Alerts

--------

19, ఫిబ్రవరి 2022, శనివారం

SSC CHSL 2021కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ముఖ్యమైన ప్రకటన

SSC CHSL 2021 Exam updates: ఎస్సెస్సీ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ (SSC CHSL 2021)కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుక్రవారం (ఫిబ్రవరి 18) కీలక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన ఎస్సెస్సీ నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 7, 2022ను చివరి తేదీగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐతే ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను పూర్తి చేయడానికి చివరి తేదీ వరకు వేచి చూడకుండా అంత కంటే ముందే దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు తాజాగా సూచించింది. చివరి తేదీనాటికి సర్వర్‌ బిజీగా ఉంటడం వల్ల సకాలంలో దరఖాస్తులు చేసుకోవడంలో వైఫల్యం ఎదుకావచ్చు. అందువల్ల ముగింపు తేదీవరకు వేచిచూడకుండా అభ్యర్ధులు వీలైనంత త్వరగా దరఖాస్తులు పూరించవల్సిందిగా కోరింది. అంతేకాకుండా అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అన్ని ముఖ్యమైన సూచనలను చదవాలని కూడా తెల్పింది. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను ఎస్సెస్సీఅధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/లో సందర్శించవచ్చు.

SSC CHSL 2021 భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు, ఇతర ముఖ్యసమాచారం మీకోసం.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ పరీక్ష ద్వారా లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌/ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు జనవరి 1, 2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థులను టైర్‌1, టైర్‌2, స్కిల్‌ టెస్ట్‌/ టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: మొత్తం రెండు విధానాల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అందులో మొదటిది టైర్‌-1 పరీక్ష దీనిని 200 మార్కులకి ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో ఇస్తారు. టైర్‌-2 పరీక్షను డిస్క్రిప్టివ్‌ పేపర్‌ రూపంలో నిర్వహిస్తారు. పేపర్‌ 1 200 మార్కులకు, పేపర్‌ 2 100 మార్కులకు ఉంటుంది. టైర్‌1 పరీక్షను 2022 మేలో నిర్వహిస్తారు. టైర్‌2 తేదీని ఇంకా ప్రకటించలేదు.

దరఖాస్తు విధానం: ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 7, 2022.

ఆన్‌లైన్‌ ఫీజు చెల్లిండానికి చివరి తేదీ: మార్చి 8, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి. 

అప్లికేషన్ల కొరకు సంప్రదించండి Gemini Internet, ధనలక్ష్మి రోడ్, హిందూపురం.

కామెంట్‌లు లేవు:

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...