2, డిసెంబర్ 2020, బుధవారం

BECIL Jobs

భారతదేశ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన  బ్రాడ్ క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్స్(BECIL) లో ఖాళీగా ఉన్న ఫీల్డ్ టెక్నీషియన్స్ ఉద్యోగాల భర్తీకి ఒక ప్రకటన విడుదల అయినది. BECIL Govt Jobs 2020 Update

ఈ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విజయవాడ, భీమవరం, విశాఖపట్నం లలో తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది. BECIL Govt Jobs 2020 

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదీనవంబర్ 28,2020
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 11,2020

విభాగాల వారీగా ఉద్యోగాలు :

ఫీల్డ్ టెక్నికల్ ఆఫీసర్స్6
ఫీల్డ్ టెక్నికల్ ఆఫీసర్స్ (GIS)2

విద్యార్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలను అనుసరించి డిగ్రీ / పీజీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. మరియు అనుభవం అవసరం.లోకల్ లాంగ్వేజ్ పై ప్రావీణ్యత అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

వయో పరిమితి :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులకు 35 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం :

వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

వేతనాలు – వివరాలు  :

ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30,000 రూపాయలు వరకూ వేతనం లభించనుంది.

దరఖాస్తు ఫీజు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ  అభ్యర్థులు 750 రూపాయలు మరియు ఎస్సి, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 450 రూపాయలను దరఖాస్తు రుసుముగా చెల్లించవలెను.

Website

Notification

కామెంట్‌లు లేవు: