హిందూపురం పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 21-05-2020
దాదాపుగా రెడ్ జోన్ లోనే హిందూపురం, పురంలో 53 రోజులలో 120 కేసులు రాగా అందులో 7 గురు చనిపోయారు, ఇప్పటికీ రెడ్ జోన్ లలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముక్కటి పేట, త్యాగరాజనగర్, ఆర్టీసీ కలనీ, నింకంపల్లి, సత్యనారాయణపేట, ఆజాద్ నగర్, హస్నాబాద్, బాలాజీ నగర్,రహమత్ పురంలలో ఈ వైరస్ జాడలు అంతమయ్యేలా కనిపించడం లేదు. ఈ రోజు విడుదల చేసిన ఆర్ టి సి బస్సు రూట్లలో హిందూపురం నుండి కాని హిందూపురానికి వచ్చే బస్సులకు అనుమతులు లేకపోవడం హిందూపురం మొత్తం ఏ జోన్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
నేటి నుండి ఆర్ టి సి బస్సుల ప్రయాణం మొదలైనా సీటు సీటుకు మధ్య దూరం, అలాగే బస్సుల్లో వృద్దులు, దివ్యాంగులు, విద్యార్థులు, పాత్రికేయులు తదితరులకు కల్పిస్తున్న వివిధ రాయితీ పాసులను తాత్కాలికంగా నిలిపివేశారు. కడప కర్నూలు మదనపల్లి రూట్ల బస్సులకు మాత్రమే ఆన్ లైన్ రిజర్వేషన్ కోసం WWW.APSRTCONLINE.IN ద్వారా చేసుకోవచ్చు. రూట్ల వారీగా ప్రయాణికులకు స్టెజి పాయింట్ల కండెక్టర్ల వద్ద నేరుగా టికెట్ తీసుకోవచ్చు. బస్సు రూట్లు, రిజర్వేషన్ అంశాల పై సందేహాలుంటే 9959225866 నెంబరుకు కాల్ చేయవచ్చు. కాగా పల్లెవెలుగులో 35 మంది ఎక్స్ ప్రెస్ లో 30, అల్ట్రాడీలక్స్ లో 29, సూపర్ లగ్జరీలో 26 మందిని మాత్రనే అనుమతిస్తారు.
రిజిస్ట్రేషన్ తో సంబంధం లేకుండా రాష్ట్రంలోని విద్యార్థులందరికి గేట్ ఆన్ లైన్ తరగతులను అందుబాటులోకి తేనున్నట్టు జె ఎన్ టి యు వి సి ప్రొఫెసర్ శ్రీనివాస కుమార్ పేర్కొన్నారు. రెండో విడత ఈ నెల 26 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇందుకోసం యూట్యూబ్ లింక్ ద్వారా తరగతులు వినవచ్చన్నారు.
శ్రీ ఆది జాంబవంతుడు డెవలప్మెంట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో హిందూపురం లోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు విటమిన్ సి లభించే పండ్లను 400 మంది పారిశుద్ధ్య కార్మికులకుపంపిణీ చేయడం జరిగిందిపెంచిన తన తండ్రి కీర్తిశేషులు కే ప్రేమ్ కుమార్ గారు స్థాపించిన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం తమకు సంతోషం కలిగిస్తోందని సందర్భంగా సతీష్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు సేవలను కొనియాడారు రెడ్ జూనో కంటోన్మెంట్ జోన్ అనే బేదాలు లేకుండా ప్రతి చోటా పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులు దైవంతో సమానం అని వారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమవారికి వారి పాదాలు శుభ్రం చేసి వారి వారి పట్ల తమకున్న గౌరవాన్ని వ్యక్తం చేశారు తరువాత మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ సార్ గారి చేతులమీదుగా పారిశుద్ధ్య కార్మికులకు పండ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు విమల్ కుమార్ ప్రవీణ్ కుమార్ మరియు బాపూజీ నగర్ యువత పాల్గొన్నారు.
ఆర్ డి టి సహకారంలో ఆన్ లైన్ లో స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ అందిస్తున్న గురుకుల్ హెడ్ అడ్మిషన్స్ శివశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణకు 20 నుంది 30 ఏళ్ళ లోపు ఉండి ఇంటర్ ఆపై చదివిన వారు అర్హులన్నారు. శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికేట్లు అందజేసి, బెంగళూరు వండి నగరాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తామని వివరాలకు 9000487423 / 6305334287 / 7780752418 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీసెట్ 2020) నోటిఫికేషన్ విడుదలయింది. ఆన్ దరఖాస్తుకు చివరి తేది జూన్ 5 https://cse.ap.gov.in లేదా https://apdeecet.apcfss.in
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
సంఖ్య - 48
అర్హతలు - సివిల్ ఇంజినీరింగ్
దరఖాస్తుకు చివరి తేది - జూన్ 15
కామెంట్‌లు