భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO), హైదరాబాద్ యద్గారిపల్లి గ్రామానికి చెందిన యూనిట్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) ఉద్యోగాల భర్తీకి గాను ఒక ప్రకటన విడుదల అయినది.
ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేది | ప్రకటన వచ్చిన 21 రోజుల లోపు |
విభాగాల వారీగా ఖాళీలు :
మెకానికల్ ఇంజనీరింగ్ | 2 |
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /కంప్యూటర్ సైన్స్ / ఎలక్ట్రానిక్స్అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | 2 |
అర్హతలు :
మెకానికల్ ఇంజనీరింగ్ లో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో బీ. ఈ /బీ. టెక్ /ఎం. ఈ /ఎం. టెక్ కోర్సులను ప్రధమ శ్రేణిలో పూర్తి చేసి, నెట్ మరియు గేట్ పరీక్షలలో క్వాలిఫై కావలెను.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ECE విభాగాలలో ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగాల ఇంజనీరింగ్ లో బీ. ఈ / బీ. టెక్ / ఎం. ఈ /ఎం. టెక్ కోర్సులను ప్రధమ శ్రేణిలో పూర్తి చేసి, నెట్ మరియు గేట్ పరీక్షలలో క్వాలిఫై కావలెను.
వయసు :
ఈ జే. ఆర్. ఎఫ్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలకు మించరాదు.నియమాలను అనుసరించి రిజర్వేషన్ ప్రకారం వయసు పరిమితి సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
పరీక్ష / ఇంటర్వ్యూ విధానముల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 31,000 రూపాయలు జీతం లభించనుంది.
జీతం తో పాటు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRA) మరియు మెడికల్ సౌకర్యాలు కూడా లభించనున్నాయి.
NOTE :
అభ్యర్థులు మార్క్ షీట్స్, డిగ్రీ సర్టిఫికెట్స్, ఇతర ప్రమాణ పత్రాలను సెల్ఫ్ అటెస్ట్ చేసి, వీటితో పాటు పూర్తి చేసిన బయో డేటా మరియు టైపు చేసిన దరఖాస్తును ప్రకటన వచ్చిన తేది నుండి 21 రోజుల లోపు ఈ క్రింది అడ్రస్ కు పంపవలెను.
దరఖాస్తు పంపవలసిన చిరునామా :
డైరెక్టర్ CAS,
యాద్గార్ పల్లి ( గ్రామం ),
కీసర మండలం,
హైదరాబాద్ – 501301.
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x
మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము
తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily
and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి