4, జూన్ 2021, శుక్రవారం

ఎల్‌ఐసీ, హెచ్‌ఎఫ్‌ఎల్‌లో అసోసియేట్‌ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది: 07.06.2021

ముంబైలోని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకి చెందిన హౌజింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎఫ్‌ఎల్‌).. అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs  
మొత్తం పోస్టుల సంఖ్య: 06
అర్హత: కనీసం 55శాతం మార్కులతో సోషల్‌ వర్క్‌/రూరల్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. దూరవిద్య, పార్ట్‌టైం, కరస్పాండెన్స్‌ డిగ్రీలు ఉన్నవారు అర్హులు కాదు.
వయసు: 01.01.2021 నాటికి 23–30ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ టెస్ట్‌లో అర్హులైన విద్యార్థులను ఇంటర్వూకు పిలుస్తారు. ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌కు ఆన్‌లైన్‌ ద్వారా రెజ్యూమ్‌ పంపించాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేది: 07.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.lichousing.com

కామెంట్‌లు లేవు: