19, నవంబర్ 2020, గురువారం

APSCO Marketing Federation Jobs 2020

ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

ఏపీ స్టేట్ కో – ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్  లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇరు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ కో – ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఉద్యోగాల భర్తీకి గాను ఒక ప్రకటన విడుదలైంది.

తెలుగు భాష మాట్లాడే ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చును. ఈ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. Latest Marketing Jobs -2020.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు కు చివరి తేదీనవంబర్ 25,2020,సాయంత్రం 5 గంటల వరకూ

ఉద్యోగాలు – వివరాలు :

తాజాగా వెలువడిన ఈ ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో – ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన అవుట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేయనున్నారు.

విభాగాల వారీగా ఉద్యోగాలు :

రీజనల్ సేల్స్ మేనేజర్స్

ఏరియా సేల్స్ మేనేజర్స్

అడ్మిన్ ఎగ్జిక్యూటివ్స్

ఆపరేషన్ మేనేజర్స్

అర్హతలు :

రీజనల్ సేల్స్ మేనేజర్ :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, రెండు సంవత్సరాల ఎంబీఏ కోర్సులో ఉత్తీర్ణత సాధించి సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం.మరియు తెలుగు భాష మాట్లాడడం మరియు వ్రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఏపీ కాపిటల్ సిటీ లో వృత్తి నిర్వహణ బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది.

ఏరియా సేల్స్ మేనేజర్ :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండి, రెండు సంవత్సరాల ఎంబీఏ కోర్సు లో ఉత్తీర్ణత సాధించి ఉండవలెను.సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం. మరియు తెలుగు భాష మాట్లాడడం మరియు వ్రాయడంలో నైపుణ్యత కలిగి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఏదైనా ప్రాంతంలో వృత్తి నిర్వహణ బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది.

అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండవలెను. హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేసిన వారికీ ప్రాధాన్యత ఇవ్వబడును. కంప్యూటర్ స్కిల్స్ అవసరం మరియు ఎం ఎస్ – ఆఫీస్ లో నాలెడ్జ్ అవసరం అని నోటిఫికేషన్ లో పొందు పరిచారు.ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విజయవాడ మరియు విశాఖపట్నం లలో వృత్తి బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది.

ఆపరేషన్ మేనేజర్ :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు బీ. టెక్ లేదా అగ్రికల్చర్ విభాగంలో బీ. ఎస్సీ డిగ్రీ కోర్సు ను పూర్తి చేసి ఉండాలి. మరియు ఎంబీఏ కోర్సు లో ఉత్తీర్ణత సాధించి సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. తెలుగు భాష మాట్లాడడం మరియు వ్రాయడంలో నైపుణ్యత కలిగి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఏపీ కాపిటల్ సిటీ లో వృత్తి బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది.

జీత భత్యాలు :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం జీతభత్యాలను అందుకోనున్నారు.

దరఖాస్తు విధానం :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ క్రింది ఈమెయిల్ అడ్రస్ కు రెస్యూమ్ లను పంపవలెను.

ఈమెయిల్ అడ్రస్ :

hrd. apmarkfed@yahoo.com

ముఖ్య గమనిక :

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు ను చూడగలరు.

Website

Notification

 

కామెంట్‌లు లేవు: