తుత పరిస్థితులలో అది సాధ్యపడటంలేదు.
ఆంధ్రప్రదేశ్ పి ఇ సెట్ 2020 ఫిజికల్ ట్రైనర్ కోర్సు, ఈ పరీక్ష ద్వారా రెండు రకాల కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. బిపి ఇడి (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) మరొకటి డి పి ఇడి/యుజి డి పి ఇడి (అండర్ గ్రాడ్యుయేట్/డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్).
రెండేళ్ళ బిపిఇడి కి అర్హతలు, ఏదైనా డిగ్రీ, ఫైనలియర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, వయసు జులై 1 2020 నాటికి 19 ఏళ్ళు నిండిఉండాలి.
రెండేళ్ళ డిపిఈడీ/యుజిడిపిఈడి కి అర్హతలు, ఇంటర్, ఇంటర్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులు, వయసు జులై 1 2020 నాటికి 16 ఏళ్ళు నిండిఉండాలి.
వ్రాత పరీక్ష ఉండదు కాని ఫిజికల్ ఈవెంట్స్ ఆధారంగానే ప్రవేశం కల్పిస్తారు.
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేది జూన్ 15
https://sche.ap.gov.in/pecet
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డీఈఈసెట్ 2020 కోసం దరఖాస్తులు
అర్హత:ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత
దరఖాస్తు : ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: జూన్ 05
పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ లో ఉద్యోగాలు
అర్హత - బి ఇ / బి టెక్ / పీజి లో సైన్స్ / ఎకనామిక్స్/ఆపరేషన్స్ రీసెర్చ్) కనీసం 5 ఏళ్ళ అనుభవం ఉండాలి
దరఖాస్తుకు చివరి తేది జూన్ 18
www.pngrb.gov.in
రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టెక్నీషియన్ ఉద్యోగాలు
ఖాళీలు 12
ఉద్యోగాలు - ఓటీ టెక్నీషియన్ 6, ల్యాబోరేటరీ టెక్నీషియన్ 6
అర్హత - ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత
ఈ మెయిల్ ద్వారా దరఖస్తుకు చివరి తేది మే 27
rims.imphal@gov.in
www.rims.edu.in
కామెంట్‌లు