తిరుమల తిరుపతి దేవస్ధానం శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవను శుక్రవారం టీటీడీ పునఃప్రారంభించింది.గత నెల 17 నుంచి శ్రీవారికి సుప్రభాత సేవకు బదలు ధనుర్మాస కైకర్యాలు నిర్వహించింది. ఈ సందర్భంగా గురువారంతో ధనుర్మాసం పూర్తైనందున..నేడు వేకువజాము నుంచే స్వామివారికి సుప్రభాత సేవ మెుదలైంది. నిత్యం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలపడం సంప్రదాయం. నెల రోజుల పాటు సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం జరిగింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి