ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), తిరుపతిలో కెమిస్ట్రీ విభాగానికి చెందిన ప్రాజెక్ట్ లో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.
ఎటువంటి పరీక్షలు లేకుండా భర్తీ చేసే ఈ ఒప్పంద ప్రాతిపదిక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
విభాగాల వారీగా ఖాళీలు :
జూనియర్ రీసెర్చ్ ఫెలో
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 60% మార్కులతో జనరల్ కెమిస్ట్రీ /ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ /ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగాలలో ఎం. ఎస్సీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.
గేట్ /సీఎస్ఐఆర్ – యూజీసీ నెట్ పరీక్షలలో స్కోర్ అవసరం. మరియు ఆర్గానిక్ సింథసిస్, ఫోటో కేటలసీస్, మరియు ఎలక్ట్రో కేటలసిస్ విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
మరింత ముఖ్య సమాచారం కొరకు అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించరాదు.
నియమాలను అనుసరించి రిజర్వేషన్స్ కేటగిరీల అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ ఈ-మెయిల్ విధానం ద్వారా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఆన్లైన్ ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 31, 000 రూపాయలు జీతం + హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRA) లభించనున్నాయి.
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0xమేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
ఈమెయిల్ అడ్రస్ :
ముఖ్యమైన తేదీలు :
ఈమెయిల్ దరఖాస్తుకు చివరి తేది | ఫిబ్రవరి 22, 2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | ఫిబ్రవరి చివరి వారం |
ఉద్యోగ నిర్వహణ ప్రారంభ తేది | మార్చి 15,2021 |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి