19, జనవరి 2021, మంగళవారం

ఆర్‌జీయూకేటీ-ఏపీలో ఫ్యాకల్టీ ఖాళీలు.. చివరి తేది జనవరి 23

ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్‌ టెక్నాలజీస్(ఆర్‌జీయూకేటీ).. ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
వివరాలు:
  • లెక్చరర్లు (పీయూసీ ప్రోగ్రామ్-రెండేళ్లు):
    విభాగాలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, ఐటీ, తెలుగు, బయోలజీ.
    అర్హత: సంబంధిత విభాగాన్ని అనుసరించి పీజీ డిగ్రీ (ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ) 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి.
  • అసిస్టెంట్ ప్రొఫెసర్లు (బీటెక్ ప్రోగ్రామ్):
    విభాగాలు: సివిల్, కంప్యూటర్ సైన్స్‌, ఈఈఈ, కెమికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలార్జికల్ ఇంజినీరింగ్, మెటీరియల్స్ ఇంజనీరింగ్.
    అర్హత: సంబంధిత విభాగాన్ని అనుసరించి ఎంటెక్/ఎంఎస్సీ/ఎంబీఏ/ఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/ఎస్‌ఎల్‌ఈటీ/సెట్/పీహెచ్‌డీ అర్హత ఉండాలి.

దరఖాస్తు విధానం: ఈమెయిల్, ఆఫ్‌లైన్, దరఖాస్తును ద ఆఫీస్ ఆఫ్ ది ఛాన్స్‌లర్, ఆర్‌జీయూకెటీ నూజివీడు క్యాంపస్, నూజివీడు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్-521202 చిరునామాకు పంపించాలి.
ఈమెయిల్: recruitments@rgukt.in

దరఖాస్తులకు చివరి తేది: జనవరి 23, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.rgukt.in

 

కామెంట్‌లు లేవు: