6, మే 2020, బుధవారం

యూపీఎస్సీ, సీపీసీబీ, సిపెట్‌, జీజీహెచ్‌ శ్రీకాకుళం, ఎన్‌ఐఈపీఐడీ ప్రభుత్వ ఉద్యోగాలు | పరీక్షల్లేకుండానే పై క్లాసులకు

🔳యూపీఎస్సీ పరీక్షలు వాయిదా
5 May, 2020 05:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్‌ ఉద్యోగాలకు అర్హత కల్పించే యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్ష ఈ నెల 31న జరగాల్సి ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా దీన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 20న తిరిగి మరోమారు యూపీఎస్సీ అధికారులు సమావేశమై దీనిపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ పరీక్ష కూడా వాయిదా పడినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు యూపీఎస్సీ వెబ్‌సైట్‌ చూడాల్సిందిగా సూచించారు.
--------------------------------------------------------------------------------------------------------------------
సీపీసీబీ, దిల్లీ

ప్రభుత్వ ఉద్యోగాలు

దిల్లీలోని భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌(సీపీసీబీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 48 పోస్టులు: సైంటిస్ట్‌, జూనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ టెక్నీషియన్‌, జూనియర్‌ టెక్నీషియన్‌, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: రాతపరీక్ష/ స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మే 05, 2020 దరఖాస్తుకు చివరి తేది: మే 25, 2020 చిరునామా: సీపీసీబీ, పరివేష్‌ భవన్‌, ఈస్ట్‌ అర్జున్‌ నగర్‌, దిల్లీ-110032. వెబ్‌సైట్‌: https://cpcb.nic.in/

--------------------------------------------------------------------------------------------------------------------------

సిపెట్‌, చెన్నై

ప్రభుత్వ ఉద్యోగాలు

చెన్నై ప్రధానకేంద్రంగా ఉన్న సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సిపెట్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 57 పోస్టులు: సీనియర్‌ ఆఫీసర్‌, ఆఫీసర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఆఫీసర్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంబీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌/ ప్రాక్టికల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. చివరి తేది: మే 29, 2020. చిరునామా: డైరెక్టర్‌(అడ్మినిస్ట్రేషన్‌), సిపెట్‌ ప్రధాన కార్యాలయం, టీవీకే ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, గిండీ, చెన్నై-600032. వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in/
---------------------------------------------------------------------------------------------------------------------------
జీజీహెచ్‌, శ్రీకాకుళం

ప్రభుత్వ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన శ్రీకాకుళంలోని గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌(జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 51 పోస్టులు: అనెస్తీషియాలజీ, పల్మనాలజిస్ట్‌, జనరల్‌ మెడిసిన్‌. అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ డీఎన్‌బీ/ డిప్లొమా ఉత్తీర్ణత. ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, ఇతర వివరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: మే 08, 2020. చిరునామా: సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌, శ్రీకాకుళం, ఏపీ.

వెబ్‌సైట్‌: https://srikakulam.ap.gov.in/ 
----------------------------------------------------------------------------------------------------------------------------
పరీక్షల్లేకుండానే పై క్లాసులకు
6 May, 2020 03:24 IST|Sakshi

1 నుంచి 9 తరగతుల విద్యార్థులు పై తరగతులకు

ప్రమోట్‌ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఒకటి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులందరినీ పైతరగతులకు ప్రమోట్‌చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని మేనేజ్‌మెంట్‌ పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పైతరగతులకు పంపాలని ఏప్రిల్‌ 19న జరిగిన కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని అదేరోజు సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు. చదవండి: సెప్టెంబర్‌ 1నుంచి ఇంజనీరింగ్‌ క్లాసులు 

విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించరాదని స్పష్టంచేశారు. దీనిపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామ్‌చంద్రన్‌ మంగళవారం ఉత్తర్వులు (జీవో 54) జారీచేశారు. కరోనా నేపథ్యంలో 2019–20 విద్యా సంవత్సరంలో 1 నుంచి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులకు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–2 (వార్షిక) పరీక్షలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వారందరినీ 2020–21 విద్యా సంవత్సరంలో పైతరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఉత్తర్వులు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ని యాజమాన్యాల పాఠశాలలకు వర్తిస్తాయని పేర్కొన్నారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఈపీఐడీ, సికింద్రాబాద్‌
సికింద్రాబాద్‌లోని భారత ప్రభుత్వానికి చెందిన సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటలెక్చువల్‌ డిజెబిలిటీస్‌ (దివ్యాంగ్‌జన్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

నోటీస్‌బోర్డు
మొత్తం ఖాళీలు: 11 పోస్టులు: జూనియర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌, స్టాటిస్టికల్‌ అసిస్టెంట్‌, వొకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌, ప్రిన్సిపల్‌, జూనియర్‌ అకౌంటెంట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి ఎనిమిదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, బీకాం, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, డ్రైవింగ్‌ లైసెన్స్‌, అనుభవం.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. చిరునామా: డైరెక్టర్‌, ఎన్‌ఐఈపీఐడీ, మనోవికాస్‌నగర్‌, సికింద్రాబాద్‌-500009.

చివరి తేది: జూన్‌ 15, 2020.

వెబ్‌సైట్‌: http://niepid.nic.in/

కామెంట్‌లు లేవు: