12, జులై 2021, సోమవారం

ఇండియన్‌ నేవీలో 350 మెట్రిక్‌ రిక్రూట్‌ సెయిలర్లు | ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 19.07.2021 | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.07.2021

ఇండియన్‌ నేవీ అక్టోబర్‌ 2021లో ప్రారంభ‌మయ్యే మెట్రిక్‌ రిక్రూట్‌(ఎంఆర్‌) సెయిలర్ల బ్యాచ్‌ కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 350
పోస్టుల వివరాలు: చెఫ్, స్టీవార్డ్, హైజీనిస్ట్‌.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: 01.06.2001 నుంచి 30.09.2004 మధ్య జన్మించి ఉండాలి.
జీతం: మొదట శిక్షణా సమయంలో స్టైపెండ్‌ రూపంలో నెలకు రూ.14,600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు డిఫెన్స్‌ పే మ్యాట్రిక్స్‌ లెవల్‌ 3 ప్రకారం వేతనం, ఎంఎస్‌పీ, డీఏ అందిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఈ పరీక్షను హిందీ, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. దీనిలో రెండు సెక్షన్లు ఉంటాయి. అవి.. సైన్స్‌ అండ్‌ మ్యాథమేటిక్స్, జనరల్‌ నాలెడ్జ్‌. ప్రశ్నల సరళి పదో తరగతి సిలబస్‌ స్థాయిలో ఉంటుంది. పరీక్షా సమయం 30 నిమిషాలు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 19.07.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.07.2021

పూర్తి వివరాలక వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in

కామెంట్‌లు లేవు: