తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్వహించనున్న శ్రీ పద్మావతి పిల్లల హృదయాలయం ( శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ ) ఆసుపత్రి లో స్వచ్ఛంద సేవలు అందించడానికి భారతదేశంలోని గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సీనియర్ పీడియాట్రిక్ కార్డియో థోరాసిక్ సర్జన్లు, డాక్టర్లును ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
టీటీడీ ప్రాణదానం పథకం కింద నిర్వహించనున్న ఈ ఆసుపత్రిలో నవజాత శిశువుల మరియు పిల్లలకు గుండె చికిత్సలు, వైద్య సేవలు అందించడం కోసం కనీసం 15 సంవత్సరాల అనుభవం కలిగిన హిందూ మతానికి చెందిన డాక్టర్లు వారి ఆసక్తిని తెలియజేయాలని కోరింది. ఈ స్వచ్ఛంద సేవలను ఆప్షన్ A మరియు ఆప్షన్ B అనే రెండు విధానాలలో చేయవచ్చును. ఆప్షన్ A విధానం లో స్వచ్ఛంద సేవ కోసం వచ్చే డాక్టర్ తో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులకు ఉచిత వసతి, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రోటోకాల్ దర్శనం, తిరుమల - తిరుపతి మధ్య ఉచిత రవాణా సదుపాయం కల్పించడం జరుగుతుంది.
ఆప్షన్ B కింద.స్వచ్ఛంద సేవ కై ఆసక్తి కనపరిచే వైద్య నిపుణులకు టీటీడీ నియమ నిబంధనల మేరకు పరస్పర ఒప్పందం ప్రకారం పారితోషకం చెల్లించడం జరుగుతుంది. ఆప్షన్ B ఎంచుకునే వారికి వసతి, దర్శనం, స్థానికంగా రవాణా సదుపాయాలు కల్పించడం జరగదు.
ఆసక్తి గల వైద్యనిపుణులు cmo.adldirector@gmail.com మెయిల్ ఐడి కి తమ వివరాలతో పాటు ఏయే కేటగిరీ కింద ఆసక్తి ఉందో తెలియజేస్తూ, వారి యోగ్యతా పత్రాలను జత చేయాలని టీటీడీ కోరింది.
_-----------------------
టిటిడి ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనదిGemini Internet
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి