AP State Cooperative Bank 26 Jobs Recruitment | ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన లోకల్ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులు తమ సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొదటి తేదీ : 21 జులై 2021
ఆన్లైన్ లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ : 05 ఆగస్ట్ 2021
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 05 ఆగస్ట్ 2021
ఆన్లైన్ ఎగ్జామినేషన్ నిర్వహించు తేదీ: సెప్టెంబర్ మొదటి వారం లో
పోస్టుల సంఖ్య:
మేనేజర్ విభాగంలో అన్ని కేటగిరీలలో మొత్తం 26 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. AP State Cooperative Bank 26 Jobs Recruitment
విభాగాల వారీగా అర్హతలు:
అగ్రికల్చర్:
ఈ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ లో కనీసం 40 శాతం మార్కులతో అగ్రికల్చర్ లో B.Sc లేదా M.Sc చేసి ఉండాలి.
హార్టికల్చర్:
ఈ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ లో కనీసం 40 శాతం మార్కులతో హార్టికల్చర్ లో B.Sc లేదా M.Sc చేసి ఉండాలి.
వెటర్నరీ:
ఈ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ లో కనీసం 40 శాతం మార్కులతో B.Vsc లేదా M.Vsc చేసి ఉండాలి.
ఫిషరీస్:
ఈ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ లో కనీసం 40 శాతం మార్కులతో B.Fsc లేదా M.Fsc చేసి ఉండాలి.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 20 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి మరియు కేటగిరీలను బట్టి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కలదు.
జీతం:
36,000 నుండి 60,943 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది మరియు ఇతర అలవెన్సులు కలవు.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక చేసుకునే విధానం:
ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
ఎగ్జామినేషన్ సెంటర్స్:
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కలవు
చెల్లించాల్సిన ఫీజు:
SC/ST/PC/EXS కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 500 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
జనరల్ లేదా BC కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 700 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు. అభ్యర్థులకు గమనిక తప్పనిసరిగా కామెంట్ రాయండి. మీకు జవాబు ఇవ్వడం జరుగుతుంది.
కామెంట్‌లు