యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. జూనియర్ మైనింగ్ జియాలజిస్ట్ తో పాటు ఇతర ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 78 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో
పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై
చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు upsc.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై
చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జనవరి 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని
నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
Gemini Internet
| పోస్టు | ఖాళీలు |
| అసిస్టెంట్ ఎడిటర్ (Oriya): | 1 |
| అసిస్టెంట్ డైరెక్టర్ (Cost): | 16 |
| ఎకనామిక్ ఆఫీసర్: | 4 |
| అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: | 1 |
| మెకానికల్ మెరైన్ ఇంజనీర్: | 1 |
| లెక్చరర్: | 4 |
| సైంటిస్ట్: | 2 |
| కెమిస్ట్: | 5 |
| జూనియర్ మైనింగ్ జియోలజిస్ట్: | 36 |
| రీసెర్చ్ ఆఫీసర్: | 1 |
| అసిస్టెంట్ ప్రొఫెసర్: | 7 |
| మొత్తం: | 78 |
వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరుగా విద్యార్హతలను నిర్ణయించారు. విద్యార్హతలు, వయో పరిమితికి సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు ఈ లింక్ ద్వారా నోటిఫికేషన్లో చూడొచ్చు.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అప్లై చేసే సమయంలో రూ.25ను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆ ఫీజును ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించొచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు.
ఎలా అప్లై చేయాలంటే:
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం ONLINE RECRUITMENT APPLICATION (ORA) FOR VARIOUS RECRUITMENT POSTS ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
కామెంట్‌లు